Showing posts with label గుడ్ ఫ్రైడే. Show all posts
Showing posts with label గుడ్ ఫ్రైడే. Show all posts

"ఈస్టర్" (Easter)

"ఈస్టర్"

నా ప్రియులారా, మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
                  
"ఈస్టర్ అనగా నేమి"..?

» Easter (ఈస్టర్) ఈ ఇంగ్లీష్ పదము అనేది ఇష్టార్(ishtar) అనే గ్రీక్ పదము నుండి కలిగింది.
» క్రీస్తు పూర్వమునకే Ishtar అని బబులోను "దేశపు దేవలోకపు రాణిని" (Queen of Heaven) పూజలు చేసేవారు. - (యిర్మీయా 7:18)
» ishtar ని హీబ్రూ లో Astaroth(అష్తారోతు దేవత) అని అర్ధము. - (1 రాజులు 11:5; 1 సమూయేలు 31:10).
» ఆ దేవత చిహ్నము Eggs, Bunny.

"ఈస్టర్" అనే పదమునకు నేటి క్రైస్తవములో అనేక అర్ధాలు ఉండవచ్చు కానీ వాటి అన్నిటిని పరిశుద్ధ గ్రంధము కొట్టివేస్తుంది. అదేమనగా,

"ఈస్టర్" అనే పదము బైబిల్ అంతటిలో "అపో.కార్య 12:3-4" వచనములోనే మాత్రమే చూడగలము.
అక్కడ పస్కా పండుగ(Passover) అనే పదమునకు ఈస్టర్(Easter) అని ఇంగ్లీష్ లో చూడగలము.
ఈస్టర్ అనే పదము క్రీ.శ. 1604 -1611 మధ్య కాలములో మొదటగా ఇంగ్లీష్ బైబిల్ (KJV) రాయడము జరిగింది.
మరల ఆ పదమును క్రీ.శ. 1979-1982 మధ్య కాలములో "అపో.కార్య 12:3-4" వచనమును "Easter" అనే పదమును బదులుగా "Passover" అని NKJV లో మార్చడము జరిగింది.

హీబ్రూ లో hap·pā·sa ( הַפָּֽסַח) - హప్పసః
గ్రీక్ లో "Pascha" (πάσχα) - పస్కా
ఇంగ్లీష్ లో "Passover".
తెలుగు లో "పస్కా పండుగ" లేదా "పులియని రొట్టెలు పండుగ".

 » పస్కా (passover) అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. (లుకా 22:1).

 గమనిక: పస్కా అంటే Easter అని అర్ధము ఇస్తే పాత నిబంధనలో పస్కా అనే ఉన్నచోట Easter అనే ఉండాలి కానీ అలా పరిశుద్ధ గ్రంథములో లేదు. (ద్వితి 16:5; నిర్గమ 12:21).

"క్రైస్తవుడు, ఈస్టర్ పండుగను జ్ఞాపకము చేసుకోవచ్చా..?".

 సమాధానము: చేసుకోకూడదు

కాంస్టాంటినే (రోమా రాజు) యొక్క పరిపాలనలో నికేయా సంఘము వారు క్రీ.శ. 325 CE ఈస్టర్ అనే అన్య పండుగకు యేసుక్రీస్తు వారి పునరుత్థానమునకు జత చేసారు.

» పరిశుద్ధ గ్రంధము  అంతటిలో Easter అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము (Resurrection) అని ఒక్క వచనము కూడా లేదు.
» పరిశుద్ధ గ్రంథము అంతటిలో నేటి క్రైస్తవుల వలె సవoత్సరమునకు ఒక్కసారి ఈస్టర్ అనే పండుగను ఆచరించినట్టుగా ఒక్క వచనము కూడా లేదు.
» నేటి ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఈస్టర్ పండుగ అని జరుపుకొనుటకు సిద్ధపడకూడదు.
» మనలో అనేకమంది వాక్యమును సరిగ్గా పరిశీలన చేయక పోవటముతో మనుషుల యొక్క ఆలోచనలకు అవకాశము ఇస్తున్నారు.
» ఆదిమ సంఘపు క్రైస్తవులు ఆలాగున చేయలేదు కావునే మనలో అనేకమంది ఈస్టర్ అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము అని మరియు క్రైస్తవులు పండుగ అనే అనుకొనుచున్నారు కాని గ్రంథము నుండి ఏటువంటి ఆధారము చూపలేని స్థితిలో ఉన్నారు.

● ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. (సామెతలు 30:6) 

● మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు. (ద్వితియోపదేశకాండము  4:22) 

● ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; (ప్రకటన గ్రంథము 22:18) 

మునుపు నేను కూడా ఈస్టర్ పండుగను గుడ్డిగా చేశాను కానీ ఎప్పుడు అయితే వాక్యమును పరిశీలన చేసానో అప్పటి నుండి సత్యమునకు లోబడి,  మనస్సు మార్చుకొని ఆ వాస్తవాన్ని మీకు ప్రేమతో యేసుక్రీస్తు నందు తెలియపరుస్తున్నా.

