Showing posts with label పరిశుద్ధాత్ముడు. Show all posts
Showing posts with label పరిశుద్ధాత్ముడు. Show all posts

నీవెవరివో నీకు తెలుసునా? 🤔



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻


పరలోకమందున్న దేవుడు క్రీస్తుయేసు నందు మహా ఘనమైన కార్యాలను చేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలమైన యాగమును బట్టి క్రీస్తు నందు ఉన్నవారు బహుగా ఘనపరచబడతారు. బలియాగము క్రీస్తు ప్రభువుది. ఆ బలియాగం నందు విశ్వాసముంచిన వారు క్రీస్తు ప్రభువుకు లోబడిన వారు, క్రీస్తును తమకి ప్రభువుగా నోటితో ఒప్పుకొనిన వారు, క్రీస్తు శరీరముగా (లేదా) క్రీస్తు సంఘముగా(church of Christ) ఉన్నవారు. వీరు దేవుని సముఖంలో అత్యధికముగా గౌరవించబడతారు. పరలోకమందున్న దేవుడే వారిని గొప్పగా ఘనపరిచారు. 


ఈ మానవజాతిలో క్రీస్తుయేసు ప్రభుత్వం క్రింద ఉన్నవారికి సాటియైన వారు ఎవరు లేరు దానర్థం,  క్రీస్తు ప్రభువుగా ఉండి పరిపాలన చేస్తున్న క్రీస్తు సంఘములో నీవు ఉంటే నీకు సమానులు ఈ భూమి మీద ఎవరూ లేరు. అయితే ఈ లోకానికి దేవుడు ఎవరో తెలీదు, క్రీస్తు ప్రభువు ఎవరో తెలియదు, క్రీస్తు ప్రభువులో ఉన్నవారు ఎవరో తెలియదన్న విషయము వాస్తవమే.  అసలు ఇంతకీ "నీవెవరివో నీకు తెలుసునా?" మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మన కెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.౹ (1 యోహాను. 3:1)


దేవుని ఎరుగని గుడ్డిలోకం ఆయన పిల్లలను ఎరుగక పోవడం గొప్ప విశేషమేమీ కాదు. కాబట్టి ఈ భూమి మీద నీవు క్రీస్తు ప్రభువుని ధరించుకొని జీవిస్తున్నావంటే అది అద్భుతమైన జీవితం. నీవు క్రీస్తులో బ్రతుకుతున్నావంటే ఈ గుడ్డి లోకానికి నీవెవరో తెలీదు. కారణం అది ఆయనను ఎరుగలేదు. "యేసు లోకంలో ఉండెను లోకము ఆయన మూలంగా కలిగెను కానీ లోకము ఆయనను ఎరుగలేదు" (యోహాను. 1:2-3,11) 


కాబట్టి ఈ రోజున క్రీస్తుయేసులో ఉండి, ఆయన రక్తంతో కడగబడి, పరిశుద్ధపరచబడి, నిర్దోషిగా తీర్చబడి, పవిత్రం చేయబడిన మనుషులు ఎవరో, వారి ఘనస్థితి ఏమిటో ఈ లోకానికి తెలియదు. ఈ లోకానికి తెలియకపోవడం వేరే సమాచారం కానీ నేను క్రీస్తులో ఉన్నానని, నేను ఒక క్రైస్తవుడు అని చెప్పుకునే నీకు "నీవెవరివో నిజముగా నీకు తెలుసునా? " "నీవేమైయున్నావో నీకు తెలుసునా?"


నీవు ఎవరివో నీకు స్పష్టముగా తెలియాల్సిన అవసరం ఉంది. నీకేలాంటి గౌరవం ఉందో, ఎంతటి ఘనముందో, పరలోకంలో ఉండే కోట్లాది దేవదూతలు నిన్ను ఎలా చూస్తారో, ఎలాంటి గుర్తింపు ఉందో,  నీ యొక్క ఔనత్యం గూర్చి నీకు తెలియాల్సిన అవసరత ఎంతో ఉంది. ఒకవేళ ఇవన్నీ ముందే తెలుసుకున్న కూడా నీవు తెలియనట్లుగా బ్రతుకుతున్నావా? ఐతే ఈ క్షణమే మరల చదివి, ఆలోచించు ఎందుకంటే… ఈ  లోకం దేవుని గ్రంథాన్ని నమ్మదు, సత్యదేవున్ని ఎరుగదు. కావున భవిష్యత్ లో ఈ లోకానికి పట్టే దుర్గతి దేవుని పిల్లలకు(నీకు) పట్టకూడదనేదే దేవుని కోరిక మరియు ఈ అంశము వ్రాయుటకు గల ముఖ్య ఉద్దేశ్యం. 


