"క్రైస్తవ జీవితం" (Christian Life)

క్రైస్తవ జీవితం

క్రీస్తుయేసునందు పరిశుద్ధ పరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించువారికందరికినీ, నా హృదయపూర్వక వందనములు.

క్రీస్తులోనికి బాప్తీస్మము పొందితే చాలు ఖచ్చితంగా పరలోకానికి వెళ్లిపోతామనే అపోహ అనేకమంది క్రైస్తవులు కలిగియున్నారు కానీ క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మనమంతా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారమనీ, క్రీస్తులాంటి జీవితమును జీవించుటకు ఏర్పరచబడినవారమని గ్రహించాలి. మరియు  క్రీస్తు శరీరమములో అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) ఉన్న మనము ఆయనలాంటి స్వారూప్యము పొందుకొని, క్రీస్తువలె నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి, పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలను ప్రేమించి, వాటిని అనుసరించి, నీతి విషయమై విశ్వాసులకు మాదిరిగా జీవిస్తేనే నిత్యజీవమును పొందుకుంటామని క్రైస్తవుడవైన నీవు తెలుసుకోవాలి. 

ప్రియ సహోదరీ/సహోదరుడా, మన ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు ఎంతమాత్రమును సిగ్గుపడక, దైర్యముతో ఆయనను ఎదుర్కొని, మన తండ్రియైన దేవునియొద్దకు చేరి నిత్యమూ వారి సహవాసములో జీవించాలని ఆశపడుతున్నావా? అయితే ఈ లోకములో నీ శరీరమును విడిచిపెట్టేలోపు నీవు చేయవలసిన కార్యక్రమములు కొన్ని కలవు. 

మార్పునొంది బిడ్డలవంటి వారమవ్వాలి :


● మీరు మనస్సు మార్పునొంది బిడ్డలవంటివారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. – (మత్తయి. 18:3).

చంపివేయాల్సిన లక్షణములు చంపాలి :


● భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. – (కొలస్సి. 3:5).

● శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. – (రోమా. 8:7).

● మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీరక్రియలను చంపినయెడల జీవించెదరు. – (రోమా. 8:13).

విసర్జించవలసిన లక్షణములు విసర్జించాలి :


● ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. – (కొలస్సి. 3:8).

● కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము. – (కీర్తన. 37:8).

ధరించుకోవలసిన లక్షణములు ధరించుకోవాలి :


● దేవుని చేత ఏర్పరచబడినవారును పరిశుద్ధలును ప్రియులునైనవారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. – (కొలస్సి. 3:12).

● నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. – (ఎఫెసీ. 4:24).

● క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. – (1 కొరింధి. 15:53).

అమర్చుకోవలసిన లక్షణములు అమర్చుకోవాలి :


● ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి. –  (2 పేతురు. 1:5-7).

సంపాదించుకోవలసిన లక్షణములు సంపాదించాలి :


● ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. – (1 తిమోతి. 6:10-11).

మానుకోవలసిన లక్షణములు  మానుకోవాలి :


● ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణవిషయములో ఎదుగునిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. – (1 పేతురు. 2:1-3).

వెదకవలసినవి వెదకాలి :


● వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను. – (కీర్తన. 14:2).

● మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. – (మత్తయి. 6:33).

● విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. – (హెబ్రీ. 11:6).

● మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్నవాటిమీదనే గాని భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. – (కొలస్సి. 3:1-3).

క్రీస్తు స్వరూపము ఏర్పరచుకోవాలి :


● నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు పర్యంతము మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది. – (గలతీ. 4:19).

అన్ని విషయములలో క్రీస్తునందు సంపూర్ణత కలిగి జీవించాలి :


● ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికిని బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. – (కొలస్సి. 1:28).

● పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్యధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులగాను, కొందరిని ప్రవక్తలగాను, కొందరిని సువార్తికులగాను, కొందరిని కాపరులగాను ఉపదేశకులగాను నియమించెను. – (ఎఫెసీ. 4:11-12).

● సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. – (1 దేస్సలోని. 5:23).

● తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్ధోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. – (కొలస్సి. 1:22).

విశ్వాసమును కాపాడుకొంటూ మంచి పోరాటము పోరాడాలి :


● మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. – (2 తిమోతి. 4:7-8).

● పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.  మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. – (1 కొరింధి. 9:24-25)

● క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. – (ఫిలిప్పి. 3:14).

పరిపూర్ణ విశ్వాసముతో క్రీస్తునందు మృతిపొందాలి :


● వీరందరు వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమిమీద పరదేశులును యాత్రికులునైయున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి. – (హెబ్రీ. 11:13). [గమనిక: హెబ్రీ 11వ అధ్యాయము చదవగలరు]  

● ఇప్పటినుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారివెంట పోవునని ఆత్మచెప్పుచున్నాడు. – (ప్రకటన. 14:13).

ప్రియులారా, మనము ఈ లోకమును ఎప్పుడు విడిచిపెడతామో, మన పయనము ఎందాకో మనకు తెలియదు కాని మనము సాధించాల్సిన ఆత్మీయ స్థితి మాత్రము చాలానే ఉంది. పైన తెలియజేయబడిన వాటన్నిటిలో విజయము పొందితేనే పరలోకము చేరుకోగలము. 

మరి వీటన్నిటిని అధిగమించాలంటే నీ దగ్గరున్న సమయము ఎంత? నీకున్న గడువు ఎంత? నీ  వయస్సెంత? 
ఆలోచించావా? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరివంటి జీవితం మనది (యాకోబు. 4:14). ఈలోగా మన ప్రభుని రాకడ వస్తే నీ  పరిస్థితి ఏమిటో ఒక్కసారి గ్రహించు. ఆలోచన చేసి నీ ప్రవర్తన సరిదిద్దుకో.  

★ మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. – (1 పేతురు. 2:24).

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16