Showing posts with label బాప్తిస్మము. Show all posts
Showing posts with label బాప్తిస్మము. Show all posts

మరణము - ఆశీర్వాదం (Death - Blessing)

మరణము - ఆశీర్వాదం 


పాపముల విషయమై మరణించి క్రీస్తు నందు జీవిస్తున్న ప్రతి సహోదరునికి మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో వందనములు. 🙏


మరణము గురించి వాస్తవాలు పూర్తిగా తెలియకుండా క్రైస్తవులుగా పిలవబడడం సరైనది కాదు.  మరణానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు అలాగే మరణానికి భయపడని వాడు కూడా క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు ఏ మరణానికి భయపడాలి ఏ మరణానికి భయపడకూడదు అలాగే మరణము ఎన్ని రకాలు ఏ విషయంలో మరణించాలి ఇలాంటి విషయాలు గూర్చి ఈ అంశంలో ఆలోచన చేద్దాం. 


✏️ మరణము అంటే "ఎడబాయిట" లేదా "ఎగిరిపోవుట" అని అర్థం. థెనాటోస్ అనే గ్రీకు పదము నుండి ఉద్భవించింది. 


✏️ పరిశుద్ధ గ్రంథంలో నాలుగు రకాలైన మరణాల గురించి వ్రాయబడ్డాయి.


𒐕. భౌతిక మరణము 

𒐖. ఆత్మీయ మరణము 

𒐗. క్రీస్తుతో పాటు మరణము 

𒐘. రెండవ మరణము లేక చివరి మరణము 


📝 భౌతిక మరణము


భౌతిక మరణం అంటే ఈ శరీరాన్ని లేక దేహాన్ని విడిచి పెట్టడం. (కీర్తన 90:10) దీనినే మృతి పొందుట అని కూడా అంటారు (మత్తయి 8: 22). ఈ శరీరము మనకు ఇల్లు వంటిది. భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మన కున్నదని యెరుగుదుము. (1కోరింది. 5:1) శరీరమనే ఈ ఇంటిలో ఆత్మ నివసిస్తుంది ఈ ఆత్మ తన దేహాన్ని లేక తన ఇంటిని విడిచి వెళ్లడమే శరీరమరణము. (మార్కు 5:38-39) 


📝 ఆత్మీయ మరణము 


నరుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం(ఆది.కాం. 1:24-27). దేవుడు ఎలా ఆత్మ స్వరూపియే/అక్షయుడో (యోహాను. 4:24;1 తిమోతి. 1:17) అలాగునే నరుడు కూడా ఆత్మ మరియు అక్షయుడు.(ఆది.కాం. ఆది.కాం. 2:7; సామెతలు. 20:17; ప్రసంగి 12:7) దేహమనే ఇంటిలో నివసించుచున్న ఆత్మ మరణించడమే ఆత్మీయ మరణం లేదా దేవునికి నీకు(ఆత్మకు) మధ్య ఎడబాటునే ఆత్మీయ మరణం అంటారు. ఇది ఎంతో భయంకరమైనది. 


ఈ లోకములో ఎవరైతే పాపపు జీవితంతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారు దేవుని నుండి కలుగు జీవములోనుండి వేరు పరచబడినవారైయుందురు(ఎఫేసి. 4:18) ఇట్టి వారు ఆత్మీయంగా మరణించిన వారైయుంటారు అంటే నీ శరీరము లేక దేహము ఈ భూమి మీద జీవించే ఉంటాది కానీ ఆ శరీరము లోపల ఉన్న నీవు(ఆత్మవి) చనిపోయి ఉంటావు. "...నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే. (ప్రకటన 3: 1) నీవు చేసే పాపపు క్రియలు నీ దేహంలో ఉండే నిన్ను (ఆత్మను) చంపేస్తాయి. నీ దేవునికి విరోధంగా నీవు ఏమి చేసినా నిబంధనానుసారంగా బ్రతకకపోయినా నువ్వు చచ్చిన వాడివే ఇదే ఆత్మీయ మరణం.(ఎఫెసీ 2:1; 4:17-18) దీనిని పొందిన వారు భౌతికముగా మరణించిన వెంటనే పాతాళ లోకములో యాతన అనుభవిస్తారని ప్రభువే సెలవిచ్చెను కదా!! (లూకా 16:19-31 చూడుము). "మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?" (కీర్తన. 89:48)



📝 క్రీస్తుతో పాటు మరణము


క్రీస్తుతో పాటు మరణము అంటే, క్రీస్తు సిలువపై మరణించినప్పుడు, ఆయనతో పాటుగా విశ్వాసి కూడా పాపం విషయమై మరణించి,(బాప్తిస్మం కార్యక్రమం ద్వారా...) నీతి విషయముగా బ్రతుకుటకు క్రీస్తుతో పాటుగా నూతన జీవితంలోకి ప్రవేశిస్తారని అర్థం. ఇది క్రైస్తవ విశ్వాసంలో ఒక ముఖ్యమైన భావన, దీని ద్వారా విశ్వాసి తన పాపాల నుండి విముక్తి పొంది, దేవునితో నూతన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. పాపం పట్ల అతనికున్న పాత కోరికలు, అలవాట్లు చనిపోతాయి. క్రీస్తుతో పాటు మరణించి, తిరిగి లేచిన విశ్వాసి, క్రీస్తు యొక్క దేవునితో సమాధానపడి, ఆయన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది పాపానికి దూరంగా, నీతి మార్గంలో జీవించడానికి ఎంతో దోహద పడుతుంది. 


