"ప్రేమ - అంటే నీ భావనేమోగానీ?" |
ప్రభువు నందు ప్రియులైన వారందరికీ మన ప్రభువైన
యేసుక్రీస్తు నామములో
నా వందనములు తెలియజేయుచున్నాను.
ప్రియులారా.., లోకంలో ప్రేమ గురించి అడిగితే చాలా
రకాలుగా చెబుతూ ఉంటారు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరిపైనా
పుడుతుందో తెలియదంటారు... అలాగే ప్రేమ గుడ్డిదని, నడ్డిదని, తొలిచూపులోనే
పుడుతుందని వారికి నచ్చినట్లుగా రకరకాలుగా చెబుతుంటారు. అయితే దేవుని నమ్మిన
పిల్లలుగా మనకు నిజమైన ప్రేమ ఏంటో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు మన కొరకు
వ్రాయించిన గ్రంథము బైబిల్ ను మనము పరిశీలిస్తే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి.
ప్రేమ గురించి గ్రంథము ఏమి చెప్పింది అని
పరిశీలిస్తే,....
(1) పవిత్ర హృదయం నుండి ప్రేమ పుడుతుంది.
(2) మంచి మనసాక్షి నుండి ప్రేమ కలుగుతుంది.
(3) నిష్కపటమైన విశ్వాసం నుండి ప్రేమ కలుగుతుంది.
(4) ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది.
⌛ ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి
మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే. (1తిమోతికి. 1:
5)
⌛ మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని
నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని
యుండుడి. (రోమీయులకు. 12: 9)
యుండుడి. (రోమీయులకు. 12: 9)
⌛ ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ
దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై
దేవుని ఎరుగును. (1యోహాను. 4: 7)
“ప్రేమిస్తే ఏం చేయాలి”..?
↪ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన
అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము
పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3: 16)
↪ మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన
అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు
మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను
ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో
ప్రేమయున్నది. (1యోహాను 4: 9,10)
B). “మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారో
ఆలోచిస్తే”
↪ క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు
మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును
ప్రేమగలిగి నడుచుకొనుడి. (ఎఫెసీయులకు 5: 2)
↪ నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను
జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు
జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని
కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. (గలతియులకు 2: 20)
C). “ప్రభువు సంఘం కోసం ఏం చేశారో ఆలోచిస్తే”
అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను
ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల
సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత
దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. (ఎఫెసీయులకు
5: 25)
D). “సంఘము ఏమి చెయ్యాలో ఆలోచిస్తే”
Note: క్రియలు లేని ప్రేమ - ప్రేమ కాదు
↪ "నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి;
దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;
దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి;
చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు–ప్రభువా,
యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట
చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి?
దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో
ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు–మిక్కిలి
అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా
మీతో చెప్పుచున్నానని వారితో అనును." (మత్తయి. 25:35-40)
↪ "చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.౹" (1 యోహాను.3:18)
↪ "నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను" (మత్తయి. 12:30-31)
↪ "నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు
విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?౹
సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు.౹ మీలో
ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక–సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి,
తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?౹ ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది
ఒంటిగా ఉండి మృతమైనదగును.౹ అయితే ఒకడు —నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి;
క్రియలులేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు
కనుపరతునని చెప్పును.౹" (యాకోబు. 2:14-18: )
↪ "సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను
చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన
విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని
రావలెను.౹" (గలతి. 6:1)
↪ "నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి
తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల౹ పాపిని వాని
తప్పుమార్గమునుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను
కప్పివేయునని తాను తెలిసికొనవలెను." (యాకోబు. 5:19-20)
↪ “కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.౹" (రోమా. 15:1).
↪ “కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.౹" (రోమా. 15:1).
↪ “నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న
నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను
సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును
ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో
దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు
సిగ్గుపడుదురు.౹" (1 పేతురు. 3:15)
↪ “తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను
చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి
జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట
లేదు.౹" (1 యోహాను. 5:16)
↪ “సందేహపడువారిమీద కనికరము చూపుడి”.౹ “అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి,
శరీర సంబంధమైనవారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని
అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి." (యూదా. 1:22-23)
↪ "భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి.౹" (2 పేతురు. 1:7)
↪ "తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు;
అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.౹" (1 యోహాను. 2:10)
↪ "మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక
మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు
నిలిచియున్నాడు.౹" "ఆయన మన
నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము.
మనము కూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.౹" (1
యోహాను. 3:14,16)
↪ "మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు
చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.౹ కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను,
విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలుచేయుదము." (గలతి. 6:9-10)
“మనం ఎవరిని ప్రేమించాలి”.?
