సంతోషము |
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన నా తోటి సహోదరీ, సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ఉపోద్ఘాతం :
I. ప్రతి
ఒక్కరు సంతోషాన్నే కోరుకుంటారు కాని ఏ ఒక్కరు నిరాశని కోరుకోరు.
II. నిజమైన
క్రైస్తవుడు సంతోషంగా ఎలా ఉండగలడు?
III. దేవుడు
నిజమైన, నిత్యమైన సంతోషాన్ని ఇవ్వగలడా (లేక) ఇస్తున్నాడా?
దేవుని వైపు చూడు మరియు ఆయనకు దగ్గరగా ఉండు :
A. ఆత్మీయ
జీవితము మనల్ని సంతోషంగా ఉంచగలదు : (ద్వితియో.
30:20).
1. ఈ
భౌతిక సంబంధమైన జీవితములో ఎన్ని కష్టములున్నా మన తండ్రి యెద్ద నిత్యము జీవించగలము
అనే ఆత్మ సంబంధమైన నిరీక్షణ మనకు సంతోషాన్నిస్తుంది.
● ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున
ప్రతిఫలమిచ్చును. సత్‌క్రియను ఓపికగా చేయుచు, మహిమను
ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. – (రోమా. 2:6-7).
2. మనకున్న ప్రతి స్థితిని దేవుడు గమనిస్తున్నాడని, ఆయన
మనలను గూర్చి చింతిస్తున్నాడనే భావన మనకు సంతోషాన్నిస్తుంది.
● ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. – (మత్తయి. 11:28).
● దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన
చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద
వేయుడి. – (1 పేతురు. 5:6-7).
● నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన
ఎన్నడును కదలనీయడు. – (కీర్తన. 55:22).
3. మనము దేవుడు రక్షించుకున్న ప్రజలమని, ఆయన మనకు సహాయకుడని నమ్ముట మనకు
సంతోషాన్నిస్తుంది.
● ఇశ్రాయేలూ, నీ
భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన
నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు
లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు. – (ద్వితియో.
33:29).
4. దేవుడు మన తప్పులని సరిచేయుటకు ఇష్టపడుతున్నాడంటే
ఆయనకు మన మీద ఉన్న ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటే మనము సంతోషంగా ఉండగలము.
● దేవుడు గద్దించు
మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. – (యోబు.
5:17).
B. ఈ లోకములోనూ, దానిలో ఉన్న అత్యధిక పదవులలోను సంతోషము
కలుగదు : (ప్రసంగి. 1:14,17; 2:11,17,25; 4:4,6,16; 6:19).
1. ఇహలోక విషయాలలో నిత్య సంతోషము కలుగుట అసాధ్యము.
● ఆయన వారితోమీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక
జాగ్రత్తపడుడి; ఒకని కలిమి
విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. – (లూకా. 12:15).
2. నిజమైన సంతోషము కేవలము దేవునిలోనే సాధ్యము.
● దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలముతన
శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. – (కీర్తన. 18:30).
● యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెన గనుక
నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను
స్తుతించుచున్నాను. – (కీర్తన. 28:7).
దేవుడు చేసిన ప్రతి మేలుని లెక్కించి చూడు :
A. దేవుని వలన పొందుకున్న ప్రతి ఆశీర్వాదమును గుర్తు
చేసుకో సంతోషంగా ఉండగలవు.
● మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును
గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీ ర్వాదమును
మనకనుగ్రహించెను. – (ఎఫెసీ. 1:3).
1. దేవుడు మనయెడల చూపిస్తున్న దయ, కృప, ఓదార్పు ఇవే
మనకు గొప్ప మేలులని తలంచు ఆ క్షణము నుండే సంతోషంగా జీవించగలవు.
● కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు
మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో
ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ
అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు. – (2 కొరింధి. 1:3-4).
B. దేవుని దీవెనలే మన సమస్యలను అధిగమిస్తాయి.
1. మనము ప్రతి ఉదయమును నూతనముగా చూడగలుగుతున్నామంటే అది
దేవుడు అనుగ్రహిస్తున్న ఉచితమైన కృపయే గొప్ప దీవెనని భావించగలిగితే సంతోషము
కలుగుతుంది.
● యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది
గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు
చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. – (విలాప.
3:22-23).
దేవుని మాటలను చదువుటకు ఎక్కువ సమయమును గడుపు :
A. దేవుని గూర్చిన మాటలను చదివితే మనకు సంతోషము
కలుగును. (ప్రసంగి. 12:13).
1. దేవుని గూర్చిన మాటలను చదవాలంటే అది కేవలము పరిశుద్ధ
గ్రంథము ద్వారానే సాధ్యమని గ్రహించాలి.
● తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను
పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును
భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు
మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును
విస్తరించును గాక. – (2 పేతురు. 1:2-3).
B. దేవుని గ్రంధము మాత్రమే మన జీవితాన్ని ప్రోత్సాహించగలదు. (కీర్తన.
119:116).
1. మనము క్రైస్తవులుగా జీవించుట ఎంత గొప్ప ధన్యతో
దేవుని గ్రంధము మనకు గుర్తుచేస్తుంది. దాని వలన కలుగు సంతోషము చాలా గొప్పది.
● దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే
క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా
తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప
బడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని
మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము;
ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము. – (రోమా.
5:8-11).
2. మనకు ఎక్కడ సంతోషము కలుగునో ఆ మార్గములను కూడా
పరిశుద్ధ గ్రంధమే మనకు చూపిస్తుంది.
● యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు
నడుచువారందరు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించె దవు నీవు
ధన్యుడవు నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును
నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. యెహోవాయందు
భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సీయోనులోనుండి యెహోవా నిన్ను
ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల
పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక. – (కీర్తన. 128:1-6).
జరిగిపోయిన దానిని ఎన్నడూ గుర్తించుకోకు :
1. మనము ఎంత ప్రయత్నించినా జరిగిపోయిన కాలాన్ని వెనకకు
తీసుకురాలేము కనుక ముందున్నఆత్మీయ విషయములను గూర్చిన జ్ఞానము వెదుకుటలో సంతోషము
కలుగును.
● పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు
అంత దూర పరచి యున్నాడు. – (కీర్తన. 103:12).
2. పూర్వము చేసిన తప్పులను గుర్తుచేసుకుని బాధపడకుండా
వాటిని సరిచేసుకునే మార్గములను ఆలోచించాలి.
● మీలో ఎవడు చింతిచుటవలన తన యెత్తును మూరెడెక్కువ
చేసికొన గలడు? – (లూకా.
12:25).
● దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము
కలుగునా? వారు తమ
ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే
ప్రభువగు యెహోవా వాక్కు. – (యెహెజ్కేలు. 18:23).
3. ఇంతకు మునుపు చేసిన తప్పులనే తిరిగి కొనసాగిస్తే
సంతోషంగా జీవించలేమని గ్రహించాలి.
● మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును
క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు
నీతి నివసించును. ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు
గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను
నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. – (2 పేతురు. 3:13-14).
4. క్రైస్తవుడు ఖచ్చితముగా గతాన్ని మర్చిపోవాలి అప్పుడే
సంతోషంగా జీవించగలడు.
● మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము,
అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు,
చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు
ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. – (1 పేతురు. 4:3).
దేవునికి మొదటి స్థానము యివ్వాలి :
A. ప్రార్థన.
ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువ సంతోషముగా
ఉండగలము.
● ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక
ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. – (1 దేస్సలోని.
5:17-18).
● మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు
ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. –
(యాకోబు. 5:16).
B. సహవాసము.
సహోదరులతో సహవాసము కలిగియుండుటలో సంతోషము ఉన్నది
కనుక సమాజముగా కూడుట మానకూడదు.
● కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు
చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు
చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. – (హెబ్రీ. 10:24-25).
C. పని (లేక) శ్రద్ధ.
సంఘ పనిలో సహాయకులుగా ఉండాలి, సమయమును కేటాయించాలి.
● బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను
పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ
చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని
జరిగింపవలెను. – (రోమా. 12:8).
సంఘ పనికి ఆర్దికంగా సహాయము చేయాలి అప్పుడే మన
జీవితములో సంతోషము.
● ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు
ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్ద నుండి తీసికొనిరి. అయినను
ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి.
– (నిర్గమా. 36:3).
ముగింపు :
» పైన తెలుపబడిన విషయములను బట్టి చూస్తే మనము
సంతోషముగా ఉండగలము. క్రైస్తవులమైనందుకు అన్యులకంటే మరింత సంతోషముగా జీవించగలము.
» నిజమైన సంతోషము మరియు నిత్యమైన సంతోషము మన
ప్రభునియందే మనకు సాధ్యమని గట్టిగా చెప్పగలము.
» కాబట్టి ప్రియ సహోదరుడా నిత్య సంతోషము కావాలా? నేడే
నీ మనస్సు మార్చుకుని దేవునివైపు తిరుగు ఎన్నడూ లేనంత సంతోషముగా జీవితమును
క్రీస్తులో కొనసాగించగలవు.
మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com