మునుపు మన ప్రాచీన పురుష జీవితాన్ని  క్రీస్తుతో కూడా సిలువ వేసిన వాడు క్రీస్తు తో పాటు మరణించినవాడు. ఎవరైతే  క్రీస్తుతో కూడా మరణం పొందుతారో వారు క్రీస్తు కూడా లేపబడతారు. క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందిన వాడు ఆయన మరణములోనికి బాప్తీసము పొందినవాడు. ఇలా క్రీస్తు నందు కొత్త జీవితాన్ని పొందుకొని, పాపానికి బానిసలుగా కాకుండా, దేవునికే విధేయులుగా జీవించేడివారైయుంటారు. (రోమా 6:1-13).


మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.(1 పేతురు. 2:24). అందుకు యేసు అతనితో —ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.౹ … యేసు ఇట్లనెను– ఒకడు నీటిమూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను. 3:3,5)



📝 రెండవ మరణం


రెండవ మరణం అంటే నీవు(ఆత్మ) నిత్యమైన శిక్షకు వెళ్లడం. ఎవరైతే క్రీస్తు సువార్తకు లోబడక(2 దెస్స 1:6), దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి(రోమా. 1:18), తమ భూనివాసకాలాన్ని దేవునికి విరోధముగా నడుచుకొని(1 పేతురు 3:12), జీవితాన్ని ముగిస్తారో వారికి రెండో మరణం సంభవిస్తుంది దీనినే దేవుని ఉగ్రత అని అంటారు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. (ప్రకటన. 20:14)


ఈ రెండవ మరణం లో ఆత్మకు చావు ఉండదు. నీవు బ్రతికే ఉంటావు కానీ ఆ బ్రతుకుకి సమాధానం ఉండదు. మరణాన్ని కోరుకున్న మరణం రాదు. "నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు." (మార్కు. 9:48). అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. (మత్తయి. 25:41)



👤 ఓ చదువరి... పైన వ్రాయబడిన విషయాలలో నాలుగు మరణాల గురించి తెలుసుకున్నాం కదా అయితే ఈ నాలుగు మరణాలలో ఏ మరణం నీకు ఆశీర్వాదకరం? అని ప్రశ్నించుకొని నీవు ఆలోచించగలిగితే అది కచ్చితంగా క్రీస్తుతో పాటు మరణమే అగును కదా!! నీవు క్రీస్తుతోపాటు మరణిస్తే ఆయనతో పాటు లేపబడతావు, పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యమై ఉంటావు.(రోమా. 6:5cf) క్రీస్తు యేసులోనికి మరణం పొందిన వారికి భౌతికమైన లేక శరీరమరణం ఆశీర్వాదకరం. అంతట– ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. (ప్రకటన. 14:13) ఎవరైతే తమ జీవితాన్ని ఈ భూమి మీద దేవుని కొరకు నిబంధనానుసారంగా బ్రతుకుతారో, ఎవరైతే అపోస్తుల బోధలో తమ జీవితాన్ని కట్టుకుంటారో, వారికి భౌతిక సంబంధమైన మరణం ఆశీర్వాదకరం. వారు భౌతికంగా మరణించినప్పటికి బ్రతికే ఉంటారు(ప్రకటన. 22:5) వారు సజీవులు(రోమా 6:11). వారు ధన్యులు(ప్రకటన 20:6; 22:14). వారే దేవుని వారసులు. (రోమా 8:17)


కనుక ప్రియులారా నీ మరణము నీకు ఆశీర్వాదకరంగా లేనప్పుడు నువ్వు జీవించిన జీవితము వ్యర్థమే అగును కదా. నీవు జీవించుచున్నావు అనే పేరు అయితే ఉన్నది గాని నీవు మృతుడవే. ఇలా బ్రతుకుట కంటే క్రీస్తు కొరకు సమర్పించుకొని బ్రతకడం మేలు కదా!! 


📖 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. (కీర్తన 116:15)

📖 దుష్ఠుల మరణము దేవుని సంతోషపరచదు. (యెహెజ్కేలు 18:23)

మీ ఆత్మీయులు👪

1. పరలోకమునకు ఎవరు వెళ్తారు?క్లిక్ చేయు

2. బాప్తిస్మముక్లిక్ చేయు

"నిజమైన బాప్తీస్మము vs తప్పుడు బాప్తీస్మము" True Baptism vs False Baptism

"నిజమైన బాప్తీస్మము"
vs 
"తప్పుడు బాప్తీస్మము"


సహోదరులకందరికిని మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.


నిజమైన బాప్తీస్మము


● "బాప్తీస్మమిచ్చు వ్యక్తి విశ్వసించిన వ్యక్తిని నీటిలో పూర్తిగా సమాధి చేయాలి". - (మత్తయి. 3:16; అపో.కార్య. 8:38-39).

