Showing posts with label శరీరము. Show all posts
Showing posts with label శరీరము. Show all posts

మానవ నిర్మాణం (creation of man)

మానవ నిర్మాణం (creation of man)


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏 


మానవ నిర్మాణం దేవుని సృష్టిలో అత్యంత ముఖ్యమైన భాగం. దేవుడు లేడని అనుకొనే వారికి ఇదొక గుణపాఠం. అనంతజ్ఞానపూర్ణడగు పరమ దేవుడు ఆదిలోనే భూమ్యాకాశములు, సూర్యచంద్రాదులు, వృక్షాలు, జలచరములు, ఆకాశ పక్ష్యాదులు, భూజంతువులు, ప్రాకు పురుగులు సృజించాడు. సకల జీవులు ఏలికలేకయే  కాలము గడుపుచుండగా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. (1సమూ. 2:3; ఆది.కాం. 1:1-27). దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. (ఆది.కాం. 2:7) ఇట్టి వాని పాదములు క్రింద తాను సృజించిన యావత్తును ఉంచి, అంతటి పైన నరుడును ఏలుబడి చేయుటకు నియమించెను కదా!! (ఆది.కాం. 1:1-28; కీర్తనలు. 8:5-8).


ఇట్టి మానవుడు రెండు భాగాలు :


1️⃣ శరీరము

2️⃣ ఆత్మ


👤 "శరీరము" ≈ దేహము + ప్రాణం ≈ జీవించు ప్రాణి


శరీరము ఒక బాహ్య పురుషుడే అనగా దృశ్యమైనది (2 కోరింది. 4:16) యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము(యెషయా. 64:8) జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి(యోబు. 10:9) మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును(ప్రసంగి. 12:7) దృశ్యమైనవి అనిత్యములు(2 కోరింది. 4:18a) నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు –నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.(కీర్తన. 90:3,10)


🚨 శరీర స్వరూపం : ఒక వ్యక్తి యొక్క మొత్తం శరీరాన్ని, దాని నిర్మాణం, కణజాలాలు, అవయవాలు మరియు వ్యవస్థలను సూచిస్తుంది. 


ఉదా: బాహ్యగా తన కనులు, చెవులు, ముక్కు, చర్మం, కాళ్లు, చేతులు, శరీరములోపల మరియు బయట ప్రతి అవయవము.


"నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను." (కీర్తనలు. 139:13-16)


🚨 శరీర పోలిక : కుటుంబ/రక్త సంబంధుల వ్యక్తుల మధ్య శరీర నిర్మాణంలో లేదా శరీర లక్షణాలలో గల సారూప్యతలను/స్వభావమును సూచిస్తుంది.  వ్యక్తులు తమను తాము ఇతరులతో పోల్చుకోవడం, ముఖ్యంగా వారి శరీరాల రూపాన్ని లేదా పనితీరును పోల్చుకోవడం...Etc 


ఉదా : బాహ్య రూపంగా తండ్రిలా, తల్లిలా, తాతయ్యలా, అమ్మమ్మలా ఉన్నావంటూ చెప్పుటయే శరీర పోలిక. 



👤 "ఆత్మ" ≈ జీవము + ఆత్మ ≈ జీవింపచేయు ఆత్మ


ఆత్మ ఒక ఆంతర్యపురుషుడే అనగా అదృశ్యమైనది(2 కోరింది. 4:16) మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా(జెకర్యా. 12:1) దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను(యోబు. 33:4). ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.(ప్రసంగి. 12:7) అదృశ్యమైనవి నిత్యములు కదా!! (2 కోరింది. 4:18b). సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. (దానియేలు. 12:2)


మానవుడు తన శరీరములో నివాసం చేయు ఆత్మేకానీ శరీరము మాత్రమే కాదు. "ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము.(యోహాను. 6:63).  దేవుడు మానవుడి నాసిక రంధ్రాలలోకి జీవవాయువును ఊదినప్పుడు, మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. (ఆది. కాం. 2:7). "మన స్వరూపంలో, మన పోలిక ప్రకారం నరుడుని చేద్దాం" అని చెప్పి, సృష్టిపై అధికారం చెలాయించడానికి మరియు దానిని బాధ్యతాయుతంగా నిర్వహించడానికి మనుషులను నిర్మించాడు.(ఆది. కాం. 1:26,27)


📖 దేవుని స్వరూపం 📖 


దేవుని స్వరూపం(own Image) నాలుగు రకాలు అని బైబిల్ సెలవు ఇస్తుంది. 


A. అదృశ్య స్వరూపి : 

అదృశ్యుడు అనగా ఆత్మ లేదా కంటికి అగోచరుడు లేదా కంటికి కనపడడు అని అర్థం.


🍃 దేవుడు ఆత్మ గనుక (యోహాను. 4:24)

🍃 ఆయన స్వరూపం అక్షయుడగు(చావులేని) స్వరూపం. (రోమా. 1:23).

🍃 అదృశ్యుడునగు దేవుడిని (హెబ్రీ. 11:27; 1 తిమోతి. 1:17cf).

🍃 అదృశ్యమైనవి నిత్యములు (2 కోరింది. 4:18)

🍃 క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపము గలవాడు. - (కొలస్సి. 1:15cf) (తండ్రైన దేవుడు కాదు).

🍃 అదృశ్య దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏమనగా నిత్యశక్తి(eternal Power), దేవత్వం(Godhead) - (రోమా. 1:20).

🍃 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్న దేవుడు (1 తిమోతి. 6:15).

