విజన్ - 2024 (Vision)


విజన్ - 2024 (Vision)

పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు. 


సహోదరులారా, ప్రతి సంవత్సరము మన పరమదేవునికి వ్యక్తిగతముగా ఎన్నో మాటలిస్తుంటాము. చివరికి వాటిని పాటించక దేవునికి ఎంతో నష్టం కలిగిస్తూంటాము. ఈ సంవత్సరములో జరిగిన పొరపాట్లు మరల తిరిగి జరిగించక 2023 మరియు అటు మనకు అనుగ్రహింపు రోజులను/నెలలను/సంవత్సరములను వాక్యానుసారముగా సద్వినియోగము చేసికొనుచు మన దేవుడు కోరిన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండటానికి సిద్ధపడుదాం. 


↛  (విలాపవాక్యములు. 3:40). "మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము."


↛  (గలతి. 6:4): "ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.౹"

↛  (1 కోరింథి. 11:28,31). "కాబట్టి ప్రతిమనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను;  అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.౹"

↛  (ప్రసంగి. 1:9-11): "మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది;మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.౹ ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే.౹ పూర్వులు జ్ఞాపకమునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు."

↛  (ఎఫెసీ. 5:15-17): దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.౹ ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.౹"



వ్యక్తిగత జీవితము (Personal Life)

“రహస్య పాపములు కలిగియున్ననా”..?
 “చెడు స్నేహము మరియు చెడు అలవాట్లు ఉన్నాయా”..?
 “పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నానా”..?
 “చెడు తలంపులకు చోటు ఇచ్చానా”..?
 “వ్యర్థమైన వాటికి సమయం కేటాయించానా”..?
"ఎవరికీ (దేవునికి/మనుషులకు) దాసులైయున్నాను"..?
"నా మనసాక్షి దోషారోపణ చేయుచున్నప్పటికీ సమర్ధించుకొనుచున్నానా"..?
"నా కనులు, చేతులు, ఆలోచన, హృదయము, మనస్సు నిజముగా వేటినైనా ఆశిస్తున్నాయా"..? 


కుటుంబ జీవితము (Family Life)

“భాగస్వామితో నమ్మకంగా/అపనమ్మకంగా ఉన్నానా”..?
⟹ “పిల్లలను దేవునిలో పెంచగలుగుతున్నానా”..?
⟹ “తల్లిదండ్రులకు విధేయత/అవిధేయత చూపానా”..?
⟹ “ఇంటిపనులలో సహకరించానా/ తృణీకరించానా”..?
⟹ “ఇంటిలో అశాంతికి/శాంతికి కారణమామయ్యానా”..?
"నా కుటుంబములో నాయకత్వాన్ని సక్రమముగా చేయుచున్నానా"..?
"నేను నా భర్త/భార్య అన్యుల/పరిశుద్ధుల మధ్య మాట్లాడువాటిని తెలుసుకోగలుగుచున్నానా"..?
"నా ఇంటివారి నోటి మాటలు విని పరిశుద్ధులను పొగగొట్టుకొనుచున్నానా"..?
"అందరితో సరియైన సంబంధాలు కలిగియున్నానా"..?   


భక్తి జీవితము (Devotion Life)

⟿ “గ్రంథము చదవడం”  - (దేవుడు మనతో మాట్లాడటం).
⟿ “ప్రార్థన చేయడం” - (మనం దేవునితో మాట్లాడటం).
⟿ “దేవుని కోసం ఉపవాసం ఉన్నానా”..?
⟿ “దేవుడు నాపై తప్పుమోపిన విషయములో నా హృదయం కఠినపరుచుకున్నానా/సమ్మతిపరుచుకున్నానా”..?
⟿ “ఈ సంవత్సరము అంతానన్నువెంటాడిన శోధనలు/శ్రమలు/బలహీనత/పాపం ఏంటి”..?
⟿ “నన్నువెంటాడిన వాటి విషయములో నిజముగా మారుమనస్సు పొందానా”..?
⟿ “నా పరిశుద్ధత/రక్షణ విషయములో శ్రద్ధ తీసుకున్నానా”..?
"నేను వాత వేయబడిన మనసాక్షి/హృదయ కాఠిన్యము కలిగియున్నానా"..?
"దిద్దుబాటును ప్రేమించ లేనివాడిగా నున్నానా"..?
"నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషింస్తూన్నానా"..?  