● "నమ్మి + బాప్తీస్మము = రక్షణ" - (మార్కు. 16:16).

● క్రీస్తు సువార్త ద్వారానే మనము పిలువబడి నమ్మి బాప్తీస్మము పొందవలెను. - (మార్కు. 16:16; అపో.కార్య. 18:12-13; 2 థెస్స. 2: 14).

● "బాప్తీస్మము యిచ్చువారు" "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి" బాప్తీస్మము యివ్వవలెను. - (మత్తయి. 28:18-20).

* (ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని నమ్మవలెను). - (మత్తయి. 3:16-17; యోహాను. 15:26).

● "బాప్తీస్మము పొందువారు" యేసుక్రీస్తు నామమున అనగా ఆయన అధికారమున మరియు ఆయన ఆజ్ఞ చొప్పున  పొందుచున్నాని గ్రహించవలెను. - (అపో.కార్య. 2:38).

* (తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నమ్మవలెను) *

●  "ఒక్కటే శరీరమైన క్రీస్తు సంఘము లోకి క్రీస్తు చేత చేర్చబడెదరు" - (ఎఫెసీ. 1:23; 4:4-6; కొలస్స. 1:18; 1 కొరింథీ. 12:13; అపొ.కార్య. 2:47; రోమా. 16:16). 



తప్పుడు బాప్తీస్మము


● చిలకరింపు, కుమ్మరింపు, జెండా, విశ్వసించిన వాడు తనకి తానుగా నీటిలో దిగి రావడము....etc ఇవి వాక్యానుసారమైన బాప్తీస్మము కాదు.

● "నమ్మి + రక్షణ = బాప్తీస్మము" - వాక్యము లేదు.

● దేవుడు కనబడి స్వరము, దర్శనములోని చెపితేనే బాప్తీస్మము తీసుకునే కార్యక్రమము తప్పుడు బాప్తీస్మము.

● నేటి మత శాఖలలో "బాప్తీస్మము యిచ్చువారు" "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి"(మత్తయి. 28:18-20).
ఈ యేసుక్రీస్తు ఆజ్ఞను కొట్టివేసి, క్రీస్తు బోధ యందు లక్ష్యము ఉంచక, ముగ్గురు వేరు వేరు అని నమ్మటము లేదు.

● ఇక్కడ మత శాఖలతో "బాప్తీస్మము పొందువారు" వారి కల్పనా బోధలకు చెవి యొగ్గి, యేసుక్రీస్తు నామమునే పొందాలి (అపో.కార్య. 2:38) అని నమ్మి పొందినది తప్పుడు బాప్తీస్మము. 

(తండ్రి లేడు, కుమారుడు లేడు, ఆత్మ లేడు. అంతా యేసుక్రీస్తు నామమే అనేవారి బోధ సరియైనదికాదు).

●  క్రీస్తు బోధను, ఆయన శరీరమును విభజన చేసి వారు ఏర్పాటు చేసుకొనిన శాఖలలోనికి  వారి చేత చేర్చబడెదరు.


హెచ్చరిక ★ 


నా ఆత్మీయ సహోదరులారా, ఈ దినమే మీరు ఏ బోధ చేత, ఏ విధముగా బాప్తీస్మము పొందియున్నారో మీకు మీరు  వ్యక్తిగతముగా పరీక్ష చేసుకోమని మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో మిమ్మలి కోరుతున్నా.. 

మీ ఆత్మీయ సహోదరుడు, 
మనోహర్ (KM).

"బాప్తీస్మము ఏ నామములో పొందాలి"..? In which name we should baptized

బాప్తీస్మము ఏ నామములో పొందాలి"..?.


నా తోటి పరిశుద్ధులకు, మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

నేటి క్రైస్తవ్యములో ఈ ప్రశ్న అనగా "బాప్తీస్మము ఏ నామములో పొందాలి?" అనేది చాల మంది ఆలోచనలను చిందరవందర చేయుచున్నది.


మత్తయి 28: 18-20👇
అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.


★ "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తీస్మము" (మత్తయి. 28:17-20). ఈ అధికారము ఎవరికి ఇవ్వబడినదో ఆలోచన చేద్దాము ★

● యేసు మరణమును జయించి తిరిగిలేచిన తరువాత ఆరోహణము కాక ముందు "మత్తయి. 28:17-20" ఈ ఆజ్ఞను శిష్యులుకి చెప్పారు.


● "ఇది బాప్తిస్మము యిచ్చేవారికి యేసు ఇచ్చే ఆజ్ఞ అని అంగీకరించాలి".


● "లోకాంతము వరకు క్రీస్తు సువార్తకి లోబడి, క్రైస్తవులు కాగోరువారు, క్రీస్తు బోధకు లోబడి ఆయన సంఘ సభ్యులు కాగోరువారు లోబడవలసిన ప్రాముఖ్యమైన ప్రాథమికమైన  ఆజ్ఞ ఇది".


● "సమస్త జనులు" అనగా "ప్రతి జాతి వంశములోని వారిని శిష్యులుగా చేయాలి" - (గలతి. 3:28).


