క్రైస్తవులకు ఆజ్ఞాపించే పండుగ ✅



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


పరిచయం

బైబిల్‌లో “పండుగ” అనే పదం వినగానే, మనకు గుర్తించేవి అటు పాత నిబంధనలోని యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఆజ్ఞాపించిన పస్కా, పెంతుకొస్తూ, గుడారాల పండుగలు..Etc. మరియు తమకు తామే ఆజ్ఞాపించుకున్న బంగారు దూడ, బయలు, అషేరా, మొలెకు, మిల్కోము వంటి అన్య దేవతల పండుగలు. వీటిని గత అంశములు ద్వారా ఆలోచన చేశాం కదూ.


✅  ఇశ్రాయేలీయులకు అజ్ఞాపించే పండుగలు క్లిక్ చేయు

❌ ఇశ్రాయేలీయులకు అజ్ఞాపించని పండుగలుక్లిక్ చేయు


అదే విధంగా, నేటి కాలంలో మనుషులు ఏర్పాటు చేసిన అనేక మతపరమైన ఉత్సవాలను కూడా “క్రైస్తవ పండుగలు” అని పిలుస్తున్నారు. అయితే, ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన ప్రశ్న అదేమనగా క్రొత్త నిబంధన ప్రకారం "క్రైస్తవులకు ఆజ్ఞాపించే పండుగ ఏంటి?" ఈ ప్రశ్నకు సమాధానం మన సంప్రదాయాలలో వెతికితే దొరకదు, చరిత్రలో రకరకాల మనుషులు ప్రవేశ పెట్టేవాటిలో లేదు మరియు మన భావోద్వేగాలలో లేదు — కేవలం అది లేఖనాలలో మాత్రమే ఉంది (1 కొరింథీయులు 4:6).


🔥 *క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులకు ఏకైక పండుగ ఆజ్ఞాపించబడింది అదేమనగా…


📖 (1కోరింది 5:7-8): "మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింప బడెను౹ గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము."


దీనిని గూర్చి ఆలోచన చేసే ముందు కొన్ని విషయాలు చర్చించుదాం. 


1. పాత నిబంధన పస్కా?

2. క్రొత్త నిబంధన పస్కా పశువు?

3. క్రైస్తవుల ఏకైక పండుగ

4. పులియని రొట్టె జీవితం + ప్రభువు బల్ల ఆజ్ఞ


1️⃣. పాత నిబంధన పస్కా?

పస్కా (Passover) అనేది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఆజ్ఞ (నిర్గమ. 12:1-28). ఇది ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని ఎలా విడిపించాడు అనే విషయాన్ని తరతరాలు జ్ఞాపకం చేసుకొనే ఒక సంఘటన. ఐగుప్తు దేశంపై చివరి తీర్పుగా "ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతు వులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను.౹" (నిర్గమ. 12:12). ఐతే ఈ విషయంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రత్యేకమైన మార్గాన్ని చూపించాడు.

వారు నిర్దోషమైన గొర్రెపిల్లను బలి అర్పించి, దాని రక్తాన్ని వారి ఇంటియొక్క ద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను పూయాలని ఆజ్ఞాపించాడు. (నిర్గమకాండము 12:5–7). తరువాత "...నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను…."(నిర్గమ. 12:13). అందువలన, రక్తం ఉన్న ప్రతి ఇంటిని దేవుని తీర్పు దాటిపోయింది (Pass-over). ఆ ఇళ్లలో మరణం ప్రవేశించలేదు. అలా ఇశ్రాయేలీయులు మరణం నుండి రక్షింపబడి, బానిసత్వం నుండి విమోచింపబడ్డారు.