హెచ్చరిక:

★ కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. (కొలస్సయులకు 2:16)

★ మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. (గలతీయులకు 4:10)

గమనిక :- పైన వ్రాయబడిన ప్రతి లేఖనమును పరిశుద్ధ గ్రంధమును తెరిచి క్షుణ్ణముగా పరిశిలన చేసి, వ్రాయబడినవి గ్రంధానుసారముగా ఉన్నవో లేవో గమనించి పరిశోధన చేయుము.

"గుడ్ ఫ్రైడే" (Good Friday)

"గుడ్ ఫ్రైడే"

నా ప్రియులారా, మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

"Good Friday" అనగా "మంచి శుక్రవారము".
ఇది Good Friday గా పిలువబడక మునుపు "హోలీ ఫ్రైడే", "బ్లాక్ ఫ్రైడే" లేదా "గ్రేట్ ఫ్రైడే" గా పిలువబడేది.
"యేసు మరణము అనంతరము" అనగా ఇంచుమించు 400 సవoత్సరములు తరువాత 'GOD FRIDAY" (గాడ్ ఫ్రైడే) గా రోమన్ కాథలిక్ బోధలు నుండి ఈ పండుగ ప్రారంభము అయింది.
రోమన్ కాథలిక్ స్థాపన క్రీ.శ. 394.
క్రీ.శ. 692 లో ఈ GOD FRIDAY ని కాస్తా GOOD FRIDAY గా మార్చి జెరూషలేములో ఈ పండుగను ఆచరించారు అని చరిత్ర చెపుతుంది.

"గుడ్ ఫ్రైడే"(Good Friday) అనే పదము పరిశుద్ధ గ్రంధము అంతటిలో ఎక్కడ కనిపించదు 

» రోమా చక్రవర్తియైన కాంస్టాంటినే (272 -337 A.D.) కాలములోనే God Friday (గాడ్ ఫ్రైడే)గా వచ్చింది అని చరిత్ర చెపుతుంది.
» "ఇరీనయూస్", "తెత్తులియాన్" ఇరుగురు రోమా వ్యక్తులు కాంస్టాంటినే  ప్రారంభము చేయక మునుపే వీరు God Friday (గాడ్ ఫ్రైడే) ని చేసి ఉండవచ్చు అని మరి కొందరు యొక్క భావన.
» మనము దీనిని ఖచ్చితముగా నిర్ణయిoచలేము. కారణమేమంటే, God Friday "or" Good Friday గూర్చి "మొదటి శతాబ్దపు అపొస్తలులు పరిశుద్ధ గ్రంథములో లిఖితము చేయలేదు".
» క్రొత్త నిబంధన క్రీ.శ. 42-98 మధ్య కాలములో రాయడము జరిగింది. ఇక్కడే మనకి బాగుగా అర్ధము కావాలి. ఈ గుడ్ ఫ్రైడే (Good Friday) అనేది పరిశుద్ధ గ్రంథములో లేనిది మనుషుల ఆలోచన మేర కలిగింది అని గ్రహించాల్సిన అవసరత ఎంతైనా ఉంది.


ఈ కాంస్టాంటినే రోమా చక్రవర్తి Ishtar (ఇస్తార్) అను  పదమును కాస్త Easter (ఈస్టర్) గా మార్చి, Easter అనే పదమునకు యేసు పునరుత్థానము (Jesus Resurrection) అని కలిపి క్రీ.శ. 325 లో ప్రవేశ పెట్టాడు.
ఈ "ఈస్టర్" ని ఆధారము చేసుకొని 'గుడ్ ఫ్రైడే" ని నిర్ణయించారు.

ఈస్టర్, గుడ్ ఫ్రైడే కూడా మనుషులు ఆలోచన వలెనే కలిగింది.


★ మీకు ఈస్టర్ గూర్చి మీకు పూర్తి వివరణ కావాలి అని అనుకుంటే ఈ  "EASTER' అనే పదమును 'క్లిక్' చేయగలరు.


"ఈస్టర్ పండుగకు ముందు వచ్చే శుక్రవారమును మాత్రమే మంచి శుక్రవారముగా(Good Friday)  భావిస్తారు".

క్రైస్తవుడు, "దినములను, కాలములను, సవoత్సరములను, పండుగలను..." ఆచరించకూడదు - (గలతి 4:10; కొలొస్స 2:16)

"గుడ్ ఫ్రైడే" మరియు "ఈస్టర్" తేదీ సవoత్సరమునకు ఒకొక్కలా వస్తున్నాయి.

(Gregorian & Saka క్యాలెండర్ - GOOD FRIDAY).

2010 లో - ఏప్రిల్ 02
2011 లో - ఏప్రిల్ 22;
2012 లో - ఏప్రిల్ 06;
2013 లో - మార్చి 29;
2014 లో - ఏప్రిల్ 18;
2015 లో - ఏప్రిల్ 03;
2016 లో - మార్చి 25;
2017 లో - ఏప్రిల్ 14;
2018 లో - మార్చి 30;
2019 లో - ఏప్రిల్ 19;
2020 లో - ఏప్రిల్ 10.

