Showing posts with label దేవుడు. Show all posts
Showing posts with label దేవుడు. Show all posts

క్రైస్తవుడు – కులం 👥



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 

1️⃣. పరిచయం
1. క్రైస్తవ విశ్వాసం — దేవుని నిర్మాణం (ఆత్మీయ రాజ్యం).
2. కుల భావన — మనుషుల నిర్మాణం (సాంఘికం).
3. ప్రశ్న: క్రైస్తవుడు మరియు కులం ఒకే మనసులో నిలవగలవా? (లేదా) ఈ రెండూ కలియుట సాధ్యమా?
4. సమాధానం — బైబిల్ ఆధారంగా.

మనం పరిశీలించబోయే ప్రశ్న చాలా సున్నితమైనది, ఆత్మీయమైనది, నిత్యజీవితాన్ని నిర్ణయించే హృదయ ప్రశ్న మరియు క్రీస్తు సంఘానికి అత్యంత సంబంధించినది. అదేమనగా... “క్రైస్తవుడు – కులము రెండూ కలిసి నడవగలవా?” (లేదా) “క్రీస్తును అనుసరించడం మరియు కులాన్ని పట్టుకోవడం ఒకేసారి సాధ్యమా?”

మనము నివసిస్తున్న సమాజం చాలా విభజనలతో నిండిపోయింది. మనుషులు తమ తమ వర్గాలు, కులాలు, సంప్రదాయాలు, భేదాలు, ఇతరులపై పైచేయి అనే భావాలను నిర్మించుకున్నారు. జన్మ ఆధారంగా, కుటుంబ పేరుతో, సామాజిక స్థితిపై ఆధారపడి మనుషులను విడదీసే ప్రపంచం ఇది. 

కుల భేదాలను నిర్మించినది మనుష్యులే అయితే  ఈ విభజనకు విలువను ఇచ్చింది మాత్రం సమాజమే. క్రైస్తవ విశ్వాసంలో/పరిశుద్ధ గ్రంథములో  — కుల విభజన,  వివక్ష , గర్వం, వినయం; పాత స్వభావం లాంటి వాటికి తావు లేదు. అయినప్పటికీ నేటి సమాజంలో  కొందరు క్రైస్తవులని పిలువబడుతూ, క్రీస్తు పేరును వాడుతూ, కులం, గర్వం అనే వాటిని ప్రోత్సహిస్తూ  దేవుని గ్రంథానికి విరోధంగా విపరీత ధోరణి కలిగియున్నారు.  అట్టివారికి ఈ అంశం అంకితం చేయనున్నాము.

క్రైస్తవులకు ప్రామాణికమైన పరిశుద్ధ గ్రంథము ఈ విషయం గూర్చి ఏం చెప్పుచున్నదో, ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. 


2️⃣. క్రైస్తవుడిగా పిలిపించుకోవడం అంటే ఏమిటి?
A. క్రీస్తు సంఘం యొక్క స్వరూపం
1. సంఘం — ఒక స్థితి నుండి వేరొక స్థితికి పిలువబడిన వారు అని అర్థం. "A calling out off" ఇది గ్రీక్ భాష నుండే అనువదింపబడింది. గ్రీక్ లో ἐκκλησία (ekklesia), meaning "called-out ones" (from ek 'out of' + kaleo 'to call'). 
2. సంఘము — క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. (1కొరింథీ. 1:2)
3. సంఘము — "ఆ సంఘము ఆయన(క్రీస్తు) శరీరము; (ఎపేసి. 1:23). " సంఘము అను శరీరమునకు ఆయనే(క్రీస్తే) శిరస్సు (కొలొస్సి. 1:18). శరీర మొక్కటే (ఎపేసి. 4:4).
4. సంఘము — కులం, జాతి, భాషలకు అతీతం. 
5. క్రీస్తు నందు ఉన్నవారిలో ఎలాంటి కుల భేదాలు, వివక్షతలు లేవు/ఉండకూడదు. (గలతీ. 3:28)
6. అందరూ ఒక ఆత్మలో క్రీస్తు శరీరమై(సంఘమై) ఉండుటకై బాప్తిస్మ పొందినవారు. (1 కొరింథీ 12:13)

☑ B. క్రైస్తవుడు అనే పేరు అమలు
1. యేసును తమ నోటితో ప్రభువని అంగీకరించడం, దేవుడు ఆయన్ను(యేసును) మృతులలో నుండి లేపెనని హృదయమందు విశ్వసించడం. (రోమా 10:9).
2. “.... మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి." (అపో.కార్య. 11:26).
3. "ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరునుబట్టియే దేవుని మహిమపరచవలెను.౹" (1 పేతురు. 4:16)
4. నేను క్రైస్తవుడును అంటూ కేవలం పేరును వాడడం రక్షణకు మార్గం కాదు.
5. ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయడం ముఖ్యము. (మత్తయి. 7:21) " తండ్రి చిత్తం ఏంటి?" మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹" (అపో.కార్య. 3:22-23)
6. క్రీస్తు యొక్క శిష్యుడే/సేవించువాడే = క్రైస్తవుడు. (యోహాను. 12:26; మత్తయి. 28:19).


3️⃣. క్రైస్తవులకు ప్రభువైన యేసుక్రీస్తు
☑ A. క్రీస్తు ఇశ్రాయేలీయుడు
1. యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుడు అనగా "మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినవాడు. (హెబ్రీ. 7:14). ఆయన గ్రీకు/అరామిక్/హీబ్రూ... భాషలు మాట్లాడినవాడు. ఇది చారిత్రిక సత్యం.
2. క్రీస్తునందు రక్షింపబడినవారు అనగా దేవుని ఉగ్రత నుండి తప్పింపబడినవారు ఒక జాతికి లేదా ఒక భాషకు పరిమితం కాదు. 

☑ B. సర్వజనులకు రక్షణ
1. "కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు" (మత్తయి. 28:19) ఈ ఆజ్ఞ ప్రకారం క్రైస్తవ్యం సర్వజనులకు, వివిధ భాషలు గలవారికి వ్యాప్తి చెందింది. మన భారతదేశమునకు కూడా వచ్చింది కావున ఇక్కడ ఏ కులం, ఏ భాష వారైనా క్రీస్తు సువార్త విని, విశ్వసించే హక్కు ఉంది. 
2. యేసు లోక రక్షకుడు(లుకా. 2:11; 1 యోహాను. 4:14; యోహాను. 1:29; 4:42).
3. భారతదేశ కులాలన్నీ దేవుని ముందు సమానమే.


4️⃣. మానవ నిర్మిత కుల వ్యవస్థ — బైబిలు దృష్టిలో
☑ A. మనుషుల విభజనను దేవుడు ఎప్పుడూ ఆశీర్వదించలేదు. కులాలు దేవుని యోచనలో లేవు
1. ఆదిలో దేవుడు ఒకే రక్తమునుండి సమస్త జనులను సృష్టించాడు (అపొస్తలుల కార్యములు 17:26) కానీ మనుషులను, కులాలుగా సృష్టించలేదు. దేవుని సృష్టిలో ఉన్నత–నిమ్న అనే భేదం లేదు. కులం అనే భావన మనుషుల మేథస్సు తయారు చేసినదే.
2. దేవుని సృష్టిలో ఉన్నత-నిమ్న అనే భావనే లేదు. "నరులు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు. (ఆదికాండము 1:27) మరింత వివరణ కోసం "మానవ నిర్మాణము" అనే అంశం చదవండి. దేవుని స్వరూపంలో ఉన్నవారిని కులం ద్వారా కొలవడం అనేది దేవుని రూపాన్ని అవమానించడమే అగును కదా!!