1️⃣. ఈ లోకస్తులు ఎవరూ నీకు సాటియైనవారు కారు

"స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు." (మత్తయి. 11:11) 


ఈ లోకంలో ప్రతి మానవుడు శరీరమందు అనగా రక్త మాంసములలో పుట్టినవాడే. స్త్రీ కంటే పుట్టినవాడే. అలాగే ఈ లోకంలో తాము గొప్ప వారిని చెప్పుకునే వారు ఉన్నారు కానీ వారు ఎవరును కూడా బాప్తిస్మమిచ్చు యోహానుకంటె  గొప్పవారు కారు. వాస్తవానికి ఈ యోహాను యొక్క గొప్పతనం ఏమిటంటే "దేవుని చేత నేరుగా పంపబడిన చివరి ప్రవక్త"  (యోహాను. 1:6) పాత నిబంధనకు ముగింపు సూచిక. యేసు కోసం మొదటగా ప్రకటించిన వాడు "మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి– ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.౹"(యోహాను 1:29). "క్రీ.పూ. యూదులకు ధైర్యంగా సత్యాన్ని ప్రకటించేవాడు మరియు సమాజంగా హెరోదు పాపాన్ని ధైర్యంగా ఎత్తి చూపాడు (మత్తయి. 3:1- 12; 14:1-6). తనకు తాను తగ్గి, యేసును హెచ్చించేలా మాట్లాడే వినయవంతుడు(యోహాను 3:30). 


అయినప్పటికి  పరలోక రాజ్యంలో వున్న అల్పుడైనవాడు బాప్తిస్మమిచ్చు యోహాను కంటే  ఎంతో గొప్పగా ఎంచబడ్డాడు. పరలోక రాజ్యం అంటే — క్రీస్తు తన స్వరక్తముతో స్థాపించిన క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు సంఘము లేదా క్రైస్తవులు (యోహాను 18:36, రోమా 14:17; రోమా 16:16; మత్తయి 16:18; అపో.కార్య. 20:28). ఈ సంఘములో ఉన్నవారు “పునర్జన్మసంబంధమైన స్నానము” చేసినవారు (యోహాను 3:3–6; తీతుకు 3:5). 


బాప్తిస్మమిచ్చ యోహాను క్రీస్తు స్థాపించిన రాజ్యములో పునర్జన్మసంబంధమైన స్నానము అనగా నీటిమూలముగాను మరియు పరిశుద్ధాత్మ అనుగ్రహించు నూతన స్వభావం అనగా ఆత్మ మూలముగాను జన్మించనివాడు (యోహాను. 3:3-6; తీతుకు. 3:5) కారణం క్రీస్తు తన సంఘాన్ని స్థాపించక మునుపే(అపో.కార్య. 2:36-42) బాప్తిస్మమిచ్చ యోహాను చంపబడ్డారు(మత్తయి. 14:1-9) కారణం యోహానుకు భయం లేదు.


అతడు రాజు ముందు కూడా దేవుని నీతిని మరియు హేరోదు యొక్క అక్రమమైన సంబంధమును స్ఫష్టముగా బహిరంగముగా ప్రకటించుట చేతనే కదా.(లేవీయకాండము 18:16, 20:21; మత్తయి. 14:4)  యోహాను భయపడే వ్యక్తి కాదు సుమీ! ఇది ఒక నిజమైన ప్రవక్త యొక్క లక్షణం.


కావున క్రీస్తు సత్య సువార్త విని, ఆయనకు శిష్యరికం చేయుగోరువాడు, ఆయన పరిపాలన క్రింద నడవాలని ఉద్దేశించే వాడు, తాను మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం, యేసుక్రీస్తు అధికారములో అనగా తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి, క్రీస్తు సంఘములో చేర్చబడివారిలో అల్పుడైనవాడు బాప్తిస్మమిచ్చ యోహానుకంటె గొప్పవాడు అనే సంగతి గుర్తించు.(రోమా. 10:9; మత్తయి. 28:19; అపో.కార్య. 2:38; మత్తయి. 11:11b) ఇది ఎంతో గొప్ప భాగ్యం. ఇది కేవలం ప్రభువైన క్రీస్తు వలన మనకు కలిగింది. ఆయన యందు ఉచితముగా అనుగ్రహింపబడుతున్న కృపవలనే సాధ్యమైంది. ఈ సంగతులు అర్థం కానివాడు, ఆయన సంఘములో లేనివాడికి  తాను ఈ లోకంలో ఏదో కోల్పోయిన వాడిగా బలహీనుడిగా ఉంటాడు. 



2️⃣. "నీవు తేజోవాసివి.., పరలోక వాసివి…"

క్రీస్తు రాజ్యంలో అనగా  ఈ భూమి మీద "క్రీస్తు సంఘములో"  నీవెంత గొప్పవాడివో చూసాం కదూ అయితే రెండవదిగా నీ స్థితి పరలోకంలో ఎలా ఉంటుందో/ఉండనుందో అనే విషయాన్ని  రెండవదిగా ప్రయత్నం చేద్దాం.


