క్రిస్మస్ లో క్రీస్తును ఎవరు ఉంచారు? (Who Was It That Put Christ In Christmas?)


బైబిల్ మాట్లాడే చోట మాట్లాడదాం 

బైబిల్ నిశ్శబ్దంగా ఉన్న చోట మౌనంగా ఉందాం. 

 మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు.🙌

ఏటేటా  అనేకమంది క్రైస్తవులుగా పిలువబడేవాళ్ళు క్రిస్మస్/Xmas/మేరీ క్రిస్మస్ అంటూ డిసెంబర్ 25వ తేదిన సంఘములోనికి అనేకమందిని ఆహ్వానించి "క్రిస్మస్లో క్రీస్తును ఉంచుతూ, క్రీస్తును ఆరాధిస్తూ, క్రీస్తునకు పుట్టినరోజు వేడుకలు చేస్తూ" ఉంటారు. 

ఈ జగతిలో మానవాళికి తెలిసిన ప్రతి తెగల నుండి మనం ఈ అభ్యర్థనను చూస్తున్నాము

అయితే ఒక్క క్షణం ఆలోచించండి..., 🙏

అసలు ఈ "క్రిస్మస్ లో క్రీస్తును ఉంచింది ఎవరు?" క్రిస్మస్ అనేది క్రైస్తవులకు సంభందించిది అని ఎవరు చెప్పారుఅసలు దీనిని ఎవరు ప్రవేశపెట్టారు?📖

దేవుడు ప్రవేశపెట్టాడా


➤ "తండ్రి తన కుమారుని ప్రపంచ రక్షకునిగా పంపాడు" అని మనకు తెలుసుతండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము (1 యోహాను 4:14). యేసు తన సొంత ఇష్టానుసారం పని చేయలేదని లేదా మాట్లాడలేదని చెప్పాడు, కానీ తన తండ్రి ద్వారా అధికారం ఇవ్వబడిన వాటిని మాత్రమే చెప్పాడు మరియు చేసాడు. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని, ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞయిచ్చియున్నాడు. (యోహాను 6:39 12:49) 

➤ యేసు జన్మదిన వేడుకలు తండ్రి కుమారునితో మాట్లాడిన విషయమా? కాదు. అయితే యేసు జననం తండ్రి చిత్తం కాదని మేము అనడం లేదు. అది, స్వయంగా యేసే తండ్రియైన దేవునికి ఇలా చెప్పాడు. "మీరు నాకు శరీరాన్ని సిద్ధం చేసారు" కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు.

➤ బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. (హెబ్రీ 10:5). సమయం యొక్క సంపూర్ణత వచ్చినప్పుడు, దేవుడు తన కుమారుని పంపాడు,ఆయన  స్త్రీకి జన్మించాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,.. (గలతీ 4:4). 

💥 యేసు జననం గురించి మత్తయి మరియు లూకా చెప్పినట్లుగా ఎటువంటి వివాదం ఉండదు. అయితే, మేము ఒక ప్రత్యేక ప్రశ్న అడుగుతున్నాము అదేటంటే..., క్రిస్మస్ అని మనకు తెలిసిన నేటి సంప్రదాయంలో దేవుడు క్రీస్తును ఉంచాడా? దేవుడు క్రీస్తును క్రిస్మస్లో ఉంచాడని మరియు క్రిస్మస్ను సంఘము యొక్క ఆరాధనలో ఉంచాడని ఏ గ్రంథం చూపిస్తుంది? దేవుడు ప్రవేశపెట్టినట్టుగా గాని లేక తానే స్వయంగా క్రిస్మస్ అనే పేరుతో క్రీస్తుకు పుట్టినరోజు వేడుక చేయండని గాని ఎక్కడా చెప్పలేదు. మరి నువ్వెలా ఏ ఆధారంతో దేవుడు క్రీస్తును క్రిస్మస్లో పెట్టాడని  నమ్ముతున్నావు

యేసు ప్రవేశపెట్టాడా? 

యేసుకు  సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. అందులో ఒకటి యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. (మత్తయి 28:18) ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండ బెట్టుకొనియున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.  (ఎఫెసీయులు 1:20-23) సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. (కొలొస్సి 1:18).

