Showing posts with label యధార్ధ ఆరాధన. Show all posts
Showing posts with label యధార్ధ ఆరాధన. Show all posts

ఆరాధన కోరిన దేవుడు? (A God who seek worship)

ఆరాధన కోరిన దేవుడు



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


📖 వాక్యము :

(యోహాను. 4:20-24): "మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹ –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹ అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹"


🔎 వివరణ :

ప్రభువైన యేసు తన బాప్తిస్మము అనంతరం దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించు తరుణములో అనేకమంది ఆయన్ను వెంబడిస్తున్నారని, తన పరిచర్య వ్యాప్తి చెందుతుందని పరిసయ్యులు గమనించారని గుర్తించిన యేసు పరిసయ్యులతో ఢీకొనడానికి ఇది సరైన సమయం కాదని యెరిగి యూదయ దేశము విడిచి గలలియ దేశమునకు తిరుగు ప్రయాణములో యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.౹ అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.౹ సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు– నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.౹" 


అటు తరువాత యేసు ఆమెతో చేసిన సంభాషణ భాగముగానే "ఆరాధన కోరిన దేవుడు" అను ఈ అంశమును వ్రాసి మీ యెదుట పెడుతున్నాం కావున శోత్రులు చివరి వరకు చదివి, పరిశీలించి, ఆలోచన చేసి సత్యాన్ని స్వీకరించవలసిందిగా మనవి. ఇందులో ఏదియు అసందర్భంగా, పిట్ట కథలతో, కట్టుకథలతో, ఊహించుకొని చెప్పబడిన మాటలు కాదని స్వయముగా ప్రభువైన యేసే పలికిన మాటలని చదువుతునప్పుడు జ్ఞాపకం ఉంచుకో...


☑ మన యెదుట ఉంచబడిన ప్రశ్నలు...

A. సమరయులు ఎవరు?

B. ఆరాధన కోరినది ఎవరు? 

C. ఎవరు ఆరాధించాలి?

D. ఎలా ఆరాధించాలి?

E. క్రైస్తవుల ఆరాధన స్థలమేది?

వీటితో పాటుగా మరి కొన్ని ప్రశ్నలకు సమాధానమును పరిశుద్ధ గ్రంథము నందు వెతికి పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం.



A.  సమరయులు ఎవరు?

క్రీస్తుపూర్వం పదవ శతాబ్దంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను - సొలొమోను రాజు 40సం. పరిపాలించి చనిపోయిన తరువాత(1 రాజులు 11:42-43), అతని కుమారుడు రెహబాము యొక్క తెలివితక్కువ చర్యలు చీలికకు దారితీశాయి,(1 రాజులు 12:25- 33) దీని ఫలితంగా రాజ్యం ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు మరియు దక్షిణ రాజ్యమైన యూదాగా విభజించబడింది. (1 రాజులు. 11:31-39) ఉత్తర భాగం, "ఇశ్రాయేల్", షెకెమ్ మరియు సమారియా నగరాలను కలిగి ఉంది, దీనికి యరొబాము రాజు అయ్యాడు. దక్షిణ భాగం, "యూదా", జెరూసలేం మరియు యూదుల దేవాలయంను కలిగి ఉంది, దీనికి రెహబాము రాజు అయ్యాడు. (1రాజులు 12:1-33) ప్రతి దానికి స్వంత రాజు ఉన్నాడు. 721 BC లో, ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం అష్షూరీయుల చేతిలో పతనమైంది. ఇశ్రాయేలు ప్రజలలో చాలామందిని బందీలుగా అష్షూరీయులకు తీసుకెళ్లారు.(2 రాజులు 18:9-10) ఈ సమరయులు కూడా ఇశ్రాయేలీయులే(ఉత్తర భాగం). షోమ్రోను అను హీబ్రూ పదానికి అర్థమే సమరయ పట్టణము. ఇవి రెండు వేరు వేరు పట్టణాలు కాదు. ఇశ్రాయేలు రాజు ఒమ్రీ ఈ పట్టణాన్ని కొని, దానికి షోమ్రోను అని పేరు పెట్టాడు. (1 రాజులు 16:24) ఈ పట్టణం యొక్క హీబ్రూ పేరు "షోమ్రోను" (שֹׁמְרוֹן). 


ధర్మశాస్త్రం కాలము మందు లేనివారిలో కొందరు యూదులు ఆ దేశంలోనే ఉండి,  అష్షూరీయుల అక్కడ నాటిన విదేశీయులతో వివాహం చేసుకున్నారు. ఈ సగం యూదులు, సగం అన్యులు కలిగిన ప్రజలే సమరయులు అని పిలువబడ్డారు. సమరయ ప్రజల గురించి మరియు వారి ఆరాధనా పద్ధతుల గురించి మరింతగా తెలుసుకోవడానికి 2 రాజులు. 17:14-41 వరకు చదవగలరు. 


సమరయులు అన్య జనాంగమని భావించి వారు యూదులతో సమానమైన వారు కాదనీ మొదలయిన కారణాలు చెప్పి యూదులు సమరయులను దూరం పెట్టారు. సమరయులకి మరియు మిగతా యూదులకి మధ్య సిద్ధాంత పరముగా కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. ఇందుకు సమరయులు ఏమి చేశారంటే క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో అప్పటికి అందుబాటులో ఉన్న హీబ్రూ లేఖనాలను తీసుకుని వాళ్లకి అనుకూలంగా కొన్ని మార్పులు చేసుకున్నారు. 


🌿 ఉదాహరణకు : యూదులు యెరూషలేము దేవాలయములో యెహోవా దేవున్ని ఆరాధిస్తే... సమరయులు ఏమో గెరిజిమ్ అనే పర్వతం మీద ఒక దేవాలయాన్ని నిర్మించుకుని అక్కడ యెహోవా దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు.. ఇప్పటికీ ఇది ఒక పవిత్ర స్థలముగా భావించే వారు లేకపోలేదు. మోషే గారు వ్రాసిన పంచకాండాలు(5 పుస్తకాలు) మాత్రమే దేవుని వాక్యం అని సమరయులు నమ్ముతారు. ఇందులో నిర్గమ.కాం. 20:17 వచనము తమకు అనుగుణముగా మార్చుకొని గెరిజిమ్ పర్వతం మీద యెహోవా దేవున్ని(తండ్రిని) ఆరాధించేవారు.