🍃 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. (యోహాను. 1:18; 1 యోహాను. 4:12; 1 తిమోతి. 6:15b)

🍃 నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.౹ (నిర్గమ. 33:20).

🍃 మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు. (యోహాను. 5:37). 


🚨 ఇట్టి అదృశ్య స్వరూపం కలిగిన దేవుడు తన స్వరూపములో మానవుని నిర్మించాడంటే అర్ధం నరుడుకి(జీవాత్మకి) చావు లేదని, మనం(ఆత్మలము) కంటికి కనపడము అని అర్థమే కదా!! (ఆది. కాం. 2:7).


B. నీతి స్వరూపి :


నీతి స్వరూపం అనగా పాపమునకు చోటు లేని స్వరూపం, పాపం లేనివాడు లేదా పాపం చేయనివాడు అని అర్థం. 


🍁 ప్రభువైన యేసు గెత్సెమనే తోటలో తండ్రికి చేయి ప్రార్థనలో "నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు. (యోహాను. 17:25).

🍁 "—నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. (1 పేతురు. 1:14).

🍁 "ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు. (ప్రసంగి. 7:29).

🍁 "దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.౹" (1 యోహాను. 5:18). 


🚨 ఇట్టి నీతి స్వరూపం కలిగిన దేవుడు తన స్వరూపములో మానవుని నిర్మించాడంటే అర్ధం నరుడుని పాపం లేనివాడిగానే అనగా పరిశుద్ధముగా, యథార్థవంతులనుగా సృజించెను కదా!!


C. సత్య స్వరూపి :


సత్య స్వరూపం అనగా అబద్దమాడలేని, అబద్దమాడజాలని స్వరూపం, సత్యమే తప్పా అబద్దమాడటం చేతకాని స్వరూపం.   


🍀 "వారు– నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి. (ప్రకటన. 6:10).

🍀 దేవుడు అబద్దమాడుట అసంభవం. (హెబ్రీ. 6:16-18)

🍀 అబద్ధమాడనేరని దేవుడు (తీతుకు. 1:2)

🍀 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు (సంఖ్యా. 23:19)

🍀 ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు (1 సము. 15:29).

🍀 "మనము సత్యవంతుడైన వానిని(తండ్రిని) ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చిమనకు వివేక మనుగ్రహించియున్నాడని యెరుగుదుము. (1 యోహాను. 5:20)


🚨 ఇట్టి సత్య స్వరూపం కలిగిన దేవుడు తన స్వరూపములో మానవుని నిర్మించాడంటే అర్ధం తన యెదుట మానవులు  సత్యసంబంధులుగా ఉండాలనే సృజించెను కదా!!


D. ప్రేమా స్వరూపి :


ప్రేమా స్వరూపం అనగా  ద్వేషించలేని స్థితి మరియు ప్రేమకు కర్త దేవుడే. ప్రేమ అనే పదం భూ సంబంధమైన పదం కాదు. పరసంబంధమైన భాష..


🍂 దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. (1 యోహాను. 4:8).

🍂 ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు (2 కోరింది. 13:11)

🍂 దేవుడు ప్రేమాస్వరూపియైయున్నాడు. (1 యోహాను. 4:16)

🍂 ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది. (1 యోహాను. 4:7)

🍂 "నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి..." (హెబ్రీ. 1:9)


🚨 ఇట్టి ప్రేమ స్వరూపం కలిగిన దేవుడు తన స్వరూపములో మానవుని నిర్మించాడంటే అర్ధం నీతిని ప్రేమించి అందలి జీవించుటకును, దుర్నీతిని ద్వేషించుటకును మరియు తన స్వరూపం గలవారిని(తోటి సహోదరులను) ప్రాణం పెట్టేయంతగా ప్రేమించే స్వభావం ఉండాలనే సృజించెను కదా!!



📖  దేవుని పోలిక 📖 


దేవుని పోలిక(own Likeness) అనగా ఆధ్యాత్మిక  లక్షణాలైన జ్ఞానం(రోమా 11:33; 1పేతురు 1:2), సృజనాత్మకత, దేవుని నీతి(2 కోరింది 5:21), దైవ స్వభావం(2 పేతురు 1:4), పరిశుద్ధత(1 పేతురు 1:14), మంచితనం(లూకా 18:19), ప్రేమ(యోహాను 3:16), న్యాయవంతుడు(లూకా 7:29) , సత్యవంతుడు(యోహాను. 3:33), దీర్ఘశాంతం(2 పేతురు 3:9), సమాధానం(1 కోరింది 14:33), పరిపూర్ణుడు(మత్తయి. 5:48) వంటివి...Etc 


అంతేకాని మనుషులు శరీర రూపం, రాయి, పక్షుల, చతుష్పాద జంతువుల, పురుగుల, విగ్రహ రూపాన్ని పోలి ఉండటం కాదు సుమీ! దేవుడు ఆత్మ స్వరూపుడు కాబట్టి శరీర పోలిక కాదు. దేవుని పోలికలు మానవులకు దేవునితో సంబంధం ఏర్పరచుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి.


🚨 ఇట్టి పోలికలు కలిగిన దేవుడు మన పోలిక చొప్పున మానవుని నిర్మించాడంటే అర్ధం మనం దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని, జీవితాన్ని, పరిశుద్ధతను, ప్రేమను కలిగి ఉండాలనే సృజించెను కదా!!


