"ప్రవర్తన" (Behaviour)

 ప్రవర్తన
ప్రవర్తన

క్రీస్తుయేసు రక్తము ద్వారా విమోచింపబడి, పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈనాటి క్రైస్తవులలో అనేకమంది తాము క్రైస్తవులని చెప్పుకొనుచున్నారు కాని వారి ప్రవర్తన ద్వారా తోటివారిని క్రీస్తులోనికి (క్రీస్తు సంఘము) నడిపింపలేనివారిగా ఉన్నారు. మరి కొంతమంది వారి ప్రవర్తన ద్వారానే సహోదరుల మనస్సాక్షి బలహీన పడేలా ప్రవర్తించి తోటి సహోదరులను దేవునికి దూరము చేస్తున్నారు. చాలామంది క్రైస్తవులు తాము సంఘములో మాత్రమే మంచి ప్రవర్తన కలిగియుంటే చాలు మిగతా విషయాలలో ఏ విధముగానైననూ ప్రవర్తించవచ్చుననుకొని వారి సొంత లాభముల కొరకు దేవుని నామాన్ని అన్యుల ఎదుట అవమాన పరుస్తున్నారు.

నిజమైన క్రైస్తవుడు ఏ విధముగా జీవించాలి?, వారి ప్రవర్తన ఎలా ఉండాలి? అనే విషయములను గ్రంథము ద్వారా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది.

క్రైస్తవుని ప్రవర్తన 


A) "పొరుగువాని యెడల నిష్కపటమైన ప్రేమ కలిగి యుండాలి."

● ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. – (రోమా. 13:8).

● నీవలె నీ పొరుగువాని ప్రేమించుము,.... – (గలతీ. 5:14).

● పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. – (కొలస్సి. 3:14).

● ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.(1 యోహాను. 4:7).

● ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.(1 తిమోతి. 1:5).

B) "దేవుని చేత ముందుగా సిద్దపరచబడి క్రీస్తుయేసునందు నూతనముగా సృష్టింపబడినవారమని ఎరిగి ఈ లోకములో సత్ క్రియలు చేసి అన్యులు దేవుని నామాన్ని మహిమ పరిచేలా మంచి ప్రవర్తన కలిగి యుండాలి."

● అన్యజనులు మిమ్మును విషయములో దుర్మార్గులని దూషింతురో విషయములో వారు మీ సత్ క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. (1 పేతురు. 2:12).

● కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. (రోమా. 12:17).

● మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి. (ఫిలిప్పి. 4:8).

C) "క్రీస్తు నందు బాప్తీస్మము పొందిన మనమంతా ఆత్మ స్వభావము కలవారమని గ్రహించి ఎంతమాత్రమును ఈ లోక మర్యాదను అనుసరింపక సజీవయాగముగా మన శరీరములను దేవునికి అర్పించుకుని దేవుని చిత్త్తానుసారమైన ప్రవర్తన కలిగి యుండాలి."

● దేవుని ఆత్మ మీలో నివసించియున్న పక్షమున మీరు ఆత్మస్వభావముగలవారే గాని శరీరస్వభావముగలవారు కారు. (రోమా. 8:9).

● మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. (గలతీ. 5:25).

● కాబట్టి సహోదరులారా, పరిశుద్దమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతనుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. (రోమా. 12:1-2).

D) "యెహోవా కనుదృష్టి యాదార్థహృదయము కలవారిమీదనే ఉంటుంది కనుక ఈ లోకములో ఎటువంటి సమస్యలు లేకుండా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము దేవుని యెడల యదార్థ ప్రవర్తన కలిగి యుండాలి."

● తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. (2 దినవృత్తా. 16:9).

● యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది. (కీర్తన. 33:19).

● ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు. – (యోబు. 34:21).

E) "క్రైస్తవులైనటువంటి స్త్రీలు తమ భర్తల యెడల విధేయత కలిగి యుండాలి, పురుషులు తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించాలి, పిల్లలు తల్లి తండ్రులను సన్మానించాలి, తలితండ్రులు పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షలో పెంచాలి. ఇట్టి ప్రవర్తన ప్రభువుకు యుక్తమైనది."

● భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. పిల్లలారా, అన్నివిషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటిక కనబడవలెననికాక, ప్రభువుకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్నివిషయములలో విధేయులై యుండుడి. (కొలస్సి. 3:18-22).

● పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. (ఎఫెసీ. 6:1-4).

F) "క్రైస్తవులమైన మనము ఈ లోకమునకు వెలుగై యున్నామని గ్రహించి మంచితనమును, నీతిని, సత్యమును మన ప్రవర్తనలో కనపరచుకోవాలి. వెలుగు సంబంధులవలె నడచుకోవాలి."

● మీరు లోకమునకు వెలుగైయున్నారు. – (మత్తయి. 5:14).

● మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమనువాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలెనడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి. (ఎఫెసీ. 5:8-11).

G) "దేవుని రాజ్యము చేరుటకు పిలువబడినవారము కనుక శరీర కార్యములను పూర్తిగా విసర్జించాలి."

● శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పినప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. (గలతీ. 5:19:21).

H) "చెడ్డవాటిని అసహ్యించుకుని మంచివాటిని హత్తుకుని యుండాలి."

● మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదాని హత్తుకొని యుండుడి. (రోమా. 12:9).

● ఎవడును కీడుకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకనియెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి. – (1 తిమోతి. 5:15).

I) "అందరి యెడల సమాధానమును, పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించాలి."

● అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు. (హెబ్రీ. 12:14).

● సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. (హెబ్రీ. 3:12).

● క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి. (కొలస్సి. 3:15; ఎఫెసీ. 2:13-14).

J) "సహోదరుల యెడల క్షమాపణ గుణము కలిగి యుండాలి."

● మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పితము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన పక్షమున అతని క్షమించుము. అతడు ఒక దినమున ఏడు మారులు నీకు తప్పితము చేసి యేడు మారులు నీ వైపు తిరిగి - మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెననెను. (లూకా. 17:3-4).

● మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. (మత్తయి. 6:14-15).

● మీకు ఒకనిమీద విరోధమేమైనను కలిగియున్న పక్షమందు, మీరు నిలువబడి ప్రార్థనచేయునప్పుడెల్ల వాని క్షమించుడి. (మార్కు. 11:25).

● ఒకనియెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించినప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. (ఎఫెసీ. 4:32).

● ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనినయెడల ఒకని ఒకడు సహించుచు ఒకని ఒకడు క్షమించుడి, ప్రభువుమిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. (కొలస్సి. 3:13).

K) "ఏ విషయములోను సహోదరుల మనసాక్షి బలహీనపడేలా ప్రవర్తించకూడదు."

● ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మనస్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను, మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. (1 కొరింధి. 8:10-12).

L) "మన దేవుడు పక్షపాతి కాడు కనుక మనము కూడా మన పొరుగువారి యెడల సహోదరుల యెడల పక్షపాతము చూపక నీతిగా నడుచుకోవాలి."

● అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. (లేవీ. 19:15).

● పక్షపాతము చూపుట మంచిది కాదు. – (సామెతలు. 28:21).

● దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును. (అపొ.కార్య. 10:34-35).

M) "అసూయలు, కలహబుద్ధి లేకుండా సంఘము యెడల ఏక మనస్సు, ఏక భావము కలిగి యుండాలి."

● సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక యేకమనస్సుతోను ఏకతాత్పర్యముతోను మీరు సన్నద్ధులైయుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తుపేరట మిమ్మును వేడుకొనుచున్నాను. – (1 కొరింధి. 1:10).

● కావున క్రీస్తునందు హెచ్చరికయైనను, ప్రేమవలన దుఃఖోపశమనమైనను, ఆత్మయందు సహవాసమైనను, దయారసవాత్సల్యములైనను ఉన్నయెడల మీరు ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమకలిగి, యేకభావముగలవారుగా ఉండి, ఒక్కదానినే మనస్కరించుచు నా సంతోషమును సంపూర్ణముచేయుడి. – (ఫిలిప్పి. 2:1-2).

N) "క్రైస్తవుడవైన నీవు బోధించు మరియు నేర్చుకున్న విషయములలో నీ ప్రవర్తన చూచుకొనుము."

● ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?. – (రోమా. 2:21).

● మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.  – (యాకోబు. 1:22-23).

ప్రియులారా ఇంకా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంధములో అనేక లేఖనములు కలవు. ఐతే క్రైస్తవులమైన మనము మంచి ప్రవర్తన గలవారమై ఈ లోకములో జీవ వాక్యమును చేత పట్టుకుని, జ్యోతులవలె కనబడుటకును (ఫిలిప్పి. 2:16), అన్ని విషయములయందు శ్రద్ధ కలిగి (ఎఫెసీ. 4:1), దేవుని చిత్తమేమిటో ఎరిగి, ఈ లోకమునుండి వేరు చేయబడిన వారమని గ్రహించి (కొలస్సి. 1:13), ఆత్మ స్వభావము కలవారమై (రోమా. 8:9), శ్రమయందు ఓర్పు గలవారై (రోమా. 12:12), మరణము వరకు నమ్మకముగా ఉండి మనకొరకు ఉంచబడిన జీవ కిరీటమును (ప్రకటన. 2:10) పొందుకోవాలని నన్ను నేను హెచ్చరిక చేసికొనుచూ ప్రేమతో మీకు మనవి చేయుచున్నాను.

దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. – (యెహెజ్కేలు. 18:23).

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

7 comments

comments
James
October 17, 2017 at 8:18 PM delete

Thank You so much anna

Reply
avatar
ప్రదీప్
October 17, 2017 at 9:49 PM delete

బ్రదర్.ఏటువంటి ప్రవర్తన కలిగి జీవించాలో నాకు జ్ఞాపకము చేసినందుకు మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

మన దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ :)

Reply
avatar
March 29, 2019 at 5:36 PM delete

Wonderful website using to grow in spiritual life

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16