దేవుని చిత్తమైతే వీరి కోసం మరింత వివరముగా సమరయులుత్వరలో అనే అంశము ద్వారా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ఇక విషయానికి వస్తే... యూదులను వీరు ఎంతో ప్రేమించేవారు కానీ యూదులే వారి మత పరమైన సిద్ధాంతాలను ధర్మశాస్త్రమునకు ఆపాదించి వీరితో సహవాసం చేయుటకు ఇష్టపడేవారు కాదు. ఇటువంటి ఒక సమరయరాలు తోనే యోహాను 4వ అధ్యాయం యందు యేసు సంభాషణ చేయటం మనం చూడగలం.



B.  ఆరాధన కోరినది ఎవరు?

యోహాను సువార్త 4వ అధ్యాయంలో వాళ్లిద్దరి మాటల మధ్యలో ఆ సమరయ స్త్రీ ఇలా అంటుంది... "మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని.." ఆమె యేసు క్రీస్తుని ప్రశ్నిస్తుంది (యోహాను సువార్త 4:20). గెరిజిమ్ అనే పర్వతాన్ని ఉద్దేశించే ఆ సమరయ స్త్రీ యేసు క్రీస్తుతో అలా మాట్లాడింది.


☑    సమరయలు ఆరాధన స్థలము - గెరిజిమ్ పర్వతం 

☑ యూదులు ఆరాధన స్థలము - యెరూషలేములోనున్న దేవుని మందిరం/దేవాలయం.

☑  అటు పితరులైన, ఇటు యూదులైన ఎవరిని మాత్రమే ఆరాధించేవారు? ≈ యెహోవా దేవున్ని(తండ్రిని). 


పితరుల ఆరాధ్యదైవం :

అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరే దగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. (ఆదికాండము 12:6-7)


అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. (ఆదికాండము 33:18-20)


యూదుల ఆరాధ్యదైవం :

🔖 యెహోవాను ఆరాధించు స్థలయొకటి... (2సమూయేలు. 15:32)

🔖 యెహోవాను ఆరాధించి స్తుతించిరి. - (2దినవృత్తా. 7:3)

🔖యెహోవాకు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి - (2దినవృత్తాంతములు. 29:25-30)

🔖 యెహోవా మందిరములో ఆరాధించుటకై - (యిర్మియా. 26:2)

🔖 యెహోవాకు ఆరాధన చేయవలెను - (యెహేజ్కేలు. 46:3)


[ Note : యూదులకు బాగా తెలుసు తమ ఆరాధ్యదైవం ఎవరో, ఎవరు ఆరాధన చేయమని తమను కోరారో అనే సంగతి.. ]


క్రైస్తవుల ఆరాధ్యదైవం :

(యోహాను. 4:22-23): "మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹ అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹"


☑ మీరు అనగా సమరయులు మీకు తెలియనిదానిని ఆరాధించువారు.

☑ మేము అనగా యూదులు మాకు తెలిసినదానిని ఆరాధించువారము. 


👤"మేము" అనే మాటలో ప్రభువైన యేసు కూడా ఆరాధికుడైయున్నట్టు సూచించారే గాని తాను ఆరాధన కోరినట్టుగా చెప్పబడ్డలేదని విషయాన్ని గుర్తించుము. 


పాత నిబంధన అమల్లోనున్న కాలములోనే ప్రభువైన యేసు జన్మించారు. యేసు ఒక యూదుడు(లూకా. 2:27-28) ఆయన జన్మించిన నాటి నుండి మరణించిన వరకు కూడా ఏటేటా లేదా పండుగ దినాల్లో తన తండ్రిని ఆరాధించే ఆరాధికుడు అనే విషయం గుర్తించుము.(లూకా. 2:41-42; 22:1; యోహాను. 2:13; 4:45; 6:4; 7:2; 7:8-14; 10:22; 11:55-56; 12:1-20; మార్కు. 14:1; మత్తయి. 26:17-20). ఇందుకే తన యందు విశ్వాసులైన వారికి, ఆయన శిష్యులకు, తన్ను ఆరాధించమని ఆదేశించినట్టుగా మనకు గ్రంథమందు కన్పించదు. మరి "యేసు ఏమి కోరారు?"క్లిక్ చేయు అనే విషయాన్ని తెలుసుకొనుటకు క్లిక్ చేసి చదువుము. 


యేసే స్వయముగా తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది, తండ్రి కోరుచున్నాడు(23వ) అని చెప్పినప్పుడు క్రైస్తవుల నుండి ఆరాధన కోరిన దేవుడు యెహోవాయే(తండ్రే) అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఆలోచించుకోండి. యేసు ఎన్నడూ కూడా నన్ను ఆరాధించండి లేదా నన్ను ఆరాధించు కాలము వచ్చును అని అనలేదు. ఇంత చెప్పిన "యెహోవా దేవుడే యేసు"క్లిక్ చేయు అనే ఆలోచన ఉంటే నీ కోసమే ముందుగా వ్రాసాను క్లిక్ చేసి చదువుము. 



C.  ఎవరు ఆరాధించాలి?

ఆరాధన కోరినవాడు తండ్రియైన దేవుడే. ఆయనే యథార్థముగా ఆరాధించే ఆరాధికులు కావాలని కోరుకున్నాడు/వెతుకుచున్నాడు అని యేసే స్వయముగా చెప్పెను కదా(యోహాను. 4:23 చూడుము).