👥 ఓ చదువరి... మన నిర్మాణం ఈ సృష్టి అంతటిలోనే గొప్పది. దేవుడు లేడని అనేవారికి ఇది ఒక పాఠం. మనం రెండు భాగాలు కలయిక... శరీరం తాత్కాలికమైనది, మనం(ఆత్మలం) శాశ్వతమైనవారం అని గుర్తించి మనలను తన నాలుగు స్వరూపాలను, తన పోలికలను మిళితం చేసి ఈ శరీరములో మనలను ఆయనే ఒక సంకల్పం ప్రకారముగా చేశారని గుర్తించమని మనవి 🙏🏿


"ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను." (యాకోబు. 1:18)

మీ ఆత్మీయులు👥

క్రైస్తవులు, వేటిపైన పోరాటం చేయాలి? (What should Christians fight for?)

క్రైస్తవులు, వేటిపైనా పోరాటం చేయాలి?

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏽 

                        నిజ క్రైస్తవుడి వ్యక్తిత్వమే నిరంతర పోరాట యోధుడు.(2 తిమోతి. 2:1-5). దీని అర్థం క్రైస్తవుడు ఆధ్యాత్మిక పోరాటం చేయువాడే కానీ బాహ్య పోరాటం చేయువాడు కాదు. బాహ్య పోరాటంలో  నిరంతరం గొడవలు, కేకలు, వివాదాలు, కుల/ మత విద్వేషాలు, ప్రభుత్వాలను ఎదిరించడం, నినాదాలు చేయడం, చర్చలు చేయడం, లేని వార్తను కల్పించడం, రోడ్లు ఎక్కడం, హక్కుల కోసం పోరాటం చేయడం, కుట్రలు పన్నడం, శత్రువును చంపమని/శిక్షించమని కోరడం...Etc. వంటివే ఉండును కదా ఇటువంటివి క్రైస్తవ విశ్వాస, ప్రేమ, క్రమశిక్షణ జీవితానికి చాలా కీడు చేకూర్చేవే కానీ మేలు చేసేవి కావు.  మరి క్రైస్తవుల వేటిపైనా పోరాడాలి? అనే విషయాన్ని ఈ అంశము ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 


🔎 క్రైస్తవులు మూడు రకాల వాటి పైనే ఆధ్యాత్మిక పోరాటం చేయవలసిన వారై యున్నారు.


①. శరీరముతో 

②. పాపముతో

③. అపవాదితో


🔴  శరీరముతో


మొదటిగా.., నీ శరీరముతో పోరాటం,  అంటే నీ శరీర కోరికలతోనూ, నీ శరీర స్వభావముతోనూ జరిగే అంతర్గత పోరాటమని దీనికి అర్థం. వాస్తవానికి మనం ఈ శరీరము'లో' నివాసం చేస్తున్న దేవుని పోలిక, దేవుని స్వరూపం గల ఆత్మలమే(ఆది.కాం. 1:27; 2 కోరింది. 5:1-2). ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. (యోహాను. 6:63). శరీరమునకు మరియు ఆత్మకు మధ్య పరస్పర పోరాటమనేది ఉంది. శరీరము ఆత్మకు విరోధముగాను,  ఆత్మ శరీరమునకు విరోధముగాను కోరినప్పుడు మనం నిర్ణయించుకొన్న వాటిని చేయకుందురు.౹"(గలతీ. 5:17).


శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. (రోమా. 8:7). శరీరానుసారమైన కోరికలు గల మనస్సు దేవునికి లోబడదు. శరీర స్వభావులు దేవుని సంతోష పెట్టలేరు. అప్పుడు నీకు(ఆత్మకు) విరోధముగా పోరాడే మనస్సు అపవాది మనస్సే కాబట్టి నీ ఆత్మకు విరోధముగా పోరాడు నీ శరీర కోరికల పైనే అనుదినం పోరాటం చెయ్యాలి.(1 పేతురు. 2:11). శరీర కోరికలు ఏమనగా.., జారత్వము/వ్యభిచారం, అపవిత్రత, కాముకత్వము,౹ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,౹ భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు... వీటిపై మనం పోరాడి గెలవాలి లేకపోతే దేవుని రాజ్యమును పొందలేము (గలతీ. 5:19-21) కాబట్టి  ప్రతి విశ్వాసి తన శరీరముతో పోరాడి జయించాలంటే క్రీస్తు మరణం ద్వారా అనుగ్రహించబడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే సాధ్యం. (గలతీ. 5:16).


📖 నీవు నీ శరీరముతో ఎంతగా పోరాడాలనేది మన ప్రభువైన యేసు మాటల్లో చూచుటకు ప్రయత్నం చేద్దాం. "నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులుకలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; రెండు పాదములుకలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసి పారవేయుము; రెండు కన్నులుకలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు." (మార్కు. 9:43-48)


✅ నిత్యత్వమునకు నీ చెయ్యి, నీ పాదములు, నీ కన్నులు అభ్యంతర పరిస్తే దానిని నరికి వేయాలని యేసు చెప్పెను కదా. 

🔖  అభ్యంతకరమైన పనులు చేసేది, తాకేది =  "చేయి"

🔖 అభ్యంతకరమైన కార్యక్రమాలకు పరుగులు పెట్టేది = "పాదములు"

🔖 అభ్యంతకరమైన వాటిని చూసేది, ఆశించేది = "కన్నులు"


📖 నీ జీవాన్ని, నీ బాంధవ్యాన్ని నీ చేయి, నీ పాదములు, నీ కన్నులు అభ్యంతర పరిస్తే వాటిని నరకాలి. అంతేగదా... 🤔 వాస్తవానికి చేయు, పాదములు, కన్నులు అనగా శరీరమును(మాంసం) ఎవరు నరకరు. మరి ఏమి చెయ్యాలి? నీ శరీరముతో పోరాటం చేయాలి. దానిని లోబరుచుకోవాలి, వశపరుచుకోవాలి. 