🔴 రక్తం ఉన్న చోట → తీర్పు దాటిపోయింది (నిర్గమ 12:13). రక్తం లేకపోతే – తీర్పు తప్పదు. (నిర్గమ. 12:12,29)

☠️ మరణం ప్రవేశించలేదు → సంహారకుడు ప్రవేశించలేదు (నిర్గమ 12:23)

🛡️ మరణం నుండి రక్షణ → దేవుడు ఇశ్రాయేలీయులను యిండ్లను రక్షించాడు. (నిర్గమ 12:27)

⛓️ బానిసత్వం నుండి విమోచన → ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చాడు (నిర్గమ 12:41)


🐑 పస్కా గొర్రె యొక్క ముఖ్య లక్షణాలు:

✔️ నిర్దోషమైనది, యేడాది మగ పిల్ల, లోపం లేనిది (నిర్గమ 12:6)

✔️ నిర్దిష్ట సమయానికి అనగా సాయంకాలమందు బలి ఇవ్వబడింది (నిర్గమ 12:6-7)

✔️ ఆ రక్తం వారి రక్షణకు సంకేతం (నిర్గమ. 12:12,13,29)

✔️ బానిసత్వం నుండి విముక్తిని సూచించింది. (నిర్గమ 12:41).


📜 దైవ ఆజ్ఞ :

▪️ ఎవరు చేయాలి? = ఇశ్రాయేలీయులు/తమ తరువాత సంతానం

▪️ఎందుకు చేయాలి? = ఐగుప్తు విమోచన/బానిసత్వం నుండి విడుదల చేయబడినందున

▪️ ఎక్కడ చేయాలి? = యెరూషలేము/వారి ఇండ్ల స్థలములలో

▪️ ఎప్పుడు చేయాలి? = మొదటి నెల (అబీబ్ / నిసాన్) 14వ దినం

▪️ ఎలా చేయాలి? = మచ్చలేని, ఒక సంవత్సరపు మగ గొర్రె బలి ఇచ్చి, అగ్నితో కాల్చిన మాంసమును తినవలెను

▪️ ఎన్ని రోజులు? = 1 రోజు

▪️ వాక్య ఆధారం? = నిర్గమ 12:1-28; లేవీ 23:5. 


🔥 NOTE : ఈ పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆజ్ఞ. కానీ ఇది భవిష్యత్తులో రాబోయే గొప్ప బలికి ఛాయ (shadow) మాత్రమే. అది ఏలాగున అనేది ఈ అంశం చివరిలో తెలుసుకుందాం. 



2️⃣. క్రొత్త నిబంధన పస్కా పశువు?

కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు “మనకు పస్కా పశువుగా ప్రకటించబడ్డాడు" (1కోరింది. 5:7). "క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. .." (ఎపేసి. 5:2)


ఇట్టి గొప్ప క్రీస్తుబలి మన పాపముల నుండి (మత్తయి 1:21; యోహాను 1:29) తండ్రియైన దేవుని తీర్పు నుండి (రోమా 8:1) ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి (గలతీ 3:13), ప్రస్తుత దుష్టకాలం నుండి (గలతీ. 1:4), అపవాది యొక్క అధికారం నుండి (కొలొస్సి 1:13), మరణం భయం నుండి (హెబ్రీ. 2:14-15), విమోచన కల్పించింది.  క్రీస్తు నందు విశ్వాసం ఉన్నవారికే అనగా తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివానికి ఈ విమోచన లభిస్తుంది. (యోహాను 3:16). ఇందుకు క్రీస్తు తానే తన స్వరక్తాన్ని చిందించడం ద్వారా విమోచన అనుగ్రహించాడు. “ఆయన రక్తముచేత మనకు విమోచన అనగా పాపములకు క్షమాపణ కలిగియున్నది.” (ఎఫెసీయులకు 1:7). రక్తం లేకుండా విమోచన లేదు (హెబ్రీయులకు 9:22) “ఆయన సిలువ మరణముచేత మనకు సమాధానము కలిగించెను.” (కొలస్సయులకు 1:20) “ఆయన తన శరీరములో మన పాపములను సిలువమీద మోసికొనెను.” (1 పేతురు 2:24)


🐑 పస్కా గొర్రె ఛాయ మాత్రమే 

👤 క్రీస్తు బలి మాత్రం నిజ స్వరూపము.

