దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
◆ గ్రీక్ 'లో' - "ἐκκλησίαν" (ekklēsian).
◆ లాటిన్ 'లో' - "ecclesia".
◆ ఇంగ్లీష్ 'లో' - "A calling Out Off".
◆ తెలుగు 'లో' - "సంఘము".
● ekklēsian (ఎక్లిషియా) అను గ్రీక్ పదము నుండే church(సంఘము) అనే పదము వచ్చింది.
● ekklēsian అనేది రెండు పదాల మిశ్రమమైనది.
"A calling Out Off" (సంఘము) అనగా "ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి పిలువబడిన వారు"
A) "మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు". - (1 పేతురు. 2:9).
● చీకటి (పాపము) అను స్థితిలో నుండి మరొక్క స్థితిలోనికి అనగా వెలుగు(నీతి లోనికి) పిలువబడిన వారే సంఘము.
B) "అపొస్తలలు యొక్క సువార్త ద్వారా పిలువబడిన సమూహమే సంఘము". - ( 2 దెస్స. 2:14).
● అపొస్తలులు ప్రకటించిన సువార్త కాక , ఇతర బోధలు (కలలు, దర్శనములు) ద్వారా మీరు పిలువబడితే నిజమైన వెలుగులోనికి పిలువబడిన వారు కాదు.
C) యేసు రక్తము ద్వారా "పునర్జన్మ సంబంధమైన" (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము వలన కడగబడిన వారె(బాప్తిస్మము ద్వారా) "మరో స్థితికి పిలువబడిన వారు" లేదా "సంఘము". - (ప్రకటన. 1:6; తీతుకు. 3:5; అపో.కార్య. 22:16).
D) "అంధకార సంబంధమైన అధికారపు స్థితి" నుండి మరొక స్థితికి అనగా "క్రీస్తు రాజ్యము"(సంఘము)గా ఉండుటకు పిలువబడిన వారే సంఘము - (కొలసి. 1:16).
E) "సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి పిలువబడిన వారే సంఘము" - (అపొ.కార్య. 26:18)
F) "ఈ లోక సహవాసము విడిచి "తండ్రితోను, కుమారునితోను" పరిశుద్ధ సహవాసముగా ఉండుటకు పిలువబడిన వారే సంఘము" - (1 కొరింది. 1:9; యాకోబు. 4:4; 1 యోహాను. 1:3).
G) "దేవుని ప్రేమించి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారే సంఘము" - (రోమా. 8:28).
H) "నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందుటకు పిలువబడిన వారే సంఘము" - (హెబ్రీ 9: 15; ఎఫెసీ 1:17).
I) "సంఘము అను శరీరమునకు ఆయనే(క్రీస్తే) శిరస్సు" - (కొలస్సి 1:18).
J) "ఆ సంఘము ఆయన(క్రీస్తు) శరీరము"(సంఘము). - (ఎఫెసీ 1: 23).
K) "మనమందరము ఒక్క శరీరము'లోనికి' (సంఘము "లోనికి") లేక,శరీరముగా ఉండుటకు పిలువబడిన వారే సంఘము - (1కోరింథి 12: 13).
L) "తన స్వరక్తమిచ్చి సంపాదించిన వారే సంఘము" - (అపొ.కార్య 20:28).
M) "క్రీస్తునకు లోబడుటకు పిలువబడిన వారే సంఘము" - (ఎఫెసీ 5:24).
N) "క్రీస్తులాంటి కుమారులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు, పరలోక సంబంధమైన పిలుపునకు పిలువబడిన వారే సంఘము" - (ఎఫెసీ 1:6; 1కొరింథి 1:3; హెబ్రీ 3:1).
【హెచ్చరిక】
● సంఘము అంటే ఒక భవనము, కట్టడము "కాదు".
● సంఘము అంటే మత శాఖ "కాదు".
📢 "సంఘము" అంటే "పరలోక సంబంధమైన సంస్థ". 💌
మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక....ఆమేన్. వందనములు
మనోహర్ & నవీన
2 comments
commentsGood topic sir thanks
ReplyVery good explanation brother ..... Sathya vakyam durakani rojulo vunamu anna ....
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com