మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻
1️⃣. పరిచయం
క్రిస్మస్/ క్రిస్మస్ పేరుతో ఆచారాలు జరిగించు భక్తులు ద్వారా మాకు తరుచుగా వినబడే ఒక ప్రశ్న లేదా వాదన ఏమనగా…
“బైబిల్‌లో పళ్లు తోముకోమని, స్నానం చేయమని, సెల్ ఫోన్ వాడమని,... Etc. లేదు కదా — అయినా చేస్తున్నాం. అలాగే క్రిస్మస్ కూడా బైబిల్‌లో లేకపోయినా మన ఇష్టమే కదా? ఇందులో తప్పేమి ఉంది? ఏదైనా దేవునికే మహిమకరంగా చేస్తున్నాము"
ఇలాంటి ప్రశ్నలు వినపడగానే అవును కదా, నిజమే కదా అన్నమా అపవాదికి/వాడి బోధకు నిన్ను నీవు అప్పగించుకొన్నట్టే అవుతుంది. ఈ మాటలు వినడానికి చాలా తర్కబద్ధంగా అనిపిస్తాయి. కానీ వాస్తవానికి ఇవి రెండు భిన్నమైన విషయాలను కలిపి చెప్పే మాటలు.
👉 ఒకటి శారీరక అవసరాలు
👉 మరొకటి దేవునికి(YHWH) ఆరాధన
బైబిల్ ఈ రెండింటిని ఎప్పుడూ కలిపి చెప్పదు. మనము కూడా కలిపి అర్థం చేసుకోవద్దు.
2️⃣. శారీరక అవసరాలు — ఆరాధన కాదు
బ్రష్ చేయడం, స్నానం చేయడం, భోజనం చేయడం, నిద్రపోవడం, సెల్ ఫోన్ వాడటం… Etc. — ఇవి మన శరీరానికి అవసరమైన సాధారణ జీవన క్రియలు. వీటిని ఎక్కడా ఆరాధనగా బైబిల్ చూపించలేదు.
📖 మార్కు 7:15: "వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని, లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను."
📖 1కోరింది 6:19-20: "మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹ విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి."
అందువల్ల శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం జ్ఞానానికి సంబంధించినది, బుద్ధి పరమైనది, ఆరోగ్యానికి సంబంధించినది కానీ ఆరాధన కాదు.
👉 మనము బ్రష్ చేసినప్పుడు దేవునికి ప్రార్థించము
👉 స్నానం చేసినప్పుడు దానిని పవిత్ర క్రియగా ప్రకటించము
కాబట్టి శారీరక అవసరాలకు ప్రత్యేక ఆజ్ఞ అవసరం లేదు.
3️⃣. ఆరాధన అంటే ఏమిటి?
— దేవుని చిత్త ప్రకారం
— ఒక క్రమమైన పద్దతిలో
— దేవుడు కోరిన మేర
— దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో
— ఆయన సన్నిధిలో కార్యక్రమాలు జరిగించుటయే ఆరాధించడం.
📖 ఫిలిప్పీ. 3:3: "ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు,..."
📖 యోహాను 4:24: "దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹"
🔴 ఉదాహరణలు
▪️ పాత నిబంధన ప్రకారం : 2దినవృత్తాంతములు 29:20-30 చదువు
▪️ క్రొత్త నిబంధన ప్రకారం : యోహాను. 4:21-24 చదువు
🔥 ఆరాధన విషయంలో జాగ్రత్త :
మన ఇష్టం పనిచేయదు ❌
మన ఆచారాలు పనిచేయదు ❌
మన ఊహలు/నిర్ణయాలు పనిచేయదు ❌
బైబిల్లో లేనిది... ఉన్నదానికి కలపడం ❌
దేవుడు ఆజ్ఞాపించనది చేయడం ❌
ఆయన మాటలతో ఏమైనా చేర్చడం ❌
ఏదైనను తీసివేయడం ❌
దేవుని ఇష్టమే మనం చెయ్యాలి ✅
ఆదిమ అపోస్తలుల ఆచారాలు చెయ్యాలి ✅
బైబిల్లో లేనిది… ఉన్నదానికి కలపకూడదు ✅
ఏదైనను తీసివేయకూడదు ✅
దేవుని వాక్యమే ప్రమాణం అవ్వాలి ✅
📖 ద్వితీయోపదేశకాండము 4:2; 12:32: "మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు.౹" "నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు."
📖 సామెతలు 30:6: "ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు."
📖 ప్రకటన 22:18-19: "ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా– ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;౹ ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును."
🔴 దేవుడు ఆజ్ఞాపించనిదాన్ని ఆరాధనగా పరిగణించి ఏర్పాటు చేసుకొని చేయడం వ్యర్థమైన ఆరాధన అగును కదా!! (మత్తయి. 15:6)
4️⃣. క్రిస్మస్ — శారీరక అవసరమా? ఆరాధనా?
ఇప్పుడు క్రిస్మస్ విషయానికి వస్తే... మీరు చేయు క్రిస్మస్ ను దీనిని మీరెవ్వరు “శారీరక అవసరం” అని చెప్పరు కానీ మా క్రిస్మస్ ఆరాధననే అంటారు. కారణం...
