మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. 🙏🏿
పరలోకమందున్న దేవుడు ఆది నుండి జరుగు సంగతులను మరియు తన సంకల్పమును అంతటిని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మనుషులు చేత వ్రాయించి(66 పుస్తకాలుగా వ్రాసి) మానవజాతికి ఇచ్చుటకు గల ముఖ్య ఉద్దేశ్యం నరుడు తాను బ్రతుకు దినములన్నియు పరిశుద్ధ గ్రంథమును చదువుటకును(ద్వితీయో. 17:21; 1 తిమోతి. 4:13; ప్రకటన), దానిలో విషయాలు చదివి/విని బాగుగా గ్రహించుకొనుటకును (నెహె. 8:8 అపో.కార్య. 8:30), పరిశోధన చేయుటకును (యెషయా. 34:16; అపో.కార్య. 17:11), ధ్యానించుటకను(యెహో. 1:8; కీర్తనలు. 1:2) తన బాల్యదినములందే సృష్టికర్తను యెరుగుటకును(ప్రసంగి. 12:2) దేవుని గూర్చిన జ్ఞానమును(2 కోరింది.10:5; 1 దేస్స.2:13), క్రీస్తును గూర్చిన జ్ఞానమును(ఎఫెసి.4:11), అలాగే పరిశుద్ధాత్ముడు గూర్చిన జ్ఞానమును(యోహాను.14:16; తీతుకు.3:5-6) స్పష్టముగా యెరిగి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్(క్రీస్తు సంఘముగా) చేర్చబడుటకును, అపోస్తలుల బోధలో తమ జీవితాలను దిద్దుబాటు చేసుకొనుటకును, క్రీస్తు స్వరూపం తనయందేర్పడుటకును, క్రీస్తు ప్రత్యక్షతలో మనం తండ్రి యొద్దకు చేరుకోవాలనే కదా!!(అపో.కార్య.2:38-42; గలతీ. 4:19; యోహాను. 14:6).
నిజమైన విశ్వాసికి బైబిలే ప్రామాణికం కాబడాలి లేనియెడల తమ ఊహలు/ఇష్టాలు గ్రంథానికి ఆపాదించబడే అవకాశాలున్నాయి. ఇలా మనుషులు సరిగ్గా ఆలోచించక, పరిశీలించక, చదవక, సరిగ్గా విభజించక పోవుట వలన పుట్టుక వచ్చే బోధలే త్రిత్వము, త్రియేక, ఏకతత్వవాదం, గతికవాదం, జ్ఞానతత్వవాదం ఇవి... 👇👇
❌ త్రిత్వ వాదం అనగా ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలోనున్న ఒక్క దేవుడు మరియు ఒక్క స్వభావమే. తండ్రి పూర్తిగా దేవుడు కుమారుడు పూర్తిగా దేవుడు పరిశుద్ధాత్మ కూడా పూర్తిగా దేవుడు అయిన మనకు ఒక్క దేవుడు ఆయనే యేసు అంటూనే తిరిగి యెహోవాయే యేసు, యేసే పరిశుద్ధాత్ముడు అనే బోధ యందు లక్ష్య పెట్టేవారు.
❌ త్రియేక వాదం అనగా ముగ్గురు వ్యక్తులు ఉన్న ఒక్కడే. ఒక్క దేవుడు మూడు రూపాల్లో పాత్ర పోషించారని. ద్వి లేదా త్రీ పాత్రాభినయం చేశాడని.. ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారని, ఆ ముగ్గురిని కలిపితే సంపూర్ణ దేవుడు అనే బోధ యందు లక్ష్య పెట్టేవారు.
❌ఏకతత్వవాదం అనగా ఇద్దరూ ఏకమైయున్నారు అంటే ఒక్కడైయున్నారని, ఒక్క దేవుడే ద్విపాత్రాభినయం చేశాడనే బోధ యందు లక్ష్య పెట్టేవారు.
