క్రిస్మస్ ఆరాధన?



పరిచయం: 

↣ ఆరాధన అనేది మానవ హక్కు కాదు

↣ దేవుడు నిర్ణయించిన పవిత్ర క్రమం.

↣ ఎవరు, ఎప్పుడు, ఎలా ఆరాధించాలో అనేది తానే నిర్ణయిస్తాడు. మనుషులు కాదు.

📖 మానవ సంప్రదాయాల ఆధారంగా పుట్టిన ఆరాధనే — క్రిస్మస్ ఆరాధన

 "మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు (మత్తయి 15:9)

📖  దేవుడు కోరినది యథార్థమైన  ఆరాధన —  సత్య ఆరాధన - (యోహాను. 4:23-24)

↣  దేవుని ఆజ్ఞ లేకుండా చేసే ఏ ఆరాధన అయినా—even if it looks religious—దేవుని దృష్టిలో వ్యర్థమైనది.

↣  క్రైస్తవులని పిలువబడిన వారిలో  అత్యధికంగా పాటించే పండుగలలో ఒకటి క్రిస్మస్. ప్రపంచమంతా దీనిని యేసు జన్మదినం, మరికొందరు క్రీస్తునకు ఆరాధన అంటూ గొప్పగా జరుపుతున్నారు.

↣ వారి సంఘాల్లో  క్రిస్మస్ పేరుతో  ఆరాధనలు నిర్వహిస్తు, క్రిస్మస్ కీర్తనలని, నాటకాలని, అలంకరణలు, పెద్ద పెద్ద స్టార్స్, నృత్యాలు, బహుమానాలు, క్రిస్మస్ చెట్ల అలంకరణతో, లైట్లు.. etc.—ఇవి అన్నీ తమ ఆధ్యాత్మిక కార్యక్రమాల భాగంగా చూస్తారు.


↣ ఇట్టి రీతిలో ఆరాధన చేయమని (లేదా) క్రిస్మస్ పేరుతో యేసునకు ఆరాధన చేయమని బైబిల్లో ఆజ్ఞ ఉందా?

↣  దేవుడు(YHWH) క్రిస్మస్ ఆరాధనను ఆమోదించాడా?

↣  యేసు తన్ను ఆరాధన చేయమని ఎప్పుడైనా కోరెన?

↣  ఏటేటా పుట్టినరోజు వేడుకలు చేయమని అజ్ఞాపించెన?

↣  అపొస్తలులు దీన్ని ఏటేటా ఆచరించారా?

↣  బైబిల్లో యేసు జన్మదినం జరపమన్న ఆజ్ఞ ఉందా? అసలు తేదీ ఉందా?

↣  ఆదిమ సంఘములో ఒకసారి కూడా క్రిస్మస్ ఆరాధన జరిగిందా?

↣ మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించి చేసే  ఆరాధన  దేవుడు అజ్ఞాపించని ఆరాధనే. దానిని చేసినప్పుడు, అది ఎంత అందంగా కనిపించినా, ఎంత భావోద్వేగపూరితమైన, ఎంత సంప్రదాయమైన, అది మనుషులకు ఎంత గొప్పగా కనిపించిన, ప్రపంచమంతా చేసిన దేవుని దృష్టిలో వ్యర్థమైన ఆరాధనే అగును కదా!!


📖  (ద్వితీయోపదేశకాండము 12:32)

 "నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు."

అంటే —




x

దేవుడు ఆజ్ఞాపించని ఆరాధనను చేస్తే అది దేవునికి అంగీకారముండదనేగా అర్ధం. 


క్రిస్మస్ ఆరాధన – వ్యర్థమైన ఆరాధన


A. బైబిల్ ఆజ్ఞ లేకపోవుట వల్ల వ్యర్థమైన ఆరాధన 

  1. దేవుడు ఆజ్ఞాపించని ఆరాధన వ్యర్థమైనది. — మత్తయి 15:9

  2. క్రిస్మస్ పండుగకు బైబిల్‌లో ఎక్కడా ఆజ్ఞ లేదు, 4వ శతాబ్దంలో రోమన్ కాథలిక్ చర్చిలో పండుగగా ఏర్పడింది. — 2 తిమోతి 3:16–17

  3. యేసు జన్మదినాన్ని జరుపవలెనని శిష్యులకు ఆదేశం లేదు — అపో.కా. 2:42; 2 దెస్స 2:14