(Gregorian & saka క్యాలెండర్- EASTER).

2010 లో - ఏప్రిల్ 04;
2011 లో - ఏప్రిల్ 24;
2012 లో - ఏప్రిల్ 08;
2013 లో - మార్చి 31;
2014 లో - ఏప్రిల్ 20;
2015 లో - ఏప్రిల్ 05;
2016 లో - మార్చి 27;
2017 లో - ఏప్రిల్ 16;
2018 లో - ఏప్రిల్ 01;
2019 లో - ఏప్రిల్ 21;
2020 లో - ఏప్రిల్ 11;


 (యూదులు క్యాలెండరు ప్రకారముగా).

నెలలో మొదటి నెల "నీసాన్" - (నిర్గమ 12:2; ఎస్తేర్ 3:7).
మొదటి నెల పదునాలుగవ దినము పస్కా పండుగ చేసేవారు - (లేవి.కాండము 23:5).
మొదటి నెల పదునయిదవ దినము నుండి ఏడు దినములు పులియని రొట్టెలు పండుగను చేసేవారు - (లేవి.కాండము 23:6-8).


 యేసుక్రీస్తు యూదులకు పస్కా దినము నాడే  అప్పగింపబడినారు. - (మత్తయి 26:19-50; మార్క 14:12-46; లుకా 22:7-54).

 కొందరు "నీసాన్" నెల అంటే "మార్చ్ - ఏప్రిల్ " నెల అని అంటారు.  భారతీయులు వాడుతున్నది "శాఖ ఏరా క్యాలెండరు"
కారణము ఉగాది ఆ నెలలోనే వస్తాది కాబట్టి అదే క్రొత్త సవoత్సరము అని, మరికొందరు మొదటి నెల అంటే జనవరి అని అంటారు. ఎలా ఏ విధముగా ఆలోచన చేసిన కానీ చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

ప్రపంచమంతట ఇంచుమించు *నలబై క్యాలెండర్లు* వాడుకలో ఉన్నాయి.

ఇక అంశములోనికి వస్తే... "పస్కా పండుగ మొదటి నెల(నీసాన్) పదునాలుగవ దినము అయితే మార్చి 14 తేదీనైనా  అయి ఉండాలి లేదా జనవరి 14 తేదీనైనా అయి ఉండాలి. కాని పైన రాసిన తేదీలు విషయములో ఒక్కొక సవoత్సరము ఒక్కోలా వచ్చేది కాదు.

»»» నా పుట్టిన దినము "మే 21 - 1991" ఆ దినము "మంగళవారము" అదే తేదీ ఈ 2017 సవoత్సరము చుస్తే "ఆదివారము".

ఇక్కడ వారము మారింది కానీ నా తల్లి గర్భము నుండి నేను బయటకు వచ్చిన తేదీ మాత్రము మారలేదు.

"Good Friday", "Easter" అనే మనుషులు ద్వారా ప్రవేశపెట్టబడిన పండుగలు కాబట్టి వారము విషయములో మార్పు లేదు కానీ తేదీలు బట్టి వారికి అనుగుణముగా మారుస్తూ ఆయా  శుక్రవారమునకు Good Friday(గుడ్ ఫ్రైడే) అని , ఆదివారమునకు Easter(ఈస్టర్) అని అంటగడుతున్నారు.

గమనిక :   

 గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు సమాధి చేయబడిన దినము, ఈస్టర్ అంటే క్రీస్తు సమాధి నుండి లేచిన దినము అని అపోహ కలిగి పండుగగా అనుసరిస్తున్న వారి యొక్క తేదీలు, ఆలోచనలు, బోధలు తప్పు అని ఖండిస్తూ చెప్పుటకు మాత్రమే ఈ పోస్ట్ రాయడము జరిగింది.

హెచ్చరిక :

 నా సహోదరులారా, ఇకనైనా ఆలస్యము చేయక ఈ పండుగల పేర్లతో బోధలు చేస్తూ, సువార్త చేస్తూ, ఈ పండుగల విషయములో "మనుష్యులు కల్పించిన ప్రతి పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ తండ్రిని వ్యర్ధముగా ఆరాధన చేస్తున్న (మత్తయి 15:9; 1తిమోతి 4:2; 2తిమోతి 4:3-4; 2 పేతురు 2:1) వారినుండి  మీరు బహు జాగ్రత్త కలిగి ఉండాలని యేసుక్రీస్తు నందు మిమ్మలి కోరుతున్నాను.... 


గమనిక :- పైన వ్రాయబడిన ప్రతి లేఖనమును పరిశుద్ధ గ్రంధమును తెరిచి క్షుణ్ణముగా పరిశిలన చేసి, వ్రాయబడినవి గ్రంధానుసారముగా ఉన్నవో లేవో గ్రమనించి పరిశోధన చేయుము. 

మీ ఆత్మీయ సహోదరుడు
మనోహర్_నవీన
వందనములు.
The churches of Christ greet you - Roma 16:16