"యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చెను?" (Why did Jesus Christ come into the world?)

"యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చెను"..?

నా తోటి పరిశుద్ధులరా, మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

మన పాపములును రక్షించుటకు :

» "ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును." (కీర్తన. 130:8).

» "ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు (రక్షకుడు) అను పేరు పెట్టుదువనెను." (మత్తయి. 1:21).

» "పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను''. (మత్తయి. 9:6; మార్కు. 2:10; లూకా. 5:24).

» "పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను." (1 తిమోతి. 1:15).


ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు :

» "ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు." (మత్తయి. 5:17).

» "అంతట ఆయన - ''మోషే ధర్మ శాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద నుండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి'' అని వారితో చెప్పెను." (లూకా. 24:44).


పాపులను పిలుచుటకు

» "అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి'' అని చెప్పెను." (మత్తయి. 9:13).

» "యేసు ఆ మాటలు విని- ''రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు'' అని వారితో చెప్పెను." (మార్కు. 2:17).

» "మారుమనస్సు పొందుటకై, నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు'' అని వారితో చెప్పెను." (లూకా. 5:32).


నశించిన దానిని వెదకి రక్షించుటకు

» "నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను'' అని అతనితో చెప్పెను." (లూకా.19:10).

» "లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు." (యోహాను. 3:17).

» "ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేనతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని." (యోహాను. 12:47).


దేవుని రాజ్యము ప్రకటించుటకు

» "ఆయన - ''నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను ఇందు నిమిత్తమే నేను పంపబడితిని'' అని వారితో చెప్పెను." (లూకా. 4:43; 9:11).

» "యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు,...." (మత్తయి. 4:23).

» "కాలము సంపూర్ణమైయున్నది "దేవుని రాజ్యము సమీపించి యున్నది. మారుమనస్సు పొంది సువార్తను నమ్ముడి'' అని ప్రకటించ సాగెను." (మార్కు. 1:15).


పరిచారము చేయుటకు :

» "మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను'' అని చెప్పెను." (మత్తయి. 20:28; మార్కు. 10:45).

» "దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచికాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును." (యోహాను. 10:10-11).


సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు :

» "అందుకు పిలాతు - నీవు రాజువా? అని ఆయనను అడుగగా, యేసు - ''నీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని? సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినును'' అనెను." (యోహాను. 18:37).

» "కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో - ''మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు" (యోహాను. 8:31).


తన శిష్యులకు తర్పీదు నిచ్చుటకు :

» శిష్యులకు "పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించమని చెప్పించు" కొన్ని జాగ్రత్తలు చెప్పుట - (మత్తయి. 10 & 13 అధ్యాయము).

» శిష్యులకు తర్పీదు నిచ్చిన పిమ్మట తండ్రికి వేడుకొనుట - (యోహాను. 17:2; 6; 14-16). 


తండ్రి చిత్తము నెరవేర్చుటకు :

» "నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని." (యోహాను. 6:38).

» "నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు'' అని చెప్పెను." (యోహాను. 8:29).

» "చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని." (యోహాను. 17:4).


నిత్య జీవము నిచ్చుటకు :

» "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను." (యోహాను. 3:16).

» "విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు." (యోహాను. 6:47).

» "అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్యజీవము." (యోహాను. 17:3).

"..ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము,
ఇదిగో ఇదే రక్షణదినము." (2 కొరింధి. 6:2).

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16