Showing posts with label ప్రభువు బల్ల. Show all posts
Showing posts with label ప్రభువు బల్ల. Show all posts

"పండుగలు" (Festivals)


"పండుగలు" (Festivals)


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో
నా హృదయపూర్వక వందనములు.


: పస్కా పండుగ :

1). పస్కా అనగా దాటి పోవుట అని అర్ధము.

 "యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారముచేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.౹" (నిర్గమ. 12:23; హెబ్రీ. 11:28).

2). ఎవరు చేయాలి..? - (ఇశ్రాయేలీయులు)

"కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెను–మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.౹" (నిర్గమ. 12:21).

» "ఇశ్రాయేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.౹" (నిర్గమ. 12:21).

3). ఎందుకు చేయాలి..?

"ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.౹ ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిపోయెను.౹ ఆయన ఐగుప్తుదేశములోనుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమతమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే." (నిర్గమ. 12:40-42).

"యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱె మేకలలోగాని గోవులలోగాని బలి అర్పింపవలెను.౹ పస్కా పండు గలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.౹" (ద్వితీయో. 16:2-3).

4). ఎప్పుడు చేయాలి..? (మొదటి నెల - ఆబీబు).

 "ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను రప్పించెను.౹" (ద్వితీయో. 16:1).

"మొదటి నెల పదునాలుగవదినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.౹" (లేవీ. కాం.  23:5).

5). ఎలా చేయాలి..?

"మొదటి నెల పదునాలుగవదినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.౹ ఆ నెల పదునయిదవదినమున యెహోవాకు పొంగనిరొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి యైన ఏ పనియు చేయకూడదు.౹ ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవదినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము." (లేవీ. కాం. 23:5-8)


: పెంతెకొస్తు పండుగ :


● "మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీ కిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయు నప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.౹ యెహోవా మిమ్ము నంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.౹ మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము.౹ మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టె యేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను.౹ ఏడవ విశ్రాంతిదినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను.౹ మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.౹ మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.౹ అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాపపరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను.౹ యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.౹ ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలముయొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను." (లేవీ. కాం. 23:9-22).

గమనిక: కనాను దేశములో రెండు వేరువేరు పంటలు పండుతాయి.

» బార్లీ.
» గోధుమలు.
              ఈ రెండు పంటలు నుండి ప్రథమ ఫలము అర్పించిన తర్వాత, ఏడువారములు లెక్కించి (లేవి.కాం. 23:15) ఏడవ విశ్రాంతిదినపు మరుసటి దినమున అనగా ఏబదియవ దినపు ఈ పెంతెకొస్తు పండుగను ఇశ్రాయేలీయుల ఆచరిస్తారు. (లేవి.కాం. 23:16).


: పర్ణశాలల/గుడారాల పండుగ :


1). పర్ణశాలల పండుగనే "గుడారాల పండుగ" అని కూడా అంటారు.

2). ఎవరు చేయాలి..?

 "మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీరు చాటింపవలసిన యెహోవా నియామకకాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామకకాలములు ఇవి.౹" (లేవీ. కాం. 23:1-2).

 "యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను" (నెహెమ్యా. 8:14).

3). ఎందుకు చేయాలి..?

"నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.౹" (లేవీ. కాం. 23:42).

4). ఎప్పుడు చేయాలి..? (యేడవ నెల - ఏతనీ నెల)

  "మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.౹" (లేవీ. కాం. 23:33-౩4).

 "కాబట్టి ఇశ్రాయేలీయులందరును ఏతనీ మను ఏడవ మాసమందు పండుగకాలమున..." (1 రాజులు. 8:2).

5). ఎలా చేయాలి..?

 "మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.౹ వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.౹ ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవదినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కు బడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యము నేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి.౹ ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొని రావలెను. అయితే ఏడవ నెల పదునయిదవదినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతిదినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.౹ మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.౹ అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను.౹ నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.౹" (లేవీ. కాం. 23:33-42).

 "యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియ జేయవలసినదేమనగా–మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.౹ ఆప్రకారమే జనులుపోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమతమ యిండ్లమీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.౹ మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను.౹ ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అను దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి విని పించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును ఏడు దినములవరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవదినమునవారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి."(నెహెమ్యా. 8:14-18).

 NOTE :- సహోదరులారా… పైన మూడు పండుగలు ఇశ్రాయేలీయుల ప్రజలకు ముఖ్యమైన పండుగలు. ఈ పండుగలను వారు ఆచరించాలని దేవుడే స్వయంగా ఆజ్ఞాపించి, ఒక్కొక్క పండుగకు పేరును సూచించాడు మరియు ఏ నెల, ఏ రోజు నుండి ఎన్ని రోజులు చేయవలెనో, ఆయా రోజుల్లో ఏమి చేయవలెనో, ఏమి చేయకూడదో ఈ విషయాలన్నింటిని గూర్చి తన రాజ్యాంగ చట్టమైన ధర్మశాస్త్రములో లిఖితపూర్వకముగా వ్రాయించి వారికి అనుగ్రహించాడు.


: క్రొత్తనిబంధనలో.., యూదులవంటి నియామక కాలాలు లేవు :

★ ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. (గలతి. 4:8-11)

★ కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది.  (కొలస్స 2:17).


: “నిజ” క్రైస్తవులకు పండుగలున్నాయా..? :


 అవును, నిజ క్రైస్తవులకు ఒకే ఒక్క పండుగ కలదు. అదే “నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ”. ఇది మనం వారానికి ఒకసారి అనగా ఆదివారం మాత్రమే ఆచరింప నాజ్ఞాపింపబడ్డాము. ఈ పండుగను ప్రతి వారం నీవు ఆచరిస్తున్నవా??  నీ విశ్వాసము వాక్యానుసారమైనది ఐతే ఈ రెండు “పస్కా పండుగ” మరియు “ప్రభురాత్రి భోజనము”  అంశములను క్లిక్ చేసి చదివి, ఆలోచన చేసి, సత్యమును గుర్తించుటకు వెనుకాడకు సుమా!


