“క్రైస్తవులకు యేసు ఏమైయున్నారు” (What was Jesus to Christians.?)

www.cockm.blogspot.in

“క్రైస్తవులకు యేసు ఏమైయున్నారు”.?తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.

(అపొకార్యములు. 10:36)
“యేసుక్రీస్తు అందరికి ప్రభువు”."He is Lord of all"

“దేవుని చేత ప్రభువుగా నియమింపబడిన యేసు”

మనము పాపమునుండి విమోచింపబడి, నీతివిషయమై జీవించునట్లు, యేసు తానే తన శరీరమందు మనమందరి పాపములు విషయమై (రోమా. 6:18; 1 పేతురు. 2:24; యెషయా 53:4-5; 12). మరణించి, సమాధి చేయబడి, మూడవ దినము తిరిగి లేచిన పిమ్మట (1 కొరింది. 15:3-4). తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). తన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33). తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తన కుమారుని ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:3; 9). అటు పిమ్మట, దావీదు సింహాసనమును తన కుమారునికిచ్చి, ఆ కుమారునియందు విశ్వాసముంచు వారిని ఏలుబడి చేయుటకు "ప్రభువుగాను, క్రీస్తుగాను" నియమించెను. - (లూకా. 1:32; యోహాను. 3:36; అపో.కార్య. 2:32-36). 

మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు "ప్రభువుగాను" క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. - (అపొ. కార్య. 2:36).“యేసును ఏలాగునా ఒప్పుకోవాలి”..?


1). యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. (రోమీయులకు. 10:9).

2). పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. (1 కొరింథీయులకు. 12:3). 

3). పరలోకముందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమిక్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమునవంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఫిలిప్పీ. 2:9-11).


“క్రైస్తవులకు ప్రభువు ఒక్కడే”


1). మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు. - (1 కొరింథీ. 8:6).

2). ప్రభువు ఒక్కడే. - (ఎఫెసీ. 4:5).

3). పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. - (1 కొరింథీ. 12:5).

4). బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. - (యోహాను. 13:13).

5) "తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను. - (రోమీయులకు 14:9).


"హెచ్చరిక"

  • ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును - (మత్తయి. 7:21). 
  • నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు..? - (లూకా. 6:46)
మీ ఆత్మీయులు...👪

Share this

Related Posts

Previous
Next Post »

2 comments

comments
July 13, 2017 at 9:41 AM delete

Great brother.God bless you.

Reply
avatar
July 13, 2017 at 9:41 AM delete

Great brother.God bless you.

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16