⭐ పరలోకము తేజోవాసులకు నివాస స్థలము.

⭐ “తేజో” = ప్రకాశము, వెలుగు, మహిమ, దేవుని తేజస్సు

⭐ “వాసి” = నివసించేవాడు, ఆ స్థితిలో ఉండేవాడు

తేజస్సు - దేవుని మహిమ, దేవుని ఉనికి, దేవుని పరిశుద్ధత 

⭐ “తేజోవాసి” అంటే — వెలుగులో నివసించువాడు, మహిమలో స్థిరముగా ఉన్నవాడు, దైవ తేజస్సుతో నిండినవాడు, అమరత్వము గలవాడు, ఆత్మీయ స్వరూపముని సూచిస్తుంది

⭐ ఇది చీకటి లేదా అపవిత్రత లేనివారు అని అర్థం. పవిత్రతతో, పరలోక కాంతితో, పరిశుద్ధతతో నిండిన స్థితి కలిగినవారు అని 

⭐ "తేజోవాసులు" అనగా — దేవుని వెలుగులో నివసించే వారు, ఆయన మహిమను ధరించిన వారు, ఆయనతో సమాగమములో ఉన్నవారు, ఆ తేజస్సును లోకములో ప్రతిఫలింప చేసేవాడు. 



👤🔥  "మొదటిగా మన తండ్రియైన దేవుడు తేజోవాసి*

 "శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.౹ సమీ పింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్." (1 తిమోతి. 6:15-16) 


◾ దేవుడు తేజస్సులో నివసించువాడు.

◾దేవుడు వెలుగు — ఆయన వెలుగుకంటే ఎక్కువ కాంతిమంతుడు (1 యోహాను 1:5)

ఉదాహరణకు : మోషే దేవుని తేజస్సులో కొంత భాగాన్ని చూశాడు; దాని ఫలితంగా అతని ముఖం ప్రకాశించింది (నిర్గమకాండము 34:29–35). అంటే దేవుని సమీపంలో ఉండడం వలన కూడా మనిషి కాంతివంతమౌతాడు.



👤🔥  రెండవదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు తేజోవాసి

"ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి,... " (హెబ్రీ. 1:3)


"తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹" (యోహాను 17:5)


◾ యేసు దేవుని కుమారుడు మాత్రమే కాదు దేవుని తేజస్సును, మహిమను ధరించినవాడు (లేదా) క్రీస్తు తన దేవుని తేజస్సు యొక్క ప్రతిరూపము. 

◾తేజోవాసి యేసు! ఈ భూమి మీద జీవించు కాలములో యేసు తన రూపాంతర సమయంలో ఆ తేజస్సును చూపించాడు.

◾ "మరల యేసు– నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.౹" (యోహాను 8:12)

◾ రూపాంతరములో  ≈ "ఆయన రూపాంతరము పొందెను; ఆయన ముఖము సూర్యమువలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు కాంతివలె తెల్లగా మారెను." (మత్తయి. 17:2)

పునరుత్థానములో  ≈ "ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు జరిగిన ఈ సంగతులన్నిటినిగూర్చి యొక రితో నొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను; అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను." (లూకా. 24:13-16) "ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.౹" (యోహాను. 20:14)


◾ "అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.౹ అప్పుడతడు నేలమీదపడి —సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.౹ –ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన– నేను నీవు హింసించు చున్న యేసును;౹" (అపో.కార్య. 9:3-5)



👤🔥 మూడవదిగా మన ఆత్మయు/ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు

"ప్రభువే ఆత్మ. ప్రభువుయొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్యమునుండును.౹ మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము." (2 కొరింథీయులు 3:17–18)


◾  పరిశుద్ధాత్ముడు కూడా తేజోవాసినే 

◾ ఇది బాహ్యగా కనపడే దృష్టి కాదు; ఆత్మీయ దృష్టి

◾పరిశుద్ధాత్ముడు మనలో నివసించినప్పుడు, మన ఆలోచనలు, మనసు, స్వభావం, నడవడి — అన్నీ ఆయన రూపమునకు దగ్గరవుతాయి. (రోమా. 12:2; ఫిలిప్పీయులకు 3:21)

◾దేవుని తేజస్సు మనలోకి రావడం అంటే ఆయన ఆత్మ మనలో పనిచేయడం.

ఈ మార్పు కేవలం ప్రవర్తనలో కాదు — దైవ స్వరూపంలో మార్పు కలుగుతుంది. (2 పేతురు 1:4)

◾పరమదేవుడు తేజోవాసి. మన ప్రభువైన యేసు ఆ తేజస్సు యొక్క ప్రతిబింబం. మన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు ఆ తేజస్సును మనలో ప్రతిబింబింపజేయువాడు.

◾ మనలో స్వాతంత్ర్యం, తేజస్సు, మహిమను నింపుతాడు.