» "మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింప బడెను౹ గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ,
నిష్కా పట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము." (1 కోరింథి. 5:7-8).

» పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితివిు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను. (అపో.కార్య. 20:6-7)

  కొన్ని శతాబ్దాలుగా పేరుకి  క్రైస్తవులు అనబడేవారు ఆచరించే క్రిస్టమస్, నూతన సంవత్సరము, మట్టల ఆదివారం, భష్మా బుధవారం, మంచి శుక్రవారం, ఈస్టర్,  సమాధుల పండుగ … etc అనేవాటిని పండుగగా ఆచరించవలెనని పరిశుద్ధ గ్రంథములో ఎటువంటి వాక్య ఆధారము లేవు. దైవ గ్రంథము నకు  లోబడక మనుషులు కల్పించిన పద్దతులను , వాక్య వ్యతిరేకమైన ఆధారములు చూపించుచు  పారం పర్యాలకు చోటు ఇస్తూ జరిగిస్తున్న వారి కోసము గ్రంథము యిలా వర్ణిస్తుంది .  "మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా — ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.(మత్తయి. 15:6-9).

పాత నిబంధన కాలములో.., పరమదేవుడు పండుగలను కోరినప్పుడు, ఆయన తేటగాను, ప్రత్యేకముగాను చెప్పడం జరిగింది. మరి నేటి క్రైస్తవులనబడేవారి(నీవు చేయు) పండుగలకు పైన చెప్పబడినవాటి ప్రకారముగా అనగా "ఏ నెల, ఏ రోజు నుండి ఎన్ని రోజులు చేయవలెనో, ఆయా రోజుల్లో ఏమి చేయవలెనో, ఏమి చేయకూడదో" ఈ విషయాలన్నింటిని నీవు/నీ కుటుంబం జరిగించు పండుగలు గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఎందుకు లేకుండా పోయింది?? నీకు నీవే ప్రశ్నించుకొని, ఆలోచించాలి!

పరిశుద్ధ గ్రంథములోని వాస్తవాలు ఇంత తేటగా కనిపిస్తున్నప్పటికీ నా ధోరణి నాదేనని నీవు అనుకుంటే నీకు నచ్చినట్టుగా బ్రతుకు అంతేకానీ,  పరిశుద్దాత్ముడు వ్రాయించిన లేఖనములకు  నీ సొంతమాటలు చేర్చకు. 

» "మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు." (మత్తయి. 12:32). 

మీ ఆత్మీయులు,
మనోహర్ & నవీన.
+91-9705040236.

నీ ఆరాధన గురించి ఆలోచించు నేస్తమా (My friend, Think about your Worship)

"నీ ఆరాధన గురించి ఆలోచించు నేస్తమా"
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు

నీవు ఏ బోధ యందు నడుచుకొనుచున్నావో ఈ లోకములో నీకు సమయం ఉండగానే పరీక్ష చేసుకో... అపోస్తులుల  బోధ (లేక) దయ్యముల బోధ - (అపో.కార్య. 2:42; 2 కోరింది. 13:5; 1 తిమో. 4:2)


నీవు నిజముగా "యధార్థమైన ఆరాధన" చేస్తున్నావా? (లేక) నటిస్తున్నవా..? ఆలోచన చేయు మిత్రమా! (యోహాను. 4:21-24; ప్రకటన. 3:15-16).


 ఏదో ఒక రకమైన ఆరాధన చేసేసి ఇదే దేవుడు కోరిన ఆరాధన అని నీవు అనుకోవచ్చు, కానీ ఆ ఆరాధన యధార్థమైన ఆరాధనా (లేక) కాదో అని పరిశీలన చేయవలసిన అవసరం ఉందని గుర్తించుకో. (మత్తయి. 15:7-9; అపో.కార్య. 17:23; కొలస్స. 2:18; 2:23; యోహాను. 4:23-24)


➊. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు మొదటి ఋజువు" : 
నీవు నీ దోషాలను, పాపములను, ఇహలోకపరమైన వినోదము, ఈలోకపు మూలపాఠములను అనుసరించుటయే. (యెషయా. 59:2; రోమా. 13:13; గలతి. 5:21; 1 పేతురు. 4:3; కొలసి. 2:8,20)


❷. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు రెండవ ఋజువు" :
దిద్దుబాటును ప్రేమించే స్వభావం లేకపోవుటయే. & వాత వేయబడిన మనసాక్షి గలవారై తప్పులను సమర్ధించుకోవడం. (యెషయా. 2:2-6; రోమా. 2:15; 1 తిమోతి. 4:3; తీతుకు. 1:15)


❸. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు మూడవ ఋజువు" :
 నీలో ఉండు కోపము, అనుమానం, అపవిత్రమైన చేతులతో వేయదగిన ధూపము లేదా ప్రార్ధన & నీతి,రక్షణ వస్త్రాలు లేకుండా... హృదయం మనస్సును దేవునిపై కేంద్రీకృతము చేయకుండా ఆరాధనలో కూర్చొండుటయే (
1 తిమోతి. 2:8; యెషయా. 1:15; కీర్తనలు. 132:9,16; 141:1-2; ప్రసంగి. 5:1-3; 1 కోరింది. 1:10; 14:15; ఎపిసి. 4:18).


❹. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు నాలుగవ ఋజువు" :
 అపోస్తుల బోధ పేరుతో పిట్టకథలు, కట్టుకథలు, లోకపరమైన ఉదాహరణలు, స్త్రీ నాయకత్వముతో బోధ చేయుట, నీ తోటి విశ్వాసి గురించి చెడుగా అన్యుల మధ్య & సంఘములో చెప్పుటయే. (
1 కోరింది. 14:3; 1 తిమోతి. 2:12; 2 తిమోతి. 4:1-4)

*(హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధియు కలుగు సందేశం ఉండవు).

