💌 అంశము: "క్రైస్తవుడు, ఏ పండుగను చేయాలి..?" మరియు "ఎప్పుడు చేయాలి"..?
నా తోటి అమూల్యమైన విశ్వాసము పొందినవారికి మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము(OT & NT) 'లో' పలురకాల పండుగలను మనము చూడగలము. వాటిని మనము వాక్య పరిశీలన చేసిన పిమ్మట క్రైస్తవుడు ఏ పండుగను చేయాలి? అనే ఒక నిర్ధారణకి వద్దాము.
📚 పాత నిబంధన పండుగలు 📚
👉 "పస్కా పండుగ" లేదా "పులియని రొట్టెలు పండుగ" - ( లేవి 23:5; నిర్గమ 12:1-27; లుకా 22:1 ).
👉 "ప్రథమ ఫలములు పండుగ" లేదా "పెంతుకోస్తు పండుగ"- (లేవి 23:9-21; నిర్గమ 34:22; అపో.కార్య 2:1-2).
👉 "జ్ఞాపకార్ద శృంగధ్వని పండుగ" - (లేవి 23:23-25).
👉 పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ - (లేవి 23:26-32).
👉 "పర్ణశాల పండుగ" లేదా "గుడారాల పండుగ" - (లేవి 23:33-35, 39-44).....etc
* గమనిక: (మరి కొన్ని పండుగలు కలవు).
📢 ఒక్కొక పండుగ గూర్చి ఒక్కొక ఉదేశ్యము కలదు.
📢 పైన తెలిపిన ఆ పండుగలు అన్నిటిని గూర్చి నేను వివరణ ఇవ్వడము లేదు కానీ ఆయా పండుగలును మోషే ద్వారా "ఇశ్రాయేల్ ప్రజలకి" లేదా "యాకోబు 12 గోత్రముల ప్రజలకి" నిత్యమైన కట్టడగా మన తండ్రియైన దేవుడు ఇచ్చారు".
📢 వారికి ఇవ్వబడిన పండుగల విషయములో ఉల్లగించుట చేత దేవుడు కోపముతో పలికిన మాటలు
"మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను". - (ఆమోసు 5:21).
📖 క్రొత్త నిబంధన పండుగలు 📖
యేసు మరణము, సమాధి, పునరుత్థానము,(1 కోరింది 15:3-4) సంఘముస్థాపన (అపో.కార్య. 2:41-42) పిమ్మట క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చింది.
👉 "పులియని రొట్టె'తో' పండుగ" లేదా "ప్రభువు బల్ల" - (1 కోరింది 5:7-8; 10:21; 11:23-29).
💎 హెచ్చరిక:
గుడ్ ఫ్రైడే, మట్టల ఆదివారం, ఈస్టర్, సమాధులు పండుగ, క్రిస్టమస్... etc ఈ పండుగలును పరిశుద్ధ గ్రంథములో ఇప్పటికి నేను చూడలేదు. కారణము ఇవి అన్నియు మానవ యోచన వలనే కలిగాయి. దేవుడు వీటిని చేయమని మనకు కట్టడగా ఇచ్చినట్టుగా బైబిల్ లో ఒక్క వాక్య ఆధారము కూడా లేదు.
💌 "క్రైస్తవుడు, ఏ పండుగను చేయాలి..?
* "మొట్ట మొదట" అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. - (అపో.కార్య 11:26)
* క్రైస్తవుడు "పులియని రొట్టెతో పండుగను ఆచరింతము" లేదా "ప్రభువు బల్లను జ్ఞాపకము చేసుకోవాలి". - (1 కోరింది 5:7-8; 10:21; 11:23-29).
💡 పాత నిబంధనలో పస్కా పశువుగా "గొఱ్ఱె పిల్లను, మేక పిల్లను" బలి ఇవ్వవలసిన అవసరము ఉంది. - (నిర్గమ 12:3-4 & 21).
💡 క్రొత్త నిబంధనలో పస్కా పశువుగా "క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను" - (1 కోరింది 5:7; యెషయా 53:7; అపో.కార్య. 8:32; ప్రకటన 5:10)
📖❣ క్రీస్తు శరీరము(బలి), రక్తము సూచనగా రొట్టె, ద్రాక్ష రసమును క్రైస్తవుడు జ్ఞాపకము చేసుకోనుటయే "పులియని రొట్టతో పండుగ" లేదా "ప్రభువు బల్ల కార్యక్రమము" - (1 కోరింది 11:23-29; మత్తయి 26:26-29; మార్క 14:22-25; లుకా 22:17- 21) ❣📖
💌 "క్రైస్తవుడు, ఈ పండుగను ఎపుడు చేయాలి"..?.
👉 యేసు పునరుత్థాన దినము అనగా ఆదివారము నాడు క్రైస్తవులు ఆ పండుగను లేదా ప్రభువు బల్లను జ్ఞాపకము చేసుకోవాలి. - (మత్తయి 28:1; మార్క్ 16:2; లుకా 24:1; యోహాను 20:1).
👉 "నా శరీరము"; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
👉 "నా రక్తము" వలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. - (1 కోరింది 11:24-25).
👉 "సంఘము స్థాపన" మరియు "రొట్టె విరుచుటకు కూడుకున్న దినము" - (అపో.కార్య. 2:42; 20:7).
💎 గమనిక: ఆదిమ సంఘము వారు ఆదివారము నాడే రొట్టె విరుచుట లేదా పులియని రొట్టె'తో' పండుగ లేదా ప్రభువు బల్ల కార్యక్రముము యెడతెగక చేశారు.
💎 ఆదిమ క్రైస్తవులు సవoత్సరము ఒక్కసారి అని, ఈస్టర్ పేరుతో, మరో విషయములో వారు అయోగ్యముగా ఆ పండుగను జరుపలేదు.
💎 ఎందరైతే ప్రభువు యొక్క రొట్టెను, పాత్ర లోనిది అయోగ్యముగా తీసుకొంటారో వారు దేవుని దృష్టిలో అపరాధియగును - (1 కొరింధీ 11:27).
నా ప్రియులారా, ఓపికతో చదివి, వాక్య పరిశీలన చేసి సత్యమును గ్రహిచినందుకు మరో సారి మీకు నా వందనములు. - (ఫిలిప్పీ 4: 21).

5 comments
commentsGood Post Bro. KM
ReplyThank You
ReplySmall mistakes are there....
Replywhat...?
ReplyNice bro
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com