![]() |
యేసుక్రీస్తు రక్తము (The Blood Of Jesus Christ) |
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు.🙌
జగత్తు పునాది వేయబడక మునుపు సర్వోన్నతుడగు దేవుడు మన నిమిత్తము సంకల్పించిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము🩸 యొక్క విలువ యెట్టిదో, ఆ రక్తము మన జీవితాలలో ఎలా పనిచేస్తుందో ఎరుగని వారు అనేకమంది ఉన్నారు.
చాలామంది యేసుక్రీస్తు కార్చిన రక్తమును గూర్చియూ సిలువలో ఆయన చేసిన త్యాగమును గూర్చియూ సరియైన అవగాహన లేక వారికి తెలిసీ తెలియని జ్ఞానముతో మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ తమకు తామే ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారు.
వాస్తవానికి నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేకమందికి ఈ విషయముపై అవగాహన లేకపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ప్రభువైన యేసు రెండువేల సంవత్సరాల క్రితం తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డాడు.(యోహాను. 6:46; 6:57; 7:19; 8:42; 13:3; 16:27-28 cf). కానీ ఈ సృష్టిని సృజించక మునుపు జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు యేసుక్రీస్తు రక్తమును🩸మన కొరకు సంకల్పించుకున్నాడు. (1 పేతురు. 1:19; అపో.కార్య. 2:23 cf).
1). యేసుక్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా తీర్చుతుంది. - (రోమా. 5:9).
2). దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది. - (రోమా. 5:9).
3). ప్రతీ పాపము నుండి మనలను పవిత్రులునుగా చేస్తుంది. - (1 యోహాను. 1:7).
4). నిర్జీవ క్రియలను విడిచి, జీవముగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది - (హెబ్రీ. 9:14).
5). పరిశుద్ధ స్థలములోనికి(క్రీస్తు సంఘము లోనికి) ప్రవేశింప చేస్తుంది - (హెబ్రీ. 10:20).
6). ఒక రాజ్యముగాను, యాజకులు గాను చేస్తుంది - (ప్రకటన. 1:6).
7). సంఘమును కట్టింది/రాజ్యం సంపాదించింది. - (అపో.కార్య. 20:28).
8). ప్రజలందరిలో దేవునికొరకు మనలను కొన్నాది - (ప్రకటన. 5:9).
9). మనలను విమోచిస్తుంది అనగా మన అపరాధములకు క్షమాపణ. - (ఎఫెసీ. 1:7; హెబ్రీ. 9:22).
10). నూతన/క్రొత్త నిబంధన యిచ్చింది. - (మత్తయి 26:28; మార్కు. 14:24).
11). ఆయన రక్తము వలన మన దెబ్బలకు స్వస్థత. - (1 పేతురు. 2:24).
12). మృతులలో నుండి లేపుతుంది. - (హెబ్రీ. 13:20).
13). దేవునికి సమీపస్థులుగా చేస్తోంది. - (ఎఫెసీ. 2:13).
14). దేవునితో మనకు సంధి చేస్తుంది. - (కొలస్స. 1:20).
15). పాపము నుండి మనలను విడిపిస్తుంది. - (ప్రకటన. 1:6).
16). మనలను పరిశుద్ధ పరుస్తుంది. - (హెబ్రీ. 13:12).
17). అపవాది మీద విజయము. - (ప్రకటన. 12:12).
ఏలయనగా 🐓కోడెలయొక్కయు, 🐂ఎడ్లయొక్కయు, 🐐 మేకలయొక్కయు రక్తము మనలను పాపముల నుండి విమోచింప లేవు గనుక యేసుక్రీస్తు తానే సిలువలో ✟🩸 తన స్వరక్తమిచ్చి మన పాపముల నుండి మనకు విమోచన కలుగజేసేను. (హెబ్రీ. 9:12; 10:4).📖
మీ ఆత్మీయులు...👪
2 comments
commentsసహోదరులకు యేసుక్రీస్తుప్రభువు పేరట వందనములు.🙏🙏
ReplyGood explaination 🤝🙏
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com