మానవ నిర్మాణం (creation of man)

మానవ నిర్మాణం (creation of man)


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏 


మానవ నిర్మాణం దేవుని సృష్టిలో అత్యంత ముఖ్యమైన భాగం. దేవుడు లేడని అనుకొనే వారికి ఇదొక గుణపాఠం. అనంతజ్ఞానపూర్ణడగు పరమ దేవుడు ఆదిలోనే భూమ్యాకాశములు, సూర్యచంద్రాదులు, వృక్షాలు, జలచరములు, ఆకాశ పక్ష్యాదులు, భూజంతువులు, ప్రాకు పురుగులు సృజించాడు. సకల జీవులు ఏలికలేకయే  కాలము గడుపుచుండగా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. (1సమూ. 2:3; ఆది.కాం. 1:1-27). దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. (ఆది.కాం. 2:7) ఇట్టి వాని పాదములు క్రింద తాను సృజించిన యావత్తును ఉంచి, అంతటి పైన నరుడును ఏలుబడి చేయుటకు నియమించెను కదా!! (ఆది.కాం. 1:1-28; కీర్తనలు. 8:5-8).


ఇట్టి మానవుడు రెండు భాగాలు :


1️⃣ శరీరము

2️⃣ ఆత్మ


👤 "శరీరము" ≈ దేహము + ప్రాణం ≈ జీవించు ప్రాణి


శరీరము ఒక బాహ్య పురుషుడే అనగా దృశ్యమైనది (2 కోరింది. 4:16) యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము(యెషయా. 64:8) జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి(యోబు. 10:9) మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును(ప్రసంగి. 12:7) దృశ్యమైనవి అనిత్యములు(2 కోరింది. 4:18a) నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు –నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.(కీర్తన. 90:3,10)


🚨 శరీర స్వరూపం : ఒక వ్యక్తి యొక్క మొత్తం శరీరాన్ని, దాని నిర్మాణం, కణజాలాలు, అవయవాలు మరియు వ్యవస్థలను సూచిస్తుంది. 


ఉదా: బాహ్యగా తన కనులు, చెవులు, ముక్కు, చర్మం, కాళ్లు, చేతులు, శరీరములోపల మరియు బయట ప్రతి అవయవము.


"నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను." (కీర్తనలు. 139:13-16)


🚨 శరీర పోలిక : కుటుంబ/రక్త సంబంధుల వ్యక్తుల మధ్య శరీర నిర్మాణంలో లేదా శరీర లక్షణాలలో గల సారూప్యతలను/స్వభావమును సూచిస్తుంది.  వ్యక్తులు తమను తాము ఇతరులతో పోల్చుకోవడం, ముఖ్యంగా వారి శరీరాల రూపాన్ని లేదా పనితీరును పోల్చుకోవడం...Etc 


ఉదా : బాహ్య రూపంగా తండ్రిలా, తల్లిలా, తాతయ్యలా, అమ్మమ్మలా ఉన్నావంటూ చెప్పుటయే శరీర పోలిక. 



👤 "ఆత్మ" ≈ జీవము + ఆత్మ ≈ జీవింపచేయు ఆత్మ


ఆత్మ ఒక ఆంతర్యపురుషుడే అనగా అదృశ్యమైనది(2 కోరింది. 4:16) మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా(జెకర్యా. 12:1) దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను(యోబు. 33:4). ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.(ప్రసంగి. 12:7) అదృశ్యమైనవి నిత్యములు కదా!! (2 కోరింది. 4:18b). సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. (దానియేలు. 12:2)


మానవుడు తన శరీరములో నివాసం చేయు ఆత్మేకానీ శరీరము మాత్రమే కాదు. "ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము.(యోహాను. 6:63).  దేవుడు మానవుడి నాసిక రంధ్రాలలోకి జీవవాయువును ఊదినప్పుడు, మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. (ఆది. కాం. 2:7). "మన స్వరూపంలో, మన పోలిక ప్రకారం నరుడుని చేద్దాం" అని చెప్పి, సృష్టిపై అధికారం చెలాయించడానికి మరియు దానిని బాధ్యతాయుతంగా నిర్వహించడానికి మనుషులను నిర్మించాడు.(ఆది. కాం. 1:26,27)


📖 దేవుని స్వరూపం 📖 


దేవుని స్వరూపం(own Image) నాలుగు రకాలు అని బైబిల్ సెలవు ఇస్తుంది. 


A. అదృశ్య స్వరూపి : 

అదృశ్యుడు అనగా ఆత్మ లేదా కంటికి అగోచరుడు లేదా కంటికి కనపడడు అని అర్థం.


🍃 దేవుడు ఆత్మ గనుక (యోహాను. 4:24)

🍃 ఆయన స్వరూపం అక్షయుడగు(చావులేని) స్వరూపం. (రోమా. 1:23).

🍃 అదృశ్యుడునగు దేవుడిని (హెబ్రీ. 11:27; 1 తిమోతి. 1:17cf).

🍃 అదృశ్యమైనవి నిత్యములు (2 కోరింది. 4:18)

🍃 క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపము గలవాడు. - (కొలస్సి. 1:15cf) (తండ్రైన దేవుడు కాదు).

🍃 అదృశ్య దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏమనగా నిత్యశక్తి(eternal Power), దేవత్వం(Godhead) - (రోమా. 1:20).

🍃 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్న దేవుడు (1 తిమోతి. 6:15).

🍃 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. (యోహాను. 1:18; 1 యోహాను. 4:12; 1 తిమోతి. 6:15b)

🍃 నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.౹ (నిర్గమ. 33:20).

🍃 మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు. (యోహాను. 5:37). 