● శిష్యులుగా చేయబడిన వారికి "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తిస్మమియ్యాలి".


● బాప్తిస్మము యిచ్చేవారు మరియు తీసుకునే వారు "యుగసమాప్తి" వరకు ఆ ఆజ్ఞకు లోబడాలి.


● దీన్ని కాదనే అధికారము ఎవరికి లేదు.


● "యేసు బోధ అంతయు తండ్రి యొద్ద నుండే ఇవ్వబడినది అని నీవు గుర్తించవలసిన అవసరము ఎంతో ఉంది". - (యోహాను. 12:49-50; 16:13-15; హెబ్రీ. 1:1-2).


యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము  


◆ "యేసుక్రీస్తు నామము" అనగా "యేసుక్రీస్తు అధికారము లేదా యేసుక్రీస్తు ఆజ్ఞ" అని అర్ధం.

◆  నామము  గ్రీక్ లో ὄνομα - Onoma(ఓనోమా)  

◆ ఓనోమా అనగా a name, authority, cause 


» యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము. - (అపో.కార్య. 2:38; 10:48; 22:16).

» యేసుక్రీస్తు నామమున  ప్రార్ధన. - (యోహాను. 16:23; అపో.కార్య. 9:14; 22:16).

» యేసుక్రీస్తు నామమున ద్వారా సూచక క్రియలు. - (అపో.కార్య. 4:30).

» యేసుక్రీస్తు నామమున నిత్య జీవము. - (1 యోహాను. 5:13).

» యేసుక్రీస్తు నామమున స్వస్థత. - (అపో.కార్య. 4:10).

» యేసుక్రీస్తు నామమున తీర్పు. - (యోహాను. 3:16-18; 12:48).

» యేసుక్రీస్తు నామమున సువార్త ప్రకటన. - (అపో.కార్య. 8:12).

» యేసుక్రీస్తు నామమున మాట్లాడుట మరియు బోధించుట. - (అపో.కార్య. 4:17-18; 9:27-29; 5:28,40).

» యేసుక్రీస్తు నామమున దయ్యముల నాజ్ఞాపించుట. (అపో.కార్య. 16:18).

» యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ. - (అపో.కార్య. 10:43).


👉 క్రొత్త నిబంధన సువార్త ప్రకటింపబడుచుండగా యేసుక్రీస్తు నామమున అనేక కార్యములు జరిగినవి.


🔖యేసు నామమున అనగా "యేసు అధికారము" చొప్పున జరిగాయి అనగా పైన విషయములో ఏది పరిశీలన చేసినా అన్నీ "యేసు అధికారముననే" జరిగినవి.


పాత నిబంధన గ్రంథములో కొన్ని ఉదాహరణలు.

◆ ​రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు - (ఎస్తేర్. 8:10).

◆ అహాబు పేరట తాకీదు - (1 రాజులు. 21:8).

రాజు పేరట అనగా రాజు యొక్క అధికారమును తెలియజేస్తుంది.

◆ దయ్యముల పేరట బలి. - (లేవి.కాండ. 17:7) అనగా దయ్యముల అధికారము.


యేసు మాటల్లో కొన్ని ఉదాహరణలు.

◆ "నేను(యేసు) తండ్రి నామమున వచ్చియున్నాను".  - (యోహాను.5:43).

◆ "తండ్రి నా(యేసు) నామమున పంపబోవు పరిశుద్ధాత్మ". - ( యోహాను. 14:26).

మరల మన అంశము లోనికి వస్తే, యేసుక్రీస్తు నామమున అనగా యేసుక్రీస్తు అధికారము లేదా యేసుక్రీస్తు ఆజ్ఞ  అని అర్థము.


🔎తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి అను యేసుక్రీస్తు ఆజ్ఞను "ప్రభువైన యేసుక్రీస్తు నామమున" అధికారమును సమన్వయ పరిచి చూడవలెను.

❎ "యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి" (అపో.కార్య. 2:38; 4:7లో) అనేది బాప్తీస్మము యిచ్చేవారికి ఇవ్వబడిన ఆజ్ఞ కాదు.

✅"తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తీస్మము" (మత్తయి. 28:18-20) అనేది బాప్తీస్మము యిచ్చేవారికి ఇవ్వబడిన ఆజ్ఞ.


గమనిక ★ 


యేసుక్రీస్తు అధికారమున "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తీస్మము" పొంది క్రీస్తు సంఘములో(Church of Christ) ప్రభువు చేత చేర్చబడుము. దీన్ని అంగీకరిస్తే నీ ఆత్మ రక్షింపబడుతుంది లేదా నాశనములో నీవు యిoతకు ముందే ఉన్నావు.


హెచ్చరిక ★ 

"మత్తయి. 28:18-20" ప్రకారముగా బాప్తిస్మము పొందేవారు "అపొ.కార్య. 2:38; 8:16; 19:5" ప్రకారముగా పొందినవారై యుంటారు.

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్.

"బాప్తీస్మము ఎలా తీసుకోవాలి"..? How can we baptized


💌 అంశము : "బాప్తీస్మము ఎలా తీసుకోవాలి"..?

ప్రియమైన నా సహోదరీ,సహోదరులారా!!
మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు తెలియజేయుచున్నాను.

