“పులిపిండి”


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 


ప్రభువైన యేసు శరీరధారియై యున్న దినాలలో తన తండ్రి యొద్ద చూచిన మరియు వినిన సంగతులను ఇతరులకు అర్థమయ్యే  రీతిలో అంతేకాకుండా వారు ఆలోచన చేసి తమలో తాము మెచ్చుకునే విధంగా తన శైలిలో తాను బోధించేవాడు.  ఆయన తానేమి బోధించేవాడు అది తన జీవితంలో, ప్రవర్తనలో చాలా స్పష్టంగా కనపరిచేవాడు. వినేవారు ఎటువంటి జ్ఞానం లేనటువంటి వారైనా వారి కంటికి కగుపడే విషయాలనే ఉదాహరణలుగా తీసుకొని  ఉపమాన రీతిగా ఆత్మీయ విషయాలను/దైవ సంకల్పాన్ని వివరించేవాడు. అలా వివరించిన వాటిలో ముఖ్యమైనటువంటి ఉపమానం “పులిపిండి”(Leaven)


పులిసిన పిండి కొంచెమే అయినప్పటికీ పిండంతటిని పులియజేసే శక్తి కలిగితింటుంది కనుకనే  ప్రభువు ఈ పదాన్ని ఉపయోగించి “కపటత్వం, తప్పుడు బోధ, లోకాసక్తి మరియు పాప ప్రభావం గురించి” తెలియజేస్తూ తన శిష్యులకు హెచ్చరించాడు. "... పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి." (లూకా. 12:1) "అప్పుడు యేసు– చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను." (మత్తయి. 16:6). ఈ హెచ్చరిక ద్వారా ప్రభువు తన శిష్యులకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేశాడు చిన్న చెడు ప్రభావం కూడా ఆత్మీయ జీవితాన్ని మరియు సంఘాన్ని పూర్తిగా ప్రభావితం చేయగలదు.


కావున నేడు మనం ఈ అధ్యయనంలో పులిపిండి ఎవరి గురించి చెప్పబడింది? వారి స్వభావం ఏమిటి? మరియు విశ్వాసులు ఎలా జాగ్రత్తపడాలి? అనే విషయాలను గూర్చి పరిశీలిద్దాం. 📖


క్రొత్త నిబంధన నాలుగు రకాలైనటువంటి పులిసిన పిండి గూర్చి తెలియజేసింది.

1. పరిసయ్యుల పులిపిండి

2. సద్దూకయ్యుల పులిపిండి

3. హేరోదు పులిపిండి

4. పాపపు పులిపిండి (సంఘములో — దిద్దుబాటు లేనివారు…).



1️⃣. పరిసయ్యుల పులిపిండి

"అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను– పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి." (లూకా. 12:1)


అర్ధం : పరిసయ్యుల పులిపిండి అంటే కపటత్వం. బయటకు భక్తిగా కనిపించి లోపల పాపంతో జీవించే వారి స్వభావం.


📍లక్షణాలు :

𒊹 ధర్మశాస్త్రం మాకు బాగుగా  తెలిసు అనే అహంకారంతో జీవించేవారు. (మత్తయి 23:2-3; రోమా 2:17-2; లూకా 18:9-11).  

𒊹 అధికారం కోసం దేవుని పేరును ఉపయోగించేవారు. (మత్తయి 23:6-7; యోహాను 11:48; 3 యోహాను 1:9)

𒊹 మనుష్యుల చేత మెప్పు పొందడానికే భక్తి చూపేవారు. (మత్తయి 6:1; మత్తయి 23:5; గలతీ 1:10)

𒊹 ధన వ్యామోహం కలిగినవారు. (లూకా 16:14; 1 తిమోతికి 6:10; మత్తయి 23:14)

𒊹 ఇతరుల లోపాలు మాత్రమే చూస్తారు కానీ వారి లోపాలను దిద్దుబాటు చేసుకొనరు. (మత్తయి 7:3-5; లూకా 6:41-42; యోహాను 8:3-9)