  4. దేవుని వాక్యానికి మించి పోవకూడదు — 1 కొరింథీ 4:6

  5. దేవుని ఆరాధన ఆయన ఆజ్ఞ ప్రకారం మాత్రమే జరగాలి — ద్వితి 12:32

  6. మానవ సంప్రదాయం ఆధారంగా చేసే ఆరాధన దేవుడు అంగీకరించడు — మత్తయి 15:3

  7. ఆరాధనకు దేవుడు నిర్ణయించిన క్రమం ఉండాలి — 1 కొరింథీ 14:40

  8. క్రిస్మస్ మానవుల సంప్రదాయం; పరిశుద్ధాత్మ యొక్క ఆజ్ఞ కాదు — యోహాను 16:13

  9. సువార్తలో ఏమి బోధించబడిందో అదే అనుసరించాలి — గలతి 1:8–9

  10. బైబిలు శిష్యుల ఆరాధనలో క్రిస్మస్ లేనందున క్రిస్మస్ దేవుని ఆరాధన కాదు — అపో.కా. 2:42


B. అన్య ఆచారాలు కలిసినందున వ్యర్థమైన ఆరాధన 

  1. అన్య పద్ధతులను అనుసరించవద్దని దేవుడు హెచ్చరించాడు — ద్వితి 12:30 చెట్టు అలంకరణ—జర్మన్ సంస్కృతి నుండి వచ్చిన ఆచారం.

  2. యిర్మియా చెట్లను కోసి అలంకరించే పద్ధతిని నిందించాడు — యిర్మియా 10:2–4

  3. క్రిస్మస్ తేది (Dec 25) సూర్యదేవుని పండుగ నుండి తీసుకుంది — రోమన్స్ చరిత్ర ఆధారముగా.. (2 కొరింథీ 6:14–17)

  4. చీకటి కార్యాలను వెలుగుతో కలపవద్దు — ఎఫెసీ 5:11

  5. దేవుని ఆరాధనలో ప్రపంచ అలంకారం ఉండకూడదు — 1 యోహాను 2:15

  6. దేవుడు ఇతర జాతుల ఆచారాలను విడిచిపెట్టమని చెప్పాడు — యెహోషువ 23:7

  7. దేవునికి పవిత్రమైన ఆరాధన కావాలి—మిశ్రమ పద్ధతులు కాదు — లేవి 10:1–2

  8. అన్య  పండుగలతో కలిసిన ఏ ఆచారం దేవుని దృష్టిలో అపవిత్రమైనది — నిర్గమకాండం 32:5–7

  9. రోమన్స్ సంస్కృతిని అనుసరించడం క్రైస్తవ ఆరాధనను కలుషితం చేస్తుంది — రోమా 12:2

  10. “ఈ లోక సంబంధమైన పద్దతులు” ద్వారా చేసిన ఆరాధన వృథా — కొలొస్సయులకు 2:8


C. అపోస్తలుల బోధలో లేనందున వ్యర్థమైన ఆరాధన 

  1. శిష్యుల బోధ, పద్ధతి, ఆజ్ఞ మనకు ప్రమాణం — అపో.కా. 2:42,2 దెస్స 2:14, 1 యోహాను. 1:1-2

  2. యేసు తన పుట్టిన రోజు జరపలేదు — సువార్తలలో ఎక్కడా లేదు అలాగే వారు ఎక్కడా క్రిస్మస్ జరపలేదు — మత్తయి నుండి ప్రకటన

  3. యేసు జన్మపై ప్రత్యేక పండుగ లేదు, ఏ సంఘానికీ ఆజ్ఞ ఇవ్వలేదు — రోమీయులకు– ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా లేదు — లూకా 2 (కథనం మాత్రమే)

  4. వారికి ప్రతి ఆదివారం ఆరాధన ఉంది, సంవత్సర పండుగలు కాదు — అపో. 20:7; 1 కోరి. 16:1-2 

  5. క్రైస్తవ పండుగగా యేసు మరణాన్ని మాత్రమే ఆజ్ఞాపించారు — 1 కొరింథీ 11:23–26 

  6. యేసు “ఇది నా జ్ఞాపకార్థమై చేయుడి” అన్నది రాత్రి భోజనం గురించి, జన్మ గురించి కాదు — లూకా 22:19; 1 కొరింథీ 11:24; 