📖 "ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది౹" (కొలస్సి 2:17)


A) నిర్దోషమైన బలి

పస్కా గొర్రె పిల్ల వలె… యేసు పాపం లేనివాడు మరియు నిర్దోషి, నిష్కళంకుడు.. (హెబ్రీ 4:15; 1పేతురు. 1:19; 2:22). క్రీస్తు పరిపూర్ణ బలిగా అర్హుడయ్యాడు.


B). రక్తం ద్వారా రక్షణ

▪️పస్కా గొర్రె రక్తం → భౌతిక మరణం నుండి రక్షణ

▪️క్రీస్తు రక్తం → పాపం మరియు నిత్య తీర్పు నుండి రక్షణ (యోహాను. 8:36; రోమా 5:9; 8:1; ఎఫెసీయులు 1:7; హెబ్రీ 9:22)

యేసు మాటల్లో….

📖 “ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న  క్రొత్త నిబంధన రక్తము” — (మత్తయి 26:28).


C). ఎముకలు విరగకపోవడం

▪️పస్కా గొర్రె ఎముకలు విరగకూడదు (నిర్గమ 12:46)

▪️యేసు ఎముకలు విరగలేదు (యోహాను 19:33–36)

ఇది క్రీస్తు పస్కా పశువు అనే ప్రవచన నెరవేర్పు.


D). సమయం – దేవుని యోచన

▪️యేసు మరణం కూడా పస్కా పండుగ సమయంలోనే జరిగింది (మత్తయి 26:2; యోహాను 19:14)

▪️ పస్కా గొర్రెలను బలి ఇచ్చే సమయానికే… క్రీస్తు సిలువపై తన ప్రాణాన్ని అర్పించాడు (మార్కు 15:34–37)


👉 ఇది యాదృచ్ఛికం కాదు.

👉 ఇది దేవుని నిర్ణయమైన యోచన.

📖 హెబ్రీయులు 9:26 “ఆయన తన్నుతానే బలిగా అర్పించుకొనెను.”


📜 NOTE : పస్కా పండుగను కొనసాగించమని క్రైస్తవులకు ఎక్కడా ఆజ్ఞ లేదు. కాని ఆ పస్కా అర్థం క్రీస్తులో పూర్తయింది. 


👤 “క్రీస్తు అను పస్కా పశువు” — అర్థం

➡️. ప్రతినిధి బలి (Substitution)

▪️ పాత పస్కాలో గొర్రె చనిపోతుంది → ఇశ్రాయేలీయుడు బ్రతుకుతాడు

▪️ క్రీస్తు చనిపోయాడు → పాపి నీతిగా జీవించడానికి

📖 యెషయా 53:5

“మన దోషములనుబట్టి ఆయన గాయపడెను.”


➡️. విమోచన (Redemption)

▪️ఈజిప్టు నుండి విమోచన → భౌతికం

▪️పాపం నుండి విమోచన → ఆత్మీయం

📖 ఎఫెసీయులు 1:7

“ఆయన రక్తమందు మనకు విమోచన కలిగియున్నది.”


➡️. తీర్పు నుండి రక్షణ

▪️రక్తం ఉన్న చోట తీర్పు దాటిపోయింది

▪️క్రీస్తు రక్తంలో ఉన్నవారికి శిక్ష లేదు. రక్షణ కలదు.

