క్రైస్తవులు పుట్టినరోజు జరుపుకోవచ్చా? |
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏
ఈరోజులలో అనేకమంది పుట్టినరోజు అనగానే అది తనకు ఒక ప్రత్యేక దినముగా భావించి, కొత్తబట్టలు కొనుక్కొని, బంధువులు సన్నిహితులతో కలసి కేక్ మీద క్యాండిల్ వెలిగించి, ఊదిన వెంటనే అందరి నోట నుండి వచ్చే "హ్యాపీ బర్త్ డే టూ యూ" అనే ట్యూన్ ల మధ్య తన కేక్ కట్ చేస్తూ, ఒకరినొకరు తినిపించుకొంటూ, పార్టీ చేసుకొంటూ ఆనందించడం మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పద్ధతి ఇటు క్రైస్తవేతరులలోనూ(అన్యులు) మరియు అటు క్రైస్తవులని పిలువబడిన వారిలోనూ లేకపోలేదు.
క్రైస్తవులని పిలువబడిన వారి విషయానికి వస్తే... మా చుట్టుపక్కల క్రైస్తవులు మరియు ఆయా సంఘాలు వారు చేసుకొంటున్నారుగా.. మా సేవకుడు అతని కుటుంబములో చేస్తున్నాడు కాబట్టి మేము చేస్తున్నామనేవారు.. కేవలం మేము మా పిల్లలు లేదా మా కుటుంబీకుల సంతోషం కొరకై చేస్తున్నామనేవారు.. మరికొందరు ఇలా చేయడం వలన తప్పేమీ? పాపమేమైనా చేస్తున్నామా? పుట్టినరోజు వేడుకల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యమేముంది? మనం చేసుకోకూడదని బైబిల్ లో ఎక్కడ ఉంది? అనేవారు ఉన్నారు.. మేము ఈ విధంగానైన దేవున్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నామని, ఇది కేవలం మామూలు విషయమే అని దీని గూర్చి ఇంకా ఆలోచించే పని ఏముందంటూ పలురకాల మనుషులు మన మధ్య లేకపోలేదు.
మరికొందరైతే తాము చేసే దానిని సమర్ధించుకోవడానికే "..మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. (కొలొస్స. 3:17) అనే ఈ వాక్యాన్ని తమ పుట్టినరోజు వేడుకులకు అనుగుణముగా మలుచుకునే వారు కూడా లేకపోలేదు.
ఐతే ఈ అంశాన్ని చదువుతున్న నీవు ఒక సత్యాన్వేషివైతే...
Ⅰ. పుట్టినరోజు యొక్క చరిత్ర ఎవరు, ఎక్కడ, ఎలా ప్రారంభించారు?
Ⅱ. ప్రపంచం అంతట ఎప్పుడు వ్యాపించింది?
Ⅲ. బైబిల్ ఏమి సెలవు ఇస్తుంది?
Ⅳ. నిజ క్రైస్తవుడు పుట్టినరోజు చేసుకోవచ్చా?
పై విషయాలను ఈ ఒక్క అంశము ద్వారా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
📚 పుట్టినరోజు చరిత్ర 📚
✅ఐగుప్తీయులు కాలములో :
⤔ క్రీ.పూ. 3000 సం. క్రితమే ఐగుప్తీయులు(ఈజిప్షియన్స్) ఈ పుట్టినరోజు వేడుకలను మొట్టమొదటిగా ప్రారంభించారు.
⤔ పురాతన ఈజిప్టులో ఈజిప్షియన్ ఫరోలు పట్టాభిషేకం చేసినప్పుడు, ఆరోజు వారు దేవతలుగా రూపాంతరం చెందినట్లు ప్రజలు భావించి, ఇది వారి జీవితంలో ఒక అద్భుతమైన క్షణమని, ఇది వారి భౌతిక పుట్టుక కంటే కూడా ముఖ్యమైనదని నమ్మేడివారు.
⤔ ఐగుప్తీ అంతటా ఫరోలు మాత్రమే చేసుకొనేవారు.
⤔ ఏటేటా ఐగుప్తీ ప్రజలే తమ ఫరోలు గొప్ప దేవుళ్లు అని, వేరొక దేవుడు లేడని నమ్మి వారికే ఘనంగా జరిపే వేడుక భాగమే ఈ "పుట్టినరోజు"(Birthday)
⤔ కేక్, క్యాండిల్ ఊదటం వంటివి వారు ఎన్నడూ చేయలేదు.