రక్షణ పొందుటకు నమూనా


❣ ముందుగా - క్రీస్తును గూర్చిన మాటలు (వాక్యము) "వినాలి". - (యోహాను. 5:24; అపో.కార్య. 8:5-6; రోమా 10:17; ప్రకటన. 1:3).
❣ వినిన వాక్యమునందు(మాట) "విశ్వాసముంచాలి". - (యోహాను. 8:24; అపో.కార్య. 16:31;  రోమా. 10:17; హెబ్రీ. 11:6).
❣ పాపక్షమాపణ నిమిత్తమై "మారుమనస్సు" పొందాలి. - (లూకా. 13:3; అపొ.కా. 2:38; 17:30).
❣ యేసుక్రీస్తు దేవునికుమారుడని, ప్రభువని "ఒప్పుకోవాలి" - (మత్తయి. 10:32-33; యోహాను. 20:31; రోమా. 10:10).
❣ రక్షింపబడుటకు "బాప్తీస్మము" పొందాలి. - (మార్కు. 16:16; అపో.కార్య. 2:38; 22:16; 1 పేతురు. 3:21).
❣ ప్రభువు చేత "క్రీస్తు సంఘముగా చేర్చబడాలి". - (అపో.కార్య. 2:47).



A). క్రీస్తులోనికి బాప్తీస్మము వాక్యానుసారముగా తీసుకోవాలనుకొనేవారు - యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకోవాలి.

రోమీయులకు 10:9
అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 

1పేతురు 3:15
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ "హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి"; 


B). క్రీస్తులోనికి బాప్తీస్మము వాక్యానుసారము తీసుకోవాలనుకొనేవారు- యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఒప్పుకోవాలి.

యోహాను సువార్త 20:31
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

అపొస్తలుల కార్యములు 8:37 
ఫిలిప్పు-నీవు పూర్ణహృదయముతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పెను.అతడు-"యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని యుత్తరమిచ్చెను".


C). ఒకనిని నీటితో(నీటిలో) పాతిపెట్టుటకు అవసరమైన నీళ్ళు ఉండాలి.

యోహాను సువార్త 1:28
యోహాను బాప్తిస్మమిచ్చుచున్న "యొర్దానునదికి" ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. 

యోహాను సువార్త 3:23
సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున "నీళ్లు విస్తారముగా" ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి. 

నీరు సమృద్ధిగా ఉన్నచోట యోహాను బాప్తీస్మమమిచ్చినట్లుగా చూస్తున్నాము.



D). బాప్తీస్మము తీసుకునేవారు అలాగే ఇచ్చేవారు కూడా ఇద్దరు *నీటిలోనికి* దిగాలి.

మత్తయి సువార్త 3:16
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 

అపొస్తలుల కార్యములు 8:37,38
ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. 


E). తండ్రి(యెహోవా),కుమారుని (యేసుక్రీస్తు), పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీస్మము ఇవ్వాలి.

మత్తయి సువార్త 28:19
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు


F). ఈ లోకంలో ఒక మనిషిని ఏవిధంగానైతే మట్టిలో పాతిపెడతారో అదే విధంగా బాప్తీస్మము పొందాలనుకునే వారిని నీటిలో(నీటితో) పాతిపెట్టబడి తిరిగి లేపబడాలి.

రోమీయులకు 6:4
కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము "బాప్తిస్మము వలన" మరణములో పాలు పొందుటకై "ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి".
కొలొస్సయులకు 2:12
మీరు "బాప్తిస్మమందు" ఆయనతో కూడ "పాతిపెట్టబడినవారై" ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా "ఆయనతో కూడ లేచితిరి".


G). బాప్తిస్మము పొందుగోరువారు మునుపు క్రీస్తు మరణము "లోనికి" పాలు పొంది, క్రీస్తు సంఘముగా చేర్చబడిన వారు చేతనే నీటిలో సమాధి చేయబడాలి. 

అపో.కార్యములు 2: 41
కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.

అపో.కార్యములు 18: 8
ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితోకూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వసించి బాప్తిస్మము పొందిరి.

అపో.కార్యములు 19: 4-5
అందుకు పౌలుయోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాస ముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను.
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.

◆ గమనిక ◆ 


1) చనిపోయిన వారిని నిలువబెట్టి పాతిపెట్టరు.

2) చనిపోయినవారిని కూర్చోబెట్టి పాతిబెట్టరు.

3) చనిపోయినవారిని బోర్ల పడుకోబెట్టి పాతిపెట్టరు.

4) చనిపోయిన వారిని పొడినేలమీద ఉంచి గుప్పెడు మట్టి చల్లి దీనిని పాతిపెట్టేసినట్టే అని అనరు.

★ "చనిపోయినవారిని వెనుకాతలా పడుకోబెట్టి దేహము కనబడకుండా మట్టితో పాతిపెడతారు".

అలాగే పాపముల నిమిత్తం ఈ లోకంలో చనిపోయి ఆత్మసంబంధముగా జీవించాలని నీటి ద్వారా బాప్తీస్మము పొందాలనుకునేవారు కూడా నీటిలో వెనకాతలా పడుకోబెట్టి దేహము కనబడకుండా నీటితో(నీటిలో)పాతిపెట్టబడి తిరిగి లేపబడాలి.

