"నీవు నిజముగా రక్షింపబడ్డావా?" (Are you saved? Are you sure?)

నీవు నిజముగా రక్షింపబడ్డావా?

పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.  

యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడిన అనేకమంది క్రైస్తవులకు తాము రక్షింపబడ్డామనే నమ్మకము వారికి లేదు. మరికొంతమంది రక్షింపబడ్డాము అని నమ్ముతున్నారు కాని తప్పులు చేస్తున్నారు రక్షణ కోల్పోతున్నారు. కాని ప్రియులారా, క్రైస్తవులమైన మనము ఈ దినమున  లోకములో మన దేహము విడిచిపెట్టినా కూడా  మన ఆత్మ ఖచ్చితంగా రక్షింపబడుతుందనే నమ్మకము ఉండాలి.   

ప్రియులారా, చాలామంది రక్షింపబడినప్పటికీ వారి రక్షణపై పూర్తి స్థాయిలో నమ్మకము లేక దేవుని నుండి తొలగిపోతున్నారు. సొంత ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తూ రక్షణ భాగ్యమును కోల్పోతున్నారు.
దేవుని మాటలను కాకుండా  నీ సొంత ఆలోచనలను బట్టి జీవిస్తే మాత్రము నీ రక్షణను నీవు కాపాడుకోలేవు.

» ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును. (సామెతలు. 16:25).

» ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును దారి విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. (మత్తయి. 7:13-14).

» ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్లగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియలచొప్పున వారికంతము కలుగును.(2 కొరింధి. 11:13-15).

కనుక ప్రియులారా, తండ్రియైన దేవుని కృప చేత ప్రభువైన క్రీస్తు ద్వారా రక్షింపబడిన మనము దేవుని మాటలను అనుసరించి నడవాల్సిన వారమై ఉన్నాము కాని మన సొంత ఆలోచనలను బట్టి కాదు.
ఈ లోకములో దేవుని కృప వలన సమస్తమును పొందుకుని, అన్నిటిలోనూ విజయము సాధించి, తమ జీవితములో కొంతకాలము మట్టుకు దేవునిపై పూర్తి విశ్వాసముతో కొనసాగి, తరువాత తమ సొంత ఆలోచనలకు ప్రాదాన్యతనిచ్చి నశించిపోయిన వారు ఉన్నారు.

రాజైన సొలోమోను :


» ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి (సొలోమోను) రెండు మారులు ప్రత్యక్షమై. నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. (1 రాజులు. 11:9-11).

రాజైన ఉజ్జియా :


» అతడు (ఉజ్జియా) స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము చేయగా యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబది మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించిఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. (2 దినవృత్తా. 26:16-19).

ప్రియ సహోదరుడా, సహోదరీ రక్షణ అనేది దేవుడు మనకు దయచేసిన గొప్ప భాగ్యము. ఆనాడు ఇశ్రాయేలీయులు ఇటువంటి గొప్ప రక్షణను పొందుకుని కూడా దేవునికి విరోధముగా పాపము చేసి అరణ్యములో కూలిపోయారు. మరి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది?

మనము ఏ ఏ మార్గములలో నడుచుకోవాలో, ఎలాంటి జీవితమును జీవించవచ్చునో మన ఆలోచనలకే మన తండ్రియైన దేవుడు విడిచిపెట్టారు.  కాని ప్రతి విషయమునకు అనగా మంచి చెడులకు సంబంధించిన విషయములపై పూర్తి అవగాహన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియజేయడమైనది. ఏ మార్గమును ఎంచుకుంటావో అది మన వ్యక్తిగతమైన విషయము.


మనముందున్న రెండు మార్గములు  


పరలోకములో నిత్య సంతోషము :


» అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణమము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లకుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవునియొద్దనుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు - ఇదికో దేవుని నివాసము మనుష్యలతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు; మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసననములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.  (ప్రకటన. 21:1-4).

పాతాళములో నిత్య వేదన :


» పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండుగుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. (ప్రకటన. 21:8).

ఈ రెండు మార్గములలో ఏ మార్గమును ఎంచుకోవాలో మన ఆలోచనకే విడిచిపెట్టాడు దేవుడు. ఏ మార్గమును ఎంచుకుంటే ఆ మార్గమునకు తగిన ఫలము ఖచ్చితంగా అనుభవిస్తాము అది నిత్య సంతోషమైనా, నిత్య నరకమైనా.

ప్రియులారా, దేవుడు తన పరిశుద్ధ గ్రంధములో చాలా గొప్ప మాటలను మనకు తెలియజేసాడు. దేవుడు పరిశుద్ధ గ్రంధములో వివాహము యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియజేస్తూ స్త్రీ పై పురుషునికి అధికారమిచ్చాడు, స్త్రీ పురుషునికి లోబడాలని తెలియజేసాడు. అంటే భౌతిక సంబంధమైన జీవితముకు సంబంధించి ఏ విషయమైనా పురుషుని ఆలోచనలకే ప్రాధాన్యతనివ్వమని  ఆ మాటలకు అర్థము. అలాగే, క్రీస్తులోనికి బాప్తీస్మము పొంది రక్షణ పొంది, ఆయన సంఘములో చేర్చబడిన  మనము క్రీస్తుతో ప్రధానము చేయబడిన వారము కనుక ఆయన మాటలకు, ఆలోచనలకు ప్రాధాన్యతను ఇవ్వవలసిన వారమై ఉన్నామని ధృడముగా విశ్వసించాలి.
మన రక్షణ విషయములో మనకు నమ్మకముండాలి.  మన సొంత ఆలోచనలకు కాదు దేవుని ఆలోచనలకు అవకాశమివ్వాలి.  

● ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.  (రోమా. 6:22-23).

● మీరు విశ్వసించినవారై కృపచేత రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడవీలులేదుమరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్ క్రియలు చేయుటకై మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియై యున్నాము.(ఎఫెసీ. 2:8-10).

నీవు నిజముగా రక్షింపబడ్డావని నమ్మితే ఖచ్చితముగా క్రీస్తు ప్రత్యక్షతలో నిత్య జీవమును పొందుకుంటావు.
నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆలోచన చేయు ! ప్రవర్తన సరిదిద్దుకో ! 

మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

1 comments:

comments
April 18, 2019 at 3:17 PM delete

Really it's very good job, online preaching is needed nowadays bcz so many spirits (lost sheep)will find in this way.

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16