✅ గ్రీకు కాలములో :
⤕ ఐగుప్తీయులు సంప్రదాయం కొంతమట్టుకు ప్రాచీన గ్రీకుల ద్వారా వారి జీవన వాడుకలోకి వచ్చింది.
⤕ ఐగుప్తీయులు వలె గ్రీకులు కూడా తమ దేవుళ్లకు పుట్టినరోజు వేడుకలు చేసెడి వారు.
⤕ గ్రీకుల యొక్క ఆరాధ్యదైవం చంద్ర దేవతయైన అర్తెమిదేవి(ఆర్టెమిస్)
⤕ మొట్టమొదటగా గ్రీకులు వారి ఆరాధ్యదైవమైన చంద్ర దేవత అర్తెమిదేవికు చంద్రుని ఆకారంలో ఉన్న తెల్లటి కేకులను తయారు చేసి.., మెరుస్తున్న కొవ్వొత్తులతో అలంకరించి ఆమెకు సమర్పించేవారు. ఇలా చంద్రుని ప్రకాశాన్ని మరియు అర్తెమిదేవి అందాన్ని పునఃసృష్టి చేయడానికి వీరు దీనిని ఒక మార్గంగా ఎంచుకున్నారు.
🕯 ఇలా వారి పూజా పద్ధతులు ప్రకారం ఆమెకు ఒక కొవ్వొత్తు వెలిగించి, కేక్ మీద పెట్టీ, ఆమెకి మొక్కుకొని, కొవ్వొత్తును ఆర్పి కోరుకొంటే ఆర్పిన తరువాత వచ్చే పొగ వారి దేవత యొద్దకు వారి కోరికలను చెరవేస్తాయి అనేది వారి యొక్క విశ్వాసం. ఇది నేటికీ వారి జీవితాల్లో కొనసాగుతున్న సంప్రదాయంగా మారింది.
🍥 పుట్టినరోజున కొవ్వొత్తులు & చంద్రుని ఆకారములో కేక్ లు మొట్టమొదటగా అక్కడే అర్తెమిదేవి దేవతకు ప్రారంభమయ్యాయి.
⤕ గ్రీకులకు ఆత్మల ఆలోచన కూడా కేంద్ర బిందువు.
⤕ ప్రతి ఒక్కరికి వారి పుట్టుకలోనే ఒక మంచి ఆత్మ లేదా ఒక చెడ్డ ఆత్మ వారిలో ఉందని విశ్వసించేవారు. వారిలో ఏ రకపు ఆత్మ ఉన్నాసరే ఆ ఆత్మ ఆ వ్యక్తితో ఒక సంబంధాన్ని ఏర్పరుచుకుంటాదని మరియు వారి జీవితకాలము వారిని చూసుకొంటాదనేది వారి గట్టి నమ్మకం.
✅ రోమా కాలములో :
⤖ కాలక్రమేనా రోమా ప్రభుత్వము ఏలుబడి చేస్తున్న దినాల్లో రోమా రాజులు ఇండ్లలో కూడా పుట్టినరోజు వేడుకలు జరిగేవి.
⤖ కొన్ని సంవత్సరాలు తర్వాత రోమా ప్రభుత్వం సామాన్య రోమా పౌరులలో పురుషులకు మాత్రమే పుట్టినరోజు జరుపుకునే అవకాశం ఇచ్చింది.
⤖ ప్రసిద్ధిగాంచిన రోమీ పురుషుడు యొక్క పుట్టినరోజును సెలవుదినంగా కూడా ప్రకటించేది.
⤖ 50 ఏళ్ళు నిండిన ఏ రోమా పురుషుడైన గోధుమ పిండి, ఆలివ్ నూనె, తురిమిన చీజ్ మరియు తేనెతో కాల్చిన ప్రత్యేక కేక్‌ను తమ బంధువులు నుండి అందుకునేవాడు. తమ బంధువుల చేత పుట్టినరోజు వేడుకలను చేసుకునేవాడు.
⤖ కానీ ఇక్కడ ముఖ్య విషయమేమంటే కేవలం పురుషులు అది 50 ఏళ్ళు నిండిన వారు మాత్రమే పుట్టినరోజు వేడుకలు చేసుకునేవారు.
