Showing posts with label ప్రేమ. Show all posts
Showing posts with label ప్రేమ. Show all posts

"ఒకనినొకడు" (One Another)

 

"ఒకనినొకడు" (One Another)


 "మీరు ఒకనినొకడు ప్రేమింపవలెను - (యోహాను. 15:17; 1 యోహాను. 3:23; 4:7).

 "సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.౹" - (రోమా. 12:10).

 "ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొన వద్దు.౹" - (రోమా. 12:16).

 "ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.౹" - (రోమా. 13:8).

↪ "...మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము...". (రోమా. 14:13).

 "కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి.౹" - (రోమా. 15:7).

↪ "సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.౹" - (గలతి. 5:13).

↪  "ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.౹" - (గలతి. 6:2).

↪ "కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,౹" - (ఎఫెసి. 4:1).

 "ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి." - (ఎఫెసి. 4:32).

".... క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు..." - (రోమా. 15:5).

↪ "క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి." - (ఎఫెసి. 5:21).

↪ "ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; - (కొలస్స. 3:9).

 "ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.౹" - (కొలస్స. 3:13).

 "సహోదరప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్ప బడితిరి.౹" - (1 థేస్స. 4:9).

 ".... ఒకనినొకడు ఆదరించుకొనుడి." - (1 థేస్స. 4:18).

↪ "కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి." - (1 థేస్స. 5:11).

 ".... ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.౹" - (1 థేస్స. 5:13).

 "ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి;౹" - (1 థేస్స. 5:15). 

 ".... ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి...." - (హెబ్రే. 3:13). 

↪ "కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము." - (హెబ్రే. 10:24). 

 "సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. - (యాకోబు. 4:11).

 "సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.౹" - (యాకోబు. 5:9).

 "మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.౹" (యాకోబు. 5:16). 

↪ "ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.౹ సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.౹" - (1 పేతురు. 4:8-9). 

↪ "...ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి". - (1 పేతురు. 5:13).

↪ "పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి." - (రోమా. 16:16).
- మీ ఆత్మీయులు
1). "సహోదర  ప్రేమ" - Click Here
2). "దేవుని ప్రేమ" - Click Here 

సహోదర ప్రేమ (Brotherly Love)

"సహోదర  ప్రేమ"
"సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి".  (హేబ్రీ. 13:1)

"Let brotherly love continue."  (Heb 13:1)

 

మన పరమతండ్రి ప్రేమ అనే స్వరూపం కలిగినవాడు (1 యోహాను. 4:11cf.) ప్రేమ యొక్క రూపం దేవునిది. ప్రేమ దేవుని మూలముగా కలిగిది కారణం దేవుడు ప్రేమ స్వరూపియైయున్నాడు. ప్రేమ - ద్వేషం అనేవి రెండు మానవుని వ్యక్తిత్వం లో దేవుడు గుప్తం చేసిపెట్టినట్టుగా  ఉన్నాయి. 

ద్వేషం లేకుండా ప్రేమకు విలువ ఉండదు

 క్రీస్తు స్వరూప స్వభావం ఏమనగా, నీతిని ప్రేమించి - దుర్నీతి ద్వేషించేది (హెబ్రే. 1:9cf)  ప్రేమ, ద్వేషం ఈ రెండు మన ప్రభువైన యేసుక్రీస్తు లో ఉన్నాయి. అలాగునే ప్రతీ మనుష్యుడు లో ప్రేమ - ద్వేషాలున్నాయి కానీ ఉపయోగించే విధానం లో ఉపయోగించక స్వార్ధముగా ఉపయోగించే పరిస్థితి ఎక్కువగా చూడగలం.  

 "ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు." (మత్తయి. 6:24) 

 

➾  నీవు సిరిని ప్రేమిస్తే - దేవుని ద్వేషిస్తావు
  నీవు దేవుని ప్రేమిస్తే - సిరిని ద్వేషిస్తావు

 

మన ప్రభువైన యేసుక్రీస్తు ఐతే నీతిని ప్రేమించి, దుర్నీతి ద్వేషించారు. ఏ మనుషుడు కూడా దుర్నీతి ని ద్వేషించకుండా నీతిని ప్రేమించడం అసంభవం. నీలో ప్రేమ, ద్వేషం ఉంటాది కేవలం ప్రేమ ఉండి ద్వేషం లేకపోతే అది మానవుని పరిపూర్ణత కాదు. మనుషులు సంపూర్ణత కాలేరు. 