❌ఏకతత్వవాదం అనగా ఇద్దరూ ఏకమైయున్నారు అంటే ఒక్కడైయున్నారని, ఒక్క దేవుడే ద్విపాత్రాభినయం చేశాడనే బోధ యందు లక్ష్య పెట్టేవారు.
❌ గతికవాదం అనగా యేసును దేవుడు కలుగజేశాడని. యేసు రెండవ రాకడ అయిపోయిందని, నరకం లేదని, సంఘము శాశ్వతముగా భూమి మీద ఉంటుందని, పునరుత్థానం లేదని, పరలోకము లేదని,...Etc. (జ్ఞానతత్వవాదల నుండి పుట్టుకు వచ్చిన వారే ఈ గతికవాదులు).
❌జ్ఞానతత్వవాదం అనగా యేసు శరీరములో దేవత్వం లేదు, శరీరమునకు పునరుత్థానం లేదు, యేసు కేవలం నరుడు మాత్రమే, అనాదిలో తండ్రి ఆలోచనలో మాత్రమే ఉన్నాడు కానీ తండ్రి యొద్ద లేరు..Etc.
మనం ముఖ్యముగా త్రిత్వము మరియు త్రియేక వాదుల బోధలు విషయానికి వస్తే ఇవి పూర్తిగా బైబిల్ కి వ్యతిరేకం. యేసు ఎప్పుడూ "త్రిత్వం/త్రియేక(Trinity)" అనే పదాన్ని ఉపయోగించలేదు. మనకు ఆ పదం బైబిల్లో కనిపించదు. ఇవి మనుషులు తమ ఆలోచనలును పరిశుద్ధ గ్రంథానికి ఆపాదించి మాట్లాడే విషయాలే. కావున ఇటువంటి అబద్ధాలు బారిన పడకూడదనే ఆలోచనతో "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడా!?" అనే అంశము మీ ముందు ఉంచుటకు ప్రయత్నం చేయుచున్నాము కావున చివరి వరకు చదివి ఆలోచించి, వాక్య పరిశీలన చేయవలసిందిగా మనవి. 🙏
🔥 కీలకమైన విషయాలు :
👤 మన దేవుడైన యెహోవా ≈ అనాది (సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యెషయా. 40:28; కీర్తనలు. 90:1-2).
👤 మన ప్రభువైన యేసుక్రీస్తు ≈ అనాది(సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యోహాను. 17:5; 1 పేతురు. 1:18-20).
📖 పాత నిబంధన కాలములో దేవుడైన యెహోవా తన భక్తుల ద్వారా యేసుని గూర్చి ముందుగా తెలియపరచుట :
1). అబ్రహామునకు తెలియజేసిన మాటలు: (ఆది. 17:7; గలతీ. 3:16).
2). దావీదునకు తెలియజేసిన మాటలు: (2 సమూయేలు. 7:12-19).
3). యెషయాకు తెలియజేసిన మాటలు: (యెషయా. 7:14; 9:6-7).
4). యిర్మియాకు తెలియజేసిన మాటలు: (యిర్మియా. 31:31-33).
5). దానియేలుకు తెలియజేసిన మాటలు: (దానియేలు. 7:13-14).
6). మీకాకు తెలియజేసిన మాటలు: (మీకా. 5:2).
7). జెకర్యాకు తెలియజేసిన మాటలు: (జెకర్యా. 9:9).
8). మలాకీకు తెలియజేసిన మాటలు: (మలాకీ. 3:1).
🔥 "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వస్తే..."
మనం ఒక్క క్షణం "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు" అని భావిస్తే బైబిల్ ను నీవు పూర్తిగా అపార్థం చేసుకొనట్టే అగును కదా... ఎలా అనేది ఈ క్రింది విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేయుము.
A). యేసుక్రీస్తు ఎవరిచేత పంపబడ్డాడు? ఆలోచించుకో... - (యోహాను 5:30; 8:42; 17:3; 20:21).
