"క్రైస్తవ జీవితం" (Christian Life)

క్రైస్తవ జీవితం

క్రీస్తుయేసునందు పరిశుద్ధ పరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించువారికందరికినీ, నా హృదయపూర్వక వందనములు.

క్రీస్తులోనికి బాప్తీస్మము పొందితే చాలు ఖచ్చితంగా పరలోకానికి వెళ్లిపోతామనే అపోహ అనేకమంది క్రైస్తవులు కలిగియున్నారు కానీ క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మనమంతా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారమనీ, క్రీస్తులాంటి జీవితమును జీవించుటకు ఏర్పరచబడినవారమని గ్రహించాలి. మరియు  క్రీస్తు శరీరమములో అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) ఉన్న మనము ఆయనలాంటి స్వారూప్యము పొందుకొని, క్రీస్తువలె నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి, పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలను ప్రేమించి, వాటిని అనుసరించి, నీతి విషయమై విశ్వాసులకు మాదిరిగా జీవిస్తేనే నిత్యజీవమును పొందుకుంటామని క్రైస్తవుడవైన నీవు తెలుసుకోవాలి. 

ప్రియ సహోదరీ/సహోదరుడా, మన ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు ఎంతమాత్రమును సిగ్గుపడక, దైర్యముతో ఆయనను ఎదుర్కొని, మన తండ్రియైన దేవునియొద్దకు చేరి నిత్యమూ వారి సహవాసములో జీవించాలని ఆశపడుతున్నావా? అయితే ఈ లోకములో నీ శరీరమును విడిచిపెట్టేలోపు నీవు చేయవలసిన కార్యక్రమములు కొన్ని కలవు. 

మార్పునొంది బిడ్డలవంటి వారమవ్వాలి :


● మీరు మనస్సు మార్పునొంది బిడ్డలవంటివారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. – (మత్తయి. 18:3).

చంపివేయాల్సిన లక్షణములు చంపాలి :


● భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. – (కొలస్సి. 3:5).

● శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. – (రోమా. 8:7).

● మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీరక్రియలను చంపినయెడల జీవించెదరు. – (రోమా. 8:13).

విసర్జించవలసిన లక్షణములు విసర్జించాలి :


● ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. – (కొలస్సి. 3:8).

● కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము. – (కీర్తన. 37:8).

ధరించుకోవలసిన లక్షణములు ధరించుకోవాలి :


● దేవుని చేత ఏర్పరచబడినవారును పరిశుద్ధలును ప్రియులునైనవారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. – (కొలస్సి. 3:12).

● నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. – (ఎఫెసీ. 4:24).

● క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. – (1 కొరింధి. 15:53).

అమర్చుకోవలసిన లక్షణములు అమర్చుకోవాలి :


● ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి. –  (2 పేతురు. 1:5-7).

సంపాదించుకోవలసిన లక్షణములు సంపాదించాలి :


● ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. – (1 తిమోతి. 6:10-11).

మానుకోవలసిన లక్షణములు  మానుకోవాలి :


● ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణవిషయములో ఎదుగునిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. – (1 పేతురు. 2:1-3).

వెదకవలసినవి వెదకాలి :


● వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను. – (కీర్తన. 14:2).

● మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. – (మత్తయి. 6:33).

● విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. – (హెబ్రీ. 11:6).

● మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్నవాటిమీదనే గాని భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. – (కొలస్సి. 3:1-3).

క్రీస్తు స్వరూపము ఏర్పరచుకోవాలి :


● నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు పర్యంతము మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది. – (గలతీ. 4:19).

అన్ని విషయములలో క్రీస్తునందు సంపూర్ణత కలిగి జీవించాలి :


● ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికిని బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. – (కొలస్సి. 1:28).

● పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్యధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులగాను, కొందరిని ప్రవక్తలగాను, కొందరిని సువార్తికులగాను, కొందరిని కాపరులగాను ఉపదేశకులగాను నియమించెను. – (ఎఫెసీ. 4:11-12).

● సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. – (1 దేస్సలోని. 5:23).

● తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్ధోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. – (కొలస్సి. 1:22).

విశ్వాసమును కాపాడుకొంటూ మంచి పోరాటము పోరాడాలి :


● మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. – (2 తిమోతి. 4:7-8).

● పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.  మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. – (1 కొరింధి. 9:24-25)

● క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. – (ఫిలిప్పి. 3:14).

పరిపూర్ణ విశ్వాసముతో క్రీస్తునందు మృతిపొందాలి :


● వీరందరు వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమిమీద పరదేశులును యాత్రికులునైయున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి. – (హెబ్రీ. 11:13). [గమనిక: హెబ్రీ 11వ అధ్యాయము చదవగలరు]  

● ఇప్పటినుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారివెంట పోవునని ఆత్మచెప్పుచున్నాడు. – (ప్రకటన. 14:13).

ప్రియులారా, మనము ఈ లోకమును ఎప్పుడు విడిచిపెడతామో, మన పయనము ఎందాకో మనకు తెలియదు కాని మనము సాధించాల్సిన ఆత్మీయ స్థితి మాత్రము చాలానే ఉంది. పైన తెలియజేయబడిన వాటన్నిటిలో విజయము పొందితేనే పరలోకము చేరుకోగలము. 

మరి వీటన్నిటిని అధిగమించాలంటే నీ దగ్గరున్న సమయము ఎంత? నీకున్న గడువు ఎంత? నీ  వయస్సెంత? 
ఆలోచించావా? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరివంటి జీవితం మనది (యాకోబు. 4:14). ఈలోగా మన ప్రభుని రాకడ వస్తే నీ  పరిస్థితి ఏమిటో ఒక్కసారి గ్రహించు. ఆలోచన చేసి నీ ప్రవర్తన సరిదిద్దుకో.  

★ మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. – (1 పేతురు. 2:24).

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"క్రీస్తు జన్మ ముఖ్య ఉద్దేశ్యము!" (The main cause of Christ birth)

"క్రీస్తు జన్మ ముఖ్య ఉద్దేశ్యము!"


ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. 


మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా  మన తండ్రియైన దేవునిచేత ఈ లోకమునకు పంపబడి నేటికి 2000 సంవత్సరాలు దాటినా, ఆయన ఎందుకు జన్మించాడో ఇప్పటికీ చాలామంది సహోదరులకు పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. దేవుని సంకల్పము చొప్పున 2000 సంవత్సరాల క్రితం కన్యక గర్భము ధరించి, కుమారుని కని, ఆయనకు యేసు అను పేరు పెట్టెను (యెషయా. 7:14, మత్తయి. 1:21, లూకా. 1:31, యోహాను. 1:45). 


ఆ యేసు ఈ లోకములో 331/2  సంవత్సరాలు జీవించి, ఎన్నో అద్భుత కార్యములు చేసి, అనేక శ్రమలు పొంది (యెషయా. 50:6; 53:3-10, మత్తయి. 26:27; 27:26-31, మార్కు. 14:65, యోహాను. 18:22; 19:1, 1 పేతురు. 3:21-24), కల్వరి సిలువలో మరణించి (1 కొరింధి. 15:1-4, 2 తిమోతి. 1:10), మూడవ దినమున తిరిగి లేపబడెను (లూకా. 24:20-24, అపొ. కార్య. 2:24, 10:40, 1 కొరింధి. 15:1-4)


