పలురకాల ఆరాధన (Types Of Worship)

పలురకాల ఆరాధన (Types Of Worship)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన వారందరికీ నా వందనములు.

1) వ్యర్థమైన ఆరాధన :

                     "వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;" (మత్తయి. 15:7-10)

 

నీవు వేషధారులతో చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

పెదవులతో ఘనపరిచే ఆరాధన అంగీకరించబడదు. 

ఆరాధనలో పరమతండ్రిని ఘనపరిచేది హృదయపూర్వకమైనదైయుండాలి.

మనుషులు పద్ధతులతో చేసే ఆరాధన అంగీకరించబడదు. 

ఇట్టి రీతిగా చేసే ఆరాధన అది వ్యర్ధమైన ఆరాధన అనబడును. వారు వ్యర్ధమైన ఆరాధికులు అగుదురు. 

 

2) స్వేచ్ఛా ఆరాధన : 

                    "అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిచేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.౹ అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు." (కొలొస్స. 2:18-23).


అతి వినయాసక్తుడై అనగా అతి వినయంతో చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

దేవదూతారాధనయందు ఇష్టముకలిగి చేసే ఆరాధన అంగీకరించబడదు.  

తాను చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొని చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

శరీర సంబంధంమైన మనస్సుతో ఊరకనే ఉప్పొంగుచు చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

శిరస్సును అనగా క్రీస్తును హత్తుకొనని వాడు చేసే ఆరాధన అంగీకరించబడదు. 

లోకములో మనుషులు బ్రతుకుచున్నట్టుగా వారి ఆజ్ఞలను, పద్ధతులను, అనుసరించి అనగా శరీరేచ్ఛానిగ్రహ విషయములో నిలకడగా ఉండక వాటిని చేతపట్టుకొని, రుచిచూసి, ముట్టి వాటికి లోబడి చేసే ఆరాధన అంగీకరించబడదు. 

ఇట్టి రీతిగా చేసే ఆరాధన అది స్వేచ్ఛారాధన అనబడును. వారు స్వేచ్ఛారాధికులు అగుదురు.

 

3). తెలియనిదానిని/తెలియబడని ఆరాధన :

                     మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹ అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది. (యోహాను. 4:20-22).

 

యూదులు తెలిసినదానిని ఆరాధన చేయువారు - సమరయులు తెలియనిదానిని ఆరాధన చేయువారు

ఎవరిని ఆరాధన చెయ్యాలో తెలియకుండా చేసే ఒక అలవాటు, ఆచారం సమరయులది.

తెలియని దేవునికి ఆరాధన చేసే అనుభవం సమరయులది. ఇట్టి ఆరాధన అంగీకరించబడదు. 

 

మరొక్క రకమైన వాళ్ళు ఎవరనగా గ్రీక్ ఫిలాస్ఫర్ (గ్రీక్ తత్త్వజ్ఞాని/తార్కికుడు) వారి అతి జ్ఞానమును ప్రదర్శించి  తెలియబడని దేవునికి ఆరాధన చేస్తున్నారంట.. 


                     ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.౹ పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.౹ నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. (అపో.కార్య. 17:21-23)

 

ఏ దేవుని ఆరాధన చెయ్యాలో తెలియక చేస్తున్న తెలియబడని దేవునికి ఏథెన్సు ప్రజలు చేయుచున్న వారి ఆరాధన కార్యక్రమం.  

దేవుడు ఎవరో? ఎవరికి మాత్రమే ఆరాధన చెయ్యాలో? లేదా ఆ ఒక్క ఆరాధ్యదైవం ఎవరో? ఈ విషయాలు తెలియకపోవడం అర్ధరహితమైన సమాచారం. 

✓ ఇట్టి రీతిగా చేసే ఆరాధన అది తెలియనిదానిని/తెలియబడని దేవునికి ఆరాధన అనబడును. 

 

4). యదార్థమైన ఆరాధన : 

                    "అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹ అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. (యోహాను. 4:21-24). 

 

యేసు మాటల్లో . ఆరాధనకు పాత్రుడు? - పరమతండ్రి

యేసుమాటల్లో . ఆత్మతోను, సత్యముతోను ఎవరిని ఆరాధన చేయాలి? - పరమతండ్రిని

యేసుమాటల్లో .  యదార్థమైన ఆరాధికులు కావాలని ఎవరు వెతుకుచున్నారు? - పరమతండ్రి

యదార్థమైన ఆరాధికులు ఎవరిని ఆరాధన చెయ్యాలి? - పరమతండ్రిని

తనను ఆరాధించాలాని ఎవరు కోరుతున్నారు? - పరమతండ్రి

 

క్రీస్తు ప్రభువు ఆరాధనను కోరుకోలేదు. *


» మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము. (22వ)

☀ మీరు - సమరయులు (స్త్రీ తో)

☀ మేము - యూదులు  (యేసు)

Note: మేము అనే మాటలో నేను అనే మాట  ఇమిడి ఉందని గ్రహించుము. 