B). యేసుక్రీస్తు ఎవరి యొద్ద నేర్చుకున్నాడు? ఆలోచించుకో... - (యెషయా. 50:4-7; యోహాను. 5:19; 8:28; 12:49-50; 14:24; 15:15).
C). యేసుక్రీస్తు ఎవరి మాట విన్నాడు? ఆలోచించుకో... - (యోహాను 3:32; 12:49-50; 14:10).
D). యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎవరికీ విధేయుడుగా ఉన్నాడు? ఆలోచించుకో... - (యెషయా. 53:10-12; మత్తయి. 26:39; యోహాను. 10:18; 14:31; రోమా 5:19; ఫిలిప్పీ 2:8; హెబ్రీ 5:5-9).
E). యేసుక్రీస్తును సమాధి/మరణం నుండి ఆయనను లేపిందెవరు? ఆలోచించుకో... - (అపో.కార్య. 2:24; 3:15; 4:10; 13:37; 17:31; 4:25; రోమా 6:4; 7:4; 8:11; 1 కొరింథీ 6:14; 15:4,12; ఎఫేసి 1:20,21).
F). యేసుక్రీస్తుకు ఎవరు అధికారం ఇచ్చారు?. ఆలోచించుకో... - (యోహాను. 5:26; మత్తయి 28:18,19; ప్రకటన 2;26; 3:12; 1పేతురు 3:22).
G). యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు?. ఆలోచించుకో... - (యెషయా 11:1-5; మత్తయి 12:18,28 లూకా. 4:18; యోహాను 3:34; అపో.కార్య. 10:38).
H). యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎవరికీ ప్రార్ధన చేశారు?. ఆలోచించుకో... -(కీర్తనలు 22:1-10; మత్తయి 11:25; 26:38-39; 27:46; మార్కు 1:35; లుకా 6:12; యోహాను 17:1-22; హెబ్రీ 5:7). Etc.
I). యెహోవా దేవుడే వస్తే... యేసుక్రీస్తు ఎవరిని నా దేవా నా దేవా, నా తండ్రి, నా దేవుడు అనెను? ఆలోచించుకో... - (మత్తయి 27:46; యోహాను 20:17). Etc.
J). యెహోవా దేవుడే వస్తే... యేసుక్రీస్తు ఎవరి కుడి పార్శమున కూర్చున్నారు? - ఆలోచించుకో... - (అపో.కార్య. 2:25,33,35; 7:55; రోమా. 8:34; ఎఫెసి. 1:20; కోలస్సీ 3:1; హెబ్రీ 1:3; 8:2; 10:12; 12:2; 1 పేతురు. 3:22).
👥 మరిన్ని ఆధారాలు :
🍃 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవునియెద్ద ఉండెను. -(యోహాను. 1:1-2)
☑ పై వచనమును బట్టి వాక్యము ఎవరు ? – యేసు (యోహాను. 1:14a).
☑ ఆ వాక్యము ఎవరియొద్ద ఉండెను ? – యెహోవా (యోహాను. 1:2; 14b).
🍂 నేను తండ్రియెద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను . –(యోహాను. 16:28).
☑ పై వచనమును బట్టి తండ్రి ఎవరు ? – యెహోవా (ఎఫేసి 1:19).
☑ తండ్రియొద్దకు వెళ్లుచున్నవారు ఎవరు ? – యేసు (యోహాను. 17:5).
🍁ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవునికుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. (అపో.కార్య. 7:56).
☑ పై వచనమును బట్టి దేవుడు ఎవరు ? – యెహోవా (1 కోరింధి. 8:6).
☑ దేవుని కుడిపార్శ్వమందు నిలిచియున్నది ఎవరు ? – యేసుక్రీస్తు (మార్కు. 16:19).
🍃 నేను తండ్రిని వేడుకొందును, మీయెద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించెను. (యోహాను. 14:16).