ప్రియ స్నేహితుడా! యేసు ఎందుకు జన్మించెను? నీవు మరియు నేను ఈ అంధకార సంబంధమైన బంధకములతోనూ (ఎఫెసీ. 1:13), ఈ లోకాశల వలన కలుగు పాపములతోనూ (1 యోహాను. 2:15), అపరాధములతోనూ (ఎఫెసీ. 2:1-2) బాధింపబడియుండగా మన నిమిత్తము తండ్రియైన దేవుడు సంతాపమునొంది, మన యెడల కనికరపడి, క్రీస్తుని అనగా తన అద్వితీయ కుమారుని మనుష్యరీతిగా ఈ లోకమునకు పంపి (యోహాను. 3:16), ఆయన ద్వారా తన అనాది సంకల్పాన్ని నెరవేర్చి (1 పేతురు. 1:18-20), పరలోక సంబంధమైన  రాజ్యమును (ఆత్మ సంబంధమైనది) ఈ భూలోకములో ఏర్పాటు చేసి (యెషయా. 2:2-4, లూకా. 17:20-21, అపొ. కార్య. 2:41-42), ఆ రాజ్యములో నిత్యము జీవించి (1 సమూయేలు. 7:12-16,  దానియేలు. 4:32), ఆయన(తండ్రి)తోను, అలాగే తన కుమారుని(క్రీస్తు)తోనూ సహవాసము కలిగి యుండుటకు (రోమా. 14:17, 1 కొరింధి. 1:9, 1 యోహాను. 1:3), శాశ్వతమైన పరలోకమును  (1 పేతురు. 1:3-4), నిత్యజీవమును పొందుకొనుటకు క్రీస్తుని మన రక్షకుడిగా (యేసు) ఈ లోకములో జన్మింపజేసెను (యోహాను. 3:36; 6:41,48; 17:2-3, రోమా. 2:7; 5:21; 6:22, 1 యోహాను. 5:10). మరి ఆ రక్షకుడు యేలుబడి చేస్తున్న ఆ రాజ్యములో అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) చేరాలని (లూకా. 1:33, అపొ. కార్య. 2:38-39,47; 22:16, ఎఫెసీ. 1:22-23, కొలస్సి. 1:18, రోమా. 16:16), తోటి పరిశుద్ధులవలె నిత్యజీవమును పొందుకోవాలని నీవు ఆశపడుతున్నావా?  అయితే ఈ క్షణమే క్రీస్తును గూర్చిన మాటలు విని (యోహాను. 5:24, అపొ. కార్య. 8:5-6, రోమా. 10:17, ప్రకటన. 1:3), వినిన దానిని హృదయమందు విశ్వసించి (యోహాను. 8:24, అపొ. కార్య. 16:31, రోమా. 10:17, హెబ్రీ. 11:6), యేసుని దేవుని కుమారుడుగా మరియు ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని (మత్తయి. 10:32-33, యోహాను. 20:31, అపొ. కార్య. 9:36-38, రోమా. 10:10), రక్షింపబడుటకు బాప్తీస్మము పొంది ఆయన రాజ్యము(క్రీస్తు సంఘము)లో ప్రవేశించు (మార్కు. 16:16, అపొ. కార్య. 2:38; 22:16; 2:47, 1 పేతురు. 3:21). 


నా ప్రియులారా, భూమ్యాకాశములను అందలి సమస్తమును సృజించిన మన దేవునికి ఏమియు కొదువలేదు (అపొ. కార్య. 17:25), మననుండి భౌతిక సంబంధమైన దినములు, పండుగలు, ఇతర ఆచారాలను ఆయన ఆశించట్లేదు (గలతీ. 4:10, కొలస్సి. 2:16), మనుష్యులు కల్పించిన పద్ధతుల ఆధారముగా తన కుమారుని పుట్టిన రోజుని ఘనముగా జరిపి “మేరీ క్రిస్టమస్”  పేరుతో ఒక్కరోజు మాత్రమే భక్తిగా చేసే నామకార్థ లేదా వ్యర్థమైన ఆరాధనని ఆయన కోరుకోవట్లేదు (మత్తయి. 15:9)