🔖 నీవు పోరాడునది శరీరులతో (మనుష్యులతో) కాదు. నీ సొంత శరీరముతో అని తెలుసుకోవాలి. 

🔖 నీ శరీరమే, అనగా శరీర కోరికలు, శరీర స్వభావమే నీ  మొదటి శత్రువు. 


📖 (1 కోరింది. 9:26-27): "నేను గురిచూడనివానివలె పరుగెత్తు వాడను కాను,౹ గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను."


📖 (గలతీ. 5:16): "నేను చెప్పునదేమనగా ఆత్మా నుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.౹"


🚹 Note : శరీరముతో పోరాడక పోతే క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు వారసులు కానేరరు, స్వతంత్రించుకోలేరు, హక్కుదారులుకాలేరు. (1 కోరింది. 6:9-10; గలతీ. 5:19-21; ఎఫెసి. 5:5). 


🔴 పాపముతో :


రెండోదిగా.., పాపముతో పోరాటం. పాపము అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము.(1 యోహాను. 3:4); విశ్వాస మూలము కానిది పాపము. (రోమా. 14:23); మేలైనది చేయనెరిగి ఆలాగు చేయకపోవుట పాపము. (యాకోబు. 4:17); సకల దుర్నీతి పాపము. (1 యోహాను. 5:17); సత్క్రియ చేయకపోవుట పాపము. (ఆది.కాం. 4:7); మరణకరమైన పాపము & మరణకరము కాని పాపము కలదు. (1 యోహాను. 5:15-16)...Etc పాపము అంటే ఏంటో గుర్తించిన విశ్వాసి అనుదినం కచ్చితంగా పాపముతో పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాపముతో పోరాడాలి అనుకునేవారు తిరిగి పాపమునకు రాజీపడి చూసిచూడనట్టుగా (ఒక్కసారికి ఏమైందిలే అంటూ) ఉంటే ఎప్పటికీ పోరాడి గెలవలేరు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. (హేబ్రీ. 12:4). పాపముతో పోరాడినప్పుడు రక్తం కారుతుంది. 


1. హేబేలు - ఆది.కాం. 4:1-12

సత్క్రియ చేయకపోవుట పాపము(ఆది. 4:7). సత్క్రియ అనగా దైవాజ్ఞ మేర ఆదేశించబడే పనులు నీవు చేయకపోతే పాపానికి నీ మీద మోజు ఉంటుంది. కయీను సత్క్రియ చేయనివాడు, హేబేలు సత్క్రియ చేసినవాడు. ఇందుచేత హేబేలు రక్తం కారునంతగా పాపముతో పోరాడాడు. పాపమునకు ప్రేమ ఉండదు. తమ్ముడు, అన్న అనే బేధం ఉండదు. 


2. యోసేపు - ఆది.కాం. 39:1-23 

పోతీఫరు భార్య రూపములో యోసేపు యొద్దకు వచ్చినది పాపం.(7వ) యోసేపు దినదినము పోరాటం చేసేవాడు.(10వ). మన జీవితములో కూడా పాపమమేది దినదినము ఏ రూపంలోనైనా రావచ్చు. కాబట్టి పాపముతో పోరాటం చేయుటకు సిద్ధముగా ఉండవలసిందే.


Note : పాపముతో పోరాడక పోతే పాపము వలన వచ్చు జీతము మరణమే. (రోమా. 6:23; యాకోబు. 1:14-15; ప్రకటన. 20:14; 21:8). 


🔴  అపవాదితో


మూడోదిగా.., అపవాదితో పోరాటమనేది విశ్వాసి జీవితములో ఆధ్యాత్మిక పోరాటంలో కీలకమైన విషయం. వీడు అబద్ధాలకు జనకుడు, నరహంతకుడు (యోహాను. 8:44), శోధకుడు (మత్తయి. 4:3), ఇహలోక అధికారి (యోహాను. 12:31; 14:30), దుష్టుడు (మత్తయి. 13:18-19), చీకటి రాజ్యానికి రాజు (కొలస్స. 1:13; మత్తయి. 12:26) అని బైబిల్లో వివిధ రకాలగా పిలువబడ్డాడు. ఇటువంటి దౌర్భాగ్యుడుతో నీవు అనుదినం పోరాటం చేయవలసిందే.


అపవాదితో పోరాటం అంటే "నీతికి vs దుర్నీతికి", "పరిశుద్ధతకు vs పాపమునకు", "వెలుగుకు vs చీకటికి", "విశ్వాసమునకు vs అవిశ్వాసమునకు" జరిగే నిరంతర పోరు. ఈ పోరులో వాడిని ఢీ కొట్టాలంటే క్రీస్తు పక్షముగ ఉండి మాత్రమే పోరాడాలి. వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును. (ప్రకటన. 17:14). ఆత్మ సంబంధమైన బలగాలతో అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన క్రీస్తు సంఘము (church of Christ) తోనే కలసి మాత్రమే అపవాదితో పోరాడాలి లేదంటే వాడితో పోరాడుట అసాధ్యము. (1 కోరింది. 1:2; 12:12; ఎఫెసి. 1:23; కొలసి. 1:18; రోమా. 16:16). ఇటువంటి ఆత్మ సంబంధమైన యుద్ధములో మన ప్రభువైన యేసు జయశాలిగా నిరంతరం విజయం సాధిస్తూ ఉంటాడు. నీవు కూడా అట్టి విజయం సాధించాలని అనుకుంటే క్రీస్తు పిలుపుకు లోబడినవాడవై, ఏర్పరచబడినవాడవై, నమ్మకమైనవాడవై ఉండాలి. (1 కోరింది. 1:9; రోమా. 8:28-30; 1 పేతురు. 2:9; మత్తయి. 25:21-23; ప్రకటన. 17:14). అప్పుడు దేవునిపై ఆధారపడి మనస్సు కలిగినప్పుడు అపవాదిని ధైర్యంగా ఎదిరించి గెలవడం సాధ్యపడును కదా! కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. (యాకోబు. 4:7). 