☑ పై వచనమును బట్టి తండ్రి ఎవరు ? – యెహోవా (ఎఫేసీ. 4:6).
☑ తండ్రిని వేడుకొందునని చెప్పినది ఎవరు ? – యేసు (యోహాను. 17:1-2).
🍂 తండ్రిని(Father) కుమారుని(Son) ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. (1 యోహాను. 2:22).
☑ నా తండ్రి (మత్తయి. 10:32), మీ తండ్రి (మత్తయి. 23:9), మన తండ్రి (1 కోరింధి. 8:6).
☑ అద్వితీయ కుమారుడు. – (యోహాను. 3:16).
🔥 యెహోవా దేవుడు - యేసు కాదని అనుటకు సాక్ష్యము :
👤 యెహోవా సాక్ష్యము – (నిర్గమ. 33:20).
👤 యేసుక్రీస్తు సాక్ష్యము – (యోహాను. 1:18).
👤 పరిశుద్ధాత్ముని సాక్ష్యము – (1 తిమోతి. 6:16; 1 యోహాను. 4:12).
గమనిక : ఇద్దరి మనుష్యుల సాక్ష్యము సత్యమని గ్రంథము తేటగా తెలియపరుస్తుంది. – (యోహాను. 8:17).
✒ సారాంశము : ఓ చదువరి... నీకు ఇవ్వబడిన బైబిల్ జాగ్రత్తగా చదువుటకు, గ్రహించుకొనడానికి, పరిశీలన చేయడానికి, ధ్యానించడానికి, క్రీస్తు నందు రక్షింపబడి, క్రీస్తు పరిపాలన క్రింద చేర్చబడి, మరల ఆయన ప్రత్యక్షతలో తండ్రి యొద్దకు చేరుకొనుటకు, యుగయుగములు ఆయన సన్నిధిలో ఉండానికి ముందుగా ఇవ్వబడిన పరిశుద్ద గ్రంథమని గుర్తిస్తే... ఆయన గ్రంథములో లేనివాటిని తిరిగి గ్రంధానికి కలిపి, చెరిపి బోధించే అవకాశం ఇవ్వబడలేదనే విషయాన్ని మొదటగా గుర్తించు. ఇక విషయానికి వస్తే... "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు" అనుటకు బైబిల్ ఏమాత్రం అంగీకరించదు. ఇది పూర్తిగా దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన బోదె. కాబట్టి పై వ్రాసిన విషయాలను వాక్యాలతో సహా చదివి, పరిశీలన చేయమని, అసత్యానికి/అబద్ధ బోధకు దూరంగా ఉండాలని మిమ్మలి క్రీస్తు నందు ప్రేమతో కోరుతున్నాం. 🙏
"యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అనేది ఒక కట్టుకథ"
WhatsApp Join Us Telegram Join Us
మీ ఆత్మీయులు 👪
🔎 మరెన్ని అంశాలు పరిశీలన చేయుటకు :
1. ఏకమైయున్నారు అంటే ఏంటి?క్లిక్ చేయు
2. యేసుకి దేవత్వము లేదు అనే జ్ఞానతత్వవాదం క్లిక్ చేయు
3. గతికవాదంత్వరలో
4. యేసుని ఎవరు పంపెను?క్లిక్ చేయు
5. యేసు యొక్క దేవుడు ఎవరు?క్లిక్ చేయు
4 comments
commentsGood Post KM
ReplyBro.వందనాలు
Replyఈ మాటలు ఇతురలతో పంచుకోవచ్చ
Yes
Replyఅపొస్తలులు ఎప్పుడైనా యెహోవా మరియు యేసు ఒక్కరు కాదు అని బోధించారా?
Replyఅపొస్తలుల బోధ కదా మీది.. ఎప్పుడైనా యేసుని తక్కువ చెయ్యడం కానీ, ఆయన దైవత్వాన్ని తక్కువ చెయ్యడం కానీ చేసారా...
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com