యధార్థవంతులైన ఆరాధికులు అంటే దిద్దుబాటును ప్రేమించేవారు అని అర్థం. పరమదేవుడును ఆరాధించేవారు తన మార్గముల విషయమై  బోధించునప్పుడు, హెచ్చరించినప్పుడు మనలోనున్న లోపాలను, దోషాలను గుర్తించి తిరిగి మరల ఆరాధన దినం లోపు  దిద్దుకొనేవారు కానీ తమ లోపాలను సమర్ధించుకునేవారు కాదు.  లోపాలను సమర్ధించుకునేవారు ఎప్పటికి  యధార్థవంతులుకారు". (c.f. కీర్తనలు. 50:17-22; యెషయా. 2:2-6; రోమా. 2:15; 1తిమోతి 4:3; తీతుకు. 1:15). 


ముందుగా దైవ ఇష్టాన్ని గుర్తించి దైవ సన్నిధికి వచ్చి తండ్రిని ఆరాధించాలి తప్పా తమ ఇష్టాలను, ఆలోచనలను తమ ఆరాధనలో కలిపి జరిగిస్తే దేవుడు ఎన్నటికి అంగీకరించరు. చాలా మంది తమ ఆరాధనను తమ ఇష్టాలతో, అభిప్రాయాలతో, వ్యాపార లావాదేవీలు కోసం, వ్యక్తిగత దూషణలతో, పగలతో, కక్ష్యలతో, ధనాపేక్షతో జరిగించేవారు లేకపోలేదు. మీలో అట్టి వారిని గుర్తించి సత్యాన్ని తెలియజేయండి. వారు వినని యెడల, మిమ్మలి తృణీకరించే ఆలోచన కలిగి ఉంటే అట్టి వారికి మీరు దూరంగా ఉండాలనే కోరుతున్న(రోమా. 16:17-18cf) కారణం ఇట్టి వారిని తండ్రి కోరడం లేదు. ఎందుకంటే యదార్థవంతులైతే అలా ప్రవర్తించరు కదా!! అటువంటి వారికి దూరముగా ఉండుటలో మేము ప్రథములమని చెప్పుటకు సంతోషించుటలో వెనుకడుగు వేయుటలేదు. కావున దేవునికి కావలసింది యధార్థమైన ఆరాధనే/ యధార్థమైన ఆరాధికులే కానీ ఏదో రకమైన ఆరాధన/ ఎవరైతే ఏంటి అనేది కాదు సుమీ!! 



D. ఎలా ఆరాధించాలి?

దేవుని ఆరాధికులు యధార్థవంతులైనప్పటికి ఎలా ఆరాధించాలి? అనే విషయాన్ని దేవుడు వారికి అవకాశమియ్యక తానే స్వయముగా ఆ నియమాన్ని ప్రభువైన యేసు ద్వారా పలికించుట మనం చూడగలం. "అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము...;౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹" (యోహాను. 4:23-24)


📖ఆత్మతోను ఆరాధించుట అనగా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించువారు అని అర్థం.(ఫిలిప్పీ. 3:2-3). వీరు తమ శరీరమును ఆస్పదము చేసుకొనని వారు అనగా వారు  రాజకీయవేత్తలైన, గొప్ప అధికారము గలవారైన, ప్రభుత్వ ఉద్యోగులైన, ఆఖరికి సీఎం, పీఎం అయిన...Etc. శరీర ఆదిక్యతను దైవ సన్నిధికి వచ్చే ముందు విడిచి పెట్టి దేవుని యొక్క ఆత్మతోనే ఆరాధించువారని అర్థం.


📖సత్యముతోను ఆరాధించుట అనగా ఆదిమ అపోస్తులుల బోధన క్రమం చొప్పున(అపో.కార్య. 2:42; 2 దెస్స. 2:15) లేదా సత్య వాక్యాన్ని సరిగ్గా విభజించేవారిగా(యోహాను 17:17; 2తిమోతి. 2:15) అని అర్థం. సత్య లేఖనము ప్రకారముగా కాకుండా ఎంత గొప్పగా చేసిన, చెప్పుకొనిన అది సత్యముతోను ఆరాధించినట్టు కాదు మరియు దేవుడు అంగీకరించే ఆరాధన కాదని గుర్తుంచుకో..


మరింత వివరణ కోసం "ఆత్మతోను, సత్యముతోను"క్లిక్ చేయు అనే అంశం క్లిక్ చేసి చదువుము. 



E. క్రైస్తవుల ఆరాధన స్థలమేది?

ఇక చివరిగా "క్రైస్తవుల ఆరాధన స్థలమేది" అనే విషయానికి వస్తే... యోహాను. 4:21లో ప్రభువు ఇలా ముందుగా సూచించెను కదా. "–అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹" ఇక్కడ మనకు చెప్పబడిన కాలము క్రొత్త నిబంధన కాలమే. పితరుల కాలములో పర్వతముల మీద, మోషే కాలములో యెరూషలేము మందిరంలో ఆరాధించేవారు. నేడు(క్రీస్తు కాలములో) ఒక ప్రత్యేకమైన స్థలమునకు ప్రాధాన్యత లేదని గుర్తించుము. 


యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించి, రక్షింపబడువారిని (రోమా. 10:9) క్రీస్తే తన శరీరమను సంఘములో చేర్చుచుండెను కదా(అపో.కార్య. 2:47) ఇలా చేర్చబడిన జనమే క్రీస్తు సంఘము(1 కోరింది. 3:16-17; రోమా 16:16) వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక నుండువారు (అపో.కార్య. 2:42) వీరు క్రీస్తు సంఘమను శరీరములో సభ్యులు అనగా అవయవములు(ఎఫేసి 1:23; రోమా. 12:4; 1 కోరింది. 12:12-14). వీరికి శిరస్సు క్రీస్తే(కొలస్సి 1:18) వీరికి ప్రభువు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు(1 కోరింది. 8:6b) వీరికి దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి(1 కోరింది. 8:6a) వీరు ఒక్క శరీరంగా ఉండుటకు లోకము నుండి పిలువబడిన వారు(1 కోరింది. 1:1; ఎపేసి. 4:4) ఇటువంటి వారి మధ్య అనగా క్రీస్తు ప్రభువై/రాజై (అపో.కార్య. 2:36; 10:36) ఏలుబడి చేయువారు మధ్య జరిగే ఆరాధనే దేవుడు అంగీకరించే ఆరాధన. సంఘానికి శిరసైన క్రీస్తు ఏం చెప్పినా అన్నివిషయాలలో ఆయన మాట వినేవారి సముదాయం గలవారు ఉన్న స్థలమునే దేవుడు నివసిస్తాడు. అది ఆయన కోరిన స్థానము. అక్కడే ఆరాధన జరగాలి. ఇంకే చోట జరిగిన అది ఆరాధన అనబడదు. మరి "అది ఏ ఆరాధన అనబడును?"క్లిక్ చేయు అనే విషయం కోసం క్లిక్ చేసి చదువుము. 