3. పాక్షికత పాపం : కులం అనేది పక్షపాతమే — కాబట్టి పాపమే. "నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి.౹".(యాకోబు
 2:1) పక్షపాతము వద్దు. (యాకోబు. 2:9) దేవునికి పక్షపాతము లేదు(అపో.కార్య. 10:34-35; రోమా. 2:11; ఎపేసి. 6:9; 1పేతురు. 1:17) " 

☑ B. ప్రపంచపు కుల భావన అనేది సాతాను యొక్క విభజన ఆయుధమే
1. అణచివేత, గర్వం, విభజన, వివక్షత, వ్యతిరేకత, పక్షపాతం — ఇవి సాతాను యొక్క స్వభావాలు — "దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు;..." (యోహాను 10:10).
2. దేవుని రాజ్యంలోని ఏకత్వానికి పూర్తి విరుద్ధం
"ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?" (మత్తయి. 12:25-26) 
“విభజింపబడిన రాజ్యం నిలువదు" . కులం సంఘాన్ని విభజిస్తుంది — గనుక ఇది దేవుని రాజ్య సూత్రాలకు వ్యతిరేకం. 


5️⃣. క్రీస్తులో కొత్త సృష్టి ≈ కుల భేదాలు పూర్తిగా తొలగింపు
☑ A. క్రీస్తులో సర్వభేదాలు లేని కొత్త సృష్టి
1. 2కొరింథీ. 5:17 — పాతవి గతించిపోయినవి; కులమూ అందులో ఒక భాగమే. 
✒ పాత మనిషి — కులం, గర్వం, భేదం
✒ కొత్త మనిషి — ప్రేమ, ఏకత్వం, వినయం, పరిశుద్ధత

2. విభేద గోడలు కూలాయి : "ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.౹ అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.౹ ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.౹ ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,౹ తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.౹ మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.౹" (ఎఫెసీ. 2:17- 22)
పౌలు గారు “గోడ” అని చెప్పింది — జాతి, కుల భేదాల గోడలే.
అట్టి గోడను కూల్చితే, క్రైస్తవుడు దానిని మళ్లీ నిర్మించగలడా? అసాధ్యం.

☑ B. క్రీస్తులో భేదాలు తొలగిపోయాయి, ఎవరు ఉన్నా, అందరూ ఒక్కటై ఉండాలి*
1. “మీరు అందరు క్రీస్తు యేసునందు ఏకమై యున్నారు.” (గలతీయులు 3:28)
ఇక్కడ “భేదాలు లేవు” అని చెప్పినట్టు — కులానికీ క్రీస్తులో స్థానం లేదు.
యూదువాడు/గ్రీకువాడు
దాసుడు/స్వతంత్రుడు
పురుషుడు/స్త్రీ
(ఇవన్నీ “సమాజిక భేదాలు” — కులం కూడా ఇదే జాబితాలో పడుతుంది.)
2. "ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు." (కొలస్సీయులు 3:11)


6️⃣. క్రీస్తు సంఘములో కుల భావనకు స్థానం ఎందుకు లేదు?
☑ A. సంఘం = ఒక శరీరం, ఒక ఆత్మ
1. అనేక అవయవాలు, ఒక శరీరం. (1 కొరింథీ 12:12–27) 
2. కుల గర్వం = శరీరాన్ని(సంఘాన్ని) చీల్చి వేయను కదా.
☑ B. సంఘము శరీరంగా, క్రీస్తు అధికారిగా(శిరస్సు) ఉండటం
1. ఆ సంఘము ఆయన(క్రీస్తు) శరీరము; (ఎపేసి. 1:23). " సంఘము అను శరీరమునకు ఆయనే(క్రీస్తే) శిరస్సు (కొలొస్సి. 1:18). శరీర మొక్కటే (ఎపేసి. 4:4).
2. శరీరంలో అవయవాలు ఒకదానిని ఒకటి తక్కువగా చూడవు.
 C. విభజనలు దేవుని వాక్యానికి విరుద్ధం
1.  విభేదాలు లేని ఏకమనస్సు. (1 కొరింథీ 1:10)
2. "మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుం చుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.౹" (ఫిలిప్పీయులు 2:2).
 D. కుల గర్వం = శరీరాశ
1. 1 యోహాను 2:16 — శరీరాశ దేవునివద్దనుండి కాదు.
2. సామెతలు 16:18 — గర్వం పతనానికి ముందు.
☑ E. కులపు విభజన = క్రైస్తవ ప్రేమకు విరుద్ధం
1. యోహాను 13:34–35 — “మీరు పరస్పరం ప్రేమించుకొనుడి.” కులం ప్రేమను చంపుతుంది.
2. 1 యోహాను 4:20 — సహోదరుని ద్వేషించి దేవునిని ప్రేమించలేడు.
3. రోమా 12:10 — “సహోదర ప్రేమతో పరస్పరం ప్రీతిగలవారై యుండుడి.”
☑ F. కులం విడవని వారికి దేవుని రాజ్యంలో స్థానం ఉండదు
1. 1 కొరింథీ 6:9–10 — పాపాలలో జీవించే వారు రాజ్యములో ప్రవేశించరు.
2. ఎఫెసీ 5:5 — హృదయ గర్వం/అహంకారం కూడినవారు రాజ్యానికి బయట.
3. హెబ్రీయులు 12:14 — పవిత్రత లేకుండా ఎవరూ ప్రభువును చూడరు. కులం మనలను పవిత్రులుగా చేయదు సుమీ!


7️⃣. కులాన్ని వదిలి క్రీస్తుయొద్దకు వచ్చినవారు
1. పాత మనిషిని(స్వభావమును) విడిచి క్రీస్తు నందు నూతన స్వభావము ధరించు (ఎఫెసీ 4:22–24)
2. పరస్పరం సోదర ప్రేమతో నడుచు (రోమా 12:10) క్రీస్తు ప్రేమించిన ప్రకారం...
3. కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు౹ (ఫిలిప్పీ 2:3)
4. నిజమైన క్రైస్తవ జీవితం — క్రీస్తు బోధకు లేదా అపోస్తలుల బోధకు లోబడటం. నీ వాక్యము సత్యము.(యోహాను. 17:17) "కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి, మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి." (2 దేస్స. 2:15)
కులం అనేది సత్యం కాదు, జీవితం కాదు, వ్యవస్థ కాదు, రక్షణ  కాదు,
క్రీస్తే మార్గం, సత్యం, జీవితం. (యోహాను 14:6)
5. నీ హృదయాన్ని మార్చుకో. పిల్లలు వలే మారుమనస్సు పొందుము. (మత్తయి. 18:3). శుద్ధ హృదయులే దేవుని చూచుదురు.(మత్తయి. 5:8)
6. మనలో పరిశుద్ధాత్ముడు పని చేసే మార్పు విషయములో ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. (రోమా 8:13–14). ఆత్మఫలాలు ప్రేమ, శాంతి, దయ…(గలతీ 5:22–23).