👥🔥  నాలుగవదిగా  దేవదూతలు తేజోవాసులు

"—తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు... " (హెబ్రీ. 1:7) 


◾దేవదూతలు తేజోవాసులు ఎందుకంటే వారు దేవుని సముఖంలో నిరంతరముగా నిలిచి సేవచేస్తారు.

◾యేసు పునరుత్థాన పిమ్మట సమాధి దగ్గర దేవదూతలు మెరుపులవలె ప్రకాశించే వస్త్రములతో కనబడ్డారు (లూకా 24:4).



👬👭 ఐదవది క్రీస్తు సంఘ సభ్యులు అనగా క్రైస్తవులు కూడా తేజోవాసులే

◾క్రీస్తు సంఘ సభ్యులు(church of Christ) అనగా గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంధమందు ఎవరి పేరు వ్రాయబడునో వారే…  వీరు క్రీస్తు నందు ఉన్నవారు అనగా చీకటిలో కాదు, వెలుగులో నడిచేవారు/ వెలుగు యొద్దకు పిలువబడిన వారు (ఎఫెసి. 5:8; 1 పేతురు. 2:9) ఇట్టి వారి “పౌరత్వము పరలోకమందున్నది.” (ఫిలిప్పీయులకు 3:20) "తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను చేసెను.” (కొలస్సి 1:12) కావున నీవు తేజోవాసివే అని తెలుసుకో.


"... దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను... " పరిశుద్ధాత్ముడు  మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ...పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో (ఎఫెసి 1:11,14,17). "మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.౹" ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.౹"

(1 పేతురు 1:3,5)


క్రీస్తు రాజ్యములో(సంఘములో) నున్నవాడు భూనివాసి కాదు. "భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.౹" (ప్రకటన. 13:8) గొఱ్ఱెపిల్లయొక్క జీవ గ్రంథములో పేరు లేనివారు భూనివాసులే కానీ పరలోక నివాసులుకారు. 


✨ ఆయన(క్రీస్తు) రాజ్యములో(సంఘములో) ప్రవేశించువారందరూ పరలోక సంబంధులే. ప్రభువైన యేసును ధరించుకున్న వాడు భూమి వాసిగా లెక్కించబడడు. ప్రస్తుతం నీవు ఈ భూమ్మీద ఉండవచ్చు కానీ నీవు పరలోక వాసిగా లెక్కింపబడతావు. అంతేకాకుండా నీకు స్వాస్థ్యము ఇచ్చాడు.


⭐ తేజోవాసులు ≈ పరలోకవాసులు ⭐


✨  తేజోవాసులు మాత్రమే పరలోకంలో నివసిస్తారు.


📖 దేవదూతల కంటే క్రీస్తుయేసు శరీరమందు ఉన్నవారు అనగా క్రీస్తు సంఘముగా ఉన్నవారు అధికమైన తేజోవాసులు, ఘనులు మరియు గొప్పవారు. ఇది కేవలం క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన కృపవలన సాధ్యపడింది. కావున ప్రతి క్రీస్తు సంఘ సభ్యుడు నీవెవరివో  అనే సంగతి మరవద్దు. 🙏🏻


A). దేవదూతలకు మరియు నీకు ఉన్న తేడా ఏమిటో నీకు బాగా తెలియాలి

దేవదూతలు దేవుని యొక్క సేవకులే (హెబ్రీ. 1:7) సేవకులు ఎప్పుడూ పిల్లలు కాలేరు. బిడ్డలు మాత్రమే తండ్రి స్వాస్థ్యమునకు హక్కుదారులైయుంటారు. భూమి పుట్టక మునుపు నుండి దేవదూతలు దేవుని సముఖములో ఉన్నారు కాని వారికి నీలాంటి హక్కు లేదు, నీకున్న ఘనత లేదు, నీకున్న మహిమ లేదు.


సేవకుడు సేవకుడే కానీ పిల్లలు మాత్రమే దేవుని వారసులు


యజమాని కుర్చీ పక్కన నిలుచుని సేవ చేసేవాడు సేవకుడు. యజమాని కూర్చున్నంతసేపు నిలబడతాడు. యజమాని వెళ్లిపోయాడు కదా కుర్చీ ఖాళీగా ఉంది కదా అని సేవకుడు కూర్చోడు. అట్టి ధైర్యం కూడా చేయలేడు. అయితే ఖాళీగా ఉన్న యజమాని కుర్చీలో ధైర్యంగా వెళ్లి కూర్చోగలడు వారసుడు (యజమాని పిల్లలు). నీవు దేవుని వారసత్వంలో భాగమైనవాడివి. క్రీస్తుతో కూడ వారసుడువి. (రోమా 8:17)


దేవదూతలను ఎన్నడూ నా కుమారులు అని దేవుడు చెప్పలేదు. దేవదూతలు రక్షణ పొందు వారికి పరిచారకులు, సేవకులే. "వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?" (హెబ్రీ. 1:14)