❺. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఐదవ ఋజువు" :
ప్రతి ఆదివారము ప్రభువును జ్ఞాపకము చేసుకోకపోవడం, కృతఙ్ఞత లేకపోవడం, అజ్ఞానముగా, అయోగ్యముగా, వివేచింపక ప్రభువు బల్లలో చెయ్యి  పెట్టుటయే. (అపో. కార్య. 20:7; 
1 కోరింది. 11:17-33)


❻. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఆరవ ఋజువు" :
యధార్థమైన ఆరాధనకు పాత్రుడు కానీ మరొక్క వ్యక్తిని ఆరాధన చేయుటయే & శరీరమును ఆస్పదము చేసుకొనుటయే, వేషధారణ కలిగిన జీవితము (
యోహాను. 4:21-24; పిలిప్పీ. 3:1-6; మత్తయి. 15:7-9)

శరీరమును ఆస్పదము అనగా  ప్రభుత్వం ఉదోగ్యము, హోదా, ధనము, పెరు ప్రఖ్యాతులు, నాకు చాలా అనుభవము కలదు అనే డంభం… etc.


❼. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఏడవ ఋజువు" :
వ్యక్తిగతముగా మాట్లాడవలసినవి సంఘముగా మాటలాడి నీ తోటి వారిని అనేకమందిలో కించపరిచే కార్యక్రమమే. (
మత్తయి. 18:15-18; లూకా. 17:3.)


❽. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఎనిమిదో ఋజువు" :
 నీవు వినే బోధలో తప్పులు లేదా లోపాలు కనబడిన ఖండించలేకపోవడం, అందరిలో తక్కువ వాడిగా అయ్యిపోతావు అని చూసి చూడనట్టుగా పోవుటయే. (
2 తిమోతి. 4:2; 3:16; అపో.కార్య. 18:28; తీతుకు. 2:15)

❾. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు తొమ్మిదో ఋజువు" :
స్వనీతిని ఆధారము చేసుకుని తమకి అనుకూలమైన సంగతులు, ఇష్టాలు సంఘముపై రుద్ది చేయించుకునుటయే. (
రోమా. 10:3; 1 పేతురు. 5:3)

*(ఎక్కువుగా మత శాఖలో & ___ చూడగలము).

❿. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు పదవ ఋజువు" :
 సత్య విషయమైనా ప్రేమను అవలభింపక, వాక్య అనుభవజ్ఞానము పొందినప్పటికి...  కుక్క తన వాంతిని తిన్నట్టుగా, పంది మరలా బురదలో పడినట్టుగా అనేడి సామెత యొక్క ఉండే నీ స్వభావము/ఆలోచనయే.....etc (
2 పేతురు. 2:20-22; 2 దెస్స. 2:9a; హెబ్రీ. 10:26).
మీ ఆత్మీయులు,
మనోహర్_నవీన

"పస్కా పండుగ" (The Passover)

పస్కా పండుగ

క్రైస్తవులని పిలువబడుతున్న వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి కాలములో అనేకమంది క్రైస్తవులు పరిశుద్ధ గ్రంధములో లేని అనేక పండుగలను ఆచరిస్తున్నారు. వారు ఆచరిస్తున్న పండుగలలో పస్కా పండుగ ఒకటి. ఈ పస్కా పండుగను చాలా మంది “ క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుటకై చేస్తున్నామని “ చెప్తున్నారు. చాలామందికి లేఖనాలపై సరియైన అవగాహన లేక ఈ పండుగను చేస్తున్నారు, మరి కొంతమంది అందరు చేస్తున్నారు కనుక మేము చేయాలి అనే భావనతో చేస్తున్నారు, ఇంకొంతమంది క్రీస్తు మరణమును తలంచుకోవటానికి చేస్తున్నారు.

వాస్తవానికి పరిశుద్ధ గ్రంధములో “ఈ పండుగను ఎవరు చేసారు? ఎప్పుడు చేసారు? ఎందుకు చేసారు? ఈ పండుగ ఉద్దేశ్యము ఏమిటి? ఈ పండుగను చేయమని ఆనాడు వారికి దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? నేటి క్రైస్తవులమైన మనము చేయవచ్చా? పస్కాను చేయమని నేటి క్రైస్తవులమైన మనకు దేవుడు ఆజ్ఞాపించాడా?”. ఇలాంటి కొన్ని విశేషమైన సంగతులను లేఖనానుసారముగా ఆలోచన చేద్దాము. తప్పును సరిదిద్దుకుందాము.

ఎవరు చేసారు?


ఈ పండుగను ఇశ్రాయేలీయులు (లేదా) యోకోబు సంతానమైన పన్నెండు గోత్రముల వారు మాత్రమే చేసినట్టుగా పరిశుద్ధ గ్రంధములో చూడగలము.

 » మోషే ఇశ్రాయేలీయుల ”  పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెనుమీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి. (నిర్గమ. 12:21).

 » “ ఇశ్రాయేలీయులు ” పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.(సంఖ్యా.కాం. 9:2).

 » “ ఇశ్రాయేలీయులు ” గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి. (యెహోషువా. 5:10).

ఎప్పుడు చేసారు?


 » ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను.(ద్వితియో. 16:1).

 » మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ ముతోఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. (నిర్గమా. 12:1-3).

 » దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.(సంఖ్యా.కాం. 9:3, యెహోషువా. 5:10).

 » మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును. (లేవీ.కాం. 23:5).

ఎందుకు చేసారు?


 » యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను. మరియు మీకుమారులుమీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కా రముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. (నిర్గమ. 12:25-28).

 » ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱ మేకలలో గాని గోవులలోగాని బలి అర్పింపవలెను. – (ద్వితియో. 16:1-2).


పస్కా పండుగ ఉద్దేశ్యము ఏమిటి? మరియు దేవుడు వారిని ఎందుకు పస్కాను చేయమన్నాడు?


దేవుడైన యెహోవా, ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్న తన ప్రజలను ఫరో అధికారము నుండి తప్పించి, అన్యుల ఎదుట అనేక ఆశ్చర్య కార్యములను జరిగించి, వారిని కనాను దేశమునకు రప్పించే మార్గములో ఎన్నో అద్భుత కార్యములను చేసి, వారిని సంరక్షించిన విధానమును ఇశ్రాయేలీయులు తెలుసుకొని, ఆ మహా గొప్ప అద్భుత కార్యములను జ్ఞాపకము చేసుకొని, దేవుడైన యెహోవాను ఘనపరచాలని ఉద్దేశ్యంతో ఈ పస్కా పండుగను ఆచరించమని వారికి ఆజ్ఞాపించినట్టుగా పరిశుద్ధ గ్రంధములో చూడగలము.

 » మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు. మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. – (నిర్గమ. 12:26-27).

 » నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించినకొలది దాని నియ్యవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవ రాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగు ప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకము చేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. (ద్వితియో. 16:10-12).

 » మోషే ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహుబలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసినదేదియు తినవద్దు. ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయు లకు నివాస స్థానమైయుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. (నిర్గమ. 13:3-5).

ప్రియ సహోదరీ, సహోదరుడా, పైన తెలుపబడిన లేఖనములను పరిశీలన చేస్తే పస్కా పండుగ ముఖ్య ఉద్దేశ్యము, ఎవరు చేసారు, ఎందుకు చేసారు, ఎప్పుడు చేసారు, అనే ప్రశ్నలకు చాలా తేటగా సమాధానము తెలిసినది.
దేవుడైన యెహోవా చెప్పిన రీతిగానే ఇశ్రాయేలీయులు పస్కా పండుగను జరుపుకున్నారు, యెహోవా చెప్పిన రీతిగానే చాలా పరిశుద్ధంగా ఆచరించారు.

నేటి క్రైస్తవులు పస్కా పండుగను ఆచరించవచ్చా ?  


వాస్తవానికి ఈ పండుగను చేయడానికి నేటి క్రైస్తవులకు ఆజ్ఞ ఇవ్వబడలేదు. అయినప్పటికీ లేఖనాలపై పూర్తి స్థాయి అవగాహన లేక ఈ పండుగను చేయాలనే భావనలో ఉన్నారు. కాని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది..,

 » మీరు దినములను మాసములను ఉత్సవకాలములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. – (గలతీ. 4:10-12).

 » అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. (కొలస్సి. 2:16).

ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన సిలువ మరణానికి ముందు శిష్యులతో కలిసి పస్కాను భుజిస్తూ, ప్రభువు బల్లను కూడా పరిచయము చేయుట  మత్తయి 26, మార్కు 14, లూకా 22 వ అధ్యాయాలలో చూడగలము. ఆ విషయమును అపోస్తలుడైన పౌలు గారు కొరింధిలో ఉన్న క్రీస్తు సంఘపు వారిని హెచ్చరిస్తూ (1 కొరింధి 11 వ అధ్యాయము) మన ప్రభువైన యేసు  తిరుగు వచ్చు పర్యంతరము దీనిని (ప్రభువుబల్ల) చేయుడని చెప్పెను. కాని ఎప్పుడు ? సంవత్సరమునకు ఒక్కసారా?

★ “ఆదివారమున” మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను. (అపొ.కార్య. 20:7).

ఆదివారము సంవత్సరానికి ఒక్కసారి వస్తుందా? ఆలోచన చేయండి. సంవత్సరమునకు ఒక్కసారే చేయుడి అని ధర్మశాస్త్ర కాలములో వారికి ఆజ్ఞ ఇవ్వబడింది అది కూడా విశ్రాంతి దినము మరుసటి రోజు. మరి నేటి క్రైస్తవులలో శుక్రవారము చేయడము ఆశ్చర్యంగా ఉంది.

1 కొరింధి 5వ అధ్యాయము 7, 8 వచనములు :


★ మీరు పులిపిండి లేనివారు గనుక కొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియనిరొట్టెతో పండుగ ఆచరింతము. – (1 కొరింధి 5:7-8).

ఈ వచనమును ఆధారముగా తీసుకుని చాలామంది పస్కా చేయవచ్చు అని అనుకుంటున్నారు.
అపోస్తలుడైన పౌలు గారు కొరింధ లో ఉన్న సంఘము యొక్క పరిస్థితిని చూసి, మీలో అనేకమంది జారత్వములు కలిగి ఉన్నారు (1 కొరింధి. 5:1), దేవుని విరోధముగా నడుచుకుంటున్నారు, అని వారిని హెచ్చరిస్తూ జారత్వములు చేసేవారిని పాపములు చేసేవారిని పులిసిన పిండితో పోలుస్తూ , క్రైస్తవులమైన మనకు ఇది తగదు. మనము ఈ లోకము నుండి వేరు చేయబడియున్నాము, మన పాపముల నిమిత్తము క్రీస్తు వధింపబడ్డాడు కనుక  మనము పులిపిండి లేని వారముగా ఉండి, నిష్కాపట్యముతోను, సత్యముతోను” పులియని రొట్టెతో పండుగ ఆచరింతము  అని చెప్పి అక్కడి సహోదరులను బలపరచడం జరిగింది.