📖 రోమా 5:9

"కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.౹"


➡️. పాత జీవితం ముగింపు – కొత్త జీవితం ఆరంభం

▪️పస్కా తర్వాత ఇశ్రాయేలు ఈజిప్టుకు తిరిగి పోలేదు

▪️క్రీస్తు బలికి తరువాత విశ్వాసి పాపంలో జీవించకూడదు

📖 రోమా 6:4

 "కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.౹"


👉 ఇదే కారణంగా పౌలు చెబుతున్నాడు:

“పాత పులిపిండిని తీసిపారవేయుడి” (1 కొరి 5:7–8)



3️⃣. క్రైస్తవుల ఏకైక పండుగ

క్రొత్త నిబంధన ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు నందున్న వారికి(క్రైస్తవులకు) ఆజ్ఞాపించబడిన ఏకైక పండుగే…


నిష్కా పట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ (1 కోరింది 5:7-8)

(లేదా)

క్రీస్తు బలియాగం జ్ఞాపకం చేసుకోవడం/ప్రభువు బల్ల/ప్రభువు రాత్రి భోజనం (లూకా. 22:19-20)


(1 కోరింది 5:7-8) : "మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింప బడెను౹ గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము."


(మత్తయి 26:26-28): "వారు భోజనముచేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి —మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి– దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము."


(లూకా 22:19-20): "పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి– ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని– ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన."


(a) పాత పులిపిండి అంటే ఏమిటి?

పస్కాకి ముందు యూదులు పులిపిండిని తొలగించేవారు (నిర్గమ 12:15)

▪️ పాత పులిపిండి అంటే పాపం, దుర్మార్గత, దుష్టత్వం


🔖 క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తును ఎరుగకముందు ఉన్న  పాప స్వభావం, దుర్మార్గత, దుష్టత్వం, కపటత్వం, జారత్వం, వ్యభిచారం, అహంకారం, అపవిత్ర జీవితం. దేవుని చిత్తానికి విరుద్ధమైన పాత అలవాట్లు, అన్య ఆచారాలు. ఇవి అన్నీ మన జీవితంలో ఉండిపోయితే, అవి మొత్తం మన జీవనాన్ని చెడగొడతాయి. ఇందుకే… “కొంచెమైన పులిపిండి అంత ముద్దను పులియజేయును” — (1 కొరింథీయులకు 5:6)


(b) "మీరు పులిపిండి లేనివారు"

క్రీస్తు మన పస్కా పశువుగా బలియయ్యాడు. కాబట్టి క్రైస్తవులు  పాప జీవితం లేక పాత జీవితం విడిచిపెట్టి కొత్త జీవితంలో నడవాలి.

“మీరు పులిపిండి లేనివారు గనుక…” — 1 కొరింథీయులకు 5:7

రోమా 6:6-7: "ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము.౹ చనిపోయినవాడు పాపవిముక్తు డని తీర్పుపొందియున్నాడు.౹"

1యోహాను 3:6: "ఆయనయందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగనులేదు.౹"


(c) “క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను”

పాత నిబంధనలో:

పస్కా గొర్రె → రక్తం → తీర్పు దాటిపోయింది (నిర్గమ 12)

క్రొత్త నిబంధనలో:

యేసు క్రీస్తు → తన రక్తం → పాపక్షమాపణ (యోహాను 1:29; 1 పేతురు 1:18–19)


(d) “పులియని రొట్టెతో పండుగ ఆచరింతము”

“గనుక పాతదైన పులిపిండితోనైనను… కాకుండా,

నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.” — 1 కొరి 5:8

క్రీస్తు మన పస్కా పశువుగా బలియయ్యాడు కాబట్టి, మనం ప్రతిదినమూ దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించడము చాలా ముఖ్యం.


👉 ఇది ఏటేటా చేసే పండుగ కాదు

👉  అన్య ఆచారాలు కాదు

👉 ఇది ఆత్మీయ జీవితం + పరిశుద్ధమైన జీవన విధానం కలిగి తండ్రియైన దేవుడను ఆరాధన చేయడం. 