ఇదంతాయు పరలోకమందున్న దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసులో క్రీస్తు సంఘ సభ్యులకు అనుగ్రహించిన భాగ్యం. ఈ సంగతులు ఈ లోకానికి తెలియదు, ఏ మత శాఖలకి తెలియదు/వివిధ నామాలు కలిగిన/అపోస్తుల బోధకు కానీ ఏ శాఖలకి తెలియదు. ఎందుకంటే వారు నడిచేత్రోవ సరైనది కాదు. బోధ సరైనది కాదు. క్రీస్తు సంఘ(church of Christ) సభ్యుడిగా నీకు తెలియక పోవడం ఎంతటి దౌర్భాగ్యం. అయ్యో! ☹️ 


దేవుని సముఖములో నున్న దేవదూతలకు(సేవకులకు) మరియు నీకు మధ్య వ్యత్యాసముంది. నీ అంతస్తు మానవజాతి కంటే ఎక్కువ. దేవదూతలు కంటే ఎక్కువ. నీకు సేవచేయుటకే దేవతలు ఏర్పాటు చేయబడ్డారు అనే సంగతి నీకు తెలుసునా?



B). *నీవు నేర్పిస్తే దేవదూతలు నేర్చుకునేంతగా నిన్ను హెచ్చించాడు

ఈ భూమికి పునాదులు వేయబడక మునుపే దేవదూతలు ఉన్నారు.* "నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?" (యోబు. 38:4-7) అంటే నరుల కంటే ముందు నుండి దేవుని సముఖములో దేవదూతలు ఉన్నారని వారికి నీ కంటే ఎక్కువగా దేవుని గురించి బాగా తెలుసు అనేగా… 


ఐనప్పటికి క్రీస్తు సంఘములో నన్ను వారు దేవదూతల జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానవంతులుగా ఎంచబడ్డారు అనే సంగతి నీకు తెలుసునా? "ఈ హేతువుచేత అన్యజనులైన మీనిమిత్తము క్రీస్తు యేసుయొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను.౹ మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారు.౹ ఎట్లనగా —క్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచబడినదను సంగతినిగూర్చిమునుపు సంక్షేపముగా వ్రాసితిని.౹ మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.౹ ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు.౹ ఈ మర్మమేదనగా– అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే.౹ దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.౹ దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.౹" (ఎపేసి. 3:1-8)


సంఘము నేర్పిస్తే దేవదూతలు నేర్చుకునేంతగా నిన్ను(క్రీస్తు సంఘము) హెచ్చించాడు. నీవు క్రీస్తు ప్రభువులో నమ్మకంగా ఉంటే దేవుని నీకిచ్చే కొల పరిమాణం ఇదే. ఈ సంగతి నీకు తెలుసునా? 



C). *నీ స్థాయి వేరు — దేవదూతలు స్థాయి వేరు

"మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశో ధించిరి.౹ పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించినవారిద్వారా మీకిప్పుడు తెలుప బడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు." (1 పేతురు. 1:10-12)


📖 “దేవుని జ్ఞానం అన్వేషింపలేనిది!” (రోమా 11:33) పూర్వపు ప్రవక్తలు, దేవదూతలు క్రీస్తు సంఘంలో ఉన్న స్థితిని పొందలేకపోయారు. వారు సంఘము కొరకే పని చేశారు. ప్రవక్తలు తమ కాలంలో దైవ సందేశం పొందినప్పటికి వారి సేవ తమ తరానికి మాత్రమే కాదు, భవిష్యత్తు విశ్వాసులకు అనగా నేడు క్రీస్తు సంఘము సభ్యులకు మాత్రమే ఉద్దేశించబడింది.


➡️ వారు విత్తారు, మనం పంట కోస్తున్నాం.

➡️ వారు ఆశతో చూశారు, మనం నెరవేరిన వాగ్దానాన్ని అనుభవిస్తున్నాం. 


రక్షణ అనేది యాదృచ్ఛికం కాదు — దేవుని శాశ్వత ప్రణాళిక. యేసు క్రీస్తు ద్వారా దేవుని కృప మనకు ప్రత్యక్షమైంది. ఇక విషయానికి వస్తే… దేవదూతలు సంఘాన్ని తొంగి చూసే స్థితిలో ఉన్నారు(1 పేతురు. 1:20cf) అది వారి స్థాయి… మరి నీ స్థాయి ఎట్టిదో నీకు తెలుసునా? క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన క్రింద ఉన్న నీకు నీ స్థాయి తెలుసునా? ఆయన పరిపాలన క్రింద ఉన్నవాడు అంతస్థకు తగినట్లుగా బ్రతుకుతాడు(రోమా. 14:8-9), ఘనతకు తగినట్లుగా ప్రవర్తిస్తాడు(ఎపెసి. 4:1), తన స్థాయిని నిలబెట్టుకోవడానికి నిత్యము ముందుకు సాగుతాడు(హెబ్రీ. 12:1-3)


