"ఒకనినొకడు" (One Another) |
↪ "మీరు ఒకనినొకడు ప్రేమింపవలెను - (యోహాను. 15:17; 1 యోహాను. 3:23; 4:7).
↪ "సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.౹" - (రోమా. 12:10).
↪ "ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొన వద్దు.౹" - (రోమా. 12:16).
↪ "ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.౹" - (రోమా. 13:8).
↪ "...మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము...". (రోమా. 14:13).
↪ "కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి.౹" - (రోమా. 15:7).
↪ "సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.౹" - (గలతి. 5:13).
↪ "ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.౹" - (గలతి. 6:2).
↪ "కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,౹" - (ఎఫెసి. 4:1).
↪ "ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి." - (ఎఫెసి. 4:32).
↪".... క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు..." - (రోమా. 15:5).
↪ "క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి." - (ఎఫెసి. 5:21).
↪ "ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; - (కొలస్స. 3:9).
↪ "ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.౹" - (కొలస్స. 3:13).
↪ "సహోదరప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్ప బడితిరి.౹" - (1 థేస్స. 4:9).
↪ ".... ఒకనినొకడు ఆదరించుకొనుడి." - (1 థేస్స. 4:18).
↪ "కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి." - (1 థేస్స. 5:11).
↪ ".... ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.౹" - (1 థేస్స. 5:13).
↪ "ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి;౹" - (1 థేస్స. 5:15).
↪ ".... ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి...." - (హెబ్రే. 3:13).
↪ "కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము." - (హెబ్రే. 10:24).
↪ "సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. - (యాకోబు. 4:11).
↪ "సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.౹" - (యాకోబు. 5:9).
↪ "మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.౹" (యాకోబు. 5:16).
↪ "ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.౹ సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.౹" - (1 పేతురు. 4:8-9).
↪ "...ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి". - (1 పేతురు. 5:13).
↪ "పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి." - (రోమా. 16:16).
- మీ ఆత్మీయులు
1). "సహోదర ప్రేమ" - Click Here
2). "దేవుని ప్రేమ" - Click Here
2). "దేవుని ప్రేమ" - Click Here
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com