➡️ పులియని రొట్టె = పాపం కలగని జీవితం, దుష్టత్వం లేని నడక, దేవునికి ఇష్టమైన స్వభావం, దిద్దుబాటును ప్రేమించే జీవితం


పౌలు స్పష్టంగా చెప్పాడు:

❌ పాత పులిపిండి = దుర్మార్గత, దుష్టత్వం

✔ పులియని రొట్టె = నిష్కపటత్వం + సత్యం


➡️ దుర్మార్గత(Malice - κακία) అనగా ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశం, మనసులో ద్వేషం, కక్ష, అసూయ, క్షమించని హృదయం, ప్రతీకారం కోరే స్వభావం. (హృదయంలో దాగి ఉంటుంది)


➡️ దుష్టత్వం(Wickedness - πονηρία) అనగా దేవుని చిత్తానికి విరుద్ధంగా జరిగే క్రియలు, అలవాటుగా మారిన పాప జీవితం, నియంత్రణలేని ప్రవర్తన, లజ్జలేని దుష్కార్యాలు. 

1యోహాను 3:12: "మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?"


➡️ నిష్కపటత్వం (Sincerity - εἰλικρίνεια) అంటే హృదయంలో ఒకటి, బయట ఒకటి కాకుండా ఉండటం, ద్వంద్వ జీవితం లేకపోవడం, నటన, మోసం, ఆత్మీయ నాటకత్వం లేకపోవడం, మనుష్యుల ముందు ఒకటి, దేవుని ముందు మరొకటి కాదు. యధార్థమైన హృదయం కలిగి ఉండటం అని అర్థం.


📖 “దేవుడు హృదయమును పరిశీలించువాడు” — 1 సమూయేలు 16:7

📖 "మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే౹" — (2కోరింది. 1:12)

📖"మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములుగలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములుగలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.౹" (హెబ్రీ. 10:22)


➡️ సత్యం(aletheia) అంటే దేవుని వాక్యానికి అనుగుణమైన జీవితం, అబద్ధం, కల్పిత బోధలు, మానవ సంప్రదాయాలు కాదు, సొంత ఊహలు, సొంత ఆలోచనలు కాక, క్రీస్తే ఏకైక సత్యమని అంగీకరించడం, ప్రభువు యొక్క ఏలుబడిలో అపోస్తలుల బోధ వెలుగులో జీవితాలు దిద్దుకోవడం.

📖 “నీ వాక్యమే సత్యము” — యోహాను 17:17


🔥 Note 

నిష్కాపట్యత లేకుండా సత్యం → కఠినత్వం

సత్యం లేకుండా నిష్కాపట్యత → మోసం


క్రీస్తు మన పస్కా పశువు గనుక,  పాప మరియు పాత జీవితం తొలగించి, క్రొత్త ముద్దగా జీవించవలెను.


🔴 నిష్కపటమైన జీవితంతో + సత్యమైన బోధ/అపోస్తలుల బోధయందు = పులియని రొట్టె పండుగ/ప్రభువు రాత్రి భోజనం 

👆🏻 ఇదే దేవుడు కోరుకునే పండుగ.



4️⃣. పులియని రొట్టె జీవితం + ప్రభువు బల్ల ఆజ్ఞ

"మనకొక బలిపీఠమున్నది; (హెబ్రీ. 13:10) క్రీస్తు అను మన పస్కా పశువు వధింప బడెను(1కోరింది. 5:7) “ఆయన తన్నుతానే బలిగా అర్పించుకొనెను.”(హెబ్రీ. 9:26) "మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను… "(1పేతురు 2:24). 


🟣 జీవితం + ఆజ్ఞ  అంటే:


ముందుగా పులియని రొట్టె జీవితం. ఆ తరువాత ప్రభువు బల్లలో భాగస్వామ్యం. “తన్ను తాను పరిశీలించుకొని తినవలెను కదా” — (1 కొరి 11:28). 