8️⃣. క్రైస్తవుడు — కులము రెండూ కలసి నడవటం అసాధ్యం.
కులం క్రైస్తవ్యం
మానవ నిర్మాణం దేవుని నిర్మాణం
విభజన ఏకత్వం
అహంకారం, ద్వేషం వినయం, ప్రేమ
పాత మనిషి/స్వభావము కొత్త సృష్టి/నూతన స్వభావం
పాపపు పులిపిండి పవిత్రుల కొరకు
పక్షపాతం, కక్షలు ప్రేమ
ద్వేషము సమాధానము
పగలు, కుట్రలు క్షమించే గుణం

క్రీస్తును ధరించినవారికి కులాన్ని ధరించగల స్థలం లేదు.

క్రీస్తును పట్టుకున్నానో? లేక కులాన్ని పట్టుకొన్నానో? ఒక క్షణం ఆలోచించు.👥


9️⃣. ముగింపు :

ఓ చదువరి… ఈ అంశము యొక్క లక్ష్యం కులాన్ని సమర్థించటం కాదు, ఒక సమాజాన్ని విమర్శించడం కాదు, ఒక వర్గాన్ని తప్పుపట్టడం కాదు. దేవుని రాజ్యంలో అనగా క్రీస్తు సంఘములో కులానికి స్థానం లేదని తెలియజేయడమే... క్రైస్తవుని గొప్పతనం — కులానికి మించి క్రీస్తులో ఏకత్వం కలిగియుండుటయే. కుల భావనను విడిచిపెట్టి, క్రీస్తులో కొత్త సృష్టిగా నడవాలి. సంఘం ప్రేమలో, వినయంలో, పవిత్రతలో ఉండాలి. యేసు కోరేది — “మీరు అందరు ఏకమై యుండవలనేది ప్రభువు యొక్క ప్రార్థన” (యోహాను 17:21).

కుల పిచ్చి, వివక్షత, ద్వేషము, విభజనలు మరియు గర్వముతో జీవించడం దేవుని(YHWH) చిత్తం కాదు. కులం, జాతి, భాషను బట్టి విర్రవీగేవారు ఒకసారి మీ హృదయాలు పరీక్షించుకోవాల్సిందిగా మా మనవి. 🙏🏿

మీ ఆత్మీయులు 👪

దేవుడు ఒక్కడే అంటే — ఎవరికీ దేవుడు?



ప్రపంచమంతా అనేకమంది వివిధ రకాల దేవతలను పూజిస్తున్నా, వివిధ రకాల విశ్వాశాలు కలిగియున్న, వివిధ భక్తి జీవితాలు కలిగియున్నప్పటికి … మొదటగా సమస్త మానవజాతికి, సర్వసృష్టికి, సమస్త దేవతలకు, యూదులకు, అన్యులకు, క్రైస్తవులకు మరియు చివరిగా మన ప్రభువైన యేసునకు కూడా దేవుడు ఒక్కడేనని సత్యాన్ని స్పష్టంగా తెలియజేసిన ఏకైక పరిశుద్ధ గ్రంథమే బైబిల్ ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. ఇందుకు ఈ క్రింది విషయాలు దీనిని నిర్ధారిస్తున్నాయి. 👇


Ⅰ.  సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే :

బైబిల్ స్పష్టంగా చెప్పేది ఏమిటంటే — దేవుడు సర్వసృష్టికి దేవుడు. ఆయనను ఒక జాతికి, మతానికి, లేదా వర్గానికి అంటూ పరిమితం చేయలేము.(యెషయా 45:2)  ఆకాశం, భూమి, సముద్రం — అన్నింటిని సృష్టించిన దేవుడు ఒకడే. ఆయన ప్రతి మనిషికి జీవం, శ్వాస, జ్ఞానం ఇచ్చుచున్నాడు. (అపో.కార్యములు 17:24-25). “నేనే మొదటివాడను, నేనే చివరివాడను” అంటే — దేవుడు సమయానికి అతీతుడు, సృష్టికి పునాది, అంతిమ గమ్యం అన్నమాట. దేవుని ఏకత్వం మరియు సర్వాధికారాన్ని ప్రకటిస్తుంది. (యెషయా 41:6; 44:6) ప్రకృతి, విశ్వం, జీవం — ఇవన్నీ ఆయన ఉనికిని సూచిస్తున్నాయి. దేవుని సృష్టిని చూసిన తర్వాత కూడా ఆయనను అంగీకరించకపోవడం — అది అజ్ఞానం కాదు, నిర్లక్ష్యం. దేవుడు ఒక్కడే సృష్టికర్త. సర్వసృష్టికి ఆయన శక్తిని, దైవత్వాన్ని సాక్షిగా చూపుతుంది. (రోమా. 1:19-20)


Ⅱ.  సర్వ జీవులకు దేవుడు ఒక్కడే :

యెహోవా అందరిమీదా కరుణగలవాడు, ఆయన కృప ఆయన సృష్టులన్నిటిమీద ఉంది. (కీర్తనలు. 145:9) ఆయన దయ సృష్టిలోని ప్రతి జీవిపై ఉంది. హన్నా తన ప్రార్థనలో చెబుతుంది — జీవమూ, మరణమూ దేవుని చేతుల్లోనే ఉన్నాయని. (1 సమూయేలు. 2:6) సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి; తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.” (కీర్తనలు 145:15). 


Ⅲ.  సమస్త దేవతలకు దేవుడు ఒక్కడే

“నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును.” (దానియేలు 2:47) …వెండి బంగారములతోను, ఇత్తడి ఇనుము కలప రాతి విగ్రహములతోను —అవి చూడవు, వినవు, గ్రహింపవు — వాటిని స్తుతించితివి; అయితే నీ ప్రాణమును నీ చేతిలో ఉంచిన దేవునిని నీవు గౌరవింపలేదు. (దానియేలు 5:22-23) మానవులు చేసిన దేవతలకంటే సజీవుడైన యెహోవా మాత్రమే నిజమైన దేవుడు. "ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.౹" (1 కొరింథీయులు 8:4–7)


Ⅳ.  దయ్యములు కూడ దేవుడు ఒక్కడేనని తెలుసును

“దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు; దయ్యములును నమ్మి వణకుచున్నవి.” (యాకోబు 2:19–20)

దేవుడు ఒక్కడే అని నమ్మడం సరైనది — ఇది సత్యం. కానీ కేవలం నమ్మడం మాత్రమే సరిపోదు. ఎందుకంటే దయ్యములు కూడా దేవుని ఉనికిని నమ్ముతాయి, కాని ఆయన నిబంధనను అనుసరించవు. అసలు విశ్వాసం అంటే దేవుని ఉనికిని అంగీకరించడం మాత్రమే కాదు, ఆయన చిత్తానికి లోబడి, ఆయన వాక్యానుసారం జీవించడం.