ఆయన కోరుకునేది ఒక్కటే. మనము మన పాపముల విషయమై చనిపోయి క్రొత్త జన్మ ద్వారా నీతి విషయమై జీవించి (1 పేతురు. 2:24), తన కుమారుడైన క్రీస్తు సంఘములో చేరి (అపొ. కార్య. 2:47), పరిశుద్ధులతో సహవాసము కలిగి (కీర్తన. 133:1, 1 కొరింధి. 7:24, హెబ్రీ.  10:25, 1 యోహాను. 1:3), ఇహలోక మాలిన్యమునంటకుండా జాగ్రత్తపడి (యాకోబు. 1:27), నిష్కలంకముగా, నిర్దోషముగా, పరిశుద్ధముగా జీవించి (1 ధేస్సలోనిక. 2:11-12, తీతుకు. 2:12-13, హెబ్రీ. 10:22, 1 పేతురు. 1:14-16), క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు ధైర్యము కలిగి ఆయనను ఎదుర్కొని మనకు వాగ్ధానము చేయబడిన నిత్యజీవమును పొందుకొనుటయే (1 ధేస్సలోనిక. 4:14-18, 1 పేతురు. 1:4-5, 1 యోహాను. 2:24-25; 3:2).   


ఆలోచన చేయు! గ్రహించు! ప్రవర్తన సరిదిద్దుకో! రక్షణ పొందు.

Christmas


మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"క్రైస్తవుడంటే ఏమిటి?" (What is a Christian?)

క్రైస్తవుడంటే ఏమిటి?

నా తోటి సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈ లోకములో అన్యులు చాలా మంది “క్రైస్తవుడంటే” సరియైన అర్థము తెలీక క్రైస్తవ్యం అంటే ఒక మతమనే భావనలో ఉన్నారు. అన్యుల విషయం ప్రక్కన పెడితే క్రైస్తవులుగా పిలువబడుతున్న నేటి క్రైస్తవులు కూడా గ్రంథాన్ని సరిగ్గా పరిశీలించకుండా నామకార్ధముగా జీవిస్తున్నారు.

అసలు క్రైస్తవుడంటే ఏమిటి? క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలి?. పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశీలన చేద్దాము. 


క్రీస్తుకు శిష్యులుగా ఉండాలి


1) క్రీస్తుని అనుసరించి, వాక్యమందు నిలిచియుండి, ఆయనకి శిష్యుడిగా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు.

 » కాబట్టి యేసు తనయందు విశ్వాసముంచిన యూదులతో - మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యము గ్రహించెదరు. – (యోహాను. 8:31).

 » వారు కలిసి యొక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనులకు  (వాక్యమును) బోధించిరి. మొట్టమొదట అంతియొకైయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. (అపొ.కార్య. 11:26).

2) క్రీస్తు లాంటి సారూప్యము (ఆత్మ సంబంధమైన) కలిగి జీవించుటకు ముందుగా నిర్ణయించబడినవాడే నిజమైన క్రైస్తవుడు.

 » ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. (రోమా. 8:29).

 » మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము. (2 కొరింధి. 3:18).


క్రీస్తు శిష్యులు చేయవలసిన పని


1) క్రీస్తు ఏలాగైతే సమస్తమును తండ్రి చిత్త ప్రకారము చేసాడో మనము అలాగే చేయాలి.

 » ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. – (మత్తయి. 7:21).

 » తండ్రి చిత్త ప్రకారమనగా,
మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట విన వలెను.(ద్వితియో. 18:18, అపొ.కార్య. 3:22).

2) క్రీస్తువలె సహోదరుల యెడల ప్రేమ కలిగి యుండాలి.

 » మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకనినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. (యోహాను. 13:34-35).

 » నేను మిమ్మును ప్రేమించినప్రకారము మీరొకనినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. (యోహాను. 15:12).

 » ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము. – (1 యోహాను. 3:16).

3) ఆయన మాటలయందు నిలిచియుండి, మంచి ఫలములు ఫలించేవారిగా ఉండాలి.

 » మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇటువలెనే మీరు నా శిష్యులగుదురు. – (యోహాను. 15:8).

 » మనుష్యులు మీ సత్ క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. (మత్తయి. 5:16).


క్రీస్తుకు శిష్యులుగా ఉండాలంటే!