క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము అనగా క్రీస్తు సంఘము ఒక రోజున పరలోకానికి ఆహ్వానింపబడతాది. ఆ ఆహ్వానానికి ఏర్పాట్లు ఆర్భాటముగా జరుగుతాయి, చేయబడ్డాయి. ఏలయనగా… ప్రధాన దూత శబ్దముతో ప్రభువైన యేసు వస్తారు. ఆయన దిగివచ్చిన దినమున వధువైన క్రీస్తు సంఘం(church of Christ) పరలోకానికి కొనిపోబడతాది. దాని అర్థం పరలోకానికి హక్కుదారిగా చేయబడతాది. ఇది క్రీస్తు సంఘానికి ఉండే మహత్కారమైన ఘనత, ఆధిక్యత. క్రీస్తు ప్రభువు యొక్క భార్యగా క్రీస్తుకి ఉండే అన్నిటిలోనూ భాగస్వామ్యం పొందుతాది. నీకు ఒక గుర్తింపు దొరుకుతాది నీకు ఒక మర్యాద దక్కుతాది. ఇంతకుమించి వర్ణించలేము….. ఇకనైనా నీవెవరివో నీకు తెలిసిందా? ఆలోచించు… ఏదో రకముగా తోచినట్టుగా బ్రతికేది క్రైస్తవ జీవితం కాదు సుమీ!!

మీ ఆత్మీయులు👪

"పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడా?" (Is the Holy Spirit son of God?)

పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడా?


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈనాడు క్రైస్తవ్యములో కొందరు బోధకులు తండ్రికి మొదటి కుమారుడు యేసుక్రీస్తని, రెండవ కుమారుడు పరిశుద్ధాత్ముడని భిన్న బోధలు చేస్తూ వాక్యమును అపార్థము చేయుచున్నారు. వీరు గ్రంథములో రెండు వచనములను ఆధారము చేసుకొని దేవుని రెండవ కుమారుడు పరిశుద్ధాత్ముడని వాక్యమును వక్రీకరణ చేయుచున్నారు. అవేమనగా,

◆ ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొంద లేదు గాని, దత్త పుత్త్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము - అబ్బా, తండ్రీ, అని మొర్ర పెట్టుచున్నాము. – (రోమా. 8:15).
◆ మీరు కుమారులై యున్నందున - నాయనా, తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. – (గలతీ. 4:6).

పైన వ్రాయబడిన రెండు వచనములను మాత్రమే చదివి పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడని బోధ చేయుచున్నారు కాని ఆ పత్రికలో ఉన్న ఆ యా అధ్యాయములలో గల సారాంశమును గ్రంహించలేకపోతున్నారు.

★ దాస్యపు ఆత్మ (spirit of bondage) అనగా, ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారియొక్క మానసిక ఒత్తిడి, పాపము మరియు మరణము.

★ దత్త పుత్త్రాత్మ (spirit of adoption) అనగా స్వీకృత ఆత్మ లేదా సమాన వారసత్వముగా అంగీకరింపనడినది.

★ కుమారుని ఆత్మ (spirit of son or nature of Christ) అనగా క్రీస్తు యొక్క ఆత్మ లేదా క్రీస్తు యొక్క స్వభావము.

అపోస్తులుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘము వారికి ధర్మశాస్త్రములో దేవునిచేత  నియమింపబడిన ఆజ్ఞలను వివరిస్తూ, ధర్మశాస్త్రమును ఎంతో పవిత్రముగా ఆచరించిన పౌలు గారు సైతము తన మరణమునకు లోనగు శరీర విషయములో దౌర్భాగ్యుడని ఎంచుకొనుచూ (రోమా. 7:23-24), వారు ధర్మశాస్త్రమునకు లోబడి (రోమా. 6:16), దాసులుగా ఉన్నారనీ (రోమా. 7:1-3), ధర్మశాస్త్రము నిత్యజీవము కలుగజేయదని తెలియజేస్తూ (రోమా. 6:21-22; 7:12-14), తండ్రి తన సొంత కుమారుని మరణము నొదించుటచేత పాప పరిహారము పొందియున్నాము (రోమా. 8:1-4) కనుక ధర్మశాస్త్రము క్రిందున్న వారిని అనగా, ఆ “దాస్యపు ఆత్మ” కలవారిని విడుదల కలుగజేసి తన కుమారుని ఆత్మను అనగా తన కుమారుని ద్వారా మనలను దత్త పుత్రులుగా స్వీకరించి క్రీస్తు స్వభావము కలిగియుండాలని (రోమా. 8:13-16; గలతీ. 4:19) తన కుమారుని ఆత్మ మన హృదయములోనికి పంపియున్నాడని (గలతీ. 4:6-7) రోమాలో ఉన్న సంఘమునకు చెప్పబడిన సంగతులను మనము రోమా పత్రిక 7 మరియు 8వ అధ్యాయములో చూడగలము.