Ⅴ.  యూదులకు దేవుడు ఒక్కడే :

ఇశ్రాయేలూ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. (ద్వితీయోపదేశకాండము 6:4) మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను. (యెషయా 44:8) యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఈలాగు చెప్పవలెను–ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండకుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును (యిర్మియా 10:10-11) అందుకు యేసు — ప్రధానమైనది ఏదనగా — ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. (మార్కు 12:29)


Ⅵ.  అన్యులకు దేవుడు ఒక్కడే :

“దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? కాదు, అన్యజనులకును దేవుడే.”  (రోమా 3:29–30)


Ⅶ.  క్రైస్తవులకు దేవుడు ఒక్కడే :

“మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు — ఆయన తండ్రి; మరియు మనకు ప్రభువు ఒక్కడే — యేసుక్రీస్తు.” (1 కొరింథీయులు 8:6). అందరికి తండ్రియైన దేవుడు అందరిలోను, అందరిమీదను, అందరిమధ్యలోను ఉన్నాడు (ఎఫెసీయులు 4:6). 


Ⅷ.  క్రీస్తు ప్రభువుకి దేవుడు ఒక్కడే :

>  “నా దేవుడా, నా దేవుడా, నీవు నన్నేల విడనాడితివి?” (కీర్తనలు 22:1)

>  "ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము." (మత్తయి 27:46)

>  "నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు." (కీర్తనలు 45:7)

>  "మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. …" (ఎఫేసి. 1:3)

>  "మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. (1 పేతురు 1:3)

>  “నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నాను.” (యోహాను 20:17)


💣యేసుక్రీస్తుకి దేవుడు — ఆయనే యెహోవా (తండ్రి) — ఒక్కడే దేవుడు — మన దేవుడే! 🙏


🔥 సారాంశం :

ప్రపంచమంతటా ఉన్న సృష్టులకు, జీవులకు, ప్రజలకు, దేవతలకు, దయ్యములకు అలాగే మన ప్రభువైన యేసునకు — అందరికీ ఒకే దేవుడు ఉన్నాడని గుర్తించు. ఆయనే యెహోవా దేవుడు, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ద్వారా మనకు తండ్రిగా వ్యక్తమయ్యాడని అంగీకరించు.


✒ "ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను." (యోహాను 1:18)

✒ “అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే.” (ఎఫెసీయులు 4:6)

మీ ఆత్మీయులు 👪👧

🌿  యేసు యొక్క దేవత్వము?క్లిక్ చేయు

🍂 యేసు యొక్క దేవుడు ఎవరు?క్లిక్ చేయు

🍃 దేవుడొక్కడే క్లిక్ చేయు

యెహోవాకు దేవుడు క్రీస్తా?(Jehovah's god is Christ?)

 యెహోవాకు దేవుడు క్రీస్తా?



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు🙏 


నేటి క్రైస్తవ సమాజములో మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకొంటూ... "యెహోవా దేవునికే దేవుడు ఉన్నారని ఆయనే యేసు" అనుచు  హెబ్రీయులకు. 1:7-8 వచనములు చూపించి తమకి అనుగుణముగా పరిశుద్ధ గ్రంథమును వక్రీకరించి, వాక్యమును అపార్థం చేసుకొనేవారు లేకపోలేదు. ఇలాంటి వారిని నేను ఎదుర్కొని తెలియపరిచినప్పటికి వారు విననందున దేవునికి విడిచిపెట్టి వదిలివేశాను. మరల కనపడే సరికి... కాస్త ఆలోచించి ఇలాంటి మిత్రుల బారిన ఎవరు పడకూడదని భావించి "యెహోవాకు దేవుడు క్రీస్తా?" అనే అంశమును వ్రాయుటకు సిద్ధపడి మీ యెదుట పెడుతున్నా కావున సత్య సంబంధులు చివరి వరకు చదివి, ఆలోచించి, సత్యాన్ని గుర్తించగలరని మనవి. 
మిత్రుడు నాతో మాటలాడిన సంభాషణ

📖 వాక్యము :
హెబ్రీయులకు. 1:7-9: "—తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే – దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను."
Heb 1:7-9: "And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire. But unto the Son he saith, Thy throne, O God, is forever and ever: a scepter of righteousness is the scepter of thy kingdom. Thou hast loved righteousness, and hated iniquity; therefore God, even thy God, hath anointed thee with the oil of gladness above thy fellows."

కీర్తనలు. 45:6-7: "దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు [నీ] దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు."
Ps 45:6-7: "Thy throne, O God, is forever and ever: the scepter of thy kingdom is a right scepter. Thou lovest righteousness, and hatest wickedness: therefore God, thy God, hath anointed thee with the oil of gladness above thy fellows."


💥 వాక్య వక్రీకరణ :
దేవా(O God) అనే మాటను పట్టుకొని యెహోవాకు దేవుడు ఉన్నారని. యెహోవా దేవుడే స్వయముగా నా దేవుడు యేసు అని అన్నారనే బోధ.
యేసు నా దేవుడు(MY GOD) నా తండ్రి అని ఎలా అన్నారో. (యోహాను. 20:17) అలాగే యెహోవా దేవుడు కూడా నా దేవుడు యేసు అన్నారనే బోధ (హెబ్రీ. 1:8).


🔎 వివరణ :
పరిశుద్ధ గ్రంథముతో కాస్త పరిచయం ఉన్నవారు ఎవరైనా ఇది  అబద్ధమే అని ఇట్టే నిర్ణయించగలరు. కానీ మన మిత్రులు ఎందుకు ఆలోచన చేయలేక, వాక్య వక్రీకరణకు పోతున్నారో వారే పరీక్షించుకొని, నిర్ధారణ చేసుకోవాలి. ఏది ఏమైనా సత్యం తెలియజేయడం మన బాధ్యత. ఇక విషయానికి వస్తే...

1. మనము పాపమునుండి విమోచింపబడి, నీతివిషయమై జీవించునట్లు, యేసు తానే తన శరీరమందు మనమందరి పాపములు విషయమై (రోమా. 6:18; 1 పేతురు. 2:24; యెషయా 53:4-5; 12). మరణించి, సమాధి చేయబడి, మూడవ దినము తిరిగి లేచి(1 కొరింది. 15:3-4), అనాది దేవుని సంకల్పం నెరవేర్చి(1పేతురు. 1:18:19-20; అపో.కార్య. 2:23). తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). తన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33).

2. తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన కుమారున్ని తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టి, ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:3-4; 9).

🔖Note : పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తరువాత యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చొనెను. (హెబ్రీ మొదటి అధ్యాయం అనాదిలో జరిగిన సంఘటన కాదు). 

3. అటు పిమ్మట, దావీదు సింహాసనమును తన కుమారునికిచ్చి, ఆ కుమారునియందు విశ్వాసముంచు వారిని ఏలుబడి చేయుటకు యెహోవా దేవుడే తన కుమారుడును మనకు "ప్రభువుగాను, క్రీస్తుగాను" నియమించెను. - (లూకా. 1:32; యోహాను. 3:36; అపో.కార్య. 2:32-36; 10:36). ఈ సంగతి ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని పరిశుద్ధాత్ముడే చెప్పెను కదా!! (అపో.కార్య. 2:36).