🍪 మన ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రెండు భోజనాలు చేశారు. (మత్తయి. 26-26)

🍪 ఒకటి పాత నిబంధన ప్రకారమైన పస్కా భోజనం (ఛాయ)

🍪🍷 రెండోది దాని నిజ స్వరూపమైన ప్రభువు రాత్రి భోజనం/ప్రభువు బల్ల. [మొదట శిష్యులకు తెలియజేయుట.. మత్తయి. 26:26-29)

🍪🍷 నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి (లూకా. 22:20)

🍪🍷 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. (1 కోరింది 11:23)

🐑🩸

పరిశుద్ధమైన జీవితముతో + ప్రభువు యొక్క ఆజ్ఞ మేర క్రీస్తు సంఘముతో కలసి ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడమే క్రైస్తవులకు ఇవ్వబడిన ఒక ఆత్మ సంబంధమైన పండుగ.


📜 దైవ ఆజ్ఞ :

▪️ఎవరు చేయాలి? = క్రీస్తు సంఘము(క్రైస్తవులు), క్రీస్తులో ఉన్నవారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. 

▪️ఎందుకు చేయాలి? = అపవాది(చీకటి) నుండి విడుదల, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యము నుండి విడుదల

▪️ ఎక్కడ చేయాలి? = ఆయన శరీరము అను క్రీస్తు సంఘములో చేరి

▪️ ఎప్పుడు చేయాలి? = ఆదివారం (సం.లో ఎన్ని ఆదివారం వస్తె అన్నియు..)

▪️ఎలా చేయాలి? = జ్ఞాపకార్ధమైన విందు, స్వపరీక్ష, క్రీస్తు మరణ ప్రచురణ, యోగ్యతో వివేచన కలిగి, 

▪️ ఎన్ని రోజులు? = క్రీస్తు వచ్చువరకు (1 కోరింది. 11:25) - ప్రతి ఆదివారం(52 weeks)

▪️వాక్య ఆధారం? = 1 కొరింథీయులు. 1:2; 10:16–17; 11:23-34; హెబ్రీ. 2:13; కొలొస్సి. 1:13; ఎపేసి 1:23; రోమా 16:16; అపో. కార్య. 20:7; 2:42.


4️⃣. ముగింపు :

నిష్కపటమైన జీవితంతో + సత్యమైన బోధ/అపోస్తలుల బోధయందు = పులియని రొట్టె జీవితంతో/అట్టి జీవితాలతో కలసి… మన తండ్రియైన దేవునికి మన ప్రభువైన క్రీస్తు ద్వారా ఆత్మసంబంధమైన బలులు అర్పించుటకును, పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధించుచు మరియు క్రీస్తు త్యాగమును జ్ఞాపకం చేసుకొంటూ పరిశుద్ధత కొనసాగిస్తూ ఆయనతో కలిసి, ఆయన విందులోని పాలు పంపులు పొందుటయే ఇదేగా క్రైస్తవులకు అజ్ఞాపించే పండుగ. 

మీ ఆత్మీయులు 👪

1. ప్రభువు రాత్రి భోజనముక్లిక్ చేయు
2. అయోగ్యముగా అంటేనేమో?క్లిక్ చేయు


పస్కా విందు

ప్రభువు విందు

🐑గొర్రె శరీరం తినుట

🍪రొట్టె - క్రీస్తు శరీరమునకు గుర్తు

🩸రక్తం - రక్షణకు గుర్తు

🍷పాత్ర - క్రీస్తు రక్తానికి గుర్తు

భౌతిక విమోచన

ఆత్మీయ విమోచన

సంవత్సరానికి ఒకసారి

ఆదివారం(52 weeks)

నీడ

క్రీస్తు నందు నిజస్వరూపం

ఇశ్రాయేలీయుల పండుగ

క్రైస్తవుల పండుగ

మోషే ద్వారా

క్రీస్తు ద్వారా ఇవ్వబడింది

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Page Follow page

Questions and Comments here!

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16