𒊹 వారికిష్టమైన వారిని పక్షపాతంగా చూస్తారు. (యాకోబు 2:1-4; లూకా 20:46-47; మత్తయి 23:16-22)

𒊹 దేవునికంటే తమను తాము హెచ్చించుకునేవారు. (లూకా 18:11-12; మత్తయి 23:12; రోమా 12:3)

𒊹 దేవుని నీతిని పక్కనబెట్టి స్వనీతిని ప్రకటించేవారు/నడుచుకొనేవారు (రోమా 10:3; లూకా 16:15; ఫిలిప్పీయులు 3:9)

𒊹 భక్తి రూపంలో పాపాలను దాచుకునేవారు, సరిచేసుకొనని వారు. (మత్తయి 23:27-28; తీతు 1:16; 2 తిమోతికి 3:5)

𒊹 ఇతరులకు చూపడానికే/కనపరుచుకోవడానికే ప్రార్థనలు చేసేవారు, వేషధారణ.  (మత్తయి 6:5; లూకా 20:47; మత్తయి 23:14)


ఈ లక్షణాలు ప్రధానంగా పరిసయ్యుల కపటభక్తి (Hypocrisy) గురించి యేసు ప్రభువు మత్తయి 23 అధ్యాయంలో తీవ్రంగా గద్దించారు.



2️⃣. సద్దూకయ్యుల పులిపిండి

"అప్పుడు యేసు– చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను." (మత్తయి. 16:6)


అర్ధం : సద్దూకయ్యుల పులిపిండి అంటే తప్పుడు బోధ మరియు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం.


📍లక్షణాలు :

𒊹 పునరుత్థానాన్ని నమ్మరు (మత్తయి 22:23; అపొస్తల కార్యములు 23:8)

𒊹దేవదూతలను నమ్మరు. (అపొస్తల కార్యములు 23:8)

𒊹 ఆత్మల లోకాన్ని/ఆత్మలు ఉన్నాయని నమ్మరు (అపొస్తల కార్యములు 23:8)

𒊹 లేఖనములను సరిగ్గా అర్థం చేసుకోలేరు (మత్తయి 22:29)

𒊹దేవుని శక్తిని వారియొక్క స్థాయివరకు మాత్రమే పరిమితం చేస్తారు. (మత్తయి 22:29; లూకా 20:37-38)

𒊹 యేసును పరీక్షించడానికి/ తృణీకరించే  విధానంలో ప్రశ్నలు అడుగుతారు. (మత్తయి 22:23-28; మార్కు 12:18)

𒊹 రాజకీయ మరియు అధికార ప్రయోజనాలకు దగ్గరగా ఉంటారు. (అపొస్తల కార్యములు 5:17; యోహాను 11:47-53)

𒊹 దేవుని కార్యాన్ని వ్యతిరేకిస్తారు. (అపొస్తల కార్యములు 4:1-2)

𒊹 సువార్త బోధను/సత్య ప్రకటన ఆపడానికి ప్రయత్నిస్తారు (అపొస్తల కార్యములు 5:17-18)

𒊹ఆధ్యాత్మిక సత్యాల కంటే భౌతిక ఆలోచనలకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. (మత్తయి 22:30; 1 కొరింథీయులు 2:14)


సద్దూకయ్యుల పులిపిండి = అవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక విషయాలను తిరస్కరించడం. 



3️⃣. హేరోదు పులిపిండి

"ఆయన– చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా" (మార్కు. 8:15)


అర్ధం : హేరోదు పులిపిండి అంటే లోకాసక్తి, అధికార దాహం. 