📝 తండ్రి(యెహోవా) ఇలా కుమారుడును(యేసును) అభిషేకించె పనిలో ముందుగా... "దేవా"(O God) అని తన కుమారుని గూర్చి ఇలా సంభోదించెను.(8వ)

☑ గ్రీకు : ho theos(ὁ θεός) 
☑ ఇంగ్లీష్ : O God
☑ తెలుగు : దేవా

🍂 దేవా(O God) అనేది ఆశ్చర్యం, ఉత్సాహం, బాధ లేదా సహాయం కోసం విజ్ఞప్తికు వివిధ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, గొప్ప చేయుటకు ఉపయోగించే ఒక సాధారణ ఆశ్చర్యార్థక పదబంధమే కానీ తనకు దేవుడని లేదా నా దేవుడు అని అర్థం కాదు. 

🍂 దేవా అని కుమారుని పిలుచుటకు గల కారణం "యేసు తన దేవుని మహిమయొక్క ప్రతిబింబమును మరియు స్వభావ సిద్ధముగా తన దేవుని గుణ లక్షణములు గలవాడనే కదా". (హెబ్రీ. 1:3).

🍂దేవా(O God) అనగా దేవుడు లేదా దేవత్వము గలవాడ అని అర్థమే కానీ మరొక్కటి కాదు. "యేసు యొక్క దేవత్వము" కొరకు Click Here ఇక్కడ క్లిక్ చేయుము. 
🍂 "దేవా" అనే పదం ఎక్కువగా పా.ని లో కీర్తనలు గ్రంథము నందు 144 సారులు వాడారు. ఉదా: (కీర్తనలు. 4:1; 5:10; 16:1; 61:5...చూడుము).



📝 చివరిగా మిత్రులకు "నా దేవా"(My God) అనే విషయమై వివరణ ఇవ్వాలని ఉద్దేశించి.. యేసు స్వయంగా సిలువలోని, సమాధిలో నుండి లేచిన తరువాత పలికిన మాటలను చూస్తే...

🍃..."నా దేవా(my God), నా దేవా(my God) నన్నెందుకు చెయ్యి విడిచితివని..." మత్తయి. 27:46

🍃..."...నా దేవుడును(my God) మీ దేవుడునైన(your God) వాని యొద్దకు..." యోహాను 20:17

🍃 నా దేవా(My God) అనేది దైవంతో వ్యక్తిగత, భక్తిపూర్వక మరియు తన దేవుడు అని ఆధారపడే సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. యేసు తన దైవం మీద ఆధారపడి బ్రతికి మనకు మాదిరి ఉంచిపోయేను కదా! 

🍃 నా దేవా(my God) అనగా నా దేవుడు లేదా నా దైవం అని అర్థమే కానీ మరొక్కటి కాదు. "యేసు యొక్క దేవుడు ఎవరు?" కొరకు Click Here ఇక్కడ క్లిక్ చేయుము.


🔎 "దేవా" మరియు "నా దేవా" అనే రెండు పదాలు వేరు వేరు అర్థాలు ఇచ్చు పదాలు అనుటకు ఆధారాలు :

కీర్తనలు 43:4: "... దేవా(O God) నా దేవా(My God), సితారా వాయించుచు నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించెదను"
కీర్తనలు 68:24: "దేవా(O God), నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని(my God) గమనమును వారు చూచియున్నారు.
కీర్తనలు 63:1: దేవా(O God), నా దేవుడవు(my God) నీవే, వేకువనే నిన్ను వెదకు దును"

🌱 యెహోవా & యేసు ఇద్దరు ఏకమైయున్నారు అంటే ఒక్కటే అని అంటావు ఏమో! ఇందుకోసం "ఏకమైయున్నాము!? Click Here " కొరకు ఇక్కడ క్లిక్ చేయుము.


💢 సారాంశము :
పరలోకమందున్న దేవుడు తన రాజ్యము పైన అనగా క్రీస్తు సంఘము(church of Christ) మీద యేసును ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించి, పట్టాభిషేకం చేయుటకు ముందు యేసును "దేవా" అనగా దేవత్వం గలవాడా అనే సంభోదించారు తప్పా... "నా దేవా/నా దేవుడు" అని అనలేదని మిత్రులు ఈ సత్యాన్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాము.

"మన తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.౹"

WhatsApp Join Us   Telegram Join Us

మీ ఆత్మీయులు👪

యేసుక్రీస్తు యొక్క దేవుడు ఎవరు? (Who is the God of Jesus Christ?)

 

"యేసుక్రీస్తు యొక్క దేవుడు ఎవరు?"

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿

మేము నేటి క్రైస్తవులంటు వారి సంఘాల్లో, తమ సేవకుల, తమ అభిమానుల మాటలకు చెవి యెగ్గి తమ స్వకీయ నాశనము వైపు నడుచుకొనే వారిలో అనేక భిన్నమైన బోధలు లేకపోలేదు. అటువంటి భిన్నమైన బోధలలో ప్రధానమైన బోధ "క్రైస్తవులకు(మనకు) యేసే దేవుడని". ఇట్టివారు పరిశుద్ధ గ్రంథము చెప్పనిదాని యందు విశ్వాసం కలిగి ఉన్నారనే గుర్తించాలి. దీనికి కారణం తమ జీవితములో యేసు మాటలకు (లేదా) ఆదిమా అపోస్తలుల బోధకు చెవి యెగ్గక పోవడమే.

నిజ క్రైస్తవుల విశ్వాసానికి, వారి ఆత్మీయ, విశ్వాస అభివృద్ధికి ప్రామాణికం యేసు మాటలే (లేదా) ఆదిమా అపోస్తలుల బోధ మాత్రమే. అటువంటి యేసు మాటలను విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతాడని పరమదేవుడు ముందుగానే సెలవు ఇచ్చియున్నారు. 

 (రోమా 10:17) : "కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును.౹"

➦ (ఆపో. కార్య. 3:22-23) : "మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹"

మన ప్రభువైన యేసు స్వయంగా ఆరు సందర్భాల్లో పలికిన సంగతులను ఈ అంశము ద్వారా ఆలోచన చేయనున్నాం. 


 యేసుక్రీస్తు మాటల్లో 


1) పండ్రెండేండ్లవాడై యున్నప్పుడు 

2) బోధింప మొదలుపెట్టినప్పుడు (ముప్పది ఏండ్లప్పుడు)

3) దేవుడు అద్వితీయుడని.

4) సిలువలో పలికిన మాట

5) సమాధిలో నుండి మూడో దినం లేచిన తరువాత

6) పరలోకములో దేవుని కుడిపార్శ్వము నుండి


𒐕 పండ్రెండేండ్లవాడై యున్నప్పుడు :


➦ (లూకా. 2:42-50) : "ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకచొప్పునవారు యెరూషలేమునకు వెళ్లిరి. ఆ దినములు తీరినతరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తలి దండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయ నను వెదకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మూడుదినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకులమధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి– కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా ఆయన– మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను; అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు."