⤖ ఇలా ప్రపంచవ్యాప్తంగా 12వ శతాబ్దం వరకు ఆడవాళ్లు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లు చరిత్రలో ఒక్క ఆధారం కూడా లేదు.
⤖ 18వ శతాబ్దం అనంతరం యావత్తు ప్రపంచమంతా కూడా ఈ పుట్టినరోజు వేడుకలు అనేవి అందరిలో మొదలయ్యయి.
☐ పుట్టినరోజు వేడుకలు మొదటగా ఎలా, ఎక్కడ, ఎవరు ప్రారంభించారో అనే చారిత్రాత్మకముగా కొన్ని సంగతులను మీరు చదవడం బట్టి కొంతమట్టుకు సత్యాన్ని గ్రహించగలిగారని నమ్ముచున్నాను. ఇంకా ఇలా వ్రాసుకుంటూ పోతే చాలా సంగతులే కలవు. ఇక వీటిని ఇక్కడకి విడిచిపెట్టి "పుట్టినరోజు వేడుకలు ఎప్పుడు వ్యాప్తి చెందాయో? ఆయా దేశాల వారు ఎలా జరుపుకునేవారు?" అనే విషయాల పై ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం.
🌏ప్రపంచమంతటా ఎప్పుడు వ్యాప్తిచెందాయి?🌍
క్రీ.పూ. 3000సం. క్రితం ఐగుప్తీయుల రాజులను దేవునిగా భావించి వారికి చేసిన వేడుకలే ఈ పుట్టినరోజు వేడుకలు. అటు పిమ్మట వారి యొక్క ఆచారాన్ని అనుసరించే గ్రీకులు అనంతరం రోమీయులు వారి దేవత దేవుళ్లకు, ప్రసిద్ధికెక్కిన పురుషులకు మాత్రమే ఈ వేడుకలను చేసుకునేవారని పైన పేర్కొన్న చరిత్ర ప్రకారంగా మనం చదివి ఉన్నాం.
మరి "అంతటా ఎప్పుడు వ్యాపించాయి?" అనే విషయాన్ని కోసం ఆలోచన చేస్తే రమారమీ క్రీ.శ. 1800s చివరి కాలములో జర్మనీ దేశము నుండే పుట్టినరోజు వేడుకలనేవి విస్తృతంగా అనేక చోట్లకు వ్యాప్తి చెందాయి. జర్మనీలోని పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి మొట్టమొదటగా అందరూ కూడా పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఇక్కడే ప్రారంభమైంది. అక్కడ పిల్లలకు కిండర్‌ఫెస్ట్ (Kinderfeste) లేదా Kids Events పేరుతో పుట్టినరోజు పార్టీలకు కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఒక పిల్ల వాడు తన పుట్టినరోజున తన పెద్దలను గౌరవించాలి అనే ఒక నిర్దిష్టమైన పద్ధతిని జరిపి అనంతరం తనకు పుట్టినరోజు వేడుకలు జరిపేవారు. ఆ వేడుకలో కేక్‌తో(Birthday Cake) మరియు వారి వయస్సు ఎంత అని తెలిపే సంఖ్యా గల కొవ్వొత్తులతో, రాబోయే సంవత్సరానికి ప్రతీకగా అదనపు కొవ్వొత్తితో వేడుకలు చేయడం మొదలయ్యింది.
🔎గ్రీకుల ఆరాధ్యదైవం చంద్ర దేవతయైన అర్తెమిదేవికి కోరికలు తీర్చడానికి కొవ్వొత్తులను వెలిగించి, ఊదే అభ్యాసమనేది జర్మనీయులు కూడా వారి పుట్టినరోజు వేడుకల్లో ఒక భాగంగా 🎂కేక్ మీద 🕯 కొవ్వొత్తులను వెలిగించి, ఊది చేసుకునేవారు. కాలక్రమేనా అన్ని దేశాల ప్రజలకు ఈ పుట్టినరోజు వేడుకల ఆచారం వ్యాప్తిచెందింది. అది ఇప్పటికీ మన మద్య లేకపోలేదు.