* బాప్తీస్మము ఒక్కటే అని (ఎఫెసీ 4:5) లో గ్రంథము తెలిజేస్తుంది *

వాక్యానుసారము తీసుకుంటే అది మన జీవితానికి ఒక్కసారే.

వాక్యము చెప్పినట్టు కాకుండా మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తీసుకున్నా అది మీ దృష్టిలో బాప్తీస్మము అవుతుందేమో కాని దేవుని దృష్టిలో అది బాప్తీస్మము కాదని గమనించాలి.

◆ హెచ్చరిక ◆


» మీరు పొందిన బాప్తీస్మము వాక్యానుసారముగా తెలియజేసినట్టు పాతిపెట్టబడ్డారా..??

ఇది ఆత్మసంబంధమైనది గనుక బాప్తీస్మము తీసుకునే విషయములో అజాగ్రత్తగా ఉండకండి.

"బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి..?" (Why should we baptized)


అంశము: "బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి..?"

నా తోటి సహోదరీ,సహోదరులారా!!
సంఘములో ఏ పనియైనా చేయుటకు ముందుకువచ్చే అనేకమంది అతి ప్రామఖ్యమైన ఆత్మసంబంధమైన ఈ విషయానికి (బాప్తీస్మము) వచ్చేసరికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు..?

సంఘములో చాలా మంది యవ్వనప్రాయం దాటినవారున్నా అందులో బాప్తీస్మము తీసుకున్నవారు ఒకవంతు కూడా లేకపోవడానికి కారణం బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలో తెలియకపోవడమే;


● “బాప్తిస్మము” అనగా పాతిపెట్టుట, క్రొత్తజన్మ, ముంచుట అని అర్ధము. (రోమా 6:3; యోహాను 3:3; 1 పేతురు 3:21).

● ఇది “బాప్టిజో” అనే గ్రీక్ పదము తర్జుమా చేయబడినది.

∆ "పాతిపెట్టుట" అనగా “పూడ్చు, పాఁతివేయు, దిగవేయు” అని అర్ధము.
∆ "క్రొత్త జన్మ" అనగా “నూతనముగా పుట్టుట” అని అర్ధము.
∆ "ముంచుట" అనగా “మునుగజేయు” అని అర్ధము.
∆ "కప్పెట్టడం" అనగా “పూడ్చడం” అని అర్ధము.


 "అసలు బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి..?" 


1) బాప్తీస్మము పొందినవారు మాత్రమే దేవుని రాజ్యము(సంఘము)లో ప్రవేశించగలరనేది యేసుక్రీస్తు వారు తెలియజేసిన విశేషమైన సమాచారం.

యోహాను సువార్త 3:3
అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

2) బాప్తీస్మము ద్వారానే మనం ఇంతకుముందు చేసిన పాపములు క్షమింపబడతాయనేది పేతురు గారు తెలియజేసిన విశేషమైన సమాచారం.

అపొస్తలుల కార్యములు 2:38
మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి;

3) బాప్తీస్మము పొందినవారు మాత్రమే  పరిశుద్థాత్ముని పొందుకోగలరు.

అపొస్తలుల కార్యములు 2:38
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

4) బాప్తీస్మము పొందినవారు మాత్రమే  దేవుని ఉగ్రతనుండి తప్పించబడగలరు.

రోమీయులకు 5:9
కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.

5) బాప్తీస్మము పొందినవారు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడగలరు.

రోమీయులకు 3:24
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

6) బాప్తీస్మము పొందినవారు మాత్రమే పవిత్రులుగా తీర్చబడగలరు.

1 యోహాను 1:7
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

7) బాప్తీస్మము పొందినవారు మాత్రమే పరసంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును పొందుకోగలరు.

ఎఫెసీయులకు 1:3
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

8) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తులో జీవించగలరు..

1యోహాను 4:9
మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.

9) బాప్తీస్మము పొందినవారు మాత్రమే  దేవుని పిల్లలుగా పిలవబడతారు.

యోహాను సువార్త 1:12
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

10) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తు మరణ, సమాధి,పునరుద్థానము (సువార్త)ను గూర్చి ఇతరులకు ప్రకటించగలరు.

1 కొరింథీయులకు 11:26
మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

11) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సమయమందును అసమయమందును వాక్యమును ఇతరులకు ప్రకటించగలరు.

2 తిమోతికి 4:2
వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.

12) బాప్తీస్మము పొందినవారు మాత్రమే అపవాది నోటనుండి తప్పించబడతారు.

1పేతురు 5:8
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

13) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సంఘముగా పిలువబడతారు.

1 కొరింథీయులకు 1:2
కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

14) బాప్తీస్మము పొందినవారు మాత్రమే తన కుమారుని (క్రీస్తు) సహవాసములో చేర్చబడతారు.

1 కొరింథీయులకు 1:9
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

15) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తు జ్ఞానమును తెలుసుకోగలరు.

1 కొరింథీయులకు 2:7
దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

16) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తును ధరించుకోగలరు.

