"క్రైస్తవుడు, ఏ పండుగను చేయాలి..?" మరియు "ఎప్పుడు చేయాలి"..?

💌 అంశము: "క్రైస్తవుడు, ఏ పండుగను చేయాలి..?" మరియు "ఎప్పుడు చేయాలి"..? 


నా తోటి అమూల్యమైన విశ్వాసము పొందినవారికి మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము(OT & NT) 'లో' పలురకాల పండుగలను మనము చూడగలము. వాటిని మనము వాక్య పరిశీలన చేసిన పిమ్మట క్రైస్తవుడు ఏ పండుగను చేయాలి? అనే ఒక నిర్ధారణకి వద్దాము.

📚  పాత నిబంధన పండుగలు 📚

👉 "పస్కా పండుగ" లేదా "పులియని రొట్టెలు పండుగ" - ( లేవి 23:5; నిర్గమ 12:1-27; లుకా 22:1 ).
👉 "ప్రథమ ఫలములు పండుగ" లేదా "పెంతుకోస్తు పండుగ"- (లేవి 23:9-21; నిర్గమ 34:22; అపో.కార్య 2:1-2).
👉 "జ్ఞాపకార్ద శృంగధ్వని పండుగ" - (లేవి 23:23-25).
👉 పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ - (లేవి 23:26-32).
👉 "పర్ణశాల పండుగ" లేదా "గుడారాల  పండుగ" - (లేవి 23:33-35, 39-44).....etc

* గమనిక: (మరి కొన్ని పండుగలు కలవు).

📢 ఒక్కొక పండుగ గూర్చి ఒక్కొక ఉదేశ్యము కలదు.
📢 పైన తెలిపిన ఆ పండుగలు అన్నిటిని గూర్చి నేను వివరణ ఇవ్వడము లేదు కానీ ఆయా పండుగలును మోషే ద్వారా "ఇశ్రాయేల్ ప్రజలకి" లేదా "యాకోబు 12 గోత్రముల ప్రజలకి" నిత్యమైన కట్టడగా మన తండ్రియైన దేవుడు ఇచ్చారు".
📢 వారికి ఇవ్వబడిన పండుగల విషయములో ఉల్లగించుట చేత దేవుడు కోపముతో పలికిన మాటలు
"మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను". -  (ఆమోసు 5:21).

📖 క్రొత్త నిబంధన పండుగలు 📖

యేసు మరణము, సమాధి, పునరుత్థానము,(1 కోరింది 15:3-4) సంఘముస్థాపన (అపో.కార్య. 2:41-42) పిమ్మట క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చింది.

👉 "పులియని రొట్టె'తో' పండుగ" లేదా "ప్రభువు బల్ల" - (1 కోరింది 5:7-8; 10:21; 11:23-29).


💎 హెచ్చరిక:
గుడ్ ఫ్రైడే, మట్టల ఆదివారం, ఈస్టర్, సమాధులు పండుగ, క్రిస్టమస్... etc ఈ పండుగలును పరిశుద్ధ గ్రంథములో ఇప్పటికి నేను చూడలేదు. కారణము ఇవి అన్నియు మానవ యోచన వలనే కలిగాయి. దేవుడు వీటిని చేయమని మనకు కట్టడగా ఇచ్చినట్టుగా బైబిల్ లో ఒక్క వాక్య ఆధారము కూడా లేదు.

💌 "క్రైస్తవుడు, ఏ పండుగను చేయాలి..?

* "మొట్ట మొదట" అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. - (అపో.కార్య 11:26)

* క్రైస్తవుడు "పులియని రొట్టెతో పండుగను ఆచరింతము" లేదా "ప్రభువు బల్లను జ్ఞాపకము చేసుకోవాలి". - (1 కోరింది 5:7-8; 10:21; 11:23-29).

💡 పాత నిబంధనలో పస్కా పశువుగా "గొఱ్ఱె పిల్లను, మేక పిల్లను" బలి ఇవ్వవలసిన అవసరము ఉంది. - (నిర్గమ 12:3-4 & 21).
💡 క్రొత్త నిబంధనలో పస్కా పశువుగా "క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను" - (1 కోరింది 5:7; యెషయా 53:7; అపో.కార్య. 8:32; ప్రకటన 5:10)

📖❣ క్రీస్తు శరీరము(బలి), రక్తము సూచనగా రొట్టె, ద్రాక్ష రసమును క్రైస్తవుడు జ్ఞాపకము చేసుకోనుటయే "పులియని రొట్టతో పండుగ" లేదా "ప్రభువు బల్ల కార్యక్రమము"  - (1 కోరింది 11:23-29; మత్తయి 26:26-29; మార్క 14:22-25; లుకా 22:17- 21) ❣📖

💌 "క్రైస్తవుడు, ఈ పండుగను ఎపుడు చేయాలి"..?.

👉 యేసు పునరుత్థాన దినము అనగా ఆదివారము నాడు క్రైస్తవులు ఆ పండుగను లేదా ప్రభువు బల్లను జ్ఞాపకము చేసుకోవాలి. -  (మత్తయి 28:1; మార్క్ 16:2; లుకా 24:1; యోహాను 20:1).

👉 "నా శరీరము"; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
👉 "నా రక్తము" వలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. - (1 కోరింది 11:24-25).

👉 "సంఘము స్థాపన" మరియు "రొట్టె విరుచుటకు కూడుకున్న దినము" - (అపో.కార్య. 2:42; 20:7).

💎 గమనిక: ఆదిమ సంఘము వారు ఆదివారము నాడే రొట్టె విరుచుట లేదా పులియని రొట్టె'తో' పండుగ లేదా ప్రభువు బల్ల కార్యక్రముము యెడతెగక చేశారు.
💎 ఆదిమ క్రైస్తవులు సవoత్సరము ఒక్కసారి అని, ఈస్టర్ పేరుతో, మరో విషయములో వారు అయోగ్యముగా ఆ పండుగను జరుపలేదు.
💎 ఎందరైతే ప్రభువు యొక్క రొట్టెను, పాత్ర లోనిది అయోగ్యముగా తీసుకొంటారో వారు దేవుని దృష్టిలో అపరాధియగును - (1 కొరింధీ 11:27).

నా ప్రియులారా, ఓపికతో చదివి, వాక్య పరిశీలన చేసి సత్యమును గ్రహిచినందుకు మరో సారి మీకు నా వందనములు. - (ఫిలిప్పీ 4: 21).

Share this

Related Posts

Previous
Next Post »

4 comments

comments

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16