1) మొదట క్రీస్తులోనికి బాప్తీస్మము పొందాలి.

 » కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులగా చేయుడి; తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములోకి వారికి బాప్తిస్మమిచ్చుచు,... – (మత్తయి. 28:19).

 » మీరు మారుమనస్సుపొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. (అపొ.కార్య. 2:38).

2) దేవుని మాటలను వినాలి, ఆ మాటలకు విధేయత చూపించాలి.

 » వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. – (రోమా. 10:17).

 » నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి పర్యంతము సదాకాలము మీతోకూడా ఉన్నానని వారితో చెప్పెను. (మత్తయి. 28:20).

 » వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. (అపొ.కార్య. 2:42).

3) వాక్యమును సాత్వికముతో అంగీకరించి,  వినువారుగా మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి.

 » అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. – (యాకోబు. 1:21-22).

 » ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. – (యాకోబు. 2:26).


క్రీస్తుకు శిష్యులుగా ఉంటే కలిగే ప్రయోజనాలు


1) మన ప్రాణములకు (ఆత్మ) విశ్రాంతి కలుగును.

 » ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైనవారలారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. (మత్తయి. 11:28-29).

2) మన పాపముల నుండి మనకు విముక్తి కలుగును.

 » దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. – (ఎఫెసీ. 1:7).

 » మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. – (1 యోహాను. 1:9).

3) దేవుని ఆత్మను బహుమతిగా పొందుకుంటాము.

 » ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు “విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను” గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక “ఆత్మ” ఇంకను అనుగ్రహింపబడియుండలేదు. – (యోహాను. 7:37-39).

 » ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. – (గలతీ. 5:22).

 » కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. – (రోమా. 15:13).

4) మన జీవితములో శాంతిని, దేవునితో సమాధానమును కలిగి ఉంటాము.

 » శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. – (యోహాను. 14:27).
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. – (రోమా. 5:1).

 » దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. – (ఫిలిప్పి. 4:6-7).

5) ఎల్లప్పుడు సంతోషముతో దేవునియందు ఆనందిస్తాము.

 » మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. – (యోహాను. 15:11).

 » ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి. – (ఫిలిప్పి. 4:4).

 » మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు,చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు. – (1 పేతురు. 1:8).

6) దేవుని ప్రేమను పొందుకుంటాము.

 » తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి. – (యోహాను. 15:9).

 » తన మహిమైశ్వ ర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. – (ఎఫెసీ. 3:17-18).

 » ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము. – (1 యోహాను. 3:16).

7) దేవుని కుటుంబముతో సహవాసము కలిగియుంటాము.

 » పేతురు ఇదిగోమేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. – (మార్కు. 10:28-30).

 » కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. – (హెబ్రీ. 10:24-25).

 » సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. – (1 కొరింధి. 7:24).

 » మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది. – (1 యోహాను. 1:3).

8) దేవుని మహిమను, స్వాస్థ్యమును, ఆదరణ మరియు ఆయనతో కూడా సదాకాలము జీవించే స్థితిని పొందుకుంటాము.

 » మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.(2 దేస్సలోని. 2:14).

 » మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధ ముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.(1 పేతురు. 1:4-5).

 » కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు.క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు  విస్తరించుచున్నది.(2 కొరింధి. 1:3-5).

 » సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.(1 దేస్సలోని. 4:13-18).


కావున ప్రియులారా, నిజమైన క్రైస్తవుడంటే క్రీస్తుకు శిష్యులుగా ఉండాలి. శిష్యులు ఏ విధముగా ఉండాలని పరిశుద్ధ గ్రంథము చెప్తుందో అట్టి రీతిగా జీవించి, క్రైస్తవుడంటే సరియైన అర్థము తెలియని వారికి నీ ప్రవర్తనే ఒక సమాధానముగా ఉండేలా అన్యుల ఎదుట దేవుని వెలుగును ప్రకాశింపజేసేలా మనము జీవించాలని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"సంతోషము" (Happy)

సంతోషము


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన నా తోటి సహోదరీ, సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.