— క్రీస్తు పుట్టుక అని
— క్రిస్మస్ ఆరాధన అని
— క్రిస్మస్ పండుగగా
— క్రిస్మస్ చెట్టు, స్టార్, శాంత తాతతో, నృత్యాలతో… Etc.
మీరు చేసే ఆరాధన/ మీకు ఆరాధనగా అనబడేది ఇదేగా…👆🏿 ఇంతకు ఇది ఆజ్ఞ? దేవుడు ఇలాగే ఆజ్ఞాపించారా? ఎవరికి ఆజ్ఞాపించారు? ఎక్కడ ఆజ్ఞాపించారు? బైబిల్లో ఎక్కడ ఉంది? ఇలాంటి ప్రశ్నలకు మీ యొద్ద నుండి ఎన్నటికి సమాధానం రాదని తెలుసు… ఎందుకంటే బైబిల్ ఆజ్ఞాపించని వాటిని ఊహించుకొని చేస్తున్నారనేది సత్యము.
📖 మత్తయి 15:9 "మనుష్యుల ఆజ్ఞలను బోధలుగా బోధించుచు, నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.”
🔖 లూకా 2వ అధ్యాయం - కాపరులు ద్వారా యేసు పుట్టుక యొక్క సాక్ష్యం తెలియబడుటకే కానీ ఏటేటా చెయ్యాలనే అజ్ఞా జారీ చేయబడలేదు/వారు జారీ చెయ్యలేదు.
🔖 మత్తయి 2వ అధ్యాయం - ఒక చారిత్రక సంఘటనే కానీ ఏటేటా చెయ్యాలనే అజ్ఞా జారీ చేయబడలేదు/వారు జారీ చెయ్యలేదు.
📖 కొలస్సయులు 2:16: "కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.౹"
📖 గలతీయులు 4:10: "మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.౹"
✒ పాత నిబంధన కాలములో యెహోవా దేవుడు ఏదైనా ఒక పండుగ గూర్చి ఆదేశించినప్పుడు ఎవరు చెయ్యాలి? ఎప్పుడూ చెయ్యాలి? ఎన్ని రోజులు చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? అనే స్పష్టత ఇచ్చినప్పుడు… నేటి క్రిస్మస్ భక్తులకు క్రిస్మస్ విషయములో ఇట్టి స్పష్టత చూడలేం? అంటే క్రిస్మస్ అపవాది బోధ అని గుర్తించండి. మరింత సమాచారం కొరకు "పండుగలుక్లిక్ చేయు" అనే అంశము చదవండి.
👉 దేవుడు చెప్పనిది
👉 మనుషులు ఆరాధనగా మార్చారు అని గుర్తించండి.
క్రిస్మస్ ఒక అన్య ఆచారమని, ఒక అబద్దమని, క్రీస్తు పుట్టుకకు ఎటువంటి సంబంధం లేదని, బైబిల్ లో లేదని తెలిసి కూడా ఈ అబద్ధమును జరిగించడానికి, సమర్దించడానికి కేవలం "పళ్లు తోముకోమని, స్నానం చేయమని.. అంటూ అడిగే ప్రశ్న కేవలం అపవాది చర్య అని గుర్తించు. ఒకవేళ కాదంటే వీటికి నీవు చేయు క్రిస్మస్ కి ఏమైన సంబంధం ఉందా?
5️⃣. క్రిస్మస్ ఆరాధన “నా ఇష్టం”అనే వాదన
📖 సామెతలు 14:12 “మనుష్యునికి సరైనదిగా తోచు మార్గము ఉంది; కానీ దాని అంతము మరణమే.”
📖 యిర్మీయా 10:23 “మనిషి తన మార్గమును తానే స్థిరపరచుకొనుట అతనిలో లేదు.”
📖 కొలస్సయులు 2:23: "అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు."
📖 (ప్రకటన 22:11-12): "అన్యాయముచేయు వాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము. ౹ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.౹"
📖 (1తిమోతి 6:20): "ఓ తిమోతీ, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అప విత్రమైన వట్టిమాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్ప బడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.౹"
📖 (1తిమోతి 4:16): "నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు."
6️⃣. ముగింపు
🟢 బ్రష్ చేయడం, స్నానం చేయడం –
➡️ శారీరక అవసరాలు
➡️ ఆరాధనగా చేయడం లేదు
➡️ బైబిల్ ఆజ్ఞ అవసరం లేదు
🔴 క్రిస్మస్ ఐతే –
➡️ ఆరాధనగా చేస్తున్నారు
➡️ బైబిల్ ఆజ్ఞ లేదు
➡️ యేసు బోధలో లేదు
➡️ అపోస్తలుల బోధలో లేదు
➡️ కాబట్టి ఇది దేవుని ఆరాధన కాదు
📖 యోహాను 12:48: "నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.౹"
మీ ఆత్మీయులు 👪
1. మత్తయి, లూకా 2వ అధ్యాయం?క్లిక్ చేయు
2. క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చెయ్యరు?క్లిక్ చేయు
3. క్రిస్మస్ ఆరాధన?క్లిక్ చేయు


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com