సాతాను పరలోకములో ఉండే ఒక దేవదూతా..? (Is Satan angel in the heaven?)

"సాతాను పరలోకములో ఉండే ఒక దేవదూతా..?"

సహోధరుకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

నేడు క్రైస్తవ్యములో అనేక మంది బోధకులు వాక్యమును పరిశీలన చేయలేక దేవుని గ్రంధమును అపార్ధము చేసుకొనుచున్నారు. ఆ విషయములో "సాతాను అంటే పరలోకములో ఒక దేవదూత అని, వాడు పరలోకము నుండి త్రోసి వేయబడ్డాడు అని...etc ఇలాంటి వాక్య ఆధారములు లేని మాటలు చెపుతూన్నారు. అటువంటి వారు యొక్క బోధలు నుండి మిమ్మలి మీరు జాగర్త వహి౦చుకొనుటకు కొన్ని సంగతులు రాస్తున్నా వాక్య పరిశీలన చేసి, ఆలోచన చేయగలరు అని ప్రభువు నందు కోరుతున్నా...

 ❣ సాతాను లేదా అపవాది యొక్క పుట్టుక పుర్వ్వాత్వము గూర్చి పరిశుద్ధ గ్రంధము మనకి సెలవు ఇవ్వలేదు.
❣ "మొదట(Beginning) నుండి పాపము చేయుచున్నాడు అని" (1 యోహాను. 3:8).
❣ "ఆది(Beginning) నుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు అని" (యోహాను. 8:44).
❣ "సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము..." (ప్రకటన. 12:9).

● వీటికి మించి (జగ్గత్తు పునాది వేయబడక మునుపు) మన గ్రంధము వాడు గూర్చి ఏమియు సెలవు ఇవ్వలేదు.

∆ 2 పేతురు. 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.
దేవుడు తీర్పుకు కావలిలో పరలోకములో ఉండే దేవదూతలు ఉంచారా? వీటిని గూర్చి ఆలోచన చేసే ముందు పరలోకములో ఉన్న దేవదూతలు నిజముగా పాపము చేసారా? అనేది తెలుసుకొందాము.

★ కెరూబులు ★
(నిర్గామకాండము. 25:16-22; ఆది.కాండము.3:24; యెహేజ్కేలు.10:18-20)
ఈ వచనములో కేరూబులు పాపము చేసినట్టుగా కనిపిచడము లేదు. ఒక వేళా పాపము చేస్తే తండ్రినైన దేవుడు  ఏదెను తోట లో నుండి ఆదాము వెళ్లి గొట్టి కెరూబులును పెట్టేవారు కాదు కదండి.

 ★ సెరాపులు ★ 
(యేషయా. 6:2-3; ప్రకటన. 4:8)
ఈ వచనములో "రెండు రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురు చుండెను" సెరాపులు పాపము చేసినట్టుగా కనిపిచడము లేదు.  వీరు యొక్క పని "యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నవారు"

★ జగత్తు పునాది వేయబడక మునుపు దేవదూతలు పాపము చేసి ఉండవచ్చునేమో అని అనుకుంటే దానికి వాక్యము ఇలా సెలవు ఇస్తుంది.  "దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసిరి"- (యోబు. 38:4-11)

◆ మరల ఒక వేళా పాపము చేసిఉండవచు అని ఆలోచన నీకు కలుగుతే ఇక్కడ కొందఱు దేవదూతలు  పాల్గొని, మరి కొందఱు వ్యతిరేకిచినట్టుగా గ్రంధము తెలియపరచలేదు.

★ "లోకము పుట్టక మునుపు పరలోకములో దేవదూతలు పాపము చేసారు అనేది పచ్చి అబద్దము" 



★  మరి 2 పేతురు 2:4 లో దేవుడు తీర్పుకు కావలిలో పరలోకములో ఉండే దేవదూతలు ఉంచారా? "లేదు" అని ఖండితముగా చెప్పాలి కారణము..

 ● "తీర్పు దేహము ధరి౦చిన మానవులకే గాని ఆత్మగా ఉన్నవారుకి కాదు" (2 కోరింది. 5:10)
పోనీ మనము వీరును నిజముగా దేవదూతలు అని అనుకుంటే (ఎపేసి. 6:12; 1 పేతురు. 5:8) ఈ వచనములు గూర్చి ఆలోచన చేయవలసిన అవసరము ఎంతో ఉంది.


★ యెహోవా దూతలు అన్నా, దేవ దూతలు అన్నా ఒక్కటే అర్ధమా...? అవును

● దూత అనగా అర్ధము " రాయబారి".

