“బోధకుడు నీళ్లలోనికి దిగకుండా విశ్వసించిన వ్యక్తికి బాప్తిస్మము ఇవ్వవచ్చునా”..? |
సహోదరులందరికిని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
NOTE:- (కుమారునియందు విశ్వాసముంచు వ్యక్తి తనకి తానుగా నీళ్లలోనికి వెళ్లి మునిగి రావడము)."ఒక క్రైస్తవుడు తాను చూచిన దానిని నాకు తెలియపరుస్తూ, నన్ను అడిగిన ఈ ప్రశ్నకి వాక్యము ఆధారముగా సమాధానము తెలియజేస్తున్నాను".
ప్రియులారా, నేటి క్రైస్తవ్యములో కొందఱు బోధకులు “సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారుగా (2 తిమోతి. 2:15)” లేకపోవడము వలనే ఇలాంటి భిన్నమైన బోధలు ప్రచారము ఆగుతున్నాయి.
ఈ అంశము గూర్చి మనము ఆలోచన చేసే ముందుగా ఈ క్రింది ప్రశ్నలు మీద పూర్తీ అవగహన మనకు తెలియవలసిన అవసరము ఏంతో ఉన్నదీ. అదేమనగా...
మొదటి ప్రశ్న
"బాప్తిస్మము అంటే ఏమిటి"..?
● “బాప్తిస్మము” అనగా పాతిపెట్టుట, క్రొత్తజన్మ, ముంచుట అని అర్ధము. (రోమా. 6:3; యోహాను. 3:3; 1 పేతురు. 3:21).
● ఇది “బాప్టిజో” అనే గ్రీక్ పదము తర్జుమా చేయబడినది.
"బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి"..?
1). దేవుని రాజ్యములో ప్రవేశిoచుట కొరకు బాప్తిస్మము తీసుకోవాలి – (యోహాను. 3:3-6).2). పాపక్షమాపణ కొరకు బాప్తిస్మము తీసుకోవాలి – (అపో.కార్య. 2:38).
3). రక్షణ కొరకు బాప్తిస్మము తీసుకోవాలి – (మార్క. 16:16).
4). క్రీస్తు “లోనికి” ప్రవేశిoచుట / క్రీస్తును ధరించుకొనుట కొరకు బాప్తిస్మము తీసుకోవాలి – (గలతీ. 3:27)...etc
❣ "పాతిపెట్టుట" అనగా “పూడ్చు, పాఁతివేయు, దిగవేయు” అని అర్ధము.
❣ "క్రొత్త జన్మ" అనగా “నూతనముగా పుట్టుట” అని అర్ధము.
❣ "ముంచుట" అనగా “మునుగజేయు” అని అర్ధము.
❣ "కప్పెట్టడం" అనగా “పూడ్చడం” అని అర్ధము.
రెండో ప్రశ్న
★ బోధకుడు నీళ్లలోనికి దిగకుండా విశ్వసించిన వ్యక్తికి బాప్తిస్మము ఇవ్వవచ్చునా...?
NOTE :- (కుమారునియందు విశ్వాసముంచు వ్యక్తి తనకి తానుగా నీళ్లలోనికి వెళ్లి మునిగి రావడము).
"బైబిల్ యొక్క సమాధానము ఇవ్వకూడదు" & "తప్పుడు బాప్తిస్మము"
"మొదటి ఆధారము"
“బాప్తిస్మమిచ్చు యోహాను గారు నీళ్లలోనికి దిగి ఆనాటి ప్రజలకి & యేసుకు బాప్తిస్మము ఇచ్చుట ”
● యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో "అతనిచేత" బాప్తిస్మము పొందుచుండిరి. “మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను” – (మతాయి. 3:1-15; మార్క. 1:5; లూకా. 3:3-7)
● సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహానుకూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి. – (యోహాను. 3:23; అపో.కార్య. 1:5)
● నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట విషయములో “యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో "యోహానుచేత బాప్తిస్మము" పొందెను.” – (మతాయి. 3:13; మార్క. 1:9; లూకా. 3:21).
"రెండోఆధారము"
“ఫిలిప్పు గారు నీళ్లలోనికి దిగి నపుంసకుడు బాప్తిస్మము ఇచ్చుట”
● ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. (అపో.కార్య. 8:37-38).
● ఇక్కడ బాప్తిస్మము అనగా “నీళ్లలోనికి మునుగజేయుచుట” అని అర్ధము.
“నీటిలో పాతిపెట్టటకు సహాయకుడు అవసరము”
A). మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడ “పాతిపెట్టబడినవారై” ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ “లేచితిరి” – (కొలస్సి. 2:12).
B). మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ “పాతిపెట్టబడితిమి” - (రోమా. 6:3).
C). “పునర్జన్మసంబంధమైనస్నానము” ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను - (తీతుకు. 3:5).
NOTE:
సహోదరులారా... ఒక పాపి తన పాపములును సమాధి చేయాలంటే తనను ముంచేత నీరు (విస్తారమైన నీళ్ళు యోహాను. 3:23) ఉండాలి. ఆ నీటిలోనికి సమాధి చేయువాడు (బాప్తిస్మముమిచ్చువాడు) కూడా దిగి సమాధి చేయాలి.
ముఖ్య గమనిక :- (నీళ్ళు కుండి, డబ్బాలు, బాత్రూం టబ్ లులో...etc బాప్తిస్మము ఇవ్వకూడదు).
A). ఆత్మను విడిచిన దేహమును ఎలాగునా అయితే మనము మట్టిలో సమాధి చేస్తామో - (ప్రసంగి. 12:7; మతాయి. 8:22).
B). "దేహములో ఉంటూ మరణిచిన ఆత్మ" (ప్రకటన. 3:1; ఎపేసి. 2:1) “క్రీస్తును గూర్చినా సువార్తను విని"(1కోరింది. 15:3-4), "యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని" (రోమా. 10:9), మరుమనస్సుపొంది, పాపక్షమాపణ కొరకు (అపో.కార్య. 2:38) నీటిలోనికి వచ్చిన యెడల (యోహాను. 3:5)” జీవింపచేయు ఆత్మ నీటిలో సమాధి చేయవలసిన అవసరము ఎంతో ఉంది.
పైన తెలిపిన వివరణ దృష్టా బోధకుడు నీళ్లలోనికి దిగకుండా విశ్వసించిన వ్యక్తి కి బాప్తిస్మము ఇవ్వడము “మొదటి శతబ్దిపు అపోస్తులులు బోధ కానిది” లేదా "భిన్నమైన బోధ అని" మనము గ్రహించాలి.
హెచ్హరిక :
సహోదరులారా, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు (1 తిమోతి. 1:3) మిమ్మలి బ్రతిమాలుకోనుచున్నాను.
మీ ఆత్మీయ సహోదరుడు,
"మనోహర్" ©
* క్రీస్తు సంఘము - (రోమా 16:16).
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com