"దేవునికిష్టులుగా ఉండుట" - (Pleasing to God)


"దేవునికిష్టులుగా ఉండుట"

 పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో
నా హృదయపూర్వక వందనములు. 

(1 కొరింథియులకు. 10:1-11)
"సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;౹ అందరును మోషేనుబట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;౹ అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;౹ అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.౹ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.౹ వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.

1). దేవునికిష్టులుగా ఉండకపోయిరి. 
2). చెడ్డవాటిని ఆశించారు. 




(1 కొరింథియులకు. 10:7-10)

జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.౹ మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.౹ మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.౹ మీరు సణుగ కుడి; వారిలో కొందరు సణిగి సంహారకునిచేత నశించిరి.౹ 


A). వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. (7వ)
B). వారివలె మనము వ్యభిచరింపక యుందము. (8వ)
C). మనము ప్రభువును శోధింపక యుందము. (9వ)
D). మీరు సణుగ కుడి. (10వ)


 మనము విగ్రహారాధన చేయకూడదు 


» "విగ్రహారాధనకు దూరముగా పారిపొండి". - (1 కొరింథి. 10:14).

» "పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు." - (నిర్గమ. 20:4; ద్వితియో. 5:8).

» "విగ్రహారాధన చేయువారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు". - (1 కొరింథి. 6:9-10).

» "ధనాపేక్ష/లోభత్వము ఒక విగ్రహారాధనే". - (ఎఫెసి. 5:5; కొలస్స. 3:5).

» "విగ్రహారాధకులు దేవునిరాజ్యమునకు వెలుపటనుందురు". (ప్రకటన. 22:15; ఎఫెసి. 5:5cf.).

» "విగ్రహారాధకులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు". (ప్రకటన. 21:8).

» "విగ్రహారాధకులతో సాంగత్యము చేయకూడదు". - (1 కొరింథి. 5:10-11).


 మనము వ్యభిచరింపకూడదు 


» "వ్యభిచరింపకూడదు అనేది దేవుని ఆజ్ఞ". - (నిర్గమ.20:14; లేవి. 20:10; ద్వితియో. 5:18; మత్తయి. 5:27; మార్కు. 10:19; లూకా. 18:20; రోమా. 13:9; యాకోబు. 2:11cf.).

» "అన్యదేవతలతో సంబంధము ఒక వ్యభిచారమే" - (సంఖ్యా. 25:1-9).

» "విగ్రహారాధన ఒక వ్యభిచారమే" - (యెహెజ్కేలు. 16:16-17; 20:30; యిర్మీయా. 3:1-10cf.)

» "మోహపుచూపుతో చూచుట ఒక వ్యభిచారమే" - (మత్తయి. 5:28).

» "భార్యను/భర్తను విడనాడి భర్త బ్రదికియుండగా ఆమె/అతను వేరొక పురుషుని/స్త్రీని చేరినయెడల అనగా రెండో వివాహము చేసుకొనుట లేదా అక్రమ సంబంధము కలిగియుండుట ఒక వ్యభిచారమే" - (మత్తయి. 5:32; 19:1-9; మార్కు. 10:1-12; లూకా. 16:18; 1 కొరింథి. 7:10-13; 7:39; రోమా. 2-3cf.)

» "వ్యభిచారము చేయువారిని మరియు సమ్మతించువారిని దేవుడు భ్రష్ట మనస్సుకు మరియు మరణమునకు అప్పగించెను". - (రోమా.1:18-28cf.)


 మనము ప్రభువును శోధింపకూడదు 


» యెహోవాను శోధింపకూడదు. - (నిర్గమ. 17:2; ద్వితియో. 6:16; మత్తయి.4:7; లూకా.4:12cf.).

» దేవున్నిశోధించుట వలన అరణ్యములో ఇశ్రాయేలీయులు తాప కరమైన సర్పములు వలన చనిపోయిరి. (సంఖ్యా. 21:5-9; 1 కోరింధి. 10:9cf.).

» మనము ఆశించి దేవున్ని శోధింపకూడదు.- (కీర్తన. 106:13-15).

» దేవున్నిశోధిస్తే నిత్యజీవమునకు ప్రవేశములేదు - (హెబ్రీ. 3:19-11).


 మనము సణుగకూడదు 


» మనము సణుగులును మానివేయాలి. - (ఫిలిప్పీ. 2:14-15).

» సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయాలి.- (1పేతురు. 4:9).

» అరణ్యములో ఇశ్రాయేలీయులు నీళ్లు కోసము సణుగుకొన్నారు - (నిర్గమ. 15:22-25cf.).

» అరణ్యములో ఇశ్రాయేలీయులు మాంసము, ఆహారము కొరకు యెహోవా మీద సణుగుకొన్నారు - (నిర్గమ. 16:1-11cf.).

» సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. - (యాకోబు. 5:9).


కాబట్టి సహోదరులారా, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయ బడెను (1 కొరింథియులకు. 10:11) కనుక ఆలోచన చేసి మన ప్రవర్తన సరిద్దిదుకోవాలని మమ్మల్ని మేము హెచ్చరిక  చేసుకొనుచు ప్రభువునందు మీకు మనవి చేయుచున్నాము.
మీ ఆత్మీయులు,
మనోహర్ & నవీన.

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16