గలతీయులకు 3:27
క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.

17) బాప్తీస్మము పొందినవారు మాత్రమే యేసుక్రీస్తును ప్రభువుగా వారి హృదయాలలో ప్రతిష్టించుకుంటారు.

1 పేతురు 3:15
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

18) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ఈ లోకసంబంధులపైన జయము పొందినవారు.

 1 యోహాను 4:4
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.

19) బాప్తీస్మము పొందినవారు మాత్రమే తండ్రి ఎవరో,కుమారుడు ఎవరో తెలుకోగలరు.

యోహాను సువార్త 17:3
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.

20) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ప్రభుబల్లలో పాలుపొందుతారు.

1 కొరింథీయులకు 11:23
"నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని".

21) బాప్తీస్మము పొందినవారు చేసే  ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు.

యోహాను సువార్త 4:24
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

22) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ఇతరులకు బాప్తీస్మము ఇవ్వగలరు.

మత్తయి సువార్త 28:19
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు

23) బాప్తీస్మము (పునర్జన్మ) పొందినవారు మాత్రమే నూతనస్వభావమును పొందుకోగలరు.

తీతుకు 3:5
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన(పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

24) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సాతాను అధికారమునుండి దేవునివైపు తిరిగినవారు.

అపొస్తలుల కార్యములు 26:18
"వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి,"..
నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

25) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సాతానుయొక్క మరణభయమనే దాస్యత్వమునుండి విడిపింపబడినవారు.

హెబ్రీయులకు 2:14,15
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,
జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

26) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ధనాపేక్షను విసర్జించగలరు.

మొదటి తిమోతికి 6:10
ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

 27) బాప్తీస్మము పొందినవారు మాత్రమే శరీరక్రియలను విసర్జించగలరు.

గలతీయులకు 5:19-21: ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

28) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తుతో కూడా మరణించి తిరిగి లేబబడినవారు.

కొలొస్సయులకు 2:12
మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేచితిరి.

29) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సంఘములో పెద్దలుగాను పరిచారకులుగాను ఉండుటకు అర్హులు.

1తిమోతికి 3:1-8:
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.

30) బాప్తీస్మము పొందినవారు మాత్రమే పరలోక పౌరసత్వం కలవారు.

ఫిలిప్పీయులకు 3:20
మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.

బాప్తీస్మము పొందినవారు మాత్రమే రక్షించబడతారు.

మార్కు సువార్త 16:16
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.



★ గమనిక ★

 ◆ బాప్తీస్మము గూర్చి నీ కుటుంబ సభ్యుల అనుమతి గాని, నీ స్నేహితుల అనుమతి గాని, నీ రక్త సంబంధుల అనుమతి గాని అవసరము అని భావిస్తున్నావ..?

 మత్తయి సువార్త 19:29
నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.

మత్తయి సువార్త 10:37
తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.

గలతీయులకు 1:15-16
తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలు పరపననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో (మూలభాషలో-రక్తమాంసములతో) నేను సంప్రతింపలేదు.

"బోధకుడు నీళ్లలోనికి దిగకుండా విశ్వసించిన వ్యక్తికి బాప్తిస్మము ఇవ్వవచ్చునా”..?

“బోధకుడు నీళ్లలోనికి దిగకుండా విశ్వసించిన వ్యక్తికి బాప్తిస్మము ఇవ్వవచ్చునా”..?
సహోదరులందరికిని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
NOTE:- (కుమారునియందు విశ్వాసముంచు వ్యక్తి తనకి తానుగా నీళ్లలోనికి వెళ్లి మునిగి రావడము).

 "ఒక క్రైస్తవుడు తాను చూచిన దానిని నాకు తెలియపరుస్తూ, నన్ను అడిగిన ఈ ప్రశ్నకి వాక్యము ఆధారముగా సమాధానము తెలియజేస్తున్నాను".

ప్రియులారా, నేటి క్రైస్తవ్యములో కొందఱు బోధకులు “సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారుగా (2 తిమోతి. 2:15)” లేకపోవడము వలనే ఇలాంటి భిన్నమైన బోధలు ప్రచారము ఆగుతున్నాయి.

ఈ అంశము గూర్చి మనము ఆలోచన చేసే ముందుగా ఈ క్రింది ప్రశ్నలు మీద పూర్తీ అవగహన మనకు తెలియవలసిన అవసరము ఏంతో ఉన్నదీ.  అదేమనగా...


మొదటి ప్రశ్న

 "బాప్తిస్మము అంటే ఏమిటి"..?


● “బాప్తిస్మము” అనగా పాతిపెట్టుట, క్రొత్తజన్మ, ముంచుట అని అర్ధము. (రోమా. 6:3; యోహాను. 3:3; 1 పేతురు. 3:21).
●  ఇది “బాప్టిజో” అనే గ్రీక్ పదము తర్జుమా చేయబడినది.

"బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి"..?