  7. అపొస్తలులు సంప్రదాయాలను అనుసరించలేదు — కొలొస్సయులకు 2:20–23

  8. దేవునికి ఆరాధన ఆత్మతోను, సత్యముతోను ఉండాలి, బాహ్య అలంకారంలో కాదు — యోహాను 4:24

  9. కొత్త నియమంలో పండుగలు పాటించడం గూర్చి హెచ్చరిక — గలతి 4:10–11

  10. దేవుని కుమారుడు ఇచ్చిన ఆజ్ఞలకు మాత్రమే విధేయత చూపవలెను — హెబ్రీ 5:9


D. ఆరాధనలో అనుమతించని అంశాలు కలవడం వల్ల 

  1. నాటికలు, ప్రదర్శనలు, నృత్యాలు ఆరాధనలో అనుమతించబడలేదు — 1 కొరింథీ 1:21

  2. ఆరాధనలో చిత్రరూపాలను వాడకూడదు — నిర్గమ 20:4

  3. సంగీత పరికరాలు లేవు -  ఆత్మీయ గానము — ఎఫెసీ 5:19

  4. బైబిల్ ఆరాధనలో అలంకరణలు/లైట్లు లేవు — 1 తిమోతి 2:8–10

  5. ఆరాధనలో ప్రపంచ ఉత్సాహం దేవుని చిత్తం కాదు — యాకోబు 4:4

  6. సెలబ్రేషన్లు ఆరాధనను ప్రదర్శనగా మార్చుతాయి — మత్తయి 6:1

  7. గిఫ్టుల సాంప్రదాయం ఆత్మీయతను భౌతికతకు మార్చుతుంది — మత్తయి 6:19–21

  8. సాంటా క్లాజ్—అబద్ధ కథలను ఆరాధనలో కలపడం తప్పు — ఎఫెసీ 4:25

  9. సంఘ ఆరాధనలో దేవుని వాక్యమే కేంద్రముగా ఉండాలి — 2 తిమోతి 4:2

  10. మనుషులు జోడిచిన పద్ధతులు ఆరాధనను అవమానపరుస్తాయి — మార్కు 7:7–8


E. దేవుని చిత్తానికి విరుద్ధమైనందున 

  1. దేవుడు చెప్పిన/కోరిన విధంగా ఆరాధించాలి — ద్వితి 12:4; యోహాను. 4:23-24

  2. దేవుని మార్గం శుద్ధమైనది—మనిషి జోడింపు అపవిత్రం — కీర్తన 18:30

  3. ఆత్మతో ఆరాధన అనేది సత్యములోనే ఉండాలి, సంప్రదాయములో కాదు — యోహాను 4:24

  4. క్రిస్మస్‌లో భావోద్వేగం, మనుషుల మోసపూరిత ఆలోచనలు — ఎఫెసీ 4:14

  5. దేవుడు తన వాక్యానికి నిబద్ధతను కోరుతున్నాడు — యెహోషువ 1:7

  6. దేవుని సేవకు మనిషి నియమాలు అవసరం లేదు — కొలొస్సయులకు 2:22

  7. వృథా ఆరాధనను దేవుడు తిరస్కరిస్తాడు — యెషయా 1:13

  8. అబద్ధంతో ఉన్న ఆరాధన దేవునికి అసహ్యం — ఆమోసు 5:21–23

  9. క్రీస్తు కేంద్రం సువార్త—జన్మపండుగ కాదు — 1 కొరింథీ 15:1–4

  10. సత్య ఆరాధన వాక్యము పైన నిలుస్తుంది; క్రిస్మస్ మనుషులు సంప్రదాయంపై నిలుస్తుంది — యోహాను 17:17; 4:24 సత్య ఆరాధన బైబిల్ ప్రకారం ఉండాలి; బైబిల్ చెప్పని ఆరాధన దేవుని దృష్టిలో ఆమోదయోగ్యం కాదు.


క్రిస్మస్ ఆరాధన:

బైబిల్ ఆజ్ఞ లేదు

❌ అపోస్తలుల బోధలో లేదు

❌ అన్య ఆచారాలు ఉన్నాయి

మానవ సంప్రదాయాల మిశ్రమం

వాక్యానికి అనుగుణంగా లేదు

అందువల్ల యేసు చెప్పినట్లుగా ఇది వ్యర్థమైన ఆరాధన (మత్తయి 15:9) అవుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Page Follow page

Questions and Comments here!

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16