𒐖 బోధింప మొదలుపెట్టినప్పుడు (ముప్పది ఏండ్లప్పుడు) :


➦ "భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు." (మత్తయి. 23:9)

 తండ్రి/నా తండ్రి/నా తండ్రీ అనే సందర్భాలు - మత్తయి సువార్తలో -  11:25-27; 16:17; 18:35; 20:23; 25:34; 26:29, 42; 26:53; మార్కు. 14:36; లుకా. 2:49; 22:29; 24:49; యోహాను. 2:16; 5:17; 6:32; 8:38; 10:17,25,29,37; 12:26; 14:2,20; 15:1,8,10,15,23-24; 20:17;

➠ నా పరలోకపు తండ్రి అనే సందర్భం - మత్తయి. 18:35;

➠ పరలోకమందున్న నా తండ్రి అనే సందర్భం - మత్తయి. 7:21; 10:32-33; 12:49; 15:13; 18:10,19;

➠ నా తండ్రి - నా దేవుడు అనే సందర్భం - యోహాను. 20:17;  


𒐗 దేవుడు అద్వితీయుడని  : 


దేవుడు అద్వితీయుడు అనగా ద్వితీయత లేనివాడు (or) రెండో వాడు లేనివాడు అని అర్థం.

➦ (మార్కు 12:29-32) : "అందుకు యేసు — ప్రధానమైనది ఏదనగా — ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను ఆ శాస్త్రి– బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే."

➦ (మార్కు 12:29) : "అందుకు యేసు - ప్రధానమైనది ఏదనగా - ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు."

➦ (యోహాను 5:44) : "అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;౹"

➦ (యోహాను 17:3) : "అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.౹"


𒐘 సిలువలో పలికిన మాట :


➦ ప్రవచనం ≈ (కీర్తనలు. 22:1) : "ప్రధానగాయకునికి. అయ్యలెత్ షహరు అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు?"

➦ నెరవేర్పు ≈ (మత్తయి. 27:46) : "ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము."

➦ (మార్కు. 15:34) : "మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము."


𒐚 సమాధిలో నుండి మూడో దినం లేచిన తరువాత :


➦ (యోహాను. 20:17) : "యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి– నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.౹"


𒐛 పరలోకములో దేవుని కుడిపార్శ్వము నుండి :


➦ (ప్రకటన 3:2,12) : "నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. ౹ … జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను.౹" 

➦ (ప్రకటన 2:26) : "నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;౹"

➦ (ప్రకటన 3:5) : "జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.౹"

➦ (ప్రకటన 3:21) : "నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.౹"

➦ (ప్రకటన 14:1) : "మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి.౹"


🔥NOTE 

కోపగించుకోమాకు.., మేము మన క్రీస్తు ప్రభువును తగ్గించడం లేదు. క్రీస్తు దేవుడా? కాదా? అనే ప్రశ్న నీమదిలో లేవనెత్తుతావని నాకు తెలుసు. మేము క్రీస్తు  దేవత్వమునకు వ్యతిరేకులము కాము. క్రీస్తు 100% దేవుడు 100% నరుడు. యేసు లో “దేవుని యొక్క గుణలక్షణములు అనగా దేవుని తత్వము ” పరిపూర్ణముగా ఉన్నప్పటికీ తండ్రి ఆయనను మనకి(క్రైస్తవులకు) దేవుడుగా నియమించక “ప్రభువుగాను అనగా రాజు, ఏలిక” “క్రీస్తుగాను అనగా అభిశక్తుడుగా" నియమించెను.(అపో. కార్య. 2:36) మరింత వివరణ కోసం ఇక్కడ క్లిక్ చేయుము.

క్రైస్తవులకు యేసు ఏమైయున్నారు? Click Here


🔥ముగింపు : 

సహోదరులారా... పైన పెరొన్న ఆరు సందర్భాలు క్రీస్తే స్వయముగా తాను  మాటలాడిన విషయాలు. ఎవరు వీటిని కాదని అనలేరు. ఒకవేళ తప్పుపట్టుటకు మీరు  ప్రయత్నిస్తే గ్రంధాన్ని కల్పి చెరిపే వారవుతారు కదా!! జాగ్రత్త.. 

↪ క్రైస్తవులకు(మనకు) యేసే దేవుడనేది పరిశుద్ధ గ్రంథమిచ్చే సమాచారం కాదు,

 యేసుక్రీస్తు కూడా దేవుడు ఉన్నాడని, 

 యేసుక్రీస్తుకు ఎవరు దేవుడో అయనే మనకు(క్రైస్తవులకు) దేవుడని,

↪ అయనే తండ్రియైన దేవుడని తెలుసుకోవలసిందిగా మా మనవి 🙏🏿

Next Topic : యేసుక్రీస్తు  దేవత్వము Click Here

మీ ఆత్మీయులు...👪

యేసుని ఎవరు పంపెను?(Who sent Jesus?)

యేసుని ఎవరు పంపెను?(Who sent Jesus?)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు.🙌

నేడు అనేక అబద్ధ బోధకులు బయలుదేరి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన తమ సొంత జ్ఞానంతో సంఘాలను మోసపుచ్చుతున్నారు. వారి అబద్ధ బోధలలో  ఒకటి  "యెహోవాయే శరీరదారియై మన మధ్యకు యేసులా వచ్చారనేది" ఇది దైవ గ్రంథానికి పూర్తి విరుద్ధమైన బోధ.👆

ఇంతకుమించి ఎక్కువగా మాట్లాడి నాశనాన్ని కొనితెచ్చుకునే ధైర్యం మాకు లేదు కనుక తండ్రి యొక్క సాక్ష్యం, యేసు యొక్క సాక్ష్యం, మరియు పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం వారి ముగ్గురు మాటల్లోనే  "యేసుని ఎవరు పంపెను?" అనే విషయాన్ని ఈ అంశము ద్వారా నేరుగా లేఖనాలను మీ ముందుంచుతున్నాము. 

కావున, సత్యాన్వేషకులు ఈ క్రింది👇అంశమును పూర్తిగా చదివి, వాక్య పరిశోధన చేసి, సత్యాన్ని స్వీకరించగలరని మనవి. 📖🙏🏻


👤 తండ్రి సాక్ష్యం :


● ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. (మత్తయి. 3:17).

● ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.  (మత్తయి. 12:18).

● అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను." (మత్తయి. 17:5)

● ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను." (మార్కు. 9:7)

● ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. (లూకా. 9:35).


👤 యేసుక్రీస్తు సాక్ష్యం :


● మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. (మత్తయి. 10:40).

● ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చు కొనునని వారితో చెప్పెను. (మార్కు. 9:37; లూకా. 9:48)

● ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. (లూకా. 4:19).

● మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను." (లూకా. 10:16).

● లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. (యోహాను. 3:17).

● "ఆయన సాక్ష్యము అంగీక రించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.౹" (యోహాను. 3:33).

● యేసు వారిని చూచి-నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది (యోహాను. 4:34).

●  కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. (యోహాను. 5:23).

● నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు;( యోహాను. 5:24).

● యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ( యోహాను. 5:36).

నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు (యోహాను. 5:37)

● యేసు-ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. ( యోహాను. 6:29). 

● నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. (యోహాను. 6:38).

● నన్ను పంపినవాని చిత్తమైయున్నది. (యోహాను. 6:39).

నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు. (యోహాను. 6:44).

● జీవముగల తండ్రి నన్ను పంపెను. (యోహాను. 6:57).

● అందుకు యేసు-నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.౹" (యోహాను. 7:16).

● నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. ( యోహాను. 7:28)

● నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను. (యోహాను. 7:29)

● యేసు-ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును (యోహాను. 7:33)

● నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. (యోహాను. 8:16).

● నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను. (యోహాను. 8:18).

● మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. (యోహాను. 8:26)

● నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. (యోహాను. 8:29)

● నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. (యోహాను. 8:42)

● పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనముచేయుచుండవలెను; (యోహాను. 9:4).

● తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో - నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?౹" (యోహాను. 10:36).

● నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. (యోహాను. 11:42).

● నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. (యోహాను. 12:44)

● నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. (యోహాను. 12:45)

● ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. (యోహాను. 12:49)

● నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను." (యోహాను. 13:20)

● నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. (యోహాను. 14:24)

● వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు. (యోహాను. 15:21)

● ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను. (యోహాను. 16:5).

● "అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. (యోహాను. 17:3).

● నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక (యోహాను. 17:7).

● నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. (యోహాను. 17:18).

నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. (యోహాను. 17:20).

● వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలనవారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. (యోహాను. 17:23)

● నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు. (యోహాను. 17:25).

● అప్పుడు యేసు-మరల మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. (యోహాను. 20:21)


👤 పరిశుద్ధాత్ముని సాక్ష్యం :


దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. (రోమా. 8:3).

● కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. (గలతీ. 4:4).

● దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. (1 యోహాను. 4:9).

● మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. (1 యోహాను. 4:10).

తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము. (1 యోహాను. 4:14).

మీ ఆత్మీయులు...👪

వెతుకుట (searching)

వెతుకుట (searching)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన వారందరికీ నా వందనములు.

మత్తయి 7:7-8: "అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును."

ఏమి వెతుకుతున్నావు?  - ఏమి వెతకాలి? 

నీవు ఏమి పోగొట్టుకొన్నావో దాని విలువ తెలుస్తేనే వెతుకుతావు. దాని విలువ తెలియనివాడు వెతకుడు. 

ఉదాహరణకు : 

"రూపాయి కాయిన్ పడిపోయింది, డైమండ్ రింగ్ జారిపోయింది."

రెండింటిలో దేనిని వెతుకుతావు? డైమండ్ రింగ్ కథ. కావున నీవు వెతికేటప్పుడు నీ మనస్సు ఆ వస్తువు యొక్క విలువను బట్టి ఆధారపడి ఉంటుంది కథ. 

మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శ్రోతలకు ఇలా వాగ్దానం చేశారు "వెదకుడి మీకు దొరకును" ఐతే ఏమి వెతకాలి? నీకు ఏమి వెతకాలో తెలియకపోవచ్చు కానీ నీవు ఏమి పొగ్గొట్టుకొన్నావో అది వెతకాలి. నీ యొద్ద క్షేమముగా ఉన్నవాటిని వెతకనవసరం లేదు. విలువైన దానిని, పొగ్గొట్టుకొన్న దానిని, అవసరమైన దానిని వెతకాలి.


నీవు క్రైస్తవుడువైతే నీవు ఏమి వెతకాలో పరిశుద్ధ గ్రంథం ఇలాగున సెలవు ఇస్తుంది


1) దేవున్ని వెతకాలి - కీర్తన. 14:2 :

"వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను".

● దేవున్ని ఎలా వెతకాలి? 

A). వివేకము కలిగి వెతకాలి : (కీర్తన. 14:2)

B). విశ్వాసముతో వెతకాలి : (హెబ్రే. 11:6a)

C). శ్రద్ధగా వెతకాలి : (హెబ్రే. 11:6b)

 "విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.౹"  (హెబ్రే. 11:6). 

⟼  తన్ను శ్రద్ధగా వెదుకువారికి (diligently seek him) అనే పదం బైబిల్ లో మిస్ అయ్యింది. 

Heb 11:6: "But without faith it is impossible to please him: for he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him."


ఎప్పుడు వెతకాలి?

మీకు దొరికే కాలమునందు వెతకాలి 

➾ "యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి." (యెషయా. 55:6)  


ఆయన దొరుకు కాలము నందు నీవు ఎలా వెతకాలి? 

➾ "భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెనువారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడునువారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును." (యెషయా. 55:7)  

➾ హెబ్రే 8:12: "నేను వారి దోషముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు."


2). సమాధానమును వెతకాలి - 1 పేతురు 3:10-12:

 "–జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడుచేయువారికి విరోధముగా ఉన్నది."

యేసుతో సమాధానం : 

↛ (యోహాను 14:27:) "శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.౹"

దేవునితో సమాధానం : 

↛  (రోమా 5:10-11:) "ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము.౹ అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము."

మానవ జాతితో సమాధానం : 

↛  (ఎఫేసి. 2:13-14:) "అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.౹ ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.౹"

క్రీస్తు శరీరం(సంఘము) ద్వేషం లేని, కక్షలు లేని, విరోధభావం లేని, బేధాలు లేని సమాజం. 


3). దేవుని రాజ్యము, నీతిని వెతకాలి

➦ (మత్తయి. 6:33:) "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును."

క్రీస్తు ప్రభువు యొక్క పరిపాలన నీ జీవిత అనుభవం లోనికి రావాలి. ఆయానేమి చెప్పిన నీవు లోబడాలి అనే వారు వెతికేవారైయుంటారు. 

దేవుని రాజ్యం వెతుకుట అంటే  "దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.౹" (రోమా 14:17)


హెచ్చరిక :   "ఆ..... తరువాత వెతకడం" అనే ఆలోచన ఉంటె...

⟹ (హెబ్రే. 12:15-17:) "మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అప విత్రులై పోవుదురేమో అనియు,౹ ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.౹ ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు."

ప్రాముఖ్యత, గొప్పతనం, విలువ తెలియక ఆ తరువాత శ్రద్ధతో వెతుకుతే విసర్జింపబడెదువు.

⟹ (లూకా. 13:25-27:) "ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి– అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు ఆయన– మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు. అప్పుడాయన— మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును."

⟹ (మత్తయి. 25:10-11) :  "వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి– అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా" "అతడు– మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను."


ప్రియులారా, దేవుడు దొరికే కాలమునందు అలక్ష్యం చేసి, సమీపంముగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం పెట్టేసి, దేవుడు తానే సమాధానపడుటకు ఎదురొచ్చినప్పుడు దానిని కాలదన్ని, ఆయన రాజ్యం ఉన్నప్పుడు పట్టించుకోకుండా జీవితం కొనసాగించి ఆ తరువాత కావాలని కోరుకొంటే నీవు ఏడ్చిన లాభం లేదు తలుపు తట్టిన లాభం లేదు అయ్యా అయ్యా అనిన లాభం లేదు. కావున ఆయన దొరుకు కాలము లొనే వెతకాలి.                        

"ప్రేమ - అంటే నీ భావనేమోగానీ"? (LOVE)

"ప్రేమ - అంటే నీ భావనేమోగానీ?"


ప్రభువు నందు ప్రియులైన వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో
నా వందనములు తెలియజేయుచున్నాను.

ప్రియులారా.., లోకంలో ప్రేమ గురించి అడిగితే చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరిపైనా పుడుతుందో తెలియదంటారు... అలాగే ప్రేమ గుడ్డిదని, నడ్డిదని, తొలిచూపులోనే పుడుతుందని వారికి నచ్చినట్లుగా రకరకాలుగా చెబుతుంటారు. అయితే దేవుని నమ్మిన పిల్లలుగా మనకు నిజమైన ప్రేమ ఏంటో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు మన కొరకు వ్రాయించిన గ్రంథము బైబిల్ ను మనము పరిశీలిస్తే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి.