1). దేవుని రాజ్యములో ప్రవేశిoచుట కొరకు బాప్తిస్మము తీసుకోవాలి – (యోహాను. 3:3-6).
2). పాపక్షమాపణ కొరకు బాప్తిస్మము తీసుకోవాలి – (అపో.కార్య. 2:38).
3). రక్షణ కొరకు బాప్తిస్మము తీసుకోవాలి – (మార్క. 16:16).
4). క్రీస్తు “లోనికి” ప్రవేశిoచుట / క్రీస్తును ధరించుకొనుట కొరకు బాప్తిస్మము తీసుకోవాలి – (గలతీ. 3:27)...etc


❣ "పాతిపెట్టుట" అనగా “పూడ్చు, పాఁతివేయు, దిగవేయు” అని అర్ధము.
❣ "క్రొత్త జన్మ" అనగా “నూతనముగా పుట్టుట” అని అర్ధము.
❣ "ముంచుట" అనగా “మునుగజేయు” అని అర్ధము.
❣ "కప్పెట్టడం" అనగా “పూడ్చడం” అని అర్ధము.


 రెండో ప్రశ్న


★ బోధకుడు నీళ్లలోనికి దిగకుండా విశ్వసించిన వ్యక్తికి బాప్తిస్మము ఇవ్వవచ్చునా...?
NOTE :- (కుమారునియందు విశ్వాసముంచు వ్యక్తి తనకి తానుగా నీళ్లలోనికి వెళ్లి మునిగి రావడము).

 "బైబిల్ యొక్క సమాధానము ఇవ్వకూడదు" & "తప్పుడు బాప్తిస్మము" 


 "మొదటి ఆధారము"
 “బాప్తిస్మమిచ్చు యోహాను గారు నీళ్లలోనికి దిగి ఆనాటి ప్రజలకి & యేసుకు బాప్తిస్మము ఇచ్చుట ”

● యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో "అతనిచేత" బాప్తిస్మము పొందుచుండిరి. “మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను” – (మతాయి. 3:1-15; మార్క. 1:5; లూకా. 3:3-7)

● సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహానుకూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి. – (యోహాను. 3:23; అపో.కార్య. 1:5)
● నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట విషయములో “యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో "యోహానుచేత బాప్తిస్మము" పొందెను.” – (మతాయి. 3:13; మార్క. 1:9; లూకా. 3:21).

"రెండోఆధారము"
“ఫిలిప్పు గారు నీళ్లలోనికి దిగి నపుంసకుడు బాప్తిస్మము ఇచ్చుట”

● ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. (అపో.కార్య. 8:37-38).
● ఇక్కడ బాప్తిస్మము అనగా “నీళ్లలోనికి మునుగజేయుచుట” అని అర్ధము.


“నీటిలో పాతిపెట్టటకు సహాయకుడు అవసరము”

A). మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడ “పాతిపెట్టబడినవారై” ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ “లేచితిరి” – (కొలస్సి. 2:12).
B). మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ “పాతిపెట్టబడితిమి” - (రోమా. 6:3).
C). “పునర్జన్మసంబంధమైనస్నానము” ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట  ద్వారాను  మనలను  రక్షించెను - (తీతుకు. 3:5).


NOTE:
సహోదరులారా... ఒక పాపి తన పాపములును సమాధి చేయాలంటే తనను ముంచేత నీరు (విస్తారమైన నీళ్ళు యోహాను. 3:23) ఉండాలి. ఆ నీటిలోనికి సమాధి చేయువాడు (బాప్తిస్మముమిచ్చువాడు) కూడా దిగి సమాధి చేయాలి.

ముఖ్య గమనిక :- (నీళ్ళు కుండి, డబ్బాలు, బాత్రూం టబ్ లులో...etc బాప్తిస్మము ఇవ్వకూడదు).


A). ఆత్మను విడిచిన దేహమును ఎలాగునా అయితే మనము మట్టిలో సమాధి చేస్తామో - (ప్రసంగి. 12:7; మతాయి. 8:22).
B). "దేహములో ఉంటూ మరణిచిన ఆత్మ" (ప్రకటన. 3:1; ఎపేసి. 2:1) “క్రీస్తును గూర్చినా సువార్తను విని"(1కోరింది. 15:3-4), "యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని" (రోమా. 10:9), మరుమనస్సుపొంది, పాపక్షమాపణ కొరకు (అపో.కార్య. 2:38) నీటిలోనికి వచ్చిన యెడల (యోహాను. 3:5)” జీవింపచేయు ఆత్మ నీటిలో సమాధి చేయవలసిన అవసరము ఎంతో ఉంది.

పైన తెలిపిన వివరణ దృష్టా బోధకుడు నీళ్లలోనికి దిగకుండా విశ్వసించిన వ్యక్తి కి బాప్తిస్మము ఇవ్వడము “మొదటి శతబ్దిపు అపోస్తులులు బోధ కానిది” లేదా "భిన్నమైన బోధ అని" మనము గ్రహించాలి.


 హెచ్హరిక :
సహోదరులారా, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు (1 తిమోతి. 1:3) మిమ్మలి బ్రతిమాలుకోనుచున్నాను.

మీ ఆత్మీయ సహోదరుడు,
"మనోహర్" ©
* క్రీస్తు సంఘము - (రోమా 16:16).
The churches of Christ greet you - Roma 16:16