పరిచర్య జీవితము (Service Life)

“దేవుని పనిలో ఏమైనా పోల్గొన్నానా”..?
➾ “దేవుని పని చేయడానికి అవకాశాలు వచ్చాయా”..?
➾ “నాకు వచ్చిన అవకాశాలు ఏమేరకు ఉపయోగించుకున్నాను”..?
➾ “నశించు ఆత్మల పట్ల భారం కలిగియున్నానా”..?
➾ “సత్యానికి భిన్నమైన బోధ చేయుచున్నానా”..?
➾ “కల్పన కథలకు చెవి యొగ్గుతున్ననా”..?
➾ "అసత్యాన్ని ప్రోత్సహిస్తున్నానా"..?
➾ “నా సొంత అభిప్రాయాలను & ఆలోచనలను నెరవేర్చుకునే విషయములో సంఘమును వాడుకొంటున్నానా”..?
"నేను ఎక్కువగా ఎవరికీ ప్రాధాన్యత ఇస్తున్నాను రక్త సంబంధులకు (లేక) నిజవిశ్వాసుకులక"..?


సహవాస జీవితము (Communion Life)

➟ “సహవాసాన్ని నిర్లక్ష్యము/లక్ష్యము చేయుచున్నానా”..?
➟ “ఆత్మీయ ఆలోచనను త్రోసిపుచ్చుతున్నానా”..?
➟ “నిజ విశ్వాసులతో ఎవరితోనైనా విభేదాలు కలిగియున్నానా”..?
➟ “నిజ విశ్వాసులతో సమాధానము పడుట తప్పిపోయానా”..?
➟ "సహోదరులను ప్రేమిస్తున్నానా"..?
➟ “ప్రార్ధించుటకు బదులు దుష్ప్రచారం చేయుచున్నానా”..? (ప్రార్ధించు - సవరించు)
➟ “వాక్యానుసారమైన దైవజనుడుతో అమర్యాదగా ప్రవర్తించాన”..?
➟ “నీ కంటే నేను మెరుగు అనే భావన నాలో ఉందా”..?
➟ “నేను వేషధారణ కలిగియున్నానా”..?
➟ "నా తప్పులను చూసిన వారిని, ప్రశ్నించేవారిని నిందలు వేసి సంఘములో నుండి వెళ్లగొట్టుచున్నానా"..?
"సహోదరుల మీద ఉండే ప్రేమను కొనసాగించడానికి వాళ్ళు బోధించునది అసత్యమని తెలిసికూడా వారిని ప్రోత్సహిస్తున్నానా"..?
"శరీరమును ఆస్పదము చేసుకొనుచు సహవాసము చేయుచున్నానా"..


డబ్బు జీవితము (Money Life)

⟼ “దేవుడు ఇచ్చిన డబ్బును ఏ సందర్భములో వృథా చేశాను”..?
⟼ “నా కష్టారిజీతాన్ని దేవుని పనికి ఎంత వరకు ఖర్చు చేశాను”..?
⟼ “ఎవరి అక్కరలోనైన సహాయము చేశానా”..? (బీదలు, నిజమైన విధవరాండ్రులు/అనాథులు). 
"నా ధనాపేక్షత వలన నిత్యజీవమునకు దూరమగుచున్నానా"..?
"నేను అన్నవస్త్రములుతో తృప్తిపొందియున్నానా"..?
"నేను నావారి కొరకు ధనము సంపాదించుకొనే పనిలో నిమగ్నమై పరమదేవున్ని ఆరాధించుటకు దూరమగుచున్నానా"..?
"నేను ఇతరుల/విదేశీయులు ధనమును సేవ పేరుతో పోగుచేసుకొనే పనిలోనున్నానా"..? 


హెచ్చరిక :
"ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.౹" (ప్రసంగి. 12:13).

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16