Showing posts with label సహోదర ప్రేమ. Show all posts
Showing posts with label సహోదర ప్రేమ. Show all posts

"ఒకనినొకడు" (One Another)

 

"ఒకనినొకడు" (One Another)


 "మీరు ఒకనినొకడు ప్రేమింపవలెను - (యోహాను. 15:17; 1 యోహాను. 3:23; 4:7).

 "సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.౹" - (రోమా. 12:10).

 "ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొన వద్దు.౹" - (రోమా. 12:16).

 "ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.౹" - (రోమా. 13:8).

↪ "...మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము...". (రోమా. 14:13).

 "కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి.౹" - (రోమా. 15:7).

↪ "సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.౹" - (గలతి. 5:13).

↪  "ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.౹" - (గలతి. 6:2).

↪ "కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,౹" - (ఎఫెసి. 4:1).

 "ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి." - (ఎఫెసి. 4:32).

".... క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు..." - (రోమా. 15:5).

↪ "క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి." - (ఎఫెసి. 5:21).

↪ "ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; - (కొలస్స. 3:9).

 "ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.౹" - (కొలస్స. 3:13).

 "సహోదరప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్ప బడితిరి.౹" - (1 థేస్స. 4:9).

 ".... ఒకనినొకడు ఆదరించుకొనుడి." - (1 థేస్స. 4:18).

↪ "కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి." - (1 థేస్స. 5:11).

 ".... ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.౹" - (1 థేస్స. 5:13).

 "ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి;౹" - (1 థేస్స. 5:15). 

 ".... ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి...." - (హెబ్రే. 3:13). 

↪ "కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము." - (హెబ్రే. 10:24). 

 "సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. - (యాకోబు. 4:11).

 "సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.౹" - (యాకోబు. 5:9).

 "మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.౹" (యాకోబు. 5:16). 

↪ "ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.౹ సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.౹" - (1 పేతురు. 4:8-9). 

↪ "...ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి". - (1 పేతురు. 5:13).

↪ "పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి." - (రోమా. 16:16).
- మీ ఆత్మీయులు
1). "సహోదర  ప్రేమ" - Click Here
2). "దేవుని ప్రేమ" - Click Here 

సహోదర ప్రేమ (Brotherly Love)

"సహోదర  ప్రేమ"
"సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి".  (హేబ్రీ. 13:1)

"Let brotherly love continue."  (Heb 13:1)

 

మన పరమతండ్రి ప్రేమ అనే స్వరూపం కలిగినవాడు (1 యోహాను. 4:11cf.) ప్రేమ యొక్క రూపం దేవునిది. ప్రేమ దేవుని మూలముగా కలిగిది కారణం దేవుడు ప్రేమ స్వరూపియైయున్నాడు. ప్రేమ - ద్వేషం అనేవి రెండు మానవుని వ్యక్తిత్వం లో దేవుడు గుప్తం చేసిపెట్టినట్టుగా  ఉన్నాయి. 

ద్వేషం లేకుండా ప్రేమకు విలువ ఉండదు

 క్రీస్తు స్వరూప స్వభావం ఏమనగా, నీతిని ప్రేమించి - దుర్నీతి ద్వేషించేది (హెబ్రే. 1:9cf)  ప్రేమ, ద్వేషం ఈ రెండు మన ప్రభువైన యేసుక్రీస్తు లో ఉన్నాయి. అలాగునే ప్రతీ మనుష్యుడు లో ప్రేమ - ద్వేషాలున్నాయి కానీ ఉపయోగించే విధానం లో ఉపయోగించక స్వార్ధముగా ఉపయోగించే పరిస్థితి ఎక్కువగా చూడగలం.  

 "ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు." (మత్తయి. 6:24) 

 

➾  నీవు సిరిని ప్రేమిస్తే - దేవుని ద్వేషిస్తావు
  నీవు దేవుని ప్రేమిస్తే - సిరిని ద్వేషిస్తావు

 

మన ప్రభువైన యేసుక్రీస్తు ఐతే నీతిని ప్రేమించి, దుర్నీతి ద్వేషించారు. ఏ మనుషుడు కూడా దుర్నీతి ని ద్వేషించకుండా నీతిని ప్రేమించడం అసంభవం. నీలో ప్రేమ, ద్వేషం ఉంటాది కేవలం ప్రేమ ఉండి ద్వేషం లేకపోతే అది మానవుని పరిపూర్ణత కాదు. మనుషులు సంపూర్ణత కాలేరు. 