ప్రియులారా నేటి క్రైస్తవులమైన మనకు భౌతిక సంబంధమైన పండుగలు ఆచరణలో లేవు.  క్రీస్తు లోనికి బాప్తీస్మము పొందిన మనము ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొని, ఆ ప్రభువు బల్లలో పాలు పొందుట అనేది మనకివ్వబడిన ఆజ్ఞ. అది నెలకొకసారి, సంవత్సరానికొకసారి చేసేది కాదు ప్రతి ఆదివారము చేసేది కనుక క్రైస్తవులమైన మనకు ప్రతి ఆదివారము ఒక పండుగ దినమే కాని అది “భౌతిక సంబంధమైన పండుగ కాదు ఆత్మ సంబంధమైన పండుగ”.  

ధర్మశాస్త్ర కాలములో మన పితరులు చేసినది భౌతిక సంబంధమైనది కాని ఆత్మ సంబంధమైనది కాదు. ఆనాడు మన పితరులు ఆచరించిన ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక (హెబ్రీ. 7:18) వారు పండుగలను, ఆచరించినను, పస్కాను భుజించినను అరణ్యములో కూలిపోయిరి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆ ఆజ్ఞలను పూర్తి స్థాయిలో పాటించక వారందరును నశించిరి.

మరి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ధర్మశాస్త్రములో గల పండుగలను చేయమనా?
ఆయన కుమారుడైన క్రీస్తు మరణమును లోకములో ప్రచురము చేసి నీ ప్రవర్తన ద్వారా అనేకులను సంఘమునకు నడిపించి, ప్రతి ఆదివారము సంఘముగా కూడి పవిత్రంగా, పరిశుద్ధంగా తండ్రిని ఆరాధించి, ప్రతి ఆదివారము ఆయన కుమారుడైన క్రీస్తుని జ్ఞాపకము చేసుకొనుచూ అనగా ప్రభువు బల్లలో పాలు పొందుచూ, అపోస్తులుల బోధలో నిలకడగా ఉండి,  మరణము వరకు నమ్మకముగా ఉండడమే కదా తండ్రి మనకిచ్చిన ఆజ్ఞ. ఆలోచన చేయు. ప్రవర్తన సరిదిద్దుకో. క్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె ఈ యుగ సంబంధమైన దేవతతో పోరాడు.....

● ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా, ధర్మశాస్త్రగ్రంధమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే.(గలతీ. 3:10-11).

● ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవునియెదుట శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్నవాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. (రోమా. 3:19-20).


మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  

"ప్రభురాత్రి భోజనము" (Lord's Supper)


"ప్రభురాత్రి భోజనము"


పరిశుద్ధులుగా  ఉండుటకు పిలువబడినవారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

 ప్రియులారా, నేటి సమాజములో అనేకమంది క్రైస్తవులు ప్రభురాత్రి భోజన విషయంలో వివిధ ఆలోచనలు, పద్దతులు కలిగియున్నారు. కొన్ని సంఘాల వారు ప్రభురాత్రి భోజనమును నెలకొకసారి తీసుకోవాలని, మరికొందరు సంవత్సరానికొకసారి తీసుకోవాలని, ఇంకొంతమంది క్రిస్టమస్ పండుగరోజు తీసుకోవాలని, పాప క్షమాపణ కలుగుటకు ప్రభువు బల్లలో చేయి పెట్టాలని సొంత అభిప్రాయాలు కలిగి 1 కొరింధి 11వ అధ్యాయము 23 నుండి 34 వచనములను సరిగ్గా అర్థము చేసుకోలేకపోతున్నారు.

ఈ ప్రభురాత్రి భోజనము అంశము ద్వారా పైన చెప్పబడిన విషయములను మరియు కొన్ని అతి ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి  పరిశుద్ధ గ్రంధమును పరిశీలన చేసి అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము.

★ "ప్రభురాత్రి భోజనము" అనగా రాజ్య సంబంధమైన భోజనము. రాజ వంశీకులకు మాత్రమే అనుగ్రహింపబడినది ఇంకా చెప్పుకోవాలంటే రాజు యొక్క సముఖములో ఆయనతో కలిసి పాలు పంచుకొనుటకు అర్హత కలిగిన భోజనము లేదా రాజుతో మరియు సంఘముతో  సహవాసము కలిగిన భోజనము.

ఉదాహరణకు :-

1) ఏ మాత్రము అర్హత లేని మెఫీబోషేతుకు రాజైన దావీదు సముఖములో భోజనము చేయుటకు కలిగిన అవకాశము.

 » అందుకు దావీదునీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవియ్యగా. అతడు నమస్క రించిచచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను. – (2 సమూయేలు. 9:7-8).


2) షేబదేశపు రాణి రాజైన సొలోమోను భోజన బల్లను చూసి ఆశర్యపడుట.

 » షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును,అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై. – (1 రాజులు. 10:4-5).


ఇటువంటి  గొప్ప రాజ విందులో పాలు పొందుటకు ఎటువంటి అర్హత లేని మనకు తండ్రియైన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా సహవాసమును ఏర్పాటు చేసి (1 కొరింధి. 1:9), తన కుమారుని రాజ్యములో వారసులునుగా చేసి (1 పేతురు. 2:9), ఆ రాజు యొక్క విందులో అనగా ప్రభురాత్రి భోజనములో చేయి పెట్టుటకు అవకాశమును దయచేసెను (1 కొరింధి. 11:23-32). కాని ప్రియ సహోదరుడా, పైన పేర్కొనబడిన రాజ విందులో పాలు పంచుకొనుట నామమాత్రమే గానీ క్రీస్తువారి ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ రాజ విందు శాశ్వతమైనది, నిత్యమూ క్రమము తప్పకుండా కొనసాగించేదని క్రైస్తవులమైన మనము మొదట గ్రహించాలి.


NOTE:- మన ప్రభువైన యేసుక్రీస్తువారు తాను అప్పగింపబడిన రాత్రి తన శిష్యులతో కలిసి రెండు రకాల భోజనాలలో పాలు పొందుట మనము చూడగలము. 

● ఒకటి పస్కా భోజనము,
● రెండవది ప్రభురాత్రి భోజనము.

 » వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. – (మత్తయి. 26:26-27).

 » వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. – (మార్కు. 14:22-23).


ప్రభురాత్రి భోజనము ఎప్పుడు తీసుకోవాలి..?

ఈ ప్రభురాత్రి భోజనమును ఒక్కొక్క సంఘము ఒక్కోరోజు తీసుకుంటుంది. కాని ఆదిమ అపొస్తలులు "ప్రతి ఆదివారము" తీసుకున్నట్లు పరిశుద్ధ గ్రంధములో స్పష్టముగా కనబడుచున్నది..

 » "ఆదివారమున" మేము రొట్టె విరుచుటకు కూడినపుడు. - (అపొ.కార్య. 20:7).

ప్రియులారా, ఆదివారము నెలకొకసారి వస్తుందా లేక సంవత్సరానికొకసారి వస్తుందా లేదా వారమునకు ఒకసారి వస్తుందా నేటి క్రైస్తవులు గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది.  చాలామంది ఆదివారము సెలవు దినము కాబట్టే ఆరోజు నిర్ణయింపబడిందనే ఆలోచనలో ఉన్నారు కాని ఆదివారమునకు ఉన్న ప్రాముఖ్యతను దేవుని గ్రంధములో చూడగలిగితే,


 » యేసు పునరుత్థానుడై తిరిగి లేపబడిన దినము "ఆదివారము". – (మత్తయి. 28:1; మార్కు. 16:2; లూకా. 24:1; యోహాను. 20:1). 

 » క్రీస్తు సంఘము ప్రారంభమైన దినము "ఆదివారము". – (అపొ.కార్య. 2:38-41).

 » క్రీస్తు వారు పరలోకమునకు కొనిపోబడిన పిమ్మట అపొస్తులులు, ఆదిమ సంఘస్థులు ప్రభురాత్రి భోజనము మొదటిగా తీసుకున్న దినము  "ఆదివారము". – (అపొ.కార్య. 20:7).


గమనిక : ప్రియులారా క్రింద వ్రాయబడిన వచనమును బట్టి కొందరు క్రైస్తవులు అనుదినము రొట్టె విరవాలని తప్పుగా అర్థము చేసుకుంటున్నారు కాని ఇక్కడ వారు చేసిన భోజనము అత్మానుసారమైనది కాదు శరీరమునకు కావలసిన ఆహారమని గ్రహించాలి.   

 » ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్థితించుచు. – (అపొ.కార్య. 2:46).



ప్రభురాత్రి భోజనము ఎవరు తీసుకోవాలి..? 

సహోదరులారా ప్రభురాత్రి భోజనమును ఎవరు పడితే వారు తీసుకునే కార్యక్రమమని పరిశుద్ధ గ్రంథము తెలియజేయట్లేదు. ఈ ఆర్హత కేవలము క్రీస్తు శరీరములోనికి అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) బాప్తీస్మము పొందిన వారికే మాత్రమే అనుగ్రహింపబడిందని తెలుసుకోవాలి.

 » ఆ సంఘము ఆయన శరీరము. – (ఎఫెసీ. 1:23).

 » క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? – (రోమా. 6:3).

 » క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. – (గలతీ. 3:27).

» ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు. – (1 కొరింధి. 12:13).


ప్రభురాత్రి భోజనముయొక్క ముఖ్య ఉద్దేశ్యము :

అపొస్తులుడైన పౌలు గారు కొరింధి పట్టణములో  ఉన్న క్రీస్తు సంఘమును హెచ్చరిస్తూ, వారి లోపాలను వారికి గుర్తుచేస్తూ ప్రభువైన క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులతో కలిసి పుచ్చుకున్న భోజన ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్క స్థానిక క్రీస్తు సంఘము ఇట్టిరీతిగానే ఆ క్రీస్తు సహవాస భోజనములో పాలు పొందాలని కొన్ని విశేష సంగతులను తెలియజేయడమైనది.


A). "జ్ఞాపకము" : (1 కొరింధి. 11:23-25).

 » నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింప బడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి. దానిని విరిచి యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

★ జ్ఞాపకము అనగా స్మృతి, జ్ఞప్తి.

1). సమస్త మానవాళి తమ పాపములు విషయములో పరిహారము పొందాలంటే క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే సాధ్యమని మన తండ్రియైన దేవుడు  ముందుగానే ఎరిగి తాను నిర్ణయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆయనను నియమించెనని, ఇప్పుడు ఆయన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలమందు మనయెదుట ప్రత్యక్షపరచబడెనని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్ఞాపకము చేసుకోవాలి. – (అపొ.కార్య. 2:23, 1 పేతురు. 1:18-21).     

2). మన పాపముల నిమిత్తమై మరణించుటకు రక్తమాంసములలో పాలివాడై, ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అపవాదిని నశింపజేసి, మరణభయము నుండి  విడిపించి,  సకల ప్రజల పాపములకు పరిహారము కలుగజేసి, సిలువపై ఎంతో శ్రమ పొంది, తనతో సమాన వారసత్వమును కలుగజేసి, మనలను రక్షించిన  క్రీస్తు మరణ త్యాగమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్ఞాపకము చేసుకోవాలి. – (హెబ్రీ. 2:14-17). 

3). యేసు తాను చేయని తప్పుకి మనకొరకు ఎన్నో శ్రమలనుభవించి, కొరడాలతో కొట్టబడి, ఎన్నో గాయములనొంది, తనను చెంపమీద కొట్టినా, తనను హేళన  చేసినా,  చివరికి తనపై ఉమ్మివేసినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనముగా తండ్రి చిత్తము చొప్పున సిలువ భారమును భరించాడంటే అది కేవలము నీ కోసము నాకోసమే అని గ్రహించి ఆయనను జ్ఞాపకము చేసుకోడానికే ప్రభురాత్రి భోజనమని  తెలుసుకోవాలి. – (యెషయా. 50:6; 53:3-10, మత్తయి. 26:27; 27:26-31, మార్కు. 14:65, యోహాను. 18:22; 19:1, 1 పేతురు. 3:21-24).