👤అపవాదితో పోరాడుటకు యుద్ధరంగంలో దిగే ముందు దేవుడు అనుగ్రహించే సంపూర్ణ కవచాన్ని ధరించుకోవాలని బైబిల్ సెలవు ఇస్తుంది. అవేమనగా...

🢡 సత్యమను దట్టి

🢡 నీతియను కవచము

🢡 సువార్తయను జోడు

🢡 విశ్వాసమను డాలు

🢡 రక్షణయను శిరస్త్రాణము

🢡 ఆత్మయను ఖడ్గము .. 

వీటితో పాటుగా...

🢡 పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేయమని, పోరాటం విషయములో పట్టుదల కలిగి, దాని యందు మెలుకువగా ఉండమని కూడా చెప్పబడింది. ≈ (ఎఫెసీయులకు 6:13-18).


అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. (1 యోహాను. 3:8). మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రత్యక్షతమగుటకు గల ముఖ్య ఉద్దేశ్యం అపవాదిని ఓడించుటకు మాత్రమే. ఆయన వాడిని 33 ½ సం. ఎన్నో రూపాల్లో ఎదుర్కొని, చివరిగా సిలువలో ఓడించి. (కొలస్స. 2:15) మరణించి, సమాధి చేయబడి, మూడో దినం పరమ దేవుని చేత క్రీస్తు లేపబడెను కదా.(1 కోరింది. 15:1-4) ఇక్కడితో అయిపోయింది అన్నట్టుగా కాక క్రీస్తును అంగీకరించే వారి ద్వారా(సంఘము ద్వారా) సహితం అపవాదికి ఓటమి నిలుపుటకు పరమదేవుడే విశ్వాసికి అపవాది పైన పూర్తిగా విజయాన్ని ఇస్తాడనే విషయాన్ని బైబిల్ నొక్కి చెప్పుతుంది. "సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక." (రోమా. 16:20). ఇట్టి పోరాటాన్ని స్వయముగా దేవుడే ఆదిలో తన పోలిక, తన స్వరూపమును పునర్దించుకోవడానికే పెట్టెను కదా! "నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను...." (ఆది.కాం. 3:15). 


📖 (ఎఫెసీ.  6:12): "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.౹"

📖 (2తిమోతి.  2:5): " జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.౹"


Note : అపవాదితో పోరాడక పోతే అగ్నిగుండమే. (మత్తయి. 13:41-42; 25:41-46; ప్రకటన. 14:10; 19:20; 20:10; 20:14-15; 21:8,27; ). 


📖 "మీరు మొదటనుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదటనుండి వినినది మీలో నిలిచినయెడల, మీరు కూడ కుమారునియందును తండ్రియందును నిలుతురు.౹ నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.౹ మిమ్మును మోసపరచువారినిబట్టి యీ సంగతులు మీకు వ్రాసియున్నాను.౹" (1 యోహాను. 2:24-26)


ఓ చదువరి.., కాబట్టి ఇటువంటి మూడు అధ్యాత్మిక పోరాటలనేవి  నీవు భూమి మీద ఉన్నంత కాలము కొనసాగుతూనే ఉంటాయి. ఒక క్రైస్తవునికి ఇది ఒక నిరంతర యుద్ధం... ఇది తెలియకుండా "నేను క్రైస్తవుడనని నీవు అనుకోవచ్చు అని దేవుని దృష్టిలో నీవు అపవాది సంబంధివే"...



మన పరమతండ్రి మనలను క్షమించు ప్రకారం(ఎఫెసీ. 4:32), అలాగే మన ప్రభువు మనలను క్షమించులాగున (కొలస్సీ. 3:13) వారిని క్షమించి, దీవించి(రోమా. 12:14-15), కీడు చేయక, పగ తీర్చుకొనక(రోమా. 12:17-21) సహించి(1 పేతురు. 2:19-20), నీతి-న్యాయము జరిగించు యెహోవా దేవునికే అప్పగించుకొనవలేను కదా!(యోబు. 37:23; కీర్తన. 9:8; 33:5; 103:6; యిర్మీయా. 9:24)


ఈ ఆధ్యాత్మిక పోరాటం విషయములో నీవు లేనివార్తను(సత్యము కానీ వాటిని) పుట్టించేవాడిగా(ప్రకటన చేసేవాడిగా) కాక(నిర్గమ. 20:16; ఎఫెసీ. 4:26), పరులజోలికి పోవువాడిగా కాక(1 పేతురు. 4:15), సత్య ప్రకటన విషయములో సిగ్గుపడని పిరికితనం లేనివ్యక్తిగా(2తిమోతి. 1:7; 2:15); క్రైస్తవుడిగా జీవించునప్పుడు అన్యాయముగా కొట్టబడిన, చంపబడిన, నిందించబడిన, శోధించబడిన, తిట్టబడిన, హింసించబడిన, దూషించబడిన సరి క్రైస్తవుడు అను పేరునుబట్టియే దేవుని మహిమపరచాలి,(1 పేతురు. 4:12-19; 1 కోరి. 11:23-31) తప్పా ఇహలోక బాహ్య పోరాటాలకు పోకుండా...  