📍లక్షణాలు :

𒊹 అధికారం కలిగి కూడ దేవుని మాటకు లోబడనివాడు. (లూకా 13:31-32; మత్తయి 2:3-8)

𒊹 నీతిని లెక్కచేయని జీవిత విధానం. (మార్కు 6:17-18)

𒊹 ప్రజలచేత మన్నలను పొందాలనే ఆలోచన కలిగినవాడు. (మత్తయి 14:5; మార్కు 6:20; గలతీ. 1:10)

𒊹 సత్యం చెప్పేవారిని చూసి సహించలేరు. (మార్కు 6:19, 27)

𒊹 తాను చేయాలనుకున్నది ప్రజలమీద రుద్దేవాడు, అందరూ నా మాటే వినాలనుకునేవాడు. (మత్తయి 2:16; లూకా 3:19-20)

𒊹 సత్యం వినినా మార్పు లేకపోవడం (మార్కు. 6:20)

𒊹 ప్రజలను భయపెట్టి తన మాటలను బలవంతంగా వినిపించేవాడు. (మత్తయి 2:16; అపొస్తల కార్యములు 12:1-3)

𒊹 సత్యం కన్నా ప్రజాభిప్రాయాన్ని ఎక్కువగా చూడటం.

𒊹 తన అధికారానికి భంగం కలిగితే సహించనివాడు, ఇతరులను తృణీకరించేవాడు. (మత్తయి 2:3; అపొస్తల కార్యములు 12:2)

𒊹 వినోదం కోసం ఆధ్యాత్మిక విషయాలను సరదాగా తీసుకోవడం (లూకా 23:8)

𒊹 దేవుని కంటే తన కుర్చీ, సింహాసనానికే విలువనిచ్చేవాడు. (అపొస్తల కార్యములు 12:21-23; దానియేలు 4:30)

𒊹 సత్యాన్ని/సత్య సంబంధులను అవమానించడం (లూకా 23:11)

𒊹 నీతి,న్యాయం, సత్యం కంటే రాజకీయ ప్రయోజనం ముఖ్యమని భావించడం. (లూకా 23:12)

హేరోదు పులిపిండి = అధికార దాహం,  ప్రజల మన్నన, లోకాసక్తి మరియు సత్యం వినిన మార్పు లేనివాడు.



4️⃣. పాపపు పులిపిండి 
"మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.౹ ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసినవారు కారు.౹ నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండి నట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.౹ ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతోకూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.౹ మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?౹" (1 కోరింది. 8:1-6)


అర్థం : సంఘంలో ఉన్న పాప ప్రభావం/పాపంలోనే ఉండే విశ్వాసులు/ క్రీస్తును ధరించి కూడా జీవితములో మార్పు లేనివారు పులిపిండి లాంటివారే.


📍 లక్షణములు : 
𒊹 పాప జీవితం సంఘ పవిత్రతను చెడగొడుతుంది. (1 కొరింథీయులు 5:7; ఎఫెసీయులు 5:11)
𒊹 కృప ఉందని చెప్పుకొని/బోధిస్తూనే పాపంలో జీవిస్తారు. (రోమా 6:1-2; యూదా 1:4)
𒊹 సంఘ శిక్షణను తిరస్కరించేవారు/తప్పును చూపిన వినరు (మత్తయి 18:15-17; 2 థెస్సలొనీకయులు 3:14)
𒊹 ఎప్పటికీ బాల్య స్థితిలోనే ఉండువారు (హెబ్రీయులు 5:12-13; ఎఫెసీయులు 4:14)
𒊹 సంఘ ఐక్యతను/క్రమమును/పద్ధతులను/అపోస్తలుల ఆచారాలను చెడగొట్టేవారు (రోమా 16:17; తీతు 3:10)
𒊹 ఇట్టివారు బయటికి వినయంగా, భక్తిగా కనపడినప్పటికి... లోపల మార్పు లేనివారు/కోరుకొనని వారు. (2 తిమోతికి 3:5)
𒊹 వారి మాటలు చూస్తే పైకి క్రైస్తవులు/సువార్తకులుగా అగుపడతారు కానీ జీవితంలో మార్పు లేనివారు. (తీతు 1:16; మత్తయి 7:16-20)
𒊹 చెడు స్నేహాలు, సంఘంలో చెడు నడవడికను చూపేవారు (1 కొరింథీయులు 15:33; 2 తిమోతికి 2:17)
𒊹పాపాన్ని లెక్కచేయకుండా జీవించేవారు (1 కొరింథీయులు 5:6; గలతీయులు 5:9)
𒊹 పాపంలో కొనసాగుతూ పశ్చాత్తాపం లేనివారు. (1 కొరింథీయులు 5:1-2; హెబ్రీయులు 10:26)
𒊹 దేవుని రాజ్యములో వారసత్వం కోరుకొనని వారు (1 కోరింది. 6:9-10)
𒊹 శరీర కార్యములు జరిగించేవారు (గలతీ 5:19-21)
𒊹 అనర్హులు (ఎపేసి 5:1-7)