🔎 రాబర్ట్ కోల్మన్ అనే వ్యక్తి HAPPY BIRTHDAY TO YOU అనే "బర్త్ డే సాంగ్" యొక్క రచయిత. ఈయన 1924 లో ఈ పాటకు ట్యూన్ ను (నేడు వాడుకులో ఉన్న..) 1893లో కెంటుకీ అనే స్కూల్ యొక్క ఇద్దరు ఉపాధ్యాయియులు "ప్యాటీ హిల్ మరియు మిల్డ్రెడ్ హిల్" వ్రాసిన GOOD MORNING TO YOU అనే పాట యొక్క ట్యూన్ నుండే వెలువడింది.
కొన్ని దేశాల ప్రజలు ఎలా చేసుకునేవారనే విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం
🍥 జపాన్ ప్రజలు :
వీరు జనవరిలో రెండవ సోమవారం కమింగ్ ఆఫ్ ఏజ్ డేని జరుపుకుంటారు. ఆరోజున 20 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ అభినందించి , ప్రోత్సహించి మరియు గొప్పగా వారి పుట్టినరోజు వేడుకను జరిగించడమే వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
🍥 కెనడా ప్రజలు :
వీరు పుట్టినరోజు వ్యక్తి యొక్క ముక్కు అంతటికి వెన్న పూస్తారు. ఇలా రాయడం వలన అతని జీవితంలో దురదృష్టం రాకుండా దానికి దూరంగా ఉంచబడతాడని వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
🍥 చైనా ప్రజలు :
వీరు పుట్టినరోజులను గొప్ప వేడుకగా జరుపుకుంటారు. పుట్టినరోజు వ్యక్తికి పువ్వులు మరియు పుస్తకాలను బహుమతులుగా ఇస్తారు. అతను దీర్ఘాయుష్మంతుడుగా ఉండుటకు తాను తినే గిన్నెలో పొడవాటి నూడిల్ ను అనగా "దీర్ఘాయువు నూడిల్" ను అతనికి ఇచ్చి తినిపిస్తారు. ఈ పొడవాటి నూడిల్ అనేది సుదీర్ఘమైన మరియు సంపన్నమైన జీవితాన్ని సూచిస్తుందనేది వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
🍥 రష్యా ప్రజలు :
మీరు పుట్టినరోజు వ్యక్తికి కేకులనే బహుమతిగా ఇస్తారు. తాము ఇచ్చే కేకులను తినిపించి, పుట్టినరోజు వ్యక్తి చెవిని నొప్పి కలిగించే విధముగా లాగి శుభాకాంక్షలు తెలుపడం వీరి ఆనవాయితీ. "తమ చెవులు భూమికి చేరుకునేంతగా పెరుగుతాయని వారి ఆశ!" వీరే కాదు ఇటలీ, బ్రెజిల్, అర్జెంటీనా వంటి ఇతర దేశాలు కూడా ఈ చెవి లాగే సంప్రదాయాన్ని పాటిస్తాయి.
🍥 వియత్నాం ప్రజలు :
ఈ దేశ ప్రజలందరూ సంవత్సరంలో మొదటి రోజునే పుట్టినరోజు జరుపుకుంటారు. ఇలా చేయడం వారి పూర్వీకుల యొక్క ఆచారము. ఆరోజును టెట్ అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరుగుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
🍥 మెక్సికో ప్రజలు :
Pinatas అనేది వీరి యొక్క ప్రసిద్ధ పుట్టినరోజు వేడుక. పుట్టినరోజు వ్యక్తికి కేక్ ను ముఖం అంతటా రాసి శుభాకాంక్షలు తెలుపుతారు.
🍥 ఇండియా ప్రజలు :
అర్థరాత్రి నుండే వేడుకలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిస్తారు. పుట్టినరోజు బంప్‌లంటూ, తన్నడం, కొట్టడం, క్రూరంగా ప్రవర్తించడం, కేక్ మొఖానికి వ్రాయడం, నగ్నంగా ఉంచడం, ర్యాగింగ్ చేయడం...Etc జరిగిస్తారు. కొందరైతే కొత్త బట్టలు వేసుకొని, అందరి మధ్య కొవ్వొత్తులని ఊది, కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకోవడం, లెక్కకు మించి ధనాన్ని ఖర్చు చేయడం, పుట్టినరోజు వ్యక్తి యొక్క పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం, పూజలు/ ప్రార్థనలు నిర్వహించడం వంటివి మనం చూస్తూ ఉంటాం..