సహోదరులును ద్వేషించేవాడు ?

 

సహోదరులును ద్వేషించేవాడు నరహంతకుడు  - (1 యోహాను. 3:15)

సహోదరులును ద్వేషించేవాడు చీకటిలో ఉన్నవాడు - (1 యోహాను. 2:9,11)

నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినవాడు  అబద్ధికుడు - ( 1 యోహాను. 4:20a).

సహోదరులును ద్వేషించేవాడు/ప్రేమింపని వాడు దేవుని సంబంధి కాదు -( 1 యోహాను. 3:10).

సహోదరులను ద్వేషించేవాడు దేవుని ప్రేమింపలేడు - (1 యోహాను. 4:2b)

 

సహోదరులును ప్రేమించేవాడు ?

 

సహోదరులును ప్రేమించేవాడు వెలుగులోనున్నవాడు - (1 యోహాను. 2:10)

సహోదరులును ప్రేమించేవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటాడు. - (1 యోహాను. 3:14)

సహోదరులును ప్రేమించేవాడిలో దేవుడు నిలిచి ఉండును - (1 యోహాను. 4:12).

నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినవాడు  అబద్ధికుడు - ( 1 యోహాను. 4:20a).

దేవుని ప్రేమించేవాడు సహోదరులను ప్రేమించాలి ఇది ఆయన ఆజ్ఞ - (1 యోహాను. 4:21).

సహోదరులను ప్రేమించేవాడు దేవుని మూలముగా పుట్టినవాడై ఉండును - (1 యోహాను. 4:7; 5:1-2)

సహోదరులను ప్రేమించేవాడు వారి కొరకు ప్రాణములను పెట్ట బద్ధులై ఉంటారు. - (1 యోహాను. 3:16). 

        అదృశ్యడైన దేవుడు నీ జీవితం అనుభవములో ప్రత్యక్షత కావాలంటే సహోదరులను ప్రేమించుట ద్వారానే సాధ్యం. అప్పుడు మనం దేవునితో సహవాస బాంధవ్యం కలిగే అనుభవం, దేవుని మూలముగా పుట్టిన అనుభవం, దేవుని ఇంటివారై అనుభవం, వెలుగులో జీవించే అనుభవం కలుగుతుంది. 

 

ప్రేమకు భాష ఉందా? "అవును" 

 ప్రేమ మాట్లాడే భాష సత్ క్రియలు అంటే "సత్ క్రియలు ద్వారా మాట్లాడుతూ ఉంటుందని". ఇది ప్రతీ సహోదరుడు నేర్చుకోవలసిన అవసరం ఉంది. 

            "సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు.౹ మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యకసమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?౹" (యాకోబు 2:15-16).

             సహోదరుడు/సహోదరి ఆ నాటికి భోజనము & దిగంబరులై ఉంటే సమాధానముగా వెళ్లు, చలి కాచుకో, తృప్తి పొందు అనేవి మోసపు మాటలు మరియు క్రియలేని మాటలు.  "ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. (1 యోహాను. 3:17-18). 

 

ప్రేమ ప్రవాహం ఎలా ఉండాలంటే? 

             యెరూషలేము ప్రాంతంలో బీదలైన పరిశుద్ధులున్నారు. మాసిదోనియ/అకయలో నిరుపేదలైన పరిశుద్ధులున్నారు. ఈ ఇరుగురు కి ఎటువంటి సంబంధాలు లేవు కానీ యెరూషలేము లోనున్న పరిశుద్ధులు అవసరతలోనున్నారనే సమాచారం తెలుసుకొని వారి అవసరతలను తీర్చడానికి ఉద్దేశించినవారై  తమ ప్రేమను మాటతో, నాలుకతో కాక క్రియతోను సత్యముతోను వారి అక్కరలు తీర్చి ప్రేమను కనపరిచారు. 

 "ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.౹ ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియవారును అకయవారును కొంత సొమ్ము చందావేయ నిష్టపడిరి.౹ అవును వారిష్ట పడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు. (రోమా. 15:25-27)

 సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము.౹ ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్త రించెను.౹ ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. (2 కొరింథి. 8:1-3).

"విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.౹ ఇట్టి ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.( 2 కొరింథి. 9:10-11)

 "మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక."

దేవుని ప్రేమ
CLICK HERE

"ప్రేమ - అంటే నీ భావనేమోగానీ"? (LOVE)

"ప్రేమ - అంటే నీ భావనేమోగానీ?"


ప్రభువు నందు ప్రియులైన వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో
నా వందనములు తెలియజేయుచున్నాను.

ప్రియులారా.., లోకంలో ప్రేమ గురించి అడిగితే చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరిపైనా పుడుతుందో తెలియదంటారు... అలాగే ప్రేమ గుడ్డిదని, నడ్డిదని, తొలిచూపులోనే పుడుతుందని వారికి నచ్చినట్లుగా రకరకాలుగా చెబుతుంటారు. అయితే దేవుని నమ్మిన పిల్లలుగా మనకు నిజమైన ప్రేమ ఏంటో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు మన కొరకు వ్రాయించిన గ్రంథము బైబిల్ ను మనము పరిశీలిస్తే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి.


ప్రేమ గురించి గ్రంథము ఏమి చెప్పింది అని పరిశీలిస్తే,....

(1) పవిత్ర హృదయం నుండి ప్రేమ పుడుతుంది.
(2) మంచి మనసాక్షి నుండి ప్రేమ కలుగుతుంది.
(3) నిష్కపటమైన విశ్వాసం నుండి ప్రేమ కలుగుతుంది.
(4) ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది.



ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే. (1తిమోతికి. 1: 5)


 మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని 
యుండుడి. (రోమీయులకు. 12: 9)


 ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. (1యోహాను.  4: 7)


“ప్రేమిస్తే ఏం చేయాలి”..?


 A). “మన  తండ్రియైన దేవుడు ఏం చేశారో ఆలోచిస్తే”

  దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3: 16)

  మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన
అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. (1యోహాను 4: 9,10)


B). “మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారో ఆలోచిస్తే”

  క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. (ఎఫెసీయులకు 5: 2)

  నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. (గలతియులకు 2: 20)

   మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. (2థెస్సలొనికయులకు 2: 16,17)


C). “ప్రభువు సంఘం కోసం ఏం చేశారో ఆలోచిస్తే”

అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. (ఎఫెసీయులకు 5: 25)


D). “సంఘము ఏమి చెయ్యాలో ఆలోచిస్తే”

Note: క్రియలు లేని ప్రేమ - ప్రేమ కాదు

  "నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు–ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు–మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును." (మత్తయి. 25:35-40)

  "చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.౹" (1 యోహాను.3:18)

  "నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను"  (మత్తయి. 12:30-31)

  "నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?౹ సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు.౹ మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక–సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?౹ ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.౹ అయితే ఒకడు —నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలులేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.౹" (యాకోబు. 2:14-18: )

  "సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.౹" (గలతి. 6:1)

  "నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల౹ పాపిని వాని తప్పుమార్గమునుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను." (యాకోబు. 5:19-20)

  “కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.౹" (రోమా. 15:1).

  “నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.౹" (1 పేతురు. 3:15)

  “తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు.౹" (1 యోహాను. 5:16)

  “సందేహపడువారిమీద కనికరము చూపుడి”.౹  “అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైనవారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి." (యూదా. 1:22-23)

  "భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి.౹" (2 పేతురు. 1:7)

  "తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.౹" (1 యోహాను. 2:10)

  "మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు.౹"  "ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.౹" (1 యోహాను. 3:14,16)

  "మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.౹ కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలుచేయుదము." (గలతి. 6:9-10)


“మనం ఎవరిని ప్రేమించాలి”.?