ఉపోద్ఘాతం :


I. ప్రతి ఒక్కరు సంతోషాన్నే కోరుకుంటారు కాని ఏ ఒక్కరు నిరాశని కోరుకోరు.

II. నిజమైన క్రైస్తవుడు సంతోషంగా ఎలా ఉండగలడు?

III. దేవుడు నిజమైన, నిత్యమైన సంతోషాన్ని ఇవ్వగలడా (లేక) ఇస్తున్నాడా?

దేవుని వైపు చూడు మరియు ఆయనకు దగ్గరగా ఉండు :


A. ఆత్మీయ జీవితము మనల్ని సంతోషంగా ఉంచగలదు :  (ద్వితియో. 30:20).

1. ఈ భౌతిక సంబంధమైన జీవితములో ఎన్ని కష్టములున్నా మన తండ్రి యెద్ద నిత్యము జీవించగలము అనే ఆత్మ సంబంధమైన నిరీక్షణ మనకు సంతోషాన్నిస్తుంది.

● ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్‌క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. – (రోమా. 2:6-7).

2. మనకున్న ప్రతి స్థితిని దేవుడు గమనిస్తున్నాడని, ఆయన మనలను గూర్చి చింతిస్తున్నాడనే భావన మనకు సంతోషాన్నిస్తుంది.

● ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. – (మత్తయి. 11:28).

● దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. – (1 పేతురు. 5:6-7).

● నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. – (కీర్తన. 55:22).

3. మనము దేవుడు రక్షించుకున్న ప్రజలమని, ఆయన మనకు సహాయకుడని నమ్ముట మనకు సంతోషాన్నిస్తుంది.

● ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు. – (ద్వితియో. 33:29).

4. దేవుడు మన తప్పులని సరిచేయుటకు ఇష్టపడుతున్నాడంటే ఆయనకు మన మీద ఉన్న ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటే మనము సంతోషంగా ఉండగలము.

● దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. – (యోబు. 5:17).

B. ఈ లోకములోనూ, దానిలో ఉన్న అత్యధిక పదవులలోను సంతోషము కలుగదు : (ప్రసంగి. 1:14,17; 2:11,17,25; 4:4,6,16; 6:19).

1. ఇహలోక విషయాలలో నిత్య సంతోషము కలుగుట అసాధ్యము.

● ఆయన వారితోమీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. – (లూకా. 12:15).

2. నిజమైన సంతోషము కేవలము దేవునిలోనే సాధ్యము.

● దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలముతన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. – (కీర్తన. 18:30).

● యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. – (కీర్తన. 28:7).

దేవుడు చేసిన ప్రతి మేలుని లెక్కించి చూడు :


A. దేవుని వలన పొందుకున్న ప్రతి ఆశీర్వాదమును గుర్తు చేసుకో సంతోషంగా ఉండగలవు.

● మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు  స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీ ర్వాదమును మనకనుగ్రహించెను. – (ఎఫెసీ. 1:3).

1. దేవుడు మనయెడల చూపిస్తున్న దయ, కృప, ఓదార్పు ఇవే మనకు గొప్ప మేలులని తలంచు ఆ క్షణము నుండే సంతోషంగా జీవించగలవు.

● కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు. – (2 కొరింధి. 1:3-4).

B. దేవుని దీవెనలే మన సమస్యలను అధిగమిస్తాయి.

1. మనము ప్రతి ఉదయమును నూతనముగా చూడగలుగుతున్నామంటే అది దేవుడు అనుగ్రహిస్తున్న ఉచితమైన కృపయే గొప్ప దీవెనని భావించగలిగితే సంతోషము కలుగుతుంది.

● యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.  – (విలాప. 3:22-23).