తండ్రికి అద్వితీయ కుమారుడు ఒక్కడే :


★ అద్వితీయుడు అనగా ఒక్కడే, సాటిలేనివాడు, ఇంకొకరితో పోలిక లేనివాడు, సమానము లేనివాడు.

» ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. – (యోహాను.1:14).
» ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. – (యోహాను. 1:18).
» దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. – (యోహాను. 3:16).
» ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను. – (యోహాను. 3:18).
» మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. – (1 యోహాను. 4:9).

హెచ్చరిక :


» తండ్రికి ఒక్కడే కుమారుడని పరిశుద్ధాత్ముడే పై వచనముల ద్వారా ఖండితముగా తెలియజేస్తుండగా పరిశుద్ధాత్ముడు దేవునికి రెండవ కుమారుడని సొంత బోధ చేయుట ఎంతవరకు సమంజసము?
» పరిశుద్ధాత్ముని గూర్చి పూర్తి వివరణ కావాలంటే పరిశుద్ధాత్ముడు, పాత నిబంధనలో మరియు  క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పని అంశములను చూడగలరు.


కాబట్టి ప్రియులారా, వాక్య పరిశీలన చేసి అపోస్తులుల బోధలో నడుచుకుని దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు, 
మనోహర్ నవీన

"నేటి కాలములో పరిశుద్ధాత్ముని పని" (The work of the Holy Spirit in the present Christianity)

నేటి కాలములో పరిశుద్ధాత్ముని పని


ప్రభువునందు ప్రియమైన పరిశుద్ధులందరికి నా హృదయపూర్వక వందనములు.


A). "యేసును ప్రభువుగా ఒప్పుకోలు చేస్తాడు" :

» "దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను". ( 1 కొరింధి. 12:3).
» "యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు". (రోమా. 10:9).
» "మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమైయున్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి (మరల ) బ్రదికెను". (రోమా. 14:8-9).
» "మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను". (అపో.కార్య. 2:36).


B). "లోకాన్ని పాపము గూర్చి ఒప్పుకోలు చేస్తాడు" :

» "నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణ కర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రియొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పుపొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును". (యోహాను. 16:7-11).


C). "మన హృదయములోనికి పంపబడి, సొంతగానికి ముద్రగా ఉంటాడు" :

» "మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానముచేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి". (ఎఫెసి. 1:13).
» “మీతోకూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్రవేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు”. (2 కొరింధి. 1:21-22).
» “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి”. ( 1 కొరింధి. 6:19-20).


D). "మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉంటాడు" :

» “ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు”. (2 కొరింధి. 5:5).
» “దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు”. (ఎఫెసు. 1:14).


E). "నీలో నివాసము చేసి, విజ్ఞాపన చేస్తాడు" :

» "మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియు మీరెరుగరా?" ( 1 కొరింధి. 3:16).
» "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా, మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు." "మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా, ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు." (రోమా. 8:26-27).


F). "కృపకు మూలమైన ఆత్మ" :

» "న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును." "ఎవడైనను మోషే ధర్మ శాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు." "ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?" (హెబ్రీ. 10:27-29).


దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినము వరకు ఆయనయందు
మీరు ముద్రింపబడియున్నారు. (ఎఫెసి. 4:30).

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.

"ఆత్మయు ఒక్కడే" (one Spirit)




ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

● కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. (1 కొరింధి. 12:4).

● మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి యొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువరములును. (1 కొరింధి. 12:9).

● ఏలాగనగా- యూదులమైనను, గ్రీసు దేశస్తులమైనను, దాసులమైనను, స్వతంతులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. (1 కొరింధి. 12:13).

● మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగుజాడలయందే నడుచుకొనలేదా? (2 కొరింధి. 12:18).

● ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేర గలిగియున్నాము. (ఎఫెసీ. 2:18).

ఆత్మయు ఒక్కడే. (ఎఫెసీ. 4:4).
 నిత్యుడగు ఆత్మ. (హెబ్రీ. 9:14).

● కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా - మనుష్యులు చేయు ప్రతిపాపమును దూషణయు వారికి క్షమిమింపబడును కాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. (మత్తయి. 12:31).

● “పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెన్నటికిని క్షమింపబడక శాశ్వతమైన నిత్య పాపము చేసినవాడుగా పరిగణింపబడును'' అని చెప్పెను. (మార్కు. 3:29).


మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు

"క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పని" (the work of holy spirit in the new testament)



ప్రభువునందు ప్రియమైన పరిశుద్ధులందరికి నా హృదయపూర్వక వందనములు.