📝 సారాంశము 

ఓ చదువరి... ఆరాధన కోరిన దేవుడు తండ్రియే(యెహోవా) అని యేసే స్వయముగా సమరయ స్త్రీతో జరిగిన సంభాషణలో మనం గుర్తించాం కదా. ఎవరిని ఆరాధించాలో, ఎవరు ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో, ఎక్కడ ఆరాధించాలో అనే విషయాలను యోహాను 4:21-24 వరకు స్పష్టముగా చదివి తెలిసినప్పటికి యేసును ఆరాధించకూడదా? యేసు ఆరాధింపబడ్డారు కదా? అంటూ నీ మదిలో మెదిలితే మరొక్క అంశం రూపములో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. అంతవరకు ఆరాధన కోరిన దేవుడు తండ్రే అని యేసు ఇచ్చే వివరణ బట్టి గట్టిగా విశ్వసించుము అలాగునే చేయుము.


(అపో.కార్య. 3:22-23) "మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹"

మీ ఆత్మీయులు 👪

1. యేసును ఆరాధించాలా లేక సేవించాలా? Click Here

2. యెహోవా దేవుడే యేసు? Click Here

పలురకాల ఆరాధన (Types Of Worship)

పలురకాల ఆరాధన (Types Of Worship)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన వారందరికీ నా వందనములు.

1) వ్యర్థమైన ఆరాధన :

                     "వేషధారులారా — ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;" (మత్తయి. 15:7-10)

 

✓ నీవు వేషధారులతో చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

✓ పెదవులతో ఘనపరిచే ఆరాధన అంగీకరించబడదు. 

✓ ఆరాధనలో పరమతండ్రిని ఘనపరిచేది హృదయపూర్వకమైనదైయుండాలి.

✓ మనుషులు పద్ధతులతో చేసే ఆరాధన అంగీకరించబడదు. 

✓ ఇట్టి రీతిగా చేసే ఆరాధన అది వ్యర్ధమైన ఆరాధన అనబడును. వారు వ్యర్ధమైన ఆరాధికులు అగుదురు. 

 

2) స్వేచ్ఛా ఆరాధన : 

                    "అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి– చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.౹ అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు." (కొలొస్స. 2:18-23).


✓ అతి వినయాసక్తుడై అనగా అతి వినయంతో చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

✓ దేవదూతారాధనయందు ఇష్టముకలిగి చేసే ఆరాధన అంగీకరించబడదు.  

✓ తాను చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొని చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

✓ శరీర సంబంధంమైన మనస్సుతో ఊరకనే ఉప్పొంగుచు చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

✓ శిరస్సును అనగా క్రీస్తును హత్తుకొనని వాడు చేసే ఆరాధన అంగీకరించబడదు. 

✓ లోకములో మనుషులు బ్రతుకుచున్నట్టుగా వారి ఆజ్ఞలను, పద్ధతులను, అనుసరించి అనగా శరీరేచ్ఛానిగ్రహ విషయములో నిలకడగా ఉండక వాటిని చేతపట్టుకొని, రుచిచూసి, ముట్టి వాటికి లోబడి చేసే ఆరాధన అంగీకరించబడదు. 

✓ ఇట్టి రీతిగా చేసే ఆరాధన అది స్వేచ్ఛారాధన అనబడును. వారు స్వేచ్ఛారాధికులు అగుదురు.

 

3). తెలియనిదానిని/తెలియబడని ఆరాధన :

                     మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹ –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది. (యోహాను. 4:20-22).

 

✓ యూదులు తెలిసినదానిని ఆరాధన చేయువారు - సమరయులు తెలియనిదానిని ఆరాధన చేయువారు

✓ ఎవరిని ఆరాధన చెయ్యాలో తెలియకుండా చేసే ఒక అలవాటు, ఆచారం సమరయులది.

✓ తెలియని దేవునికి ఆరాధన చేసే అనుభవం సమరయులది. ఇట్టి ఆరాధన అంగీకరించబడదు. 

 

★ మరొక్క రకమైన వాళ్ళు ఎవరనగా గ్రీక్ ఫిలాస్ఫర్ (గ్రీక్ తత్త్వజ్ఞాని/తార్కికుడు) వారి అతి జ్ఞానమును ప్రదర్శించి  తెలియబడని దేవునికి ఆరాధన చేస్తున్నారంట.. 


                     ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.౹ పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా –ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.౹ నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద– తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. (అపో.కార్య. 17:21-23)

 

✓ ఏ దేవుని ఆరాధన చెయ్యాలో తెలియక చేస్తున్న తెలియబడని దేవునికి ఏథెన్సు ప్రజలు చేయుచున్న వారి ఆరాధన కార్యక్రమం.  

✓ దేవుడు ఎవరో? ఎవరికి మాత్రమే ఆరాధన చెయ్యాలో? లేదా ఆ ఒక్క ఆరాధ్యదైవం ఎవరో? ఈ విషయాలు తెలియకపోవడం అర్ధరహితమైన సమాచారం. 

✓ ఇట్టి రీతిగా చేసే ఆరాధన అది తెలియనిదానిని/తెలియబడని దేవునికి ఆరాధన అనబడును. 