             మన ప్రభువైన యేసుక్రీస్తు తాను కూడా ఆరాధికులలో ఒక్కడు అన్నట్టుగా తెలియజేశారు. తండ్రిని ఆరాధించే వ్యక్తులలో యేసు కూడా ఉన్నారు. కావున తండ్రియైన దేవుడు ఆరాధింపబడే వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధింపబడటం అనేది జరిగే కార్యక్రమం కాదు.

చాలామంది తెలియని దానియందు విశ్వాసం నిలిపి ఇలా అందురు "మేము క్రైస్తవులము కథ అందుకే మేము క్రీస్తును ఆరాధన చేస్తామని" ఇట్టివారు తెలియక మాట్లాడుతున్నారు. నిజానికి క్రైస్తవులు క్రీస్తును ఆరాధన చేస్తారని/చెయ్యాలని పరిశుద్ధు గ్రంథము చెప్పే సమాచారం కాదు. ఇది మనుషుల యొక్క అభిప్రాయం. వీరు స్వేచ్ఛారాధికులు. ఎవరిని ఆరాధన చెయ్యాలో యేసు మాటల్లో తెలియక/ఆలోచన చేయక ఆయన్నే(క్రీస్తును) ఆరాధన చేస్తాం అనేడి వారు... కానీ యేసు ఏమన్నారంటే "మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము." అని అన్నారు. ప్రభువైన క్రీస్తు యదార్థమైన ఆరాధికులు నుండి తాను ఆరాధనను కోరుతున్నట్టుగా ఎక్కడ చెప్పుకోలేదు. కాబట్టి నీవు ఎవరిని ఆరాధన చేస్తావో అనేది విచక్షణ లేకుండా చేసే ఆరాధన వ్యర్ధముగానో, తెలియబడని దానిగానో, ఇష్టానుసారంగా జరిగే ఆరాధననై ఉంటాది. 

 

5) విగ్రహరాధన :  

అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు..... (1 కొరింథి. 8:7).

జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. (1 కొరింథి. 10:7).

విగ్రహారాధనకు దూరముగా పారిపొండి. (1 కొరింథి. 10:14).

మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. (1 కొరింథి. 12:2).

చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి. (1 యోహాను. 5:21).

వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. (ఎఫెసి. 5:5)

  లోభి అనగా దేవుడు కంటే అత్యధికంగా దేనిని ప్రేమించిన అది విగ్రహారాధనయై అగును.

కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. (కొలస్స. 3:5)

ధనాపేక్ష అనగా దురాశ, లోభత్వము, లుబ్ధత్వము.


6) సృష్టికి/ప్రకృతికి ఆరాధన :  

            వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమెన్‌. (రోమా. 1:23-25)


7) మనుష్యులకు ఆరాధన :  

            బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను. అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. (అపో.కార్య. 14:12-15).

నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరిఅతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. (అపో.కార్య. 12:21-23).


7) సబ్బాత్(విశ్రాంతి) దినము ఆరాధన :  

               విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుముఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.  ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. (నిర్గమ.కాం. 20:8-11).

 సబ్బాత్/విశ్రాంతి దినము బౌతిక సంబంధమైన ఇశ్రాయేలీయుల ప్రజలకు మాత్రమే ఇవ్వబడిన ప్రత్యేకమైన/పరిశుద్ధ దినము. (నిర్గమ. 16:23; 31:12-16; లేవియా. 16:31; 19:3; 19:30; 23:24-39; 26:2; ద్వితియో. 5:12-15 చదువుము). 

 సబ్బాత్/విశ్రాంతి దినము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులైన మనకు(క్రైస్తవులకు) ఇవ్వబడలేదు.

ముగింపు :

        ప్రియులారా.. పైన 👆 పేర్కొన్నబడిన వాటిలో ఏ ఆరాధన చేస్తున్నావో? ఆలోచన చేసుకో. ఒకవేళ నీవు చేయు ఆరాధన యదార్థమైన ఆరాధన కానిచో ఈ క్షణమే గ్రంథము పరిశీలన చేసి మార్చుకో..📖

మీ ఆత్మీయులు...👪

★ ఆరాధన : Click Here
★ ఆత్మతోను, సత్యముతోను : Click Here

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16