💥 యేసు, క్రిస్మస్ అనే సంప్రదాయంలో తనను తాను ఉంచుకున్నాడా? ఆయన మన విశ్వాసానికి స్థాపకుడు మరియు పునాది కాబట్టి  బహుశా, సంఘమునకు అధిపతిగా, యేసే స్వయంగా తన సొంత నిర్ణయం చేత క్రిస్మస్ ను ప్రవేశపెట్టాడా? ఒకవేళ యేసు అలా చేస్తే, ఈ సమాచారాన్ని మనం ఎక్కడ కనుగొనవచ్చు? ఖచ్చితంగా క్రొత్త నిబంధనలో మనం దానిని కనుగొనగలమా?

💥 యేసు తన శిష్యులకు క్రిస్మస్ అనే సంప్రదాయాన్ని పాటించమని బోధించాడని (లేదా) ఆయన పుట్టిన వార్షిక జ్ఞాపకార్థం చేయమని చూపించే వాక్య ఆధారం  మన వద్ద ఉందా? లేదు ఒకవేళ ఉంటె, అది ఎక్కడ ఉంది? మన పరిశుద్ద గ్రంథములో దొరక్కపోతే క్రిస్టమస్లో క్రీస్తు తనను తాను పెట్టుకున్నాడని, సంఘములో క్రిస్మస్ పెట్టాడని చెప్పడం కరెక్టేనా? కాదు

పరిశుద్ధాత్ముడు ప్రవేశపెట్టాడా?

పరిశుద్ధాత్ముడు అపొస్తలులను "సర్వసత్యములోనికి" నడిపిస్తాడని యేసు వారికీ వాగ్దానం చేసెను. యేసు వారితో నేరుగా మాట్లాడని విషయాలను వారికి వెల్లడి చేస్తాడు అని చెప్పాడు.

➦ నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. (యోహాను 16:12-15).

మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. (1 కొరి. 2:10-13) పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి. (1 థెస్స. 1:5)

"ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.౹ ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి." (2 పేతురు. 1:20-21).

💥 కాబట్టి, పరిశుద్ద గ్రంథము మనకు పరిశుద్ధాత్ముడు ద్వారానే అనుగ్రహించబడింది. మనకు తెలిసినట్లుగా పరిశుద్ధాత్ముడు క్రిస్మస్ అనే సంప్రదాయాన్ని రూపొందించాడా? లేదు పరిశుద్ధాత్ముడు క్రీస్తును క్రిస్మస్‌లో ఉంచాడా? లేదు.

💥 ఒకవేళ అతను అలా చేస్తే మనం అతని మాటను అంగీకరించాలి మరియు "క్రిస్మస్‌లో క్రీస్తును కొనసాగించాలి" కానీ అయన అలా చేయలేదు. అయన చెయ్యని దానికి నీవు చేస్తే పరిశుద్ధాత్మను  తిరస్కరించడమే కదా. పరిశుద్ధాత్మను  తిరస్కరించడం అంటే దేవున్ని తిరస్కరించడమే.

➦ కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా– మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు." ( మత్తయి. 12:31-32 )

💥 క్రీస్తును క్రిస్మస్‌లో లేక సంఘములో క్రిస్మస్‌ ను ఉంచింది తానేనని పరిశుద్ధాత్మ ఎక్కడైనా లిఖితపూర్వకముగా చెప్పెనా? లేదు

అపోస్తులులు ప్రవేశపెట్టారా?

అపొస్తలుల మాటను తిరస్కరించడం అంటే క్రీస్తు మరియు
దేవుని వాక్యాన్ని తిరస్కరించడమే.

➧ మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను. (లూకా 10:16)

మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. (1 థేస్సాలో4:1). మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. (గలతీ 1:8)

"అపొస్తలుల బోధ" అనేది "ప్రభువు యొక్క బోధ"

వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. (అపో.కా. 2:42).

కాబట్టి "అపొస్తలుల బోధ" ప్రకారంగా అపొస్తలులు క్రిస్మస్‌లో క్రీస్తును ఉంచడం మరియు ఆదిమ సంఘములో ప్రవేశపెట్టడం మనం కనుగొనగలిగితే, మనం కూడా పరలోకం యొక్క ఆమోదంతో చేయవచ్చు. 💥 అపొస్తలుల ఆదేశానుసారం, క్రిస్మస్ సంప్రదాయాన్ని పాటించిన శిష్యుల గురించి మనం గ్రంధములో చదువుతామా? లేదా ఏ విధంగానైనా యేసు జన్మ తేదిని గమనించామా? లేదు. ఒకవేళ క్రీస్తును క్రిస్మస్‌లో ఉంచడం ఒక ముఖ్యమైన కర్తవ్యం అయితే ప్రభువు యొక్క మొదటి ఉత్సాహభరితులైన ఆదిమ క్రైస్తవులు, అపొస్తలులు మరియు భక్తిగల శిష్యులు క్రిస్మస్ ను చేసినట్టుగా మనకు ఆధారాలు ఉండాలి. పరిశుద్ద గ్రంథములో ఎక్కడా అలాంటి దాఖలు లేవు.

