"క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పని" (the work of holy spirit in the new testament)



ప్రభువునందు ప్రియమైన పరిశుద్ధులందరికి నా హృదయపూర్వక వందనములు.

క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పేర్లు :

» ఆత్మ.  (మత్తయి. 4:1; 12:31; ఎపేసి. 1:14).
» దేవుని ఆత్మ.  (రోమా. 8:9).
» ఆదరణ కర్త/ఉత్తరవాది.  (యోహాను. 15:26).
» సత్యస్వరూపియైన ఆత్మ.  (యోహాను. 16:13).
» మహాస్వరూపియైన ఆత్మ.  (1 పేతురు. 4:14).
» నిత్యుడగు ఆత్మ.  (హెబ్రీ. 9:14).

క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయుంచుటలో పరిశుద్ధాత్ముని పని

ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. – (2 పేతురు. 1:20:21).


యేసు పుట్టుకలో పరిశుద్ధాత్ముడు

● అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. – (లూకా. 1:34-35).

● అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్బము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది. – (మత్తయి. 1:20).

యేసు బాప్తీస్మములో పరిశుద్ధాత్ముడు

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. – (మత్తయి. 3:16; మార్కు. 1:10; లూకా. 3:22; యోహాను. 1:32).

అపోస్తులుల కాలములో పరిశుద్ధాత్ముడు

1)     అపోస్తులులు పరిశుద్దాత్మలో బాప్తీస్మము పొందుట :
» తండ్రి యొక్క వాగ్ధానమును అనగా పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి (యోవేలు. 2:28) యేసు ముందుగా తండ్రియొక్క వాగ్ధానమును తన శిష్యులకి జ్ఞాపకము చేసి యెరూషలేములో వారు మాత్రమే పొందుకొనుటకు సహాయపడిరి (లూకా. 24:49; అపో.కార్య. 1:4; 2:3-4).

2)     అపోస్తులులతో పరిశుద్ధాత్ముడు చేసిన పని :
» అపోస్తులులకు సమస్తమును బోధించుటలోను, యేసు చెప్పిన సంగతులన్నిటిని జ్ఞాపకము చేయుటలోను పరిశుద్ధాత్ముడు వారికి ఉత్తరవాదిగా ఉన్నారు. (యోహాను. 14:26; 17:7). 

» పరిశుద్ధాత్ముడు, అపోస్తులుల ద్వారా యేసుని గూర్చిన సాక్ష్యమును లోకమునకు తెలియజేసారు. (యోహాను. 15:26).

» అపోస్తులులను సర్వసత్యములోనికి నడిపించుటలోను, ఆయన వినిన సంగతులను వారికి బోధించి సంభవింపబోవు సంగతులను వారికి తెలియజేసారు. (యోహాను. 16;13).

3)   అపోస్తులుల “తో”, “లో” ఉంటూ పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు :  
» పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని అపోస్తులులతో పరిశుద్ధాత్ముడు స్వస్థపరిచెను. (అపో. కార్య. 3:1-9).

» పరిశుద్ధాత్మ అపోస్తులులలో ఉండుట వలన వారి నీడ సైతము పడి అనేకమంది స్వస్థపరచబడ్డారు. (అపో.కార్య. 5:15).

4)     అపోస్తులులు పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించుట :
 » పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా     మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై, తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు. (1 పేతురు. 1:12).

» నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. (అపో.కార్య. 11:14).

» పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను- ప్రజల అధికారులారా, పెద్దలారా... (అపో.కార్య. 4:8).

5)     మరుగైయున్న దేవుని సంకల్పము తెలియచేయుటలో పరిశుద్దాత్ముని పని :
» మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడుఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవుదేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. (1 కొరింధి. 2:10-13).

» ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులుగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడ లేదు.
ఈ మర్మమేదనగా - అన్యజనులు సువార్త వలన క్రీస్తుయేసునందు యూదులతోపాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే. (ఎఫెసీ. 3:5-6).

6)     అపోస్తులుల హస్తనిక్షేపణ చేయగా(చేతులుంచగా)  పరిశుద్దాత్ముని శక్తీ పొందునట్లు పనిచేసెను :
» అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. (అపో.కార్య. 8:17).

» తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును  ప్రవచించుటకును  మొదలుపెట్టిరి. (అపో.కార్య. 19:16).

7)     పరిశుద్దాత్ముడు తన చిత్తము చెప్పున కృపావరములు పంచి ఇచ్చెను :
» ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. అయినను వీటినన్నిటిని ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. (1 కొరింధి. 12:8-11).

.» దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుత ములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. (1 కొరింధి. 12:28-31).

వాక్యము స్థిరపరచుటలో పరిశుద్ధాత్ముడు
కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను మహత్కార్యములచేతను నానావిధములైన అద్భుతములచేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను. – (హెబ్రీ. 2:1-4).

మీ ఆత్మీయ సహోదరుడు, 
మనోహర్ బాబు . 


Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16