4). మనలను ఎలాగైతే అపవాది లోబరుచుకున్నాడో అలాగే, యేసు ఈ లోకములో శరీరధారిగా నివసించినప్పుడు అపవాది చేత ఎన్నో రకాలుగా శోధించిబడినప్పటికీ తాను ఎంతమాత్రము లోబడక అపవాదిని దైర్యముగా ఎదుర్కొని ఈ లోకములో ఉన్నంత కాలము మనకొరకు అపవాదితో మహాయుద్ధము చేసి మనకు జయమును కలుగజేసాడన్న విశేష సంగతిని జ్ఞాపకము చేసుకోవాలి. – (లూకా. 11:21, యోహాను. 1:14; 13:1-17, హెబ్రీ. 2:15).

5). దేవుని స్వరూపము కలిగినవాడైనప్పటికీ, ఆయనతో సమానముగా ఉండే గొప్ప బాగ్యమును విడనాడి, దేవదూతలకంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడి, మనుష్య పోలికగా పుట్టి, దాసుని రూపము ధరించుకుని, తనను తాను ఎంతమాత్రము హెచ్చించుకొనక శిష్యుల పాదములను సైతము కడిగి, అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడుదల చేయుటకు సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తనను తాను ఎంతగానో తగ్గించుకుని, మనలను బ్రతికించిన ఆ యేసుని హృదయపూర్వకముగా జ్ఞాపకము చేసుకోవాలి. – (ఫిలిప్పి. 2:5-8, ఎఫెసీ. 2:1, హెబ్రీ. 2:9).

6). మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుటకు అనగా ఇహలోక మాలిన్యమును ఎంతమాత్రమును మనకంటకుండా ఆయనను పోలి నడుచుకోవాలని మనకు మాదిరి చూపించిన ఆ యేసుని జ్ఞాపకము చేసుకోవాలి. – (1 పేతురు. 2:21-24, యాకోబు. 1:27).

NOTE: ఇటువంటి ఎన్నో విశేష సంగతులన్నిటిని జ్ఞాపకము చేసుకొని ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందాలి.


B). "యేసు మరణ ప్రచురము" : (1 కొరింధి. 11:26).

» మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

★ ప్రచురము అనగా ప్రకటించుట.

ప్రియులారా,  క్రీస్తులోనికి బాప్తీస్మము పొంది, ఆ ప్రభువు యొక్క బల్లలో పాలుపంచుకునే నీవు మనకు అప్పగింపబడిన సువార్త పనిలో కొనసాగుతున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి.
సిలువను గూర్చిన వార్త మనకు దేవుని శక్తియై ఉన్నదని, నశించువారు రక్షింపబడుటకు క్రీస్తు సువార్తయే మార్గమని ఈ లోకములో ప్రకటన చేయాలి.

» సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. – (1 కొరింధి. 1:18).

1). సిలువను గూర్చిన వార్త ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించారని, సమాధి చేయబడెనని, మూడవ దినమున లేపబడెనని అపోస్తులులు ఎలాగైతే ప్రకటన చేసారో మనము కూడా ఈ లోకములో ప్రకటన చేయాలి.

» సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. – (1 కొరింధి. 15:1-4).

2). క్రీస్తు ఈ లోకమునకు రాకమునుపు మరణము ప్రతి మనుష్యుని యేలెను కాని ఆ క్రీస్తు రాక ద్వారా మరణము ఓడించి, అపవాదికి అపజయమునిచ్చియున్నాడని, పాతాళపు నోరు కట్టియున్నాడని, సువార్త ద్వారా ఆయనను అంగీకరించువారికి జీవమును, అక్షయతను కలుగుజేయువాడు ఆయన మాత్రమే అని ప్రకటన చేయాలి. 

» క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడినదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను. – (2 తిమోతి. 1:10).

 జీవము అనగా క్రీస్తునందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకునని,

 అక్షయత అనగా బ్రదికి క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడని ప్రకటన చేయాలి.

» అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. – (యోహాను. 11:25,26).

3). మృతులు అనగా యేసుక్రీస్తు సువార్తకు లోబడనివారు. ఆయన సువార్తకు లోబడనివారికి నీవు తెలియజేయవలసినది ఏమనగా “పాపముల విషయములో చనిపోయిన నీవు క్రీస్తు సువార్త ద్వారానే బ్రతుకుతావని అలా చెప్పుటకు సాక్షిని నేనే అని చెప్తూ, ఆ మృతుడు క్రీస్తు రాజ్యములో (CHURCH OF CHRIST) ప్రవేశించు వరకూ  ఆయన మరణమును గూర్చి ప్రకటన చేయాలి.”

» మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. – (యోహాను. 5:25).


C). "స్వపరీక్ష" : (1 కొరింధి. 11:27-28).

» కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

★ స్వపరీక్ష అనగా తనకు తాను పరీక్షించుకొనుట


మనస్సు మార్పునొంది, దుష్టత్వాన్ని మానుకొని చెడు కార్యములను విడిచి పెట్టుటకు, తన మనసాక్షి నిమిత్తము  తప్పులను సరిచేసుకుని, క్రీస్తులాంటి జీవితమును జీవించాలని ఆలోచన కలిగి హృదయపూర్వకముగా కోరుకునేవారికి ప్రభురాత్రి భోజనము ఒక గొప్ప అవకాశము.

