సహోదర ప్రేమ (Brotherly Love)

"సహోదర  ప్రేమ"
"సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి".  (హేబ్రీ. 13:1)

"Let brotherly love continue."  (Heb 13:1)

 

మన పరమతండ్రి ప్రేమ అనే స్వరూపం కలిగినవాడు (1 యోహాను. 4:11cf.) ప్రేమ యొక్క రూపం దేవునిది. ప్రేమ దేవుని మూలముగా కలిగిది కారణం దేవుడు ప్రేమ స్వరూపియైయున్నాడు. ప్రేమ - ద్వేషం అనేవి రెండు మానవుని వ్యక్తిత్వం లో దేవుడు గుప్తం చేసిపెట్టినట్టుగా  ఉన్నాయి. 

ద్వేషం లేకుండా ప్రేమకు విలువ ఉండదు

 క్రీస్తు స్వరూప స్వభావం ఏమనగా, నీతిని ప్రేమించి - దుర్నీతి ద్వేషించేది (హెబ్రే. 1:9cf)  ప్రేమ, ద్వేషం ఈ రెండు మన ప్రభువైన యేసుక్రీస్తు లో ఉన్నాయి. అలాగునే ప్రతీ మనుష్యుడు లో ప్రేమ - ద్వేషాలున్నాయి కానీ ఉపయోగించే విధానం లో ఉపయోగించక స్వార్ధముగా ఉపయోగించే పరిస్థితి ఎక్కువగా చూడగలం.  

 "ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు." (మత్తయి. 6:24) 

 

➾  నీవు సిరిని ప్రేమిస్తే - దేవుని ద్వేషిస్తావు
  నీవు దేవుని ప్రేమిస్తే - సిరిని ద్వేషిస్తావు

 

మన ప్రభువైన యేసుక్రీస్తు ఐతే నీతిని ప్రేమించి, దుర్నీతి ద్వేషించారు. ఏ మనుషుడు కూడా దుర్నీతి ని ద్వేషించకుండా నీతిని ప్రేమించడం అసంభవం. నీలో ప్రేమ, ద్వేషం ఉంటాది కేవలం ప్రేమ ఉండి ద్వేషం లేకపోతే అది మానవుని పరిపూర్ణత కాదు. మనుషులు సంపూర్ణత కాలేరు. 


సహోదరులును ద్వేషించేవాడు ?

 

సహోదరులును ద్వేషించేవాడు నరహంతకుడు  - (1 యోహాను. 3:15)

సహోదరులును ద్వేషించేవాడు చీకటిలో ఉన్నవాడు - (1 యోహాను. 2:9,11)

నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినవాడు  అబద్ధికుడు - ( 1 యోహాను. 4:20a).

సహోదరులును ద్వేషించేవాడు/ప్రేమింపని వాడు దేవుని సంబంధి కాదు -( 1 యోహాను. 3:10).

సహోదరులను ద్వేషించేవాడు దేవుని ప్రేమింపలేడు - (1 యోహాను. 4:2b)

 

సహోదరులును ప్రేమించేవాడు ?

 

సహోదరులును ప్రేమించేవాడు వెలుగులోనున్నవాడు - (1 యోహాను. 2:10)

సహోదరులును ప్రేమించేవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటాడు. - (1 యోహాను. 3:14)

సహోదరులును ప్రేమించేవాడిలో దేవుడు నిలిచి ఉండును - (1 యోహాను. 4:12).

నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినవాడు  అబద్ధికుడు - ( 1 యోహాను. 4:20a).

దేవుని ప్రేమించేవాడు సహోదరులను ప్రేమించాలి ఇది ఆయన ఆజ్ఞ - (1 యోహాను. 4:21).

సహోదరులను ప్రేమించేవాడు దేవుని మూలముగా పుట్టినవాడై ఉండును - (1 యోహాను. 4:7; 5:1-2)

సహోదరులను ప్రేమించేవాడు వారి కొరకు ప్రాణములను పెట్ట బద్ధులై ఉంటారు. - (1 యోహాను. 3:16). 

        అదృశ్యడైన దేవుడు నీ జీవితం అనుభవములో ప్రత్యక్షత కావాలంటే సహోదరులను ప్రేమించుట ద్వారానే సాధ్యం. అప్పుడు మనం దేవునితో సహవాస బాంధవ్యం కలిగే అనుభవం, దేవుని మూలముగా పుట్టిన అనుభవం, దేవుని ఇంటివారై అనుభవం, వెలుగులో జీవించే అనుభవం కలుగుతుంది. 

 

ప్రేమకు భాష ఉందా? "అవును" 

 ప్రేమ మాట్లాడే భాష సత్ క్రియలు అంటే "సత్ క్రియలు ద్వారా మాట్లాడుతూ ఉంటుందని". ఇది ప్రతీ సహోదరుడు నేర్చుకోవలసిన అవసరం ఉంది. 

            "సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు.౹ మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యకసమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?౹" (యాకోబు 2:15-16).

             సహోదరుడు/సహోదరి ఆ నాటికి భోజనము & దిగంబరులై ఉంటే సమాధానముగా వెళ్లు, చలి కాచుకో, తృప్తి పొందు అనేవి మోసపు మాటలు మరియు క్రియలేని మాటలు.  "ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. (1 యోహాను. 3:17-18). 

 

ప్రేమ ప్రవాహం ఎలా ఉండాలంటే? 

             యెరూషలేము ప్రాంతంలో బీదలైన పరిశుద్ధులున్నారు. మాసిదోనియ/అకయలో నిరుపేదలైన పరిశుద్ధులున్నారు. ఈ ఇరుగురు కి ఎటువంటి సంబంధాలు లేవు కానీ యెరూషలేము లోనున్న పరిశుద్ధులు అవసరతలోనున్నారనే సమాచారం తెలుసుకొని వారి అవసరతలను తీర్చడానికి ఉద్దేశించినవారై  తమ ప్రేమను మాటతో, నాలుకతో కాక క్రియతోను సత్యముతోను వారి అక్కరలు తీర్చి ప్రేమను కనపరిచారు. 

 "ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.౹ ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియవారును అకయవారును కొంత సొమ్ము చందావేయ నిష్టపడిరి.౹ అవును వారిష్ట పడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు. (రోమా. 15:25-27)

 సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము.౹ ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్త రించెను.౹ ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. (2 కొరింథి. 8:1-3).

"విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.౹ ఇట్టి ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.( 2 కొరింథి. 9:10-11)

 "మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక."

దేవుని ప్రేమ
CLICK HERE

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16