 

4). యదార్థమైన ఆరాధన : 

                    "అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹ అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. (యోహాను. 4:21-24). 

 

✓ యేసు మాటల్లో …. ఆరాధనకు పాత్రుడు? - పరమతండ్రి

✓ యేసుమాటల్లో …. ఆత్మతోను, సత్యముతోను ఎవరిని ఆరాధన చేయాలి? - పరమతండ్రిని

✓ యేసుమాటల్లో ….  యదార్థమైన ఆరాధికులు కావాలని ఎవరు వెతుకుచున్నారు? - పరమతండ్రి

✓ యదార్థమైన ఆరాధికులు ఎవరిని ఆరాధన చెయ్యాలి? - పరమతండ్రిని

✓ తనను ఆరాధించాలాని ఎవరు కోరుతున్నారు? - పరమతండ్రి

 

* క్రీస్తు ప్రభువు ఆరాధనను కోరుకోలేదు. *


» మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము. (22వ)

☀ మీరు - సమరయులు (స్త్రీ తో)

☀ మేము - యూదులు  (యేసు)

Note: మేము అనే మాటలో నేను అనే మాట  ఇమిడి ఉందని గ్రహించుము. 


             మన ప్రభువైన యేసుక్రీస్తు తాను కూడా ఆరాధికులలో ఒక్కడు అన్నట్టుగా తెలియజేశారు. తండ్రిని ఆరాధించే వ్యక్తులలో యేసు కూడా ఉన్నారు. కావున తండ్రియైన దేవుడు ఆరాధింపబడే వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధింపబడటం అనేది జరిగే కార్యక్రమం కాదు.

చాలామంది తెలియని దానియందు విశ్వాసం నిలిపి ఇలా అందురు "మేము క్రైస్తవులము కథ అందుకే మేము క్రీస్తును ఆరాధన చేస్తామని" ఇట్టివారు తెలియక మాట్లాడుతున్నారు. నిజానికి క్రైస్తవులు క్రీస్తును ఆరాధన చేస్తారని/చెయ్యాలని పరిశుద్ధు గ్రంథము చెప్పే సమాచారం కాదు. ఇది మనుషుల యొక్క అభిప్రాయం. వీరు స్వేచ్ఛారాధికులు. ఎవరిని ఆరాధన చెయ్యాలో యేసు మాటల్లో తెలియక/ఆలోచన చేయక ఆయన్నే(క్రీస్తును) ఆరాధన చేస్తాం అనేడి వారు... కానీ యేసు ఏమన్నారంటే "మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము." అని అన్నారు. ప్రభువైన క్రీస్తు యదార్థమైన ఆరాధికులు నుండి తాను ఆరాధనను కోరుతున్నట్టుగా ఎక్కడ చెప్పుకోలేదు. కాబట్టి నీవు ఎవరిని ఆరాధన చేస్తావో అనేది విచక్షణ లేకుండా చేసే ఆరాధన వ్యర్ధముగానో, తెలియబడని దానిగానో, ఇష్టానుసారంగా జరిగే ఆరాధననై ఉంటాది. 

 

5) విగ్రహరాధన :  

అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు..... (1 కొరింథి. 8:7).

జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. (1 కొరింథి. 10:7).

విగ్రహారాధనకు దూరముగా పారిపొండి. (1 కొరింథి. 10:14).

మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. (1 కొరింథి. 12:2).

చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి. (1 యోహాను. 5:21).

వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. (ఎఫెసి. 5:5)

✓  లోభి అనగా దేవుడు కంటే అత్యధికంగా దేనిని ప్రేమించిన అది విగ్రహారాధనయై అగును.

కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. (కొలస్స. 3:5)

✓ ధనాపేక్ష అనగా దురాశ, లోభత్వము, లుబ్ధత్వము.


6) సృష్టికి/ప్రకృతికి ఆరాధన :  

            వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమెన్‌. (రోమా. 1:23-25)


7) మనుష్యులకు ఆరాధన :  

            బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను. అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. (అపో.కార్య. 14:12-15).

నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. (అపో.కార్య. 12:21-23).


7) సబ్బాత్(విశ్రాంతి) దినము ఆరాధన :  

               విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుముఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.  ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. (నిర్గమ.కాం. 20:8-11).

✓ సబ్బాత్/విశ్రాంతి దినము బౌతిక సంబంధమైన ఇశ్రాయేలీయుల ప్రజలకు మాత్రమే ఇవ్వబడిన ప్రత్యేకమైన/పరిశుద్ధ దినము. (నిర్గమ. 16:23; 31:12-16; లేవియా. 16:31; 19:3; 19:30; 23:24-39; 26:2; ద్వితియో. 5:12-15 చదువుము). 

✓ సబ్బాత్/విశ్రాంతి దినము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులైన మనకు(క్రైస్తవులకు) ఇవ్వబడలేదు.

ముగింపు :

        ప్రియులారా.. పైన 👆 పేర్కొన్నబడిన వాటిలో ఏ ఆరాధన చేస్తున్నావో? ఆలోచన చేసుకో. ఒకవేళ నీవు చేయు ఆరాధన యదార్థమైన ఆరాధన కానిచో ఈ క్షణమే గ్రంథము పరిశీలన చేసి మార్చుకో..📖

మీ ఆత్మీయులు...👪

★ ఆరాధన : Click Here
★ ఆత్మతోను, సత్యముతోను : Click Here

నీ ఆరాధన గురించి ఆలోచించు నేస్తమా (My friend, Think about your Worship)

"నీ ఆరాధన గురించి ఆలోచించు నేస్తమా"
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. 

➡ నీవు ఏ బోధ యందు నడుచుకొనుచున్నావో ఈ లోకములో నీకు సమయం ఉండగానే పరీక్ష చేసుకో... అపోస్తులుల  బోధ (లేక) దయ్యముల బోధ - (అపో.కార్య. 2:42; 2 కోరింది. 13:5; 1 తిమో. 4:2)


➡ నీవు నిజముగా "యధార్థమైన ఆరాధన" చేస్తున్నావా? (లేక) నటిస్తున్నవా..? ఆలోచన చేయు మిత్రమా! (యోహాను. 4:21-24; ప్రకటన. 3:15-16).