ప్రేమ గురించి గ్రంథము ఏమి చెప్పింది అని పరిశీలిస్తే,....

(1) పవిత్ర హృదయం నుండి ప్రేమ పుడుతుంది.
(2) మంచి మనసాక్షి నుండి ప్రేమ కలుగుతుంది.
(3) నిష్కపటమైన విశ్వాసం నుండి ప్రేమ కలుగుతుంది.
(4) ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది.



ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే. (1తిమోతికి. 1: 5)


 మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని 
యుండుడి. (రోమీయులకు. 12: 9)


 ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. (1యోహాను.  4: 7)


“ప్రేమిస్తే ఏం చేయాలి”..?


 A). “మన  తండ్రియైన దేవుడు ఏం చేశారో ఆలోచిస్తే”

  దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3: 16)

  మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన
అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. (1యోహాను 4: 9,10)


B). “మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారో ఆలోచిస్తే”

  క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. (ఎఫెసీయులకు 5: 2)

  నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. (గలతియులకు 2: 20)

   మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. (2థెస్సలొనికయులకు 2: 16,17)


C). “ప్రభువు సంఘం కోసం ఏం చేశారో ఆలోచిస్తే”

అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. (ఎఫెసీయులకు 5: 25)


D). “సంఘము ఏమి చెయ్యాలో ఆలోచిస్తే”

Note: క్రియలు లేని ప్రేమ - ప్రేమ కాదు

  "నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు–ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు–మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును." (మత్తయి. 25:35-40)

  "చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.౹" (1 యోహాను.3:18)

  "నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను"  (మత్తయి. 12:30-31)

  "నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?౹ సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు.౹ మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక–సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?౹ ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.౹ అయితే ఒకడు —నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలులేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.౹" (యాకోబు. 2:14-18: )

  "సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.౹" (గలతి. 6:1)

  "నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల౹ పాపిని వాని తప్పుమార్గమునుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను." (యాకోబు. 5:19-20)

  “కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.౹" (రోమా. 15:1).

  “నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.౹" (1 పేతురు. 3:15)

  “తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు.౹" (1 యోహాను. 5:16)

  “సందేహపడువారిమీద కనికరము చూపుడి”.౹  “అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైనవారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి." (యూదా. 1:22-23)

  "భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి.౹" (2 పేతురు. 1:7)

  "తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.౹" (1 యోహాను. 2:10)

  "మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు.౹"  "ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.౹" (1 యోహాను. 3:14,16)

  "మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.౹ కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలుచేయుదము." (గలతి. 6:9-10)


“మనం ఎవరిని ప్రేమించాలి”.?


➡ “దేవున్ని ప్రేమించాలి”

నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. (ద్వితియోపదేశకాండము 6: 5)

➡ “క్రీస్తు ప్రభువుని ప్రేమించాలి”

మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక. (ఎఫెసీయులకు 6: 24)

➡ “జ్ఞానమును ప్రేమించాలి”

↠ జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును. (సామెతలు 4: 6)

➡ “సహోదరులను ప్రేమించాలి”

దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము. (1 యోహాను 4: 21)

➡ “తల్లిదండ్రులను ప్రేమించాలి”

పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. (ఎఫెసీయులకు 6: 1)

పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది. (కొలస్సీయులకు 3: 20)

➡ “అన్నదమ్ములను ప్రేమించాలి”

అప్పుడు తన తమ్మునిమీద యోసేపు నకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. (ఆదికాండము 43: 30)

“శత్రువులను ప్రేమించాలి”

నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. (మత్తయి 5: 44)

“భార్యను/భర్తను ప్రేమించాలి”

పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి.  (ఎఫెసీయులకు 5: 25)

స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. (ఎఫెసీయులకు 5: 22)

భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. (కొలస్సీయులకు 3: 18)

భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. (కొలస్సీయులకు 3: 19)

“పొరుగువానిని ప్రేమించాలి”

నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. (మత్తయి 19: 19)

“శిక్షను ప్రేమించాలి”

శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించు వాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు (సామెతలు 12: 1)

వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. (హెబ్రీయులకు 12: 10)

“హృదయ శుద్దిని ప్రేమించాలి”

హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. (సామెతలు 22: 11)

“మేలును ప్రేమించాలి”

​కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. (ఆమోసు 5: 15)

“నీతిని ప్రేమించాలి”

నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు. (కీర్తనలు. 45:7)

నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:9)

ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది. (కీర్తనలు. 33:5)

“దేవుని నామమును ప్రేమించాలి”

యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు.  (కీర్తనలు. 5:12)

“జీవమును ప్రేమించాలి”

జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. (1పేతురు 3: 10)

షరతులు :
↠ "తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;" (మత్తయి. 10:37)

↠ “ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు”. (లూకా. 14:26)


“మనం ఎవరిని ప్రేమించకూడదు”.?


“లోకము-లోకములో ఉన్నవాటిని ప్రేమించకూడదు”

ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. (1యోహాను 2: 15)

“ధనమును ప్రేమించకూడదు”

ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. (1తిమోతికి 6: 9,17)

“ప్రాణమును ప్రేమించకూడదు”

తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 12: 25)

“అబద్ధమును ప్రేమించకూడదు”

కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. (ప్రకటన గ్రంథం 22: 15)

“దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు”

ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపనియెడల వాడు నా శిష్యుడు కానేరడు. (లూకా 14: 26,27,33)

ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.


“నిజమైన ప్రేమ ఎలా ఉండును”. ?


👉 ప్రేమ దీర్ఘకాలం సహించును
👉 ప్రేమ దయ చూపించును
👉 ప్రేమ మత్సరపడదు
👉 ప్రేమ డంబముగా ప్రవర్తింపదు
👉 ప్రేమ ఉప్పొంగదు
👉 ప్రేమ అమర్యాదగా నడవదు
👉 ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకొనదు
👉 ప్రేమ త్వరగా కోపపడదు
👉 ప్రేమ అపకారం చేయదు
👉 ప్రేమ సత్యమునందు సంతోషించును
👉 ప్రేమ అన్నిటికీ తాళుకొనును
👉 ప్రేమ అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును
👉 ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును
👉 ప్రేమ శాశ్వతకాలముండును
👉 ప్రేమ దోషములన్నిటినీ కప్పును
👉 ప్రేమ మరణమంత బలవంతమైనది
👉 ప్రేమ నిష్కపటమైనది
👉 ప్రేమ పొరుగువారికి కీడుచేయదు
👉 ప్రేమ క్షేమాభివృద్ది కలుగజేయును
👉 ప్రేమ యధార్థమైనది
👉 ప్రేమ పాపములను కప్పును
👉 ప్రేమ ప్రాణమును పెట్టును
👉 ప్రేమ భయమును వెళ్లగొట్టును.


"దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు
దేవుని ఎరుగడు.౹"
(1 యోహాను. 4:8)

The churches of Christ greet you - Roma 16:16