➡ “దేవున్ని ప్రేమించాలి”

నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. (ద్వితియోపదేశకాండము 6: 5)

➡ “క్రీస్తు ప్రభువుని ప్రేమించాలి”

మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక. (ఎఫెసీయులకు 6: 24)

➡ “జ్ఞానమును ప్రేమించాలి”

↠ జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును. (సామెతలు 4: 6)

➡ “సహోదరులను ప్రేమించాలి”

దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము. (1 యోహాను 4: 21)

➡ “తల్లిదండ్రులను ప్రేమించాలి”

పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. (ఎఫెసీయులకు 6: 1)

పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది. (కొలస్సీయులకు 3: 20)

➡ “అన్నదమ్ములను ప్రేమించాలి”

అప్పుడు తన తమ్మునిమీద యోసేపు నకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. (ఆదికాండము 43: 30)

“శత్రువులను ప్రేమించాలి”

నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. (మత్తయి 5: 44)

“భార్యను/భర్తను ప్రేమించాలి”

పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి.  (ఎఫెసీయులకు 5: 25)

స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. (ఎఫెసీయులకు 5: 22)

భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. (కొలస్సీయులకు 3: 18)

భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. (కొలస్సీయులకు 3: 19)

“పొరుగువానిని ప్రేమించాలి”

నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. (మత్తయి 19: 19)

“శిక్షను ప్రేమించాలి”

శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించు వాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు (సామెతలు 12: 1)

వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. (హెబ్రీయులకు 12: 10)

“హృదయ శుద్దిని ప్రేమించాలి”

హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. (సామెతలు 22: 11)

“మేలును ప్రేమించాలి”

​కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. (ఆమోసు 5: 15)

“నీతిని ప్రేమించాలి”

నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు. (కీర్తనలు. 45:7)

నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:9)

ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది. (కీర్తనలు. 33:5)

“దేవుని నామమును ప్రేమించాలి”

యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు.  (కీర్తనలు. 5:12)

“జీవమును ప్రేమించాలి”

జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. (1పేతురు 3: 10)

షరతులు :
↠ "తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;" (మత్తయి. 10:37)

↠ “ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు”. (లూకా. 14:26)


“మనం ఎవరిని ప్రేమించకూడదు”.?


“లోకము-లోకములో ఉన్నవాటిని ప్రేమించకూడదు”

ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. (1యోహాను 2: 15)

“ధనమును ప్రేమించకూడదు”

ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. (1తిమోతికి 6: 9,17)

“ప్రాణమును ప్రేమించకూడదు”

తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 12: 25)

“అబద్ధమును ప్రేమించకూడదు”

కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. (ప్రకటన గ్రంథం 22: 15)

“దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు”

ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపనియెడల వాడు నా శిష్యుడు కానేరడు. (లూకా 14: 26,27,33)

ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.


“నిజమైన ప్రేమ ఎలా ఉండును”. ?


👉 ప్రేమ దీర్ఘకాలం సహించును
👉 ప్రేమ దయ చూపించును
👉 ప్రేమ మత్సరపడదు
👉 ప్రేమ డంబముగా ప్రవర్తింపదు
👉 ప్రేమ ఉప్పొంగదు
👉 ప్రేమ అమర్యాదగా నడవదు
👉 ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకొనదు
👉 ప్రేమ త్వరగా కోపపడదు
👉 ప్రేమ అపకారం చేయదు
👉 ప్రేమ సత్యమునందు సంతోషించును
👉 ప్రేమ అన్నిటికీ తాళుకొనును
👉 ప్రేమ అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును
👉 ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును
👉 ప్రేమ శాశ్వతకాలముండును
👉 ప్రేమ దోషములన్నిటినీ కప్పును
👉 ప్రేమ మరణమంత బలవంతమైనది
👉 ప్రేమ నిష్కపటమైనది
👉 ప్రేమ పొరుగువారికి కీడుచేయదు
👉 ప్రేమ క్షేమాభివృద్ది కలుగజేయును
👉 ప్రేమ యధార్థమైనది
👉 ప్రేమ పాపములను కప్పును
👉 ప్రేమ ప్రాణమును పెట్టును
👉 ప్రేమ భయమును వెళ్లగొట్టును.


"దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు
దేవుని ఎరుగడు.౹"
(1 యోహాను. 4:8)

వైఖరి, పద్ధతి, ధోరణి (Attitude)

వైఖరి, పద్ధతి, ధోరణి (Attitude)


క్రీస్తుయేసునందు పరిశుద్ధ పరచబడిన వారై, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ప్రతి మనిషికి వారి వారి జీవనశైలిని బట్టి వారికంటూ ఒక వైఖరి లేక పద్ధతి ఉంటుంది, వారి ఇష్టాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని కనపరుస్తుంటారు. కొందరి పద్ధతి తమ చుట్టూ ఉండేవారికి ఇష్టంగా ఉంటుంది కొందరి పద్ధతి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, ఈ లోకపు తీరును ప్రక్కన పెడితే ప్రభువునందున్న మనకందరికీ ఆత్మీయ విషయములో ఒకే రకమైన పద్ధతి ఉండాలి. అలా ఉండాలనే మన తండ్రియైన దేవుని కోరిక.
దేవుని గ్రంధమైన పరిశుద్ధ గ్రంధము ఆధారముగా మన వైఖరి ఏ విధముగా ఉండాలో ఐదు విషయములను బట్టి ఆలోచన చేద్దాము.

The attitude of Love :  ప్రేమ


ప్రేమ మనలను ధైర్యపరుస్తుంది, ప్రేమ మనలను నడిపిస్తుంది, ప్రేమ మనకు సమస్త విషయాలలో విజయాన్నిస్తుంది, ప్రేమ మనలను ప్రోత్సాహిస్తుంది. ప్రేమ మనలను రక్షిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతము వహిస్తుంది.

ప్రేమ వలన ఇన్ని లాభములు ఉన్నవి కనుక ప్రేమను మన జీవితములో ఒక వైఖరిగా మార్చుకోవాలి. ఎవ్వరు నన్ను ద్వేషించినా ప్రేమించుటయే నా పద్ధతి అనే భావన మన హృదయములో నాటుకుపోవాలి. ఎందుకనగా ప్రేమ లేనిదే ఎవరును దేవుని చూడలేరు.

» జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. (1 కొరింధి. 8:1).

» మనమొకనినొకడు ప్రేమింపవలెననునది మొదటినుండి మీరు వినిన వర్తమానమేగదా? (1 యోహాను. 3:11).

» ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది
ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు. (1 యోహాను. 4:7-8).

(Note: 1 కొరింధి 13వ అధ్యాయము చదువవలెను)  

The attitude of Respect : గౌరవం (లేక) ఆదరణ


నేడు సంఘాలలో, కుటుంబాలలో కాని ఎక్కడ చూసినా సహోదరుల మధ్య ఆదరణ లేదు. ఒకరి యెడల ఒకరికి గౌరవం లేదు.  ఒకరినొకరు గౌరవించుకోవడం వలన కలహములు తగ్గుతాయి, ప్రేమ ఉప్పొంగుతుంది. ఒకరినొకరం ఆదరించుకొనుట వలన ధైర్యము కలిగి ఉంటాము, ప్రభువునందు విశ్వాసములో ఆసక్తి కలవారమగుతాము. కాబట్టి ఇతరులను, సహోదరులను ఆదరించుట మన జీవనశైలిగా మార్చుకోవాలి.

» మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించునిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనికొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై యుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా, అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత ఇయ్యుడి, అందరియెడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. – (1 థెస్సలొనీ. 5:10-14).

» కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. (రోమా. 12:17).

» ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.  - (1 పేతురు 3:9)

The attitude of Service : పరిచర్య (లేక) సేవ


మన స్థాయిని బట్టి హెచ్చించుకొనకుండా, దేవుని నిమిత్తము సహోదరులకు పరిచర్య చేయుటలో వెనుకాడకూడదు. క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు తనను తాను ఎంతగానో తగ్గించుకుని శిష్యుల పాదములను సైతము కడిగాడు. మనము కూడా అంత గొప్ప తగ్గింపు కలిగి అన్ని విషయములలో మన సహోదరులకు సేవ చేయాలి. క్రీస్తు సువార్త ప్రకటింపబడు నిమిత్తము, దేవుని ప్రేమ వెల్లడిపరచు నిమిత్తము మనలను మనము  దాసునిగా ఎంచుకొనినా తప్పులేదు. కాని ప్రియులారా, నీవు ప్రేమ కలిగి ఉంటేనే నే సహోదరునికి దాసుడుగా ఉండగలవని గుర్తుంచుకోవాలి.

» మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. – (మత్తయి. 23:11-12).

» సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. (గలతీ. 5:13).

» ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. (యోహాను. 13:14-15).

» మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడైయుండవలెను. (మత్తయి. 20:26-27).

The attitude of Peace : సమాధానము


ఈనాడు క్రైస్తవులలో చాలామందికి సమాధానము లేదు. సమాధానము లేక క్రీస్తు సంఘాలు చెదిరిపోతున్నాయి, హృదయములలో గర్వానికి ప్రాధాన్యతనిస్తున్నారు గానీ సమాధానమును వెతుకుటలేదు. అయితే సమాధాన పడుటలో గల ఆనందము, సంతోషము గ్రహించక అలా చేయుచున్నారేమో కాని ప్రియులారా సహోదరుల మధ్య సమాధానము  నీ జీవితమును శాంతి పధములో నడిపిస్తుంది. నిన్ను నీ దేవునికి దగ్గర చేస్తుంది. సమాధాన పడుటలో ఎంత మాత్రమును సిగ్గుపడక, ముందుకు కొనసాగితే నీ జీవితములో కలహములు ఉండవు.

» సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. (రోమా. 14:19).

» శక్యమైతే సమస్త మనుష్యులతో మీ చేతనైనంతమట్టుకు సమాధానముగా ఉండుడి. (రోమా. 12:18).

» కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము. (కీర్తన. 34:14).

» కీడునుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకిదాని అనుసరింపవలెను. – (1 పేతురు. 3:11).

» సమాధానము మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా సమాధానము మీకనుగ్రహించుచున్నాను. – (యోహాను. 14:27).

» క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగునుగాక. ఆమేన్. (1 పేతురు. 5:14).

» మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. – (యూదా. 1:2).

The attitude of Cooperation : సహకారము


దేవుని వాక్యమును బోధించుటలోను, ప్రార్థించుటలోను, సంఘము అభివృద్ధి చెందుటలోను సహోదరులకు మంచి సహకారులుగా ఉండాలి. స్వప్రయోజనమును,  సొంత కార్యములను చూచుకొనుటయే కాదు ఇతరుల కార్యముల విషయములో కూడా మన తోటివారికి సహకారమును అందించాలి. తోటివారు రక్షింపబడుటకు అన్ని విషయములలో వారికి సహకరించి, దేవునిని సంతోషపెట్టేవారముగా ఉండాలి.

» తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైనదానియందు అతని సంతోషపరచవలెను. (రోమా. 15:2).

» వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటరొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము చేర్చుచుండెను. (అపో. కార్య. 2:46-47).

» మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వా సముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు. - (2 కొరింథీ. 1:24)

» ప్రతివాడును తన స్వకార్యములనుమాత్రమేగాక యితరుల కార్యములనుకూడా చూడవలెను. క్రీస్తుయేసుకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. (ఫిలిప్పి. 2:4-5).

ముగింపు:

కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరీ, క్రీస్తుకు కలిగిన ఈ ఐదు పద్ధతులను మన జీవితములో కూడా అనుసరిస్తేనే దేవుని దృష్టికి నిజమైన క్రైస్తవుడిగా అంగీకరింపబడతాము. ఈ లోకములో క్రైస్తవులమని చెప్పుకుంటున్న అనేకమంది వారి స్థాయిలను బట్టి గర్వమును, అహంకారమును కనపరుస్తుంటారు కాని నిజమైన క్రైస్తవ్యము పైన తెలుపబడిన ఐదు లక్షణములలోనే ఉంది.

★ ప్రేమ, ఆదరణ, పరిచర్య, సమాధానము, సహకారము ఈ ఐదింటిని నీ వైఖరిగా మార్చుకో. దేవుని రాజ్యమును స్వతంత్రించుకో. 
● అందరూ చేస్తే నేను చేస్తాను అనే భావనను నీనుండి తొలగించుకొని మొదట నీతోనే ప్రారంభించి విశ్వాసులకు మాదిరిగా జీవించు.  

ఆలోచన చేసి ప్రవర్తన సరిదిద్దుకోవాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ, మీకు మనవి చేయుచున్నాను. 


మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  
The churches of Christ greet you - Roma 16:16