➡ ఏదో ఒక రకమైన ఆరాధన చేసేసి ఇదే దేవుడు కోరిన ఆరాధన అని నీవు అనుకోవచ్చు, కానీ ఆ ఆరాధన యధార్థమైన ఆరాధనా (లేక) కాదో అని పరిశీలన చేయవలసిన అవసరం ఉందని గుర్తించుకో. (మత్తయి. 15:7-9; అపో.కార్య. 17:23; కొలస్స. 2:18; 2:23; యోహాను. 4:23-24)


➊. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు మొదటి ఋజువు" : 
నీవు నీ దోషాలను, పాపములను, ఇహలోకపరమైన వినోదము, ఈలోకపు మూలపాఠములను అనుసరించుటయే. (యెషయా. 59:2; రోమా. 13:13; గలతి. 5:21; 1 పేతురు. 4:3; కొలసి. 2:8,20)


❷. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు రెండవ ఋజువు" :
దిద్దుబాటును ప్రేమించే స్వభావం లేకపోవుటయే. & వాత వేయబడిన మనసాక్షి గలవారై తప్పులను సమర్ధించుకోవడం. (యెషయా. 2:2-6; రోమా. 2:15; 1 తిమోతి. 4:3; తీతుకు. 1:15)


❸. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు మూడవ ఋజువు" :
 నీలో ఉండు కోపము, అనుమానం, అపవిత్రమైన చేతులతో వేయదగిన ధూపము లేదా ప్రార్ధన & నీతి,రక్షణ వస్త్రాలు లేకుండా... హృదయం మనస్సును దేవునిపై కేంద్రీకృతము చేయకుండా ఆరాధనలో కూర్చొండుటయే (
1 తిమోతి. 2:8; యెషయా. 1:15; కీర్తనలు. 132:9,16; 141:1-2; ప్రసంగి. 5:1-3; 1 కోరింది. 1:10; 14:15; ఎపిసి. 4:18).


❹. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు నాలుగవ ఋజువు" :
 అపోస్తుల బోధ పేరుతో పిట్టకథలు, కట్టుకథలు, లోకపరమైన ఉదాహరణలు, స్త్రీ నాయకత్వముతో బోధ చేయుట, నీ తోటి విశ్వాసి గురించి చెడుగా అన్యుల మధ్య & సంఘములో చెప్పుటయే. (
1 కోరింది. 14:3; 1 తిమోతి. 2:12; 2 తిమోతి. 4:1-4)

*(హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధియు కలుగు సందేశం ఉండవు).

❺. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఐదవ ఋజువు" :
ప్రతి ఆదివారము ప్రభువును జ్ఞాపకము చేసుకోకపోవడం, కృతఙ్ఞత లేకపోవడం, అజ్ఞానముగా, అయోగ్యముగా, వివేచింపక ప్రభువు బల్లలో చెయ్యి  పెట్టుటయే. (అపో. కార్య. 20:7; 
1 కోరింది. 11:17-33)


❻. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఆరవ ఋజువు" :
యధార్థమైన ఆరాధనకు పాత్రుడు కానీ మరొక్క వ్యక్తిని ఆరాధన చేయుటయే & శరీరమును ఆస్పదము చేసుకొనుటయే, వేషధారణ కలిగిన జీవితము (
యోహాను. 4:21-24; పిలిప్పీ. 3:1-6; మత్తయి. 15:7-9)

✅ శరీరమును ఆస్పదము అనగా  ప్రభుత్వం ఉదోగ్యము, హోదా, ధనము, పెరు ప్రఖ్యాతులు, నాకు చాలా అనుభవము కలదు అనే డంభం… etc.


❼. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఏడవ ఋజువు" :
వ్యక్తిగతముగా మాట్లాడవలసినవి సంఘముగా మాటలాడి నీ తోటి వారిని అనేకమందిలో కించపరిచే కార్యక్రమమే. (
మత్తయి. 18:15-18; లూకా. 17:3.)


❽. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఎనిమిదో ఋజువు" :
 నీవు వినే బోధలో తప్పులు లేదా లోపాలు కనబడిన ఖండించలేకపోవడం, అందరిలో తక్కువ వాడిగా అయ్యిపోతావు అని చూసి చూడనట్టుగా పోవుటయే. (
2 తిమోతి. 4:2; 3:16; అపో.కార్య. 18:28; తీతుకు. 2:15)

❾. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు తొమ్మిదో ఋజువు" :
స్వనీతిని ఆధారము చేసుకుని తమకి అనుకూలమైన సంగతులు, ఇష్టాలు సంఘముపై రుద్ది చేయించుకునుటయే. (
రోమా. 10:3; 1 పేతురు. 5:3)

*(ఎక్కువుగా మత శాఖలో & ___ చూడగలము).

❿. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు పదవ ఋజువు" :
 సత్య విషయమైనా ప్రేమను అవలభింపక, వాక్య అనుభవజ్ఞానము పొందినప్పటికి...  కుక్క తన వాంతిని తిన్నట్టుగా, పంది మరలా బురదలో పడినట్టుగా అనేడి సామెత యొక్క ఉండే నీ స్వభావము/ఆలోచనయే.....etc (
2 పేతురు. 2:20-22; 2 దెస్స. 2:9a; హెబ్రీ. 10:26).
మీ ఆత్మీయులు,
మనోహర్_నవీన

క్రీస్తు సత్య ఆరాధనకు పాత్రుడా..? Is Christ deserving of true worship..?

"క్రీస్తు సత్య ఆరాధనకు పాత్రుడా".. ?

నా తోటి పరిశుద్దులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు.

పాత నిబంధనలో ప్రధానయాజకుడి పని

1)      యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు, రాజుల సంగతుల విషయములలో  పై వాడుగా ఉన్నాడు. – (2 దిన. 19:11).