ప్రియ సహోదరుడా,  క్రీస్తువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు తనని సిలువకు అప్పగించిన ఇస్కరియోతు యూదా యొక్క ఆలోచన ముందుగానే ఎరిగి, మనస్సు మార్చుకునే అవకాశమును ఇవ్వడము జరిగింది కాని యూదా మాత్రము అయోగ్యముగానే క్రీస్తు బల్లలో పాలు పొందాడు, చివరికి క్షమాపణ లేకుండానే మరణించాడు. ఆనాడు యూదాకి ఎలాగైతే అవకాశామునిచ్చాడో  ఈనాడు మనకు కూడా ప్రభురాత్రి భోజనము ద్వారా అవకాశమును కల్పించాడు. అయినప్పటికీ దానిని నీవు ఎంతమాత్రము లెక్క చేయకుండా అయోగ్యముగానే అందులో పాలు పొందితే  ఇస్కరియోతు యూదాలాంటి స్థితిని కొరి కొనితెచ్చుకుంటున్నావేమో అని నిన్ను నీవు పరీక్షించుకుని ఆ బల్లలో పాలుపొందాలని కొరింధి పత్రికలో వ్రాయబడిన మాటల సారాంశమని గ్రహించాలి.


» సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుం డెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవు చున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. – (మత్తయి. 26:20-25).


D). "వివేచన" : (1 కొరింధి. 11:29).

» ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.

★ వివేచన అనగా ఆలోచించుట లేక గ్రహించుట.

◆ సహోదరులారా, ప్రభురాత్రి భోజనములో భాగంగా రొట్టెను తీసుకునేటప్పుడు అది క్రీస్తు శరీరముకు సాదృశ్యమని, ద్రాక్షారసమును తీసుకునేటప్పుడు అది క్రీస్తు రక్తమునకు సాదృశ్యమనే భావన కలిగియున్నారు కాని వాస్తవానికి రొట్టె క్రీస్తు శరీరముకు, ద్రాక్షారసము ఆయన రక్తముకు చిహ్నమని గ్రహించలేకపోతున్నారు.

◆ నేటి సంఘాలలో చాలామంది ప్రభురాత్రి భోజనము కార్యక్రమము చేస్తున్నపుడు రొట్టెను, ద్రాక్షారసమును పంచిపెడుతూ అవి క్రీస్తు శరీరముకు మరియు రక్తముకు సాదృశ్యముగా చెప్తుంటారు కాని సహోదరుడా ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో సాదృశ్యమనే పదము వాడుట సరియైనది కాదు ఎందుకనగా సాదృశ్యము (figure ) అనగా ఆకారము, ఆకృతి, స్వరూపము, బింబము అని అర్థము వసున్నది. దీనినిబట్టి ఆలోచన చేయగలిగితే రొట్టె క్రీస్తు శరీర ఆకారము కాదు మరియు ద్రాక్షారసము ఆయన రక్తము కాదు కనుక సాదృశ్యమనే భావనతో ఆయన బల్లలో చేయి పెట్టకూడదు.

◆ ప్రభురాత్రి భోజనములో పాలు పొందే ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే, రొట్టె అనగా సిలువలో నలుగగొట్టబడిన క్రీస్తు శరీరముకు చిహ్నమని, ద్రాక్షారసమనగా ఆయన ఎన్నో గాయములనొంది సిలువలో కార్చిన రక్తముకు చిహ్నమని ఆలోచన కలిగియుండాలి, వివేచనతో ఆ పాత్రలో చేయి పెట్టాలి.  (చిహ్నము అనగా గుర్తు).

◆ క్రీస్తు శరీరము అనగా సంఘము కాని రొట్టె కాదు. అపోస్తలుడైన పౌలుగారు శరీరమంటే సంఘమనే ఉద్దేశముతోనే మాట్లాడటం జరిగిందని గ్రహించాలి. ఎందుకనగా కొరింధిలో ఉన్న క్రీస్తు సంఘములో వివిధ భావాలు ఏర్పడి కక్ష్యలు, పేద, ధనిక అనే  భేధాలు కలిగియున్నారు కనుక వారిని హెచ్చరిస్తూ ఈలాగు చెప్పెను..

◆ మనమంతా క్రీస్తు శరీరములో అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) అవయవములుగా చేర్చబడ్డామని, ఆయన శరీరమములో అవయవములన్ని ఏలాగైతే ఒక్కటిగా కలిసియున్నాయో  అలాగే క్రీస్తు సంఘములో చేర్చబడిన మనము ఏక మనస్సును, ఏక ప్రేమ, ఏక భావము, ఏక తాత్పర్యమును కలిగియుండాలని, ఒకరితో ఒకరు సమాధానము కలిగి దేవునితో సమాధానపరచవలెనని అందుకే క్రీస్తు ఈ లోకములో మరణించాడని వారికి గుర్తుచేస్తూ  ప్రభురాత్రి భోజనము యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేయడమైనది. 

 » ఆ సంఘము ఆయన శరీరము. – (ఎఫేసీ. 1:23).

 » కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. – (మత్తయి. 5:22-24).

 » ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. – (ఎఫెసీ. 2:14-17).

 » ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవ ములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. – (1 కొరింధి. 12:12).

కాబట్టి, ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనములో చేయి పెడుతున్న నీవు నీ సహోదరునితో సమాధానము కలిగియున్నావా?, అన్ని విషయములలో, అన్ని సమయాలలో  క్రీస్తు సంఘముతో ఏకీభవిస్తున్నావా? అని వివేచన కలిగి  ఆ పాత్రలో చేయి పెట్టాలనేది ఆ వచనముల ఉద్దేశమైయున్నది కాని బాప్తీస్మము తీసుకున్నాను కదా అందులో పాలు పంచుకోవాలి కదా అని వివేచన లేకుండా నిన్ను నీవు పరీక్షించుకొనకుండా ఒక ఆచారముగా తీసుకోవాలని సిద్ధపడితే అది శిక్షావిదికే కారకమగును కనుక ఆలోచన చేసి జాగ్రత్తగా ఆయన ఆజన ప్రకారము ప్రభువు బల్ల కార్యక్రమమును నెరవేర్చాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.



మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  
The churches of Christ greet you - Roma 16:16