క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పేర్లు :

» ఆత్మ.  (మత్తయి. 4:1; 12:31; ఎపేసి. 1:14).
» దేవుని ఆత్మ.  (రోమా. 8:9).
» ఆదరణ కర్త/ఉత్తరవాది.  (యోహాను. 15:26).
» సత్యస్వరూపియైన ఆత్మ.  (యోహాను. 16:13).
» మహాస్వరూపియైన ఆత్మ.  (1 పేతురు. 4:14).
» నిత్యుడగు ఆత్మ.  (హెబ్రీ. 9:14).

క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయుంచుటలో పరిశుద్ధాత్ముని పని

ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. – (2 పేతురు. 1:20:21).


యేసు పుట్టుకలో పరిశుద్ధాత్ముడు

● అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. – (లూకా. 1:34-35).

● అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్బము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది. – (మత్తయి. 1:20).

యేసు బాప్తీస్మములో పరిశుద్ధాత్ముడు

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. – (మత్తయి. 3:16; మార్కు. 1:10; లూకా. 3:22; యోహాను. 1:32).

అపోస్తులుల కాలములో పరిశుద్ధాత్ముడు

1)     అపోస్తులులు పరిశుద్దాత్మలో బాప్తీస్మము పొందుట :
» తండ్రి యొక్క వాగ్ధానమును అనగా పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి (యోవేలు. 2:28) యేసు ముందుగా తండ్రియొక్క వాగ్ధానమును తన శిష్యులకి జ్ఞాపకము చేసి యెరూషలేములో వారు మాత్రమే పొందుకొనుటకు సహాయపడిరి (లూకా. 24:49; అపో.కార్య. 1:4; 2:3-4).

2)     అపోస్తులులతో పరిశుద్ధాత్ముడు చేసిన పని :
» అపోస్తులులకు సమస్తమును బోధించుటలోను, యేసు చెప్పిన సంగతులన్నిటిని జ్ఞాపకము చేయుటలోను పరిశుద్ధాత్ముడు వారికి ఉత్తరవాదిగా ఉన్నారు. (యోహాను. 14:26; 17:7). 

» పరిశుద్ధాత్ముడు, అపోస్తులుల ద్వారా యేసుని గూర్చిన సాక్ష్యమును లోకమునకు తెలియజేసారు. (యోహాను. 15:26).

» అపోస్తులులను సర్వసత్యములోనికి నడిపించుటలోను, ఆయన వినిన సంగతులను వారికి బోధించి సంభవింపబోవు సంగతులను వారికి తెలియజేసారు. (యోహాను. 16;13).

3)   అపోస్తులుల “తో”, “లో” ఉంటూ పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు :  
» పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని అపోస్తులులతో పరిశుద్ధాత్ముడు స్వస్థపరిచెను. (అపో. కార్య. 3:1-9).

» పరిశుద్ధాత్మ అపోస్తులులలో ఉండుట వలన వారి నీడ సైతము పడి అనేకమంది స్వస్థపరచబడ్డారు. (అపో.కార్య. 5:15).

4)     అపోస్తులులు పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించుట :
 » పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా     మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై, తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు. (1 పేతురు. 1:12).

» నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. (అపో.కార్య. 11:14).

» పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను- ప్రజల అధికారులారా, పెద్దలారా... (అపో.కార్య. 4:8).

5)     మరుగైయున్న దేవుని సంకల్పము తెలియచేయుటలో పరిశుద్దాత్ముని పని :
» మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడుఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవుదేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. (1 కొరింధి. 2:10-13).

» ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులుగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడ లేదు.
ఈ మర్మమేదనగా - అన్యజనులు సువార్త వలన క్రీస్తుయేసునందు యూదులతోపాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే. (ఎఫెసీ. 3:5-6).

6)     అపోస్తులుల హస్తనిక్షేపణ చేయగా(చేతులుంచగా)  పరిశుద్దాత్ముని శక్తీ పొందునట్లు పనిచేసెను :
» అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. (అపో.కార్య. 8:17).

» తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును  ప్రవచించుటకును  మొదలుపెట్టిరి. (అపో.కార్య. 19:16).

7)     పరిశుద్దాత్ముడు తన చిత్తము చెప్పున కృపావరములు పంచి ఇచ్చెను :
» ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. అయినను వీటినన్నిటిని ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. (1 కొరింధి. 12:8-11).

.» దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుత ములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. (1 కొరింధి. 12:28-31).

వాక్యము స్థిరపరచుటలో పరిశుద్ధాత్ముడు
కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను మహత్కార్యములచేతను నానావిధములైన అద్భుతములచేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను. – (హెబ్రీ. 2:1-4).

మీ ఆత్మీయ సహోదరుడు, 
మనోహర్ బాబు . 


The churches of Christ greet you - Roma 16:16