📖 బైబిల్ ఏమి సెలవు ఇస్తుంది? 📖
సర్వమానవజాతికి ప్రామాణికముగా ఉండుటకు దేవుని యొద్ద నుండి మనుషులకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ గ్రంథము(బైబిల్) 🕮 సత్యమే అని చెప్పుటకు మీ యెదుట వెనకడుగు వేయడం లేదు. కారణమేమనగా.., పైన మనం చదివిన చరిత్ర ప్రకారంగా ఆలోచిస్తే...
🎂 మొదటి ఆధారం :
👤 ఫరో జన్మదినము ≈ ఐగుప్తీయులు రాజు
(ఆది. కాం. 40:18-22): "అందుకు యోసేపు– దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడుదినములు ఇంక మూడుదినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీదనుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను. మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందుచేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను.౹ మరియు యోసేపు వారికి తెలిపిన భావముచొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.౹"
🎂 రెండో ఆధారం :
👤 హేరోదు జన్మదినము ≈ రోమా రాజు
(మత్తయి. 14:6-10): "అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై– బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతోకూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను."
☀ పైన పేర్కొనబడిన చరిత్ర ప్రకారం పుట్టినరోజు వేడుకలు అనేవి అన్యులైన ఐగుప్తీయ రాజులకు చెందినవేనని గ్రహించగలం.
☀ వారి ఇద్దరి జన్మదినోత్సవము నాడు రెండు మరణాలు సంభవించాయి.
☀ ఫరో జన్మదినమున - భక్ష్యకారుల అధిపతిని ఉరి.
☀ హేరోదు జన్మదినము - బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికించడం.
☀ ఐగుప్తీయులు(అన్యుల) యొద్ద నుండి ప్రారంభము కాబడిన ఆ పుట్టినరోజు వేడుకలే నేటికీ మన మధ్య జరుగుతున్నాయని తెలుసుకొనగలరు.
🔘 NOTE ::
🔎 పాత నిబంధనలో ఒక్క ఇశ్రాయేలుడైన గాని, క్రొత్త నిబంధనలో ఒక్క క్రైస్తవుడైన గాని అన్య ఆచారమైన పుట్టినరోజు వేడుకలను చేసినట్టు ఒక్క ఆధారం కూడా లేదు.
🔎 చివరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తాను పుట్టిన సంవత్సరం, పుట్టిన నెల, పుట్టిన తేది, పుట్టిన సమయమనేది తండ్రి రహస్యంగా తన స్వాధీనంలో ఉంచుకున్నప్పటికీ... యేసు తన బాల్యం నుండే తల్లి మరియ యొద్ద ఉండినప్పటికి అతనికి ఏటేటా పుట్టినరోజును(క్రిస్మస్) తల్లి చేసినట్టుగా గాని లేదా తాను చేసుకొనట్టుగా గాని, తన శిష్యులైన వారికి అజ్ఞాపించినట్టుగా గాని, ఆదిమా క్రీస్తు సంఘములు చేసినట్టుగా గాని పరిశుద్ధ గ్రంథంలో ఒక్క ఆధారం కూడా కానాడదు.
🔎 యేసు పుట్టుక అంటే క్రిస్మస్ అని ఈ లోకానికి పరిచయం చేసినది అపవాదియే. వాడే ఒక తేదీని నిర్ణయించి ఏటేటా అనేకమందిని మోసగిస్తూ క్రిస్మస్ పేరుతో దేవుని గ్రంధానికి లోబడనివ్వకుండా వ్యతిరేకముగా నడిపిస్తున్నాడు. ఇలా ఏటేటా అన్య ఆచారం చేయుట వలన దేవుడు సంతోషించునా? క్రీస్తు అంగీకరించునా? ఆలోచించుకో..
🔎 మనలో కొందరు ఏటేటా క్రిస్మస్ చేయనివారు కూడా ఉన్నారు కానీ వారు ఏటేటా తమ పుట్టినరోజు వేడుకలను మాత్రం చేసుకొనేవారు లేకపోలేదు. అటువంటి వారికి క్రిస్మస్ చేయకూడదని చెప్పే నీవు ఎందుకు అన్య ఆచారమైన నీ పుట్టినరోజును చేసుకొంటున్నావు? ఇతరులకు బోధించే నీవు నీకు నీవు బోధించుకొనవా? ఆలోచించుకో..