( 1 పేతురు. 2:21-23): "క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.౹ ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.౹ ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.౹"



👤యేసు మాటల్లో... 

(లూకా. 23:34): "యేసు— తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. 

👤స్తెఫను మాటల్లో... 

(అపో. కార్య. 7:59-60): "ప్రభువునుగూర్చి మొరపెట్టుచు– యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.౹ అతడు మోకాళ్లూని — ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను."


🔍 కాబట్టి నీవు చేయునది బాహ్యా పోరాటమా? లేక ఆధ్యాత్మిక పోరాటమా? అనే రెండు నీ యెదుట ఉంచబడినప్పుడు ఏది నిర్ణయించుకొని పోరాడుతావో నీ ఇష్టం.🙏

మీ ఆత్మీయులు👪

WhatsApp Join Us   Telegram Join Us

నీవెందుకు క్రీస్తుసంఘ సభ్యుడివవ్వాలి..? (why you become a member of the Church of Christ?)

నీవెందుకు క్రీస్తుసంఘ సభ్యుడివవ్వాలి..?


అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు.

ప్రియమైన సహోదరీ, సహోదరులారా మనలో చాలామంది యేసుక్రీస్తుని తమ సొంత రక్షడుగా అంగీకరించి వివధ సంఘాలలో చేర్చబడుతున్నారు. కాని వారు వెళ్తున్న సంఘాలు వాక్యానుసారముగా ఉన్నవో లేవో గ్రహించలేకపోతున్నారు.  ప్రియులారా ఈ లోకములో మనుష్యులు ఏర్పాటు చేసుకున్న సంఘాలు ఎన్నో ఉన్నప్పటికీ దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా ఏర్పాటు చేసిన సంఘము ఒక్కటే అదియే క్రీస్తుసంఘము (CHURCH OF CHRIST). చాలామంది “మనము ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలేదు ఆరాధన ఒక్కటే కదా రక్షణ ఒక్కటే కదా అనే భావనలో ఉన్నారు” కాని నీవు నిజముగా రక్షణ పొందుకోవాలి, నిత్యజీవములోనికి ప్రవేశించాలంటే ఖచ్చితముగా నీవు క్రీస్తుసంఘ (CHURCH OF CHRIST) సభ్యుడివవ్వాలి. ఎందుకంటే...........

A). “క్రీస్తు సంఘము” లేఖనములలో చెప్పబడినట్టుగా దేవుని కుమారునిచే కట్టబడినందున.

» ఈ బండమీద నా (క్రీస్తు) సంఘమును కట్టుదును. – (మత్తయి. 16:18).

B). “క్రీస్తు సంఘము” లేఖనానుసారమైన పునాదిగా కట్టబడినందున.

» వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. (1 కొరింధి. 3:11) 

» క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. (ఎఫేసీ. 2:20).

C). “క్రీస్తు సంఘము” లేఖనములలో తెలుపబడిన స్థలములోనే (యెరూషలేము) ప్రారంభించబడినందున.

» అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. (యెషయా. 2:2-3)

» క్రీస్తు శ్రమపడి మూడవ దిన మున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. (లూకా. 24:46-49)

D). “క్రీస్తు సంఘము” లేఖనములలో తెలుపబడిన సమయానికే (పెంతుకొస్తను పండుగ దినమున) ప్రారంభింపబడినందున...

» కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. (అపొ.కార్య. 2:41:42).

E). “క్రీస్తు సంఘము” లేఖనానుసారముగా దేవుని కుమారునియొక్క స్వరక్తముతో కొనబడినందున.

» ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును...” (అపొ.కార్య. 20:28).

» పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా (1 పేతురు. 1:18-19).

F). “క్రీస్తు సంఘము” అను నామము మాత్రమే లేఖనములలో వ్రాయబడినందున.

» ఈ బండమీద నా (క్రీస్తు) సంఘమును కట్టుదును. (మత్తయి. 16:18)

» క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి. (రోమా. 16:16).

G). “క్రీస్తు సంఘము” పరిశుద్ధుల సమూహము కొరకు ఏర్పాటు చేయబడినందున.

» ఫిలిప్పీలో ఉన్నక్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధుల కును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.  (ఫిలిప్పి. 1:1).

H). “క్రీస్తు సంఘము” నకు మాత్రమే పరిశుద్ధ గ్రంధములో లేఖనములు, పత్రికలు వ్రాయబడినందున.

» దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.  (2 తిమోతి. 3:16-17)

» తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. (2 పేతురు. 1:3).

I). “క్రీస్తు సంఘము” మాత్రమే తండ్రియైన దేవునితోను, ప్రభువైన క్రీస్తుతోనూ మరియు అపోస్తులుల బోధలోను ఏకమై ఉన్నందున.

» నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. (యోహాను. 17:20-21).

J). “క్రీస్తు సంఘము” లేఖనానుసారమైన బోధను, బాప్తీస్మమును నిర్వహించునందున.

» యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. (మత్తయి. 28:18-19) 

» సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహానుకూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి. (యోహాను. 3:23)

» కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు. (రోమా. 6:4).

» వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు. (అపొ.కార్య. 8:36-39).

K). “క్రీస్తు సంఘము” మాత్రమే రక్షణ పొందుట మరియు దానిని కొనసాగించు విషయములో కలుగు ప్రతి సందేహమునకు  లేఖనానుసారముగా సమాధానము ఇవ్వగలుగునందున.

» పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.  (అపొ.కార్య. 2:38) 

» నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.  (అపొ.కార్య. 22:16).

» నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. (మార్కు. 16:16).

L). “క్రీస్తు సంఘము” లేఖనానుసారముగా ప్రతి ఆదివారము ప్రభువు బల్లలో పాలుపొందుటనందున.

» ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు (అపొ.కార్య. 20:7; 2:42; 1 కొరింధి. 11:23-31).

M). “క్రీస్తు సంఘము” మాత్రమే లేఖనానుసారమైన సంగీతమును కలిగియున్నందున.

» ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు, (ఎఫేసీ. 5:19)

» సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు (కొలస్సి. 3:16).

N). “క్రీస్తు సంఘము” తండ్రిని మాత్రమే ఆరాధించుటలో లేఖనానుసారమైన క్రీస్తు వారి ఆజ్ఞను పాటించునందున.

» యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. (యోహాను. 4:23-24).

O). “క్రీస్తు సంఘ” సభ్యులు మాత్రమే పరలోకములో దాచబడిన స్వాస్థ్యమునకు హక్కుదారులుగా ఉన్నందున.

» దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన3 ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. (ఎఫేసీ. 1:14)

» కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధ ముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది. (1 పేతురు. 1:5).

P). “క్రీస్తు సంఘము” లో అనగా క్రీస్తు శరీరములో (CHURCH OF CHRIST) ఉన్నవారికి మాత్రమే రక్షణ ఉన్నందున.

» క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.  (ఎఫేసీ. 5:23)

» సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. (కొలస్సి. 1:18).


కాబట్టి ప్రియులారా, పైన తెలుపబడిన లేఖనములన్నిటినిబట్టి నీవు చేర్చబడిన సంఘము దేవుడు ఏర్పాటు చేసిన సంఘమా లేక  మనుష్యులు ఏర్పాటు చేసిన సంఘమా చాలా ఖచ్చితముగా తెలుసుకోగలవు.

మరి నీవు ఆ నిజమైన ఏకైక క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) సభ్యుడిగా ఉన్నావా?

లేకపోతే  ఆలోచన చేయు. వాక్యాన్ని పరిశీలన చేసి లేఖనములను ఉన్నవి ఉన్నట్టుగా అంగీకరించు. నిజ క్రైస్తవుడిగా జీవించు. ఎందుకనగా...
క్రీస్తు సంఘ సభ్యుడే నిజమైన క్రైస్తవుడు.

మీ ఆత్మీయులు,
మనోహర్ నవీన.


"నిజమైన ఆ ఒక్క సంఘమును గుర్తించడం ఎలా.? (How can I identified ONE true CHURCH)


“నిజమైన ఆ ఒక్క సంఘమును  గుర్తించడం ఎలా..?”



★   నీకు తేలుసిన "ఆ ఒక్కసంఘము" ఏమిటి?

●    “సంఘము” అనే పదం గ్రీక్ (ఎక్క్లీసియా) బాష నుoచి కలిగిది.


» దీని అర్థము “పరిశుద్ధులుగాఉండుటకు పిలువబడినవారము”. - (I కొరింథీ 1:2).

●  సంఘము క్రీస్తు యొక్క“శరీరము” - (కొలొస్స 1:18).
●  సంఘము క్రీస్తు యొక్క “వధువు” – (ఎఫెసీ 5:22-27).
●  సంఘము దేవుని యొక్క“కుటుంబము” – (I తిమోతికి ౩:15).
●  సంఘము “సత్యమునకు స్తoభము” మరియు “ఆధారము” – (I తిమోతికి ౩:15).



★    నీకు తెలిసిన ఆ "ఒక్కసంఘమునకు" స్థాపకుడు ఎవరు?

●     క్రీస్తు వాగ్దానం చేసినాడు “ఆయన తన సంఘమును” కట్టుదును అని– (మత్తయి 16:18).
●     క్రీస్తు “తన సంఘము” కొరకు తన స్వరక్తమిచ్చి సంపాదించినాడు –(అపొస్తలుల కార్యములు 20:28).
●     క్రీస్తు తన "సంఘము”అను శరీరమునకు  ఆయనే(క్రీస్తు)  శిరస్సు – (కొలొస్స 1:18).
●     క్రీస్తు తన "సంఘము”అను శరీరమునకు  ఆయనే ఆధ్యాత్మికత వహిస్తున్నారు - (కొలొస్స 1:18).



★    నీకు తెలిసిన "ఆ ఒక్కసంఘము" ఎప్పుడు ప్రారంభమైనది?

●   జెరూషలేము యొక్క చివరి రోజులలో “ఆయన(క్రీస్తు) సంఘము” వాగ్దానం చేయబడిది – (యెషయా 2:2-4)
●   “ఆయన(క్రీస్తు) సంఘము” బాప్తీస్మమిచ్చు యోహాను రోజుల సమీపంలో ఉంది –(మత్తయి 3:1-2).
●   “ఆయన(క్రీస్తు) సంఘము” బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని క్రీస్తు తన శిష్యులకు ముoదుగా చెప్పాడు – (మార్కు 9:1).
●   క్రీస్తు “తన సంఘము” ప్రారంభము కొరకు శిష్యులతో పలికిన మాటలు “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు” - (అపొస్తలుల కార్యములు 1:8).

●      పైన తెలిపిన అన్ని విషయములు “పెంతెకొస్తు పండుగ” దినమున “క్రీస్తు సంఘము(Church of Christ) ”ప్రారంభమైనది. (క్రీ.శ.33) - (అపొస్తలుల కార్యములు 2:40-42; 46-47).