➡ “దేవున్ని ప్రేమించాలి”
నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను
నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. (ద్వితియోపదేశకాండము 6: 5)
➡ “క్రీస్తు ప్రభువుని
ప్రేమించాలి”
మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు
వారికందరికిని కృప కలుగును గాక. (ఎఫెసీయులకు 6: 24)
➡ “జ్ఞానమును
ప్రేమించాలి”
↠ జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని
ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును. (సామెతలు 4: 6)
➡ “సహోదరులను
ప్రేమించాలి”
దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను
ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము. (1 యోహాను 4: 21)
➡ “తల్లిదండ్రులను ప్రేమించాలి”
పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు
విధేయులైయుండుడి; ఇది ధర్మమే. (ఎఫెసీయులకు 6: 1)
పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి;
ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది. (కొలస్సీయులకు 3: 20)
➡ “అన్నదమ్ములను ప్రేమించాలి”
అప్పుడు తన తమ్మునిమీద యోసేపు నకు ప్రేమ పొర్లుకొని
వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ
ఏడ్చెను. (ఆదికాండము 43: 30)
➡
“శత్రువులను ప్రేమించాలి”
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి
కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు
ప్రార్థన చేయుడి. (మత్తయి 5: 44)
➡
“భార్యను/భర్తను ప్రేమించాలి”
పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. (ఎఫెసీయులకు 5: 25)
స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు
లోబడియుండుడి. (ఎఫెసీయులకు 5: 22)
భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండుడి; ఇది
ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. (కొలస్సీయులకు 3: 18)
భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని
నిష్ఠురపెట్టకుడి. (కొలస్సీయులకు 3: 19)
➡
“పొరుగువానిని ప్రేమించాలి”
నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. (మత్తయి
19: 19)
➡ “శిక్షను ప్రేమించాలి”
శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించు వాడు
గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు (సామెతలు 12: 1)
వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను
శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన
శిక్షించుచున్నాడు. (హెబ్రీయులకు 12: 10)
➡ “హృదయ
శుద్దిని ప్రేమించాలి”
హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు
స్నేహితుడగును. (సామెతలు 22: 11)
➡ “మేలును
ప్రేమించాలి”
కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో
న్యాయము స్థిరపరచుడి. (ఆమోసు 5: 15)
➡ “నీతిని
ప్రేమించాలి”
నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు
కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో
అభిషేకించియున్నాడు. (కీర్తనలు. 45:7)
నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి
అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
(హెబ్రీ. 1:9)
ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా
కృపతో నిండియున్నది. (కీర్తనలు. 33:5)
➡ “దేవుని నామమును ప్రేమించాలి”
యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు. (కీర్తనలు. 5:12)
➡ “జీవమును
ప్రేమించాలి”
జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని
పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. (1పేతురు
3: 10)
షరతులు :
↠ "తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;" (మత్తయి. 10:37)
షరతులు :
↠ "తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;" (మత్తయి. 10:37)
↠ “ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను
పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా
శిష్యుడు కానేరడు”. (లూకా. 14:26)
“మనం ఎవరిని ప్రేమించకూడదు”.?
➡
“లోకము-లోకములో ఉన్నవాటిని ప్రేమించకూడదు”
ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి.
ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. (1యోహాను 2: 15)
➡ “ధనమును
ప్రేమించకూడదు”
ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక
యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను
నష్టములోను నాశనములోను ముంచివేయును. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక,
అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ
చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. (1తిమోతికి 6: 9,17)
➡ “ప్రాణమును
ప్రేమించకూడదు”
తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ
లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 12: 25)
➡ “అబద్ధమును
ప్రేమించకూడదు”
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును
విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. (ప్రకటన
గ్రంథం 22: 15)
➡ “దేవుని
కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు”
ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను
పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా
శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపనియెడల వాడు
నా శిష్యుడు కానేరడు. (లూకా 14: 26,27,33)
ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు
నా శిష్యుడు కానేరడు.
“నిజమైన ప్రేమ ఎలా ఉండును”. ?
👉 ప్రేమ దీర్ఘకాలం సహించును
👉 ప్రేమ దయ చూపించును
👉 ప్రేమ మత్సరపడదు
👉 ప్రేమ డంబముగా ప్రవర్తింపదు
👉 ప్రేమ ఉప్పొంగదు
👉 ప్రేమ అమర్యాదగా నడవదు
👉 ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకొనదు
👉 ప్రేమ త్వరగా కోపపడదు
👉 ప్రేమ అపకారం చేయదు
👉 ప్రేమ సత్యమునందు సంతోషించును
👉 ప్రేమ అన్నిటికీ తాళుకొనును
👉 ప్రేమ అన్నిటినీ నమ్మును అన్నిటినీ
నిరీక్షించును
👉 ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును
👉 ప్రేమ శాశ్వతకాలముండును
👉 ప్రేమ దోషములన్నిటినీ కప్పును
👉 ప్రేమ మరణమంత బలవంతమైనది
👉 ప్రేమ నిష్కపటమైనది
👉 ప్రేమ పొరుగువారికి కీడుచేయదు
👉 ప్రేమ క్షేమాభివృద్ది
కలుగజేయును
👉 ప్రేమ యధార్థమైనది
👉 ప్రేమ పాపములను కప్పును
👉 ప్రేమ ప్రాణమును పెట్టును
👉 ప్రేమ భయమును వెళ్లగొట్టును.
"దేవుడు
ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు
దేవుని ఎరుగడు.౹"
దేవుని ఎరుగడు.౹"
(1 యోహాను. 4:8)
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com