* యెహోవా దూతయైన హగ్గయి - (హగ్గయి. 1:13)
* యెహోవా దూతలు - (ఆది.కాండము. 16:7; 22:11-15; నిర్గమ. 3:2; మలాకీ. 2:7-8)
* ఎపఫ్రొది దూత - (ఫిలిప్పీ. 2:25)
* తీతు  సంఘముపు దూత - (2 కొరింథీ. 8:23).
* దేవుని దూత (అపొ. కార్య. 10:3,4)
* ప్రభువు దూత (అపొ. కార్య. 12:7&23).


★ యెహోవా యాజకులు 

★  మరి "2 పేతురు. 2:4" లో ఉండే దేవదూతలు ఎవరు..?

◆ సమాధానము --  యాజకులు

పాపము చేసిన వారు ఆహారోను సంతతి వారు అయిన యాజకులని దేవుడు తెలియపరిచారు.
 "యాజకులు సైన్య ములకు అధిపతియగు యెహోవా దూతలు" గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞాన మునుబట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి, లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసియున్నారు. (మలాకీ. 2:7-8).

● యెహోవా దూతలు అన్నా, దేవ దూతలు అన్నా ఒక్కటే అర్ధము.

● తమ "ప్రధానత్వమును" నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. (యుదా 6 వచనము).

● ఈ యాజకులు పాత నిబంధన కాలములో యెహోవ దుతలుగా పిలువబడ్డారు. వీరు యొక్క ప్రజలో యజమనులుగాను (లేవి. 21:4), హోమద్రవ్యము అర్పించువారు(లేవి. 21:8) ధూపము వేయుటకు ప్రతిష్టమ౦పబడినవారుగాను(2 దిన. 26:18) యజమానుడు, ప్రతిష్టడు, పరిశుద్దడు గాను పిలువబడినవారె (లేవి. 21:3-9) చివరికి వారు యొక్క " ప్రధానత్వమును" కాపాడుకోలేక జ్ఞానమునుబట్టి బోధిస్తు, వారి పక్షమున ఏలుబడి చేస్తూ, దేవుని మార్గము తప్పి, వంచకులుగా మారారు. (యిర్మయా. 5:30-31; మలాకీ. 2:8-9; యిర్మయా. 6:13). వీరునే దేవుడు విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచారు (2 పేతురు. 2:4).


★ యోబు కాలములో అపవాది దేవదూతగా దేవుని సన్నిధికి వెళ్లాడా? ఎందుకు వెళ్ళాడు?

యోబు కాలములో అపవాది "దేవదూతగా" దేవుని సన్నిధికి వెళ్ళలేదు.

ఒక అపవాదిగానే వెళ్ళాడు అని, "దేవుని చేత ఎక్కడ నుండి నీవు వచ్చావు" అని ప్రశ్న వేయబడ్డాడు అని గ్రంధము తెలియపరుస్తుంది (యోబు. 1:7; 2:2)

● ఎందుకు వెళ్ళాడు..? అనే సందేహము కూడా కలుగ వచ్చు దానికి గ్రంధము నుండి ఆలోచన చేస్తే " రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము స్థాపన చేయుటకు" (ప్రకటన. 12:10).


 ★ అపవాది పతనము ★ 

■ యేసు మాటల్లో (లుకా. 10:18-20) క్రీస్తు అధికారము రావడము తో అపవాది యొక్క అధికారము ప్రడద్రోయ బడినది. (ప్రకటన. 12:7-10).
 "యెడమవైపున ఉండువారిని చూచిశపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని(అనగా-సాతనుకును) వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని లోనికి పోవుడి". - (మత్తయి. 25:41).
■ "గురుగులు  అగ్నిలో కాల్చివేయబడును" - (మత్తయి. 13:24-30; 36-43).


★ యెషయా. 14:12-14 ; యెహేజ్కేలు. 28:1-19 వచనములు సాతాను గూర్చిహ..?

◆ సమాధానము - కాదు సుమా.

* యెషయా 14:12-14 :- "బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము".
* యెహేజ్కేలు 28:1-19 :- "తూరు రాజును గూర్చి అంగలార్పువచనమెత్తి".


✝✝ బైబిల్ కి శత్రువులు ఎవరో కాదు వాక్యమును సరిగ్గా చూడక, ఆలోచన చేయలేని వారే ✝✝

కాబట్టి నా ప్రియులరా, మీరు వినుచున్న ఏమైనా కానీ గుడ్డిగా నమ్మక మొదటి శతబ్దిపు విశ్వాసులుకు వలె "చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధన చేయుటము అలవాటు చేసుకోండి" - (అపో.కార్య. 17:11) .

మీ ఆత్మీయ సహోదరుడు,
❣ మనోహర్_నవీన

Share this

Related Posts

Previous
Next Post »

1 comments:

comments
October 15, 2019 at 1:49 PM delete

thank you brother good message and information

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16