👤క్రైస్తవులు తమ పుట్టినరోజును చేసుకోవచ్చా? 🕯🍥
[ NO ≈ నిజమైన క్రైస్తవులు తమ పుట్టినరోజునే కాదు అన్య ఆచారాలను వేటినైనను జ్ఞాపకం చేసుకోకూడదు. ]
💥 క్రైస్తవుడు అన్యుల స్వరం వినడు :
"మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.౹ అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.౹" (యోహాను 10:4-5):
💥 క్రైస్తవుడు తిరిగి లోకముయొక్క మూలపాఠములను అనుసరించడు :
"ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.౹" (కొలస్స 2:8)
"మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి– చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.౹" (కొలస్స 2:20)
💥 క్రైస్తవుడు దినము, మాసము, సంవత్సరములను ఆచరించడు :
"ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని౹ యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల?మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?౹ మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.౹ మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను." (గలతి. 4:8-11)
💥 క్రైస్తవుడు అన్యజనులాగ జీవించడు :
"కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.౹" (ఎఫెసీ. 4:17)
"నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. (హెబ్రీ. 13:9)
"... అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,౹" (1 పేతురు. 4:3)
✅ గమనిక :
📖 నేటి బోధకులలో అనేకమంది పుట్టిన రోజుల వేడుకలలో భాగముగా వారి చేత సంఘము యెదుట వాక్య వక్రీకరణ చేయబడుతున్న వచనములో ఒకటి కొలస్స 3:17.
"మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి".
And whatever you do, in word or in deed, do everything in the name of the Lord Jesus, giving thanks to God the Father through him.
"καὶ πᾶν, ὅ τι ἐὰν ποιῆτε ἐν λόγῳ ἢ ἐν ἔργῳ, πάντα ἐν ὀνόματι Κυρίου Ἰησοῦ, εὐχαριστοῦντες τῷ Θεῷ Πατρὶ δι’ αὐτοῦ."
📖 ఈ వచనములో "మీరేమి చేసినను" అనే మాటని పట్టుకొను దేవుడు చెప్పని దానిని తిరిగి దేవుని గ్రంధాన్ని అపాదించడమే తప్పు. పుట్టిన రోజు వేడుక వాక్యానుసారమైనది కాదని యేరిగి ఉంటే క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామని అనుకోవడం తప్పే కదా !
🔜మీరేమి చేసినను అంటే క్రీస్తు మనకు చెప్పిన వాటినే నీ దేహముతో జరిగించినప్పుడు అని అర్ధం.
🔜 సమస్తమును ఆయన పేరట(Onoma) చేయుడి అంటే ఆయన అధికారము(Onoma) నందు ఉంటూ ఆయన చెప్పేది చేయడమే తప్పా ఆయన చెప్పనది చేయడం కాదు.
📖 సంఘానికి అధికారి క్రీస్తే కదా (కొలస్స. 1:18) ఇట్టి అధికారి క్రింది ఉన్నవారికి ఒక్కసారే అప్పగింపబడిన అపోస్తులుల బోధ విషయాల్లో "ఏదైనను కల్పినయెడల లేదా ఏదైనను తీసివేసినయెడల" పరమతండ్రియే వానికి పరిశుద్ధ పట్టణములో పాలులేకుండ చేయును కదా(ప్రకటన. 22:18-19)
📖 ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. (సామెతలు. 30:6)
📖 పుట్టినరోజు వేడుకలు అనేవి అన్యుల పద్ధతులే కానీ దైవ పద్ధతి కాదని గుర్తించండి. ఆది నుండి భక్తులకు తెలిసిన ఈ సత్యము మీకు తెలియకపోవడం బాధాకరమే కదా!
🔎 ఈ అంశము ద్వారా పుట్టినరోజు వేడుకలనేవి అన్య ఆచారలేనని గుర్తిస్తే "నీవు చేసుకోవు, చేసేవారిని శుభాకాంక్షలతో ప్రోత్సహించవు మరియు క్రీస్తు మాటలకు వ్యతిరేకముగా నడుచుకోవు".
📖 ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు. (ప్రసంగి 7:1)
WhatsApp Join Us Telegram Join Us
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com