2)      పాపములకొరకు అర్పణములను, బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమి౦పబడెను. – (హెబ్రీ. 5:1; హెబ్రీ. 8:3).

3)      అతడు ఏమియు తెలియనివారి యెడలను, త్రోవతప్పిన వారి యెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. – (హెబ్రీ. 5:2).

4)      ఈ ప్రధానయాజకుడు తనది కాని రక్తము తీసుకొని సంవత్సరమునకు ఒక్కసారే పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించి ప్రజల కొరకు , తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయువాడు. – (హెబ్రీ. 5:3; 9:25).

5)      అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడై ఈ ఘనత పొందువాడు. – (నిర్గమ. 28:1; హెబ్రీ. 5:4).

6)      ఇట్టి ప్రధానయాజకుడు దేవుని ఆరాధన చేయువాడు. – (హెబ్రీ. 9:7-9).

NOTE: ఇట్టి ప్రధానయాజకుడి యొక్క పని మన మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు మరియు శరీరాచారములు గనుక దిద్దుబాటు చేయుటకొరకు అట్టి ఆరాధన కొట్టివేయబడినది. (హెబ్రీ. 9:10; 10:1; 8:7,13)

క్రొత్త నిబంధనలో ప్రధానయాజకుడి పని


ఆకాశమండలముగుండ వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. (హెబ్రీ. 4:14)

1)      యేసు ఆ జనములకొరకును , ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును , చావనైయున్నాడు. – (మత్తయి. 1:21; యోహాను. 11:52; 1 పేతురు. 2:24)

2)      పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలముకంటే మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. – (హెబ్రీ. 7:26)

3)      మన ప్రధానయజకుడైన క్రీస్తు , తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక , తన్నుతాను అర్పించుకొన్నప్పుడు  తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించి యీ పని చేసి ముగించెను. – (హెబ్రీ. 7:28; 9:11,12,26-28)

4)       క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిoచుచు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొని మన మనస్సాక్షి విషయములో నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు క్రీస్తు యొక్క రక్తము మనలను శుద్ధిచేసి, మన అపరాధములనుండి విమోచన కలుగుటకై మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్ధానము పొందుటకు, క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు   – (హెబ్రీ. 7:2; 9:14,15)

5)      క్రీస్తు సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసేదేకు యొక్క క్రమములో చేరిన ప్రధాయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. – (హెబ్రీ. 5:9,10; 6:20 7:16,17,20).

6)      పరిశుద్ధ గ్రంధములో ఉన్న ప్రధానయాజకులందరు దేవుని ఆరాధించిన వారుగానే ఉన్నారు కానీ ఆరాధనకు పాత్రులుగా లేరు అలాగే మనకు దేవుని చేత యేర్పరచబడిన  ప్రధానయాజకుడైన క్రీస్తు తన జీవితములో మన తండ్రిని ఆరాధించారు మరియు సత్య ఆరాధన లేదా యదార్ధమైన ఆరాధనయందు వారికి ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించాలని , అట్టి ఆరాధికులను తండ్రి వెదుకుచున్నాడని మన ప్రభువైన యేసు తెలియజేసెను. – (యోహాను. 4:21-24; లూకా. 2:41-42)

NOTE:  ఇట్టి ప్రధానయాజకుడి యొక్క పని మన మనస్సాక్షి విషయములో నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని (తండ్రిని) సత్య ఆరాధన చేయుటకు సంపూర్ణసిద్ధి కలుగజేసినది.


(హెబ్రీయులకు 8:1-2)

మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా,మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయనపరిశుద్ధాలయమునకు  అనగా మనుష్యుడుకాక ప్రభువేస్థాపించిన నిజమైన గుడారమునకుపరిచారకుడైయుండి, పరలోకమందుమహామహునిసింహాసనమునకు కుడిపార్శ్వమునఆసీనుడాయెను.

(మనోహర్ బాబు గుడివాడ)©

"ఆరాధన అనగా నేమి"..? CLICK HERE

"ఆత్మతోను", "సత్యముతోను" ఆరాధన చేయుట అనగా నేమి..?


"ఆత్మతోను", "సత్యముతోను"

ఆరాధన చేయుట అనగా నేమి..?


నా తోటి పరిశుద్ధులరా, మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

యోహాను 4: 23-24
యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను "తండ్రిని" ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని "తండ్రి కోరుచున్నాడు" (మూలభాషలో-వెదుకుచున్నాడు).

దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను(in Spirit) సత్యముతోను(in Truth) ఆరాధింపవలెననెను.

నా ప్రియులారా, "యధార్ధమైన ఆరాధన" లేదా "సత్య ఆరాధన" ఎలా ఉండాలో, ఎవరు ఆరాధనకు ప్రాతుడు, ఎవరు యదార్ధ ఆరాధికులు వెదుకుచున్నారో అనే విశేష సంగతిని మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి పరిచయము చేశారు - (యోహాను 4:21-23).


❣ ఆరాధన చేయువారు ఎలా ఉండాలి..? (యథార్థముగా).
❣ ఆరాధన ఎలా చేయాలి..? (ఆత్మతోను, సత్యముతోను).
❣ ఆరాధన ఎవరుకి చేయాలి లేదా చెందాలి..? (తండ్రినైనా దేవుడు).

గమనిక: మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు ఆరాధనను కోరుకోలేదు.

పైన వచనములు ఆధారముగా ఈ మూడు ముఖ్యమైన సంగతులను మనము తెలుసుకోవలసిన అవసరము ఎంతో ఉంది.

● నేడు అనేక రకరకాలు ఆరాధనలు లోకములో జరుగుతున్నాయి అవి ఏమియు కూడా దేవునికి అంగీకరయోగ్యమైనవి కావు. మునుపు అంశములో మనము ఎన్ని రకాలు ఆరాధనలు ఉన్నాయో గ్రంధము నుండే  తెలుసుకున్నాము.

