"పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడా?" (Is the Holy Spirit son of God?)

పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడా?


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈనాడు క్రైస్తవ్యములో కొందరు బోధకులు తండ్రికి మొదటి కుమారుడు యేసుక్రీస్తని, రెండవ కుమారుడు పరిశుద్ధాత్ముడని భిన్న బోధలు చేస్తూ వాక్యమును అపార్థము చేయుచున్నారు. వీరు గ్రంథములో రెండు వచనములను ఆధారము చేసుకొని దేవుని రెండవ కుమారుడు పరిశుద్ధాత్ముడని వాక్యమును వక్రీకరణ చేయుచున్నారు. అవేమనగా,

◆ ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొంద లేదు గాని, దత్త పుత్త్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము - అబ్బా, తండ్రీ, అని మొర్ర పెట్టుచున్నాము. – (రోమా. 8:15).
◆ మీరు కుమారులై యున్నందున - నాయనా, తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. – (గలతీ. 4:6).

పైన వ్రాయబడిన రెండు వచనములను మాత్రమే చదివి పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడని బోధ చేయుచున్నారు కాని ఆ పత్రికలో ఉన్న ఆ యా అధ్యాయములలో గల సారాంశమును గ్రంహించలేకపోతున్నారు.

★ దాస్యపు ఆత్మ (spirit of bondage) అనగా, ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారియొక్క మానసిక ఒత్తిడి, పాపము మరియు మరణము.

★ దత్త పుత్త్రాత్మ (spirit of adoption) అనగా స్వీకృత ఆత్మ లేదా సమాన వారసత్వముగా అంగీకరింపనడినది.

★ కుమారుని ఆత్మ (spirit of son or nature of Christ) అనగా క్రీస్తు యొక్క ఆత్మ లేదా క్రీస్తు యొక్క స్వభావము.

అపోస్తులుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘము వారికి ధర్మశాస్త్రములో దేవునిచేత  నియమింపబడిన ఆజ్ఞలను వివరిస్తూ, ధర్మశాస్త్రమును ఎంతో పవిత్రముగా ఆచరించిన పౌలు గారు సైతము తన మరణమునకు లోనగు శరీర విషయములో దౌర్భాగ్యుడని ఎంచుకొనుచూ (రోమా. 7:23-24), వారు ధర్మశాస్త్రమునకు లోబడి (రోమా. 6:16), దాసులుగా ఉన్నారనీ (రోమా. 7:1-3), ధర్మశాస్త్రము నిత్యజీవము కలుగజేయదని తెలియజేస్తూ (రోమా. 6:21-22; 7:12-14), తండ్రి తన సొంత కుమారుని మరణము నొదించుటచేత పాప పరిహారము పొందియున్నాము (రోమా. 8:1-4) కనుక ధర్మశాస్త్రము క్రిందున్న వారిని అనగా, ఆ “దాస్యపు ఆత్మ” కలవారిని విడుదల కలుగజేసి తన కుమారుని ఆత్మను అనగా తన కుమారుని ద్వారా మనలను దత్త పుత్రులుగా స్వీకరించి క్రీస్తు స్వభావము కలిగియుండాలని (రోమా. 8:13-16; గలతీ. 4:19) తన కుమారుని ఆత్మ మన హృదయములోనికి పంపియున్నాడని (గలతీ. 4:6-7) రోమాలో ఉన్న సంఘమునకు చెప్పబడిన సంగతులను మనము రోమా పత్రిక 7 మరియు 8వ అధ్యాయములో చూడగలము.

తండ్రికి అద్వితీయ కుమారుడు ఒక్కడే :


★ అద్వితీయుడు అనగా ఒక్కడే, సాటిలేనివాడు, ఇంకొకరితో పోలిక లేనివాడు, సమానము లేనివాడు.

» ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. – (యోహాను.1:14).
» ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. – (యోహాను. 1:18).
» దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. – (యోహాను. 3:16).
» ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను. – (యోహాను. 3:18).
» మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. – (1 యోహాను. 4:9).

హెచ్చరిక :


» తండ్రికి ఒక్కడే కుమారుడని పరిశుద్ధాత్ముడే పై వచనముల ద్వారా ఖండితముగా తెలియజేస్తుండగా పరిశుద్ధాత్ముడు దేవునికి రెండవ కుమారుడని సొంత బోధ చేయుట ఎంతవరకు సమంజసము?
» పరిశుద్ధాత్ముని గూర్చి పూర్తి వివరణ కావాలంటే పరిశుద్ధాత్ముడు, పాత నిబంధనలో మరియు  క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పని అంశములను చూడగలరు.


కాబట్టి ప్రియులారా, వాక్య పరిశీలన చేసి అపోస్తులుల బోధలో నడుచుకుని దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు, 
మనోహర్ నవీన

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16