దేవుని మాటలను చదువుటకు ఎక్కువ సమయమును గడుపు :


A. దేవుని గూర్చిన మాటలను చదివితే మనకు సంతోషము కలుగును. (ప్రసంగి. 12:13).

1. దేవుని గూర్చిన మాటలను చదవాలంటే అది కేవలము పరిశుద్ధ గ్రంథము ద్వారానే సాధ్యమని గ్రహించాలి.

● తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. – (2 పేతురు. 1:2-3).

B. దేవుని గ్రంధము మాత్రమే  మన జీవితాన్ని ప్రోత్సాహించగలదు. (కీర్తన. 119:116).

1. మనము క్రైస్తవులుగా జీవించుట ఎంత గొప్ప ధన్యతో దేవుని గ్రంధము మనకు గుర్తుచేస్తుంది. దాని వలన కలుగు సంతోషము చాలా గొప్పది.

● దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము. – (రోమా. 5:8-11).

2. మనకు ఎక్కడ సంతోషము కలుగునో ఆ మార్గములను కూడా పరిశుద్ధ గ్రంధమే మనకు చూపిస్తుంది.

● యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించె దవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక. – (కీర్తన. 128:1-6).

జరిగిపోయిన దానిని ఎన్నడూ గుర్తించుకోకు :


1. మనము ఎంత ప్రయత్నించినా జరిగిపోయిన కాలాన్ని వెనకకు తీసుకురాలేము కనుక ముందున్నఆత్మీయ విషయములను గూర్చిన జ్ఞానము వెదుకుటలో సంతోషము కలుగును.

● పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచి యున్నాడు. – (కీర్తన. 103:12).

2. పూర్వము చేసిన తప్పులను గుర్తుచేసుకుని బాధపడకుండా వాటిని సరిచేసుకునే మార్గములను ఆలోచించాలి.

● మీలో ఎవడు చింతిచుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు?(లూకా. 12:25).

● దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. – (యెహెజ్కేలు. 18:23).

3. ఇంతకు మునుపు చేసిన తప్పులనే తిరిగి కొనసాగిస్తే సంతోషంగా జీవించలేమని గ్రహించాలి.

● మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును. ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. – (2 పేతురు. 3:13-14).

4. క్రైస్తవుడు ఖచ్చితముగా గతాన్ని మర్చిపోవాలి అప్పుడే సంతోషంగా జీవించగలడు.

● మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. – (1 పేతురు. 4:3).

దేవునికి మొదటి స్థానము యివ్వాలి :


A. ప్రార్థన.

ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువ సంతోషముగా ఉండగలము.

● ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. – (1 దేస్సలోని. 5:17-18).

● మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. – (యాకోబు. 5:16).

B. సహవాసము.

సహోదరులతో సహవాసము కలిగియుండుటలో సంతోషము ఉన్నది కనుక సమాజముగా కూడుట మానకూడదు.

● కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. – (హెబ్రీ. 10:24-25).

C. పని (లేక) శ్రద్ధ.

సంఘ పనిలో సహాయకులుగా ఉండాలి, సమయమును కేటాయించాలి.

● బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను. – (రోమా. 12:8).

సంఘ పనికి ఆర్దికంగా సహాయము చేయాలి అప్పుడే మన జీవితములో సంతోషము.

● ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్ద నుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. – (నిర్గమా. 36:3).

ముగింపు :


» పైన తెలుపబడిన విషయములను బట్టి చూస్తే మనము సంతోషముగా ఉండగలము. క్రైస్తవులమైనందుకు అన్యులకంటే మరింత సంతోషముగా జీవించగలము.

» నిజమైన సంతోషము మరియు నిత్యమైన సంతోషము మన ప్రభునియందే మనకు సాధ్యమని గట్టిగా చెప్పగలము.

» కాబట్టి ప్రియ సహోదరుడా నిత్య సంతోషము కావాలా? నేడే నీ మనస్సు మార్చుకుని దేవునివైపు తిరుగు ఎన్నడూ లేనంత సంతోషముగా జీవితమును క్రీస్తులో కొనసాగించగలవు.



మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  
The churches of Christ greet you - Roma 16:16