★    నీకు తెలిసిన "ఆ ఒక్కసంఘము" ఎలా వర్ణించబడింది?

●  ప్రభువు సంఘము -(అపొస్తలుల కార్యములు 20:28).
●  దేవుని సంఘము – (Iకొరింథీ 1:2).
●  క్రీస్తు యొక్క శరీరo -(ఎఫెసీ 4:12).
●  క్రీస్తు సంఘము – (రోమా16:16).



★    నీకు తెలిసిన దేవుడు ఆ "ఒక్క సంఘమునకు" ఏమి ఇవ్వాలి అని యత్నము చేయుచున్నారు?

●  క్రీస్తు సంఘము లో ఉన్న వారికి “పాపముల యెక్క క్షమాపణ అవకాశం” - (ఎఫెసీ1:17).
●  క్రీస్తు సంఘము లో ఉన్న వారికి  “మోక్షము” - (2 తిమోతి 2:10).
●  క్రీస్తు సంఘము లో  ఉన్న వారికి “ముక్తి” - (కొలస్సీ 1:14).
●  క్రీస్తు సంఘము లో  ఉన్న వారికి “ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు” - (ఎఫెసీ 1:3).
●  క్రీస్తు సంఘము లో  ఉన్న వారికి  “రక్షణ”  -(అపొస్తలుల కార్యములు 2:47).


మీ ఆత్మీయులు

Romans 16: 16
The churches of Christ salute you.

రోమీయులకు 16:16
క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

"సంఘము" (Church)

దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

◆ గ్రీక్ 'లో' - "ἐκκλησίαν" (ekklēsian).
◆ లాటిన్ 'లో' - "ecclesia".
◆ ఇంగ్లీష్ 'లో' - "A calling Out Off".
◆ తెలుగు 'లో' - "సంఘము".


● ekklēsian (ఎక్లిషియా) అను గ్రీక్ పదము నుండే church(సంఘము) అనే పదము వచ్చింది.
● ekklēsian  అనేది రెండు పదాల మిశ్రమమైనది.


"A calling Out Off" (సంఘము)  అనగా "ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి పిలువబడిన వారు"


A) "మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు". - (1 పేతురు. 2:9).
● చీకటి (పాపము) అను స్థితిలో నుండి మరొక్క స్థితిలోనికి అనగా వెలుగు(నీతి లోనికి)  పిలువబడిన వారే సంఘము.

B) "అపొస్తలలు యొక్క సువార్త ద్వారా పిలువబడిన సమూహమే సంఘము". - ( 2 దెస్స. 2:14).
● అపొస్తలులు ప్రకటించిన సువార్త కాక , ఇతర బోధలు (కలలు, దర్శనములు) ద్వారా మీరు పిలువబడితే నిజమైన వెలుగులోనికి పిలువబడిన వారు కాదు.

C) యేసు రక్తము ద్వారా  "పునర్జన్మ సంబంధమైన" (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము వలన కడగబడిన వారె(బాప్తిస్మము ద్వారా) "మరో స్థితికి పిలువబడిన వారు" లేదా "సంఘము". - (ప్రకటన. 1:6; తీతుకు. 3:5; అపో.కార్య. 22:16).

D) "అంధకార సంబంధమైన అధికారపు స్థితి" నుండి  మరొక స్థితికి అనగా "క్రీస్తు రాజ్యము"(సంఘము)గా ఉండుటకు పిలువబడిన వారే సంఘము - (కొలసి. 1:16).

E) "సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి పిలువబడిన వారే సంఘము" - (అపొ.కార్య. 26:18)

F) "ఈ లోక సహవాసము విడిచి "తండ్రితోను, కుమారునితోను" పరిశుద్ధ సహవాసముగా ఉండుటకు పిలువబడిన వారే సంఘము" - (1 కొరింది. 1:9; యాకోబు. 4:4; 1 యోహాను. 1:3).

G) "దేవుని ప్రేమించి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారే సంఘము" - (రోమా. 8:28).

H) "నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందుటకు పిలువబడిన వారే సంఘము" - (హెబ్రీ 9: 15; ఎఫెసీ 1:17).

I) "సంఘము అను శరీరమునకు ఆయనే(క్రీస్తే) శిరస్సు" - (కొలస్సి 1:18).

J) "ఆ సంఘము ఆయన(క్రీస్తు) శరీరము"(సంఘము). - (ఎఫెసీ 1: 23).

K) "మనమందరము ఒక్క శరీరము'లోనికి' (సంఘము "లోనికి") లేక,శరీరముగా ఉండుటకు పిలువబడిన వారే సంఘము - (1కోరింథి 12: 13).

L) "తన స్వరక్తమిచ్చి సంపాదించిన వారే సంఘము" - (అపొ.కార్య 20:28).

M) "క్రీస్తునకు లోబడుటకు పిలువబడిన వారే సంఘము" - (ఎఫెసీ 5:24).

N) "క్రీస్తులాంటి కుమారులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు, పరలోక సంబంధమైన పిలుపునకు పిలువబడిన వారే సంఘము" - (ఎఫెసీ 1:6; 1కొరింథి 1:3;  హెబ్రీ 3:1).


【హెచ్చరిక】


● సంఘము అంటే ఒక భవనము, కట్టడము "కాదు".
● సంఘము అంటే మత శాఖ "కాదు".
📢 "సంఘము" అంటే "పరలోక సంబంధమైన సంస్థ".  💌 



మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక....ఆమేన్.    వందనములు
మనోహర్ & నవీన 
The churches of Christ greet you - Roma 16:16