సహోదరులును ద్వేషించేవాడు ?

 

సహోదరులును ద్వేషించేవాడు నరహంతకుడు  - (1 యోహాను. 3:15)

సహోదరులును ద్వేషించేవాడు చీకటిలో ఉన్నవాడు - (1 యోహాను. 2:9,11)

నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినవాడు  అబద్ధికుడు - ( 1 యోహాను. 4:20a).

సహోదరులును ద్వేషించేవాడు/ప్రేమింపని వాడు దేవుని సంబంధి కాదు -( 1 యోహాను. 3:10).

సహోదరులను ద్వేషించేవాడు దేవుని ప్రేమింపలేడు - (1 యోహాను. 4:2b)

 

సహోదరులును ప్రేమించేవాడు ?

 

సహోదరులును ప్రేమించేవాడు వెలుగులోనున్నవాడు - (1 యోహాను. 2:10)

సహోదరులును ప్రేమించేవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటాడు. - (1 యోహాను. 3:14)

సహోదరులును ప్రేమించేవాడిలో దేవుడు నిలిచి ఉండును - (1 యోహాను. 4:12).

నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినవాడు  అబద్ధికుడు - ( 1 యోహాను. 4:20a).

దేవుని ప్రేమించేవాడు సహోదరులను ప్రేమించాలి ఇది ఆయన ఆజ్ఞ - (1 యోహాను. 4:21).

సహోదరులను ప్రేమించేవాడు దేవుని మూలముగా పుట్టినవాడై ఉండును - (1 యోహాను. 4:7; 5:1-2)

సహోదరులను ప్రేమించేవాడు వారి కొరకు ప్రాణములను పెట్ట బద్ధులై ఉంటారు. - (1 యోహాను. 3:16). 

        అదృశ్యడైన దేవుడు నీ జీవితం అనుభవములో ప్రత్యక్షత కావాలంటే సహోదరులను ప్రేమించుట ద్వారానే సాధ్యం. అప్పుడు మనం దేవునితో సహవాస బాంధవ్యం కలిగే అనుభవం, దేవుని మూలముగా పుట్టిన అనుభవం, దేవుని ఇంటివారై అనుభవం, వెలుగులో జీవించే అనుభవం కలుగుతుంది. 

 

ప్రేమకు భాష ఉందా? "అవును" 

 ప్రేమ మాట్లాడే భాష సత్ క్రియలు అంటే "సత్ క్రియలు ద్వారా మాట్లాడుతూ ఉంటుందని". ఇది ప్రతీ సహోదరుడు నేర్చుకోవలసిన అవసరం ఉంది. 

            "సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు.౹ మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యకసమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?౹" (యాకోబు 2:15-16).

             సహోదరుడు/సహోదరి ఆ నాటికి భోజనము & దిగంబరులై ఉంటే సమాధానముగా వెళ్లు, చలి కాచుకో, తృప్తి పొందు అనేవి మోసపు మాటలు మరియు క్రియలేని మాటలు.  "ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. (1 యోహాను. 3:17-18). 

 

ప్రేమ ప్రవాహం ఎలా ఉండాలంటే? 

             యెరూషలేము ప్రాంతంలో బీదలైన పరిశుద్ధులున్నారు. మాసిదోనియ/అకయలో నిరుపేదలైన పరిశుద్ధులున్నారు. ఈ ఇరుగురు కి ఎటువంటి సంబంధాలు లేవు కానీ యెరూషలేము లోనున్న పరిశుద్ధులు అవసరతలోనున్నారనే సమాచారం తెలుసుకొని వారి అవసరతలను తీర్చడానికి ఉద్దేశించినవారై  తమ ప్రేమను మాటతో, నాలుకతో కాక క్రియతోను సత్యముతోను వారి అక్కరలు తీర్చి ప్రేమను కనపరిచారు. 

 "ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.౹ ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియవారును అకయవారును కొంత సొమ్ము చందావేయ నిష్టపడిరి.౹ అవును వారిష్ట పడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు. (రోమా. 15:25-27)

 సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము.౹ ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్త రించెను.౹ ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. (2 కొరింథి. 8:1-3).

"విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.౹ ఇట్టి ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.( 2 కొరింథి. 9:10-11)

 "మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక."

దేవుని ప్రేమ
CLICK HERE

The churches of Christ greet you - Roma 16:16