"క్రీస్తు జన్మ ముఖ్య ఉద్దేశ్యము!" |
ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా మన తండ్రియైన దేవునిచేత ఈ లోకమునకు పంపబడి నేటికి 2000 సంవత్సరాలు దాటినా, ఆయన ఎందుకు జన్మించాడో ఇప్పటికీ చాలామంది సహోదరులకు పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. దేవుని సంకల్పము చొప్పున 2000 సంవత్సరాల క్రితం కన్యక గర్భము ధరించి, కుమారుని కని, ఆయనకు యేసు అను పేరు పెట్టెను (యెషయా. 7:14, మత్తయి. 1:21, లూకా. 1:31, యోహాను. 1:45).
ఆ యేసు ఈ లోకములో 331/2 సంవత్సరాలు జీవించి, ఎన్నో అద్భుత కార్యములు చేసి, అనేక శ్రమలు పొంది (యెషయా. 50:6; 53:3-10, మత్తయి. 26:27; 27:26-31, మార్కు. 14:65, యోహాను. 18:22; 19:1, 1 పేతురు. 3:21-24), కల్వరి సిలువలో మరణించి (1 కొరింధి. 15:1-4, 2 తిమోతి. 1:10), మూడవ దినమున తిరిగి లేపబడెను (లూకా. 24:20-24, అపొ. కార్య. 2:24, 10:40, 1 కొరింధి. 15:1-4).
ప్రియ స్నేహితుడా! యేసు ఎందుకు జన్మించెను? నీవు మరియు నేను ఈ అంధకార సంబంధమైన బంధకములతోనూ (ఎఫెసీ. 1:13), ఈ లోకాశల వలన కలుగు పాపములతోనూ (1 యోహాను. 2:15), అపరాధములతోనూ (ఎఫెసీ. 2:1-2) బాధింపబడియుండగా మన నిమిత్తము తండ్రియైన దేవుడు సంతాపమునొంది, మన యెడల కనికరపడి, క్రీస్తుని అనగా తన అద్వితీయ కుమారుని మనుష్యరీతిగా ఈ లోకమునకు పంపి (యోహాను. 3:16), ఆయన ద్వారా తన అనాది సంకల్పాన్ని నెరవేర్చి (1 పేతురు. 1:18-20), పరలోక సంబంధమైన రాజ్యమును (ఆత్మ సంబంధమైనది) ఈ భూలోకములో ఏర్పాటు చేసి (యెషయా. 2:2-4, లూకా. 17:20-21, అపొ. కార్య. 2:41-42), ఆ రాజ్యములో నిత్యము జీవించి (1 సమూయేలు. 7:12-16, దానియేలు. 4:32), ఆయన(తండ్రి)తోను, అలాగే తన కుమారుని(క్రీస్తు)తోనూ సహవాసము కలిగి యుండుటకు (రోమా. 14:17, 1 కొరింధి. 1:9, 1 యోహాను. 1:3), శాశ్వతమైన పరలోకమును (1 పేతురు. 1:3-4), నిత్యజీవమును పొందుకొనుటకు క్రీస్తుని మన రక్షకుడిగా (యేసు) ఈ లోకములో జన్మింపజేసెను (యోహాను. 3:36; 6:41,48; 17:2-3, రోమా. 2:7; 5:21; 6:22, 1 యోహాను. 5:10). మరి ఆ రక్షకుడు యేలుబడి చేస్తున్న ఆ రాజ్యములో అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) చేరాలని (లూకా. 1:33, అపొ. కార్య. 2:38-39,47; 22:16, ఎఫెసీ. 1:22-23, కొలస్సి. 1:18, రోమా. 16:16), తోటి పరిశుద్ధులవలె నిత్యజీవమును పొందుకోవాలని నీవు ఆశపడుతున్నావా? అయితే ఈ క్షణమే క్రీస్తును గూర్చిన మాటలు విని (యోహాను. 5:24, అపొ. కార్య. 8:5-6, రోమా. 10:17, ప్రకటన. 1:3), వినిన దానిని హృదయమందు విశ్వసించి (యోహాను. 8:24, అపొ. కార్య. 16:31, రోమా. 10:17, హెబ్రీ. 11:6), యేసుని దేవుని కుమారుడుగా మరియు ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని (మత్తయి. 10:32-33, యోహాను. 20:31, అపొ. కార్య. 9:36-38, రోమా. 10:10), రక్షింపబడుటకు బాప్తీస్మము పొంది ఆయన రాజ్యము(క్రీస్తు సంఘము)లో ప్రవేశించు (మార్కు. 16:16, అపొ. కార్య. 2:38; 22:16; 2:47, 1 పేతురు. 3:21).
నా ప్రియులారా, భూమ్యాకాశములను అందలి సమస్తమును సృజించిన మన దేవునికి ఏమియు కొదువలేదు (అపొ. కార్య. 17:25), మననుండి భౌతిక సంబంధమైన దినములు, పండుగలు, ఇతర ఆచారాలను ఆయన ఆశించట్లేదు (గలతీ. 4:10, కొలస్సి. 2:16), మనుష్యులు కల్పించిన పద్ధతుల ఆధారముగా తన కుమారుని పుట్టిన రోజుని ఘనముగా జరిపి “మేరీ క్రిస్టమస్” పేరుతో ఒక్కరోజు మాత్రమే భక్తిగా చేసే నామకార్థ లేదా వ్యర్థమైన ఆరాధనని ఆయన కోరుకోవట్లేదు (మత్తయి. 15:9).
ఆయన కోరుకునేది ఒక్కటే. మనము మన పాపముల విషయమై చనిపోయి క్రొత్త జన్మ ద్వారా నీతి విషయమై జీవించి (1 పేతురు. 2:24), తన కుమారుడైన క్రీస్తు సంఘములో చేరి (అపొ. కార్య. 2:47), పరిశుద్ధులతో సహవాసము కలిగి (కీర్తన. 133:1, 1 కొరింధి. 7:24, హెబ్రీ. 10:25, 1 యోహాను. 1:3), ఇహలోక మాలిన్యమునంటకుండా జాగ్రత్తపడి (యాకోబు. 1:27), నిష్కలంకముగా, నిర్దోషముగా, పరిశుద్ధముగా జీవించి (1 ధేస్సలోనిక. 2:11-12, తీతుకు. 2:12-13, హెబ్రీ. 10:22, 1 పేతురు. 1:14-16), క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు ధైర్యము కలిగి ఆయనను ఎదుర్కొని మనకు వాగ్ధానము చేయబడిన నిత్యజీవమును పొందుకొనుటయే (1 ధేస్సలోనిక. 4:14-18, 1 పేతురు. 1:4-5, 1 యోహాను. 2:24-25; 3:2).
1 comments:
comments🙏🙏👌👍🆗️💯
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com