🚨 ఇట్టి అదృశ్య స్వరూపం కలిగిన దేవుడు తన స్వరూపములో మానవుని నిర్మించాడంటే అర్ధం నరుడుకి(జీవాత్మకి) చావు లేదని, మనం(ఆత్మలము) కంటికి కనపడము అని అర్థమే కదా!! (ఆది. కాం. 2:7).


B. నీతి స్వరూపి :


నీతి స్వరూపం అనగా పాపమునకు చోటు లేని స్వరూపం, పాపం లేనివాడు లేదా పాపం చేయనివాడు అని అర్థం. 


🍁 ప్రభువైన యేసు గెత్సెమనే తోటలో తండ్రికి చేయి ప్రార్థనలో "నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు. (యోహాను. 17:25).

🍁 "—నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. (1 పేతురు. 1:14).

🍁 "ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు. (ప్రసంగి. 7:29).

🍁 "దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.౹" (1 యోహాను. 5:18). 


🚨 ఇట్టి నీతి స్వరూపం కలిగిన దేవుడు తన స్వరూపములో మానవుని నిర్మించాడంటే అర్ధం నరుడుని పాపం లేనివాడిగానే అనగా పరిశుద్ధముగా, యథార్థవంతులనుగా సృజించెను కదా!!


C. సత్య స్వరూపి :


సత్య స్వరూపం అనగా అబద్దమాడలేని, అబద్దమాడజాలని స్వరూపం, సత్యమే తప్పా అబద్దమాడటం చేతకాని స్వరూపం.   


🍀 "వారు– నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి. (ప్రకటన. 6:10).

🍀 దేవుడు అబద్దమాడుట అసంభవం. (హెబ్రీ. 6:16-18)

🍀 అబద్ధమాడనేరని దేవుడు (తీతుకు. 1:2)

🍀 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు (సంఖ్యా. 23:19)

🍀 ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు (1 సము. 15:29).

🍀 "మనము సత్యవంతుడైన వానిని(తండ్రిని) ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చిమనకు వివేక మనుగ్రహించియున్నాడని యెరుగుదుము. (1 యోహాను. 5:20)


🚨 ఇట్టి సత్య స్వరూపం కలిగిన దేవుడు తన స్వరూపములో మానవుని నిర్మించాడంటే అర్ధం తన యెదుట మానవులు  సత్యసంబంధులుగా ఉండాలనే సృజించెను కదా!!


D. ప్రేమా స్వరూపి :


ప్రేమా స్వరూపం అనగా  ద్వేషించలేని స్థితి మరియు ప్రేమకు కర్త దేవుడే. ప్రేమ అనే పదం భూ సంబంధమైన పదం కాదు. పరసంబంధమైన భాష..


🍂 దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. (1 యోహాను. 4:8).

🍂 ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు (2 కోరింది. 13:11)

🍂 దేవుడు ప్రేమాస్వరూపియైయున్నాడు. (1 యోహాను. 4:16)

🍂 ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది. (1 యోహాను. 4:7)

🍂 "నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి..." (హెబ్రీ. 1:9)


🚨 ఇట్టి ప్రేమ స్వరూపం కలిగిన దేవుడు తన స్వరూపములో మానవుని నిర్మించాడంటే అర్ధం నీతిని ప్రేమించి అందలి జీవించుటకును, దుర్నీతిని ద్వేషించుటకును మరియు తన స్వరూపం గలవారిని(తోటి సహోదరులను) ప్రాణం పెట్టేయంతగా ప్రేమించే స్వభావం ఉండాలనే సృజించెను కదా!!



📖  దేవుని పోలిక 📖 


దేవుని పోలిక(own Likeness) అనగా ఆధ్యాత్మిక  లక్షణాలైన జ్ఞానం(రోమా 11:33; 1పేతురు 1:2), సృజనాత్మకత, దేవుని నీతి(2 కోరింది 5:21), దైవ స్వభావం(2 పేతురు 1:4), పరిశుద్ధత(1 పేతురు 1:14), మంచితనం(లూకా 18:19), ప్రేమ(యోహాను 3:16), న్యాయవంతుడు(లూకా 7:29) , సత్యవంతుడు(యోహాను. 3:33), దీర్ఘశాంతం(2 పేతురు 3:9), సమాధానం(1 కోరింది 14:33), పరిపూర్ణుడు(మత్తయి. 5:48) వంటివి...Etc 


అంతేకాని మనుషులు శరీర రూపం, రాయి, పక్షుల, చతుష్పాద జంతువుల, పురుగుల, విగ్రహ రూపాన్ని పోలి ఉండటం కాదు సుమీ! దేవుడు ఆత్మ స్వరూపుడు కాబట్టి శరీర పోలిక కాదు. దేవుని పోలికలు మానవులకు దేవునితో సంబంధం ఏర్పరచుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి.


🚨 ఇట్టి పోలికలు కలిగిన దేవుడు మన పోలిక చొప్పున మానవుని నిర్మించాడంటే అర్ధం మనం దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని, జీవితాన్ని, పరిశుద్ధతను, ప్రేమను కలిగి ఉండాలనే సృజించెను కదా!!


👥 ఓ చదువరి... మన నిర్మాణం ఈ సృష్టి అంతటిలోనే గొప్పది. దేవుడు లేడని అనేవారికి ఇది ఒక పాఠం. మనం రెండు భాగాలు కలయిక... శరీరం తాత్కాలికమైనది, మనం(ఆత్మలం) శాశ్వతమైనవారం అని గుర్తించి మనలను తన నాలుగు స్వరూపాలను, తన పోలికలను మిళితం చేసి ఈ శరీరములో మనలను ఆయనే ఒక సంకల్పం ప్రకారముగా చేశారని గుర్తించమని మనవి 🙏🏿


"ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను." (యాకోబు. 1:18)

మీ ఆత్మీయులు👥

WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Questions and Comments here!

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16