"క్రైస్తవుడంటే ఏమిటి?" (What is a Christian?)

క్రైస్తవుడంటే ఏమిటి?

నా తోటి సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈ లోకములో అన్యులు చాలా మంది “క్రైస్తవుడంటే” సరియైన అర్థము తెలీక క్రైస్తవ్యం అంటే ఒక మతమనే భావనలో ఉన్నారు. అన్యుల విషయం ప్రక్కన పెడితే క్రైస్తవులుగా పిలువబడుతున్న నేటి క్రైస్తవులు కూడా గ్రంథాన్ని సరిగ్గా పరిశీలించకుండా నామకార్ధముగా జీవిస్తున్నారు.

అసలు క్రైస్తవుడంటే ఏమిటి? క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలి?. పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశీలన చేద్దాము. 


క్రీస్తుకు శిష్యులుగా ఉండాలి


1) క్రీస్తుని అనుసరించి, వాక్యమందు నిలిచియుండి, ఆయనకి శిష్యుడిగా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు.

 » కాబట్టి యేసు తనయందు విశ్వాసముంచిన యూదులతో - మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యము గ్రహించెదరు. – (యోహాను. 8:31).

 » వారు కలిసి యొక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనులకు  (వాక్యమును) బోధించిరి. మొట్టమొదట అంతియొకైయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. (అపొ.కార్య. 11:26).

2) క్రీస్తు లాంటి సారూప్యము (ఆత్మ సంబంధమైన) కలిగి జీవించుటకు ముందుగా నిర్ణయించబడినవాడే నిజమైన క్రైస్తవుడు.

 » ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. (రోమా. 8:29).

 » మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము. (2 కొరింధి. 3:18).


క్రీస్తు శిష్యులు చేయవలసిన పని


1) క్రీస్తు ఏలాగైతే సమస్తమును తండ్రి చిత్త ప్రకారము చేసాడో మనము అలాగే చేయాలి.

 » ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. – (మత్తయి. 7:21).

 » తండ్రి చిత్త ప్రకారమనగా,
మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట విన వలెను.(ద్వితియో. 18:18, అపొ.కార్య. 3:22).

2) క్రీస్తువలె సహోదరుల యెడల ప్రేమ కలిగి యుండాలి.

 » మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకనినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. (యోహాను. 13:34-35).

 » నేను మిమ్మును ప్రేమించినప్రకారము మీరొకనినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. (యోహాను. 15:12).

 » ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము. – (1 యోహాను. 3:16).

3) ఆయన మాటలయందు నిలిచియుండి, మంచి ఫలములు ఫలించేవారిగా ఉండాలి.

 » మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇటువలెనే మీరు నా శిష్యులగుదురు. – (యోహాను. 15:8).

 » మనుష్యులు మీ సత్ క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. (మత్తయి. 5:16).


క్రీస్తుకు శిష్యులుగా ఉండాలంటే!


1) మొదట క్రీస్తులోనికి బాప్తీస్మము పొందాలి.

 » కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులగా చేయుడి; తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములోకి వారికి బాప్తిస్మమిచ్చుచు,... – (మత్తయి. 28:19).

 » మీరు మారుమనస్సుపొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. (అపొ.కార్య. 2:38).

2) దేవుని మాటలను వినాలి, ఆ మాటలకు విధేయత చూపించాలి.

 » వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. – (రోమా. 10:17).

 » నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి పర్యంతము సదాకాలము మీతోకూడా ఉన్నానని వారితో చెప్పెను. (మత్తయి. 28:20).

 » వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. (అపొ.కార్య. 2:42).

3) వాక్యమును సాత్వికముతో అంగీకరించి,  వినువారుగా మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి.

 » అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. – (యాకోబు. 1:21-22).

 » ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. – (యాకోబు. 2:26).


క్రీస్తుకు శిష్యులుగా ఉంటే కలిగే ప్రయోజనాలు


1) మన ప్రాణములకు (ఆత్మ) విశ్రాంతి కలుగును.

 » ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైనవారలారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. (మత్తయి. 11:28-29).

2) మన పాపముల నుండి మనకు విముక్తి కలుగును.

 » దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. – (ఎఫెసీ. 1:7).

 » మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. – (1 యోహాను. 1:9).

3) దేవుని ఆత్మను బహుమతిగా పొందుకుంటాము.

 » ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు “విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను” గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక “ఆత్మ” ఇంకను అనుగ్రహింపబడియుండలేదు. – (యోహాను. 7:37-39).

 » ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. – (గలతీ. 5:22).

 » కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. – (రోమా. 15:13).

4) మన జీవితములో శాంతిని, దేవునితో సమాధానమును కలిగి ఉంటాము.

 » శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. – (యోహాను. 14:27).
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. – (రోమా. 5:1).

 » దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. – (ఫిలిప్పి. 4:6-7).

5) ఎల్లప్పుడు సంతోషముతో దేవునియందు ఆనందిస్తాము.

 » మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. – (యోహాను. 15:11).

 » ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి. – (ఫిలిప్పి. 4:4).

 » మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు,చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు. – (1 పేతురు. 1:8).

6) దేవుని ప్రేమను పొందుకుంటాము.

 » తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి. – (యోహాను. 15:9).

 » తన మహిమైశ్వ ర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. – (ఎఫెసీ. 3:17-18).

 » ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము. – (1 యోహాను. 3:16).

7) దేవుని కుటుంబముతో సహవాసము కలిగియుంటాము.

 » పేతురు ఇదిగోమేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. – (మార్కు. 10:28-30).

 » కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. – (హెబ్రీ. 10:24-25).

 » సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. – (1 కొరింధి. 7:24).

 » మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది. – (1 యోహాను. 1:3).

8) దేవుని మహిమను, స్వాస్థ్యమును, ఆదరణ మరియు ఆయనతో కూడా సదాకాలము జీవించే స్థితిని పొందుకుంటాము.

 » మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.(2 దేస్సలోని. 2:14).

 » మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధ ముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.(1 పేతురు. 1:4-5).

 » కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు.క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు  విస్తరించుచున్నది.(2 కొరింధి. 1:3-5).

 » సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.(1 దేస్సలోని. 4:13-18).


కావున ప్రియులారా, నిజమైన క్రైస్తవుడంటే క్రీస్తుకు శిష్యులుగా ఉండాలి. శిష్యులు ఏ విధముగా ఉండాలని పరిశుద్ధ గ్రంథము చెప్తుందో అట్టి రీతిగా జీవించి, క్రైస్తవుడంటే సరియైన అర్థము తెలియని వారికి నీ ప్రవర్తనే ఒక సమాధానముగా ఉండేలా అన్యుల ఎదుట దేవుని వెలుగును ప్రకాశింపజేసేలా మనము జీవించాలని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16