● మన ఆరాధన తండ్రినైనా దేవుడికి అంగీకరయోగ్యముగా ఉండాలి అని అనుకుంటే ఈ క్రింది విషయాలను ఆలోచన చేసి, అనుసరిచవలసిన అవసరము ఎంతో ఉంది.


"ఆత్మతోను" ఆరాధన


ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక "దేవుని యొక్క ఆత్మవలన (worship God in the Spirit) ఆరాధించుచు". - ఫిలిప్పీయులకు 3: 3 

◆ శరీరమును ఆధారము చేసుకొనక దేవుని ఆత్మ వలన అనగా పరిశుద్ధాత్మ ద్వారానే మనము తండ్రినైనా దేవుడును ఆరాధన చేయాలి. శరీరమును ఆస్పదము చేసుకునే వాడు దేవుని యొక్క ఆత్మ చేత ఆరాధన చేయలేడు.

మన తండ్రినైనా దేవుడు శరీరమును ఆస్పదము చేసుకునే వారితో సబంధము పెట్టుకోరు.

◆ "దేవుడు దీన మనస్సు గలవారితోను, వినయ మనస్సు గలవారు తోను మాత్రమే సబంధము పెట్టుకొనే మహోన్నతుడు" (యేషయా 57:15).

● గమనిక: ఎందరు అయితే పాపక్షమపణ కొరకు మారుమనస్సు పొంది, బాప్తిస్మము పిమ్మట దేవుని ఆత్మను పొందుకొని (అపో.కార్య 2:38) ప్రభువు సంఘము చేర్చబడి (అపో.కార్య 2:47) దేవుని యొక్క ఆత్మ చేత ఎందురు అయితే తండ్రిని ఆరాధన చేస్తున్నారో వారు "*యధార్ధముగా తండ్రిని ఆత్మతోను ఆరాధన చేయువారు"*.


"సత్యముతోను" ఆరాధన 


"సత్యము" అనగా "యథార్థమైన, నిౙమైన".

యోహాను 17: 17,19, 21
సత్యమందు( మూలభాషలో-సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; "నీ వాక్యమే సత్యము".

వారును "సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు" వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.

వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; "వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ" వలెనని వారికొరకును "ప్రార్థించుచున్నాను".

● పైన వచనములో మూడు ముఖ్యమైన విశేష సంగతులను మనము తెలుసుకోవాలి.

1)  శిష్యులు(అపోస్తలులు) ను యేసు వారు సత్యమందు ప్రతిష్ట చేసారు అని.
2)  దేవుని వాక్యమే సత్యము అని
3)  అపోస్తలులు ఆ సత్యమును ఎందరుకి ప్రకటన చేసారో వారు అందరూ ఆ బోధయందు ఏకమైయుండాలి అని.

● యదార్ధమైన ఆరాధికులు ఎల్లపుడు చెప్పబడిన లేదా వినిన సంగతులు పరిశుద్ధ లేఖనములును ఆలాగున్నవో, లేవో పరిశోధన చేయువారుగానే ఆసక్తి కలిగి ఉంటారు (అపో.కార్య. 17:11).


• యేసు సాక్ష్యము •

❣ నేను దేవుని యొద్ద వినిన సత్యమును మీకు బోధిస్తున్నా. - (యోహాను 8:26)
❣ దేవుని వలన వినిన సత్యము - (యోహాను 8:40)
❣ నా తండ్రి వలన వినిన సత్యము - (యోహాను 15:15).

◆ ఆ సత్యమును యేసు వారు అపోస్తలులుకి ఇచ్చి వారుని సత్యమందు ప్రతిష్ట చేసారు. (యోహాను 17:19).


• అపోస్తలులు సాక్ష్యము •

❣ జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, "మేమేది వింటిమో".... అది మీకు తెలియజేయుచున్నాము. - (1 యోహాను. 1:1).
❣ "....మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను(పారంపర్యములను) చేపట్టుడి". - ( 2థెస్స. 2: 15).
❣ "....సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము". - ( 2కోరింథీ. 13: 8).


● గమనిక: యేసు ద్వారా ప్రతిష్ట చేయబడిన ఆ సత్యము అనగా అపోస్తలులు బోధ యందు ఉంటూ వారు తెలియపరిచిన ప్రకారముగా ఎందరు అయితే  లోబడి దేవుని ఆరాధన చేయు కార్యక్రముము వారు మాటలు ద్వారా ఎందరూ అయితే అనుసరిస్తూ ఆరాధన చేస్తున్నారో వారె "యధార్ధముగా తండ్రిని సత్యముతోను ఆరాధన చేయువారు".


ఈ క్రింది అంశములు ప్రతి వారు యొక్క ఆరాధనలో భాగములో ఖచితముగా ఉండాలి 

◆ అపొస్తలుల బోధయందును, -- (యోహాను 17:14, 17-21; అపో.కార్య 2:42; 2 దెస్స 2:15).
◆ సహవాసమందును, -- (హెబ్రీ 10:23-24; 1 కోరింది 7:24; 1 యోహాను 1:3).
◆ రొట్టె విరుచుటయందును, -- (అపో.కార్య. 20:7; 1 కోరింది 11:23-29).
◆ ప్రార్థన చేయుటయందును, -- (యోహాను 16:23; 1తిమోతి 2:1,8).
◆ పాటలు (ఎపేసి 5:19; కొలసి 3:16; హెబ్రీ 13:15).
◆ కానుకులు -- (1 కోరింది 16:1-2; 2 కోరింది 9:7).

(మీ ఆరాధన క్రమములో పైన తెలిపిన ఏ ఒక్క అంశము లేకపోయినా అది యదార్ధమైన ఆరాధన కాదు).

👊 హెచ్చరిక - పైన తెలిపిన ప్రతి అంశము యందు కూడా యదార్ధమైన ఆరాధికుడు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధన చేయవలసిన అవసరం ఎంతో ఉంది.

The churches of Christ greet you - Roma 16:16