“పాత పులిపిండిని తొలగించుడి, మీరు కొత్త పిండిగా ఉండునట్లు..” (1కొరింథీయులు 5:7)
అంటే సంఘంలో పాపం, కపటం, చెడు ప్రభావం, అన్యాయం, సంఘం యొక్క నియమం విభేదించుట, కృపను తృణీకరించుట...ఇవి పులిపిండి వలె వ్యాపిస్తాయి, అందువల్ల విశ్వాసులు పవిత్రతతో జీవించాలి.


📖 విశ్వాసులు ఎలా జాగ్రత్తపడాలి?
A : తప్పుడు బోధల నుండి జాగ్రత్త పడాలి- (మత్తయి. 16:6; లూకా 12:1; యూదా 1:4)
B : కపటత్వం విడిచిపెట్టడం - (1 పేతురు. 2:1)
C : పాత పులిపిండిని తొలగించడం - (1కొరింథీయులు. 5:7)
D : చెడు సహవాసం నివారించడం - (1కొరింథీయులు 15:33)
E : వాక్యంతో పరీక్షించడం, చేపట్టడం - (అపో కార్య. 17:11; 2 దేస్స 2:14-15)
F : సంఘ పరిశుద్ధత కాపాడడం - (1 కోరింది 5:6; 6:19; 1 దేస్స 4:4; రోమా. 6:19; ఎపేసి 5:25)
G : అపోస్తలుల బోధలో గట్టిగా నిలవడం - (అపో.కార్య. 2:41-42; 2 దేస్స 2:14-15)
H : సంఘ క్రమశిక్షణ - (మత్తయి. 18:15)
I : తప్పుడు బోధకులను దూరంగా ఉంచడం - (రోమా 16:17)
J : నిష్కపట జీవితం కలిగి ఉండటం - (1 కొరింథీయులు 5:8)
కొంచెం పులిపిండి పిండంతటిని పులిపించినట్లు, కొంచెం చెడు ప్రభావం కూడా సంఘమంతటిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి విశ్వాసులు వాక్యాధారంగా జాగ్రత్తగా జీవించాలి. 📖🙏🏿


🫂 ముగింపు :
మన ప్రభువైన యేసు మన నుండి కోరుకునే జీవితం పులిపిండి లేని జీవితం మరి ముఖ్యంగా పులిపిండి లేని క్రీస్తు సంఘమును. కావున విశ్వాసులు తప్పుడు బోధలు, కపటత్వం, చెడు సహవాసం మరియు పాపపు ప్రభావం నుండి జాగ్రత్తగా ఉండాలి. పాత పులిపిండిని తొలగించి సత్యము మరియు నిష్కపటత్వముతో జీవించాలి.


"మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?౹ మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింప బడెను౹ గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కా పట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము." (1కొరింథీయులు. 5:6-8)


అందువల్ల ప్రతి విశ్వాసి తన జీవితం మరియు సంఘాన్ని పరిశీలించుకొని పులిపిండి స్వభావం లేకుండా పరిశుద్ధమైన జీవితం గడపవలెను. 🙏🏿

మీ ఆత్మీయులు 👪

- క్రైస్తవుల పండుగ - క్లిక్ చేయు

WhatsApp Channel - 2k Join Now
Telegram Group - 600 Join Now
Instagram Page - 500 Follow page

Questions and Comments here!

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16