మేము ఏమి కనుగొన్నాం?

పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడి దేవుని మూలముగ పలికిన వారి చేత పరిశుద్ద గ్రంథము సంపూర్ణముగా మానవజాతికి ఇవ్వబడిన AD 98 నాటి నుండి సుమారు 300 సంత్సరాల లోపు ఎన్నడూ క్రిస్మస్ ను ఆచరించలేదు. నిజానికి అతరువాత కాలములో పనిచేసిన చర్చి పాదర్ లు కూడా పుట్టినరోజు వేడుకులు జరుపుకోవడంపై విరుచుకుపడేవారట మరియు వాటిని అన్యజనుల ఆచారంగా భావించేవారంట. 300 సంత్సరాల తరువాత డిసెంబరు 25ని... క్రీస్తు జన్మదినంగా కాథలిక్ సంఘము వారు ప్రవేశపెట్టారు. వీళ్ళు ఇలా చేయడం దేవుని నిర్ణయం కాదు. దేవుని పరిశుద్ద ఆజ్ఞలను మీరారు. ఏమనగా....

★ ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.- (సామెతలు. 30:6).

★ ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా-ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడలఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును. – (ప్రకటన. 22:18).

⏩క్రిస్మస్ అనేది మొదటి శతాబ్ద కాలపు  క్రీస్తు సంఘము(Church of Christ) యొక్క విధులలో ఒకటి కాదు. నేటికి అపోస్తుల బోధ ప్రకారమైన క్రీస్తు సంఘము క్రిస్మస్ అనే అన్య పండుగకు వ్యతిరేకమే.

⏩ క్రీస్తు జన్మించిన దాదాపు 300 సంవత్సరాల వరకు క్రిస్మస్ జరుపుకోలేదని చరిత్ర చెప్తుంది.


"December 25th began to be celebrated as Christmas, the birthday of Jesus in 354 AD. as ordered by Bishop Liberius of Rome." (The World Book Encyclopedia, Vol. c # 3 p.416). The Catholic church was not fully developed at that time as the first pope was not named until 606 A.D.

The Grolier Encyclopedia adds, “The date was chosen to counter the pagan festivities connected with the winter solstice.” 

The New Schaff-Herzog Encyclopedia of Religious Knowledge indicates that Christmas was adopted from the pagan festivals “Saturnalia” and “Brumalia.”


💥 డిసెంబర్ 25నే ఎందకు ఎంచుకున్నారో ఎవరికీ తెలియదు . ఇది ఖచ్చితమైన తేదీ అని సూచించడానికి కొత్త నిబంధనలో ఆధారము ఏమీ లేదు. "క్రిస్మస్‌ చేయచ్చు/క్రిస్మస్ లో క్రీస్తును పెట్టవచ్చు" అని మీ బోధకుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తే, దానికి సంబంధించిన ఆధారాలు లేఖనం ద్వారా మీకు చూపించమని అడగండి.

💥 దేవుడు గానీ, క్రీస్తు గానీ, పరిశుద్ధాత్మ గానీ, అపొస్తలులు గానీ క్రీస్తును క్రిస్మస్‌లో పెట్టలేదు కాబట్టి మనం కూడా చేయకూడదు!

మీ ఆత్మీయులు...👪
🔍మరిన్ని వివరాలతో కూడిన లేఖన సమాచారం కొరకు ఈ క్రింది అంశములు క్లిక్ చేసి చదవగలరు.
పండుగలు - Click Here
క్రిస్మస్ - Click Here
క్రీస్తు జన్మ ముఖ్య ఉద్దేశ్యము - Click Here

Share this

Related Posts

Previous
Next Post »

2 comments

comments
December 13, 2022 at 6:50 PM delete

Very useful message Brother thank you 😊

Reply
avatar
December 20, 2022 at 8:03 PM delete

Exlent brother... సహోదరులకు వందనములు 🙏🙏

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16