"దేవుడు మన ముందు వుంటే !" (If God before us)



ప్రభువునందు ప్రియులకు నా హృదయపూర్వక వందనములు.

సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. (కీర్తన. 16:8).

 మన నిర్ణయాలు, ఆలోచనలు, పనులలో దేవుడు మన ముందు వుంటే మన మార్గాలు లేదా మన జీవితం చాల  సురక్షితంగా ఉంటుంది. ఈ మాట ఎంత నిజమో గ్రంధానుసారముగా ఆలోచన చేద్దాము.

 ● నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవునికి ప్రధమ స్థానము ఇచ్చి ఆయనను మనముందు ఉంచుకోగలిగితే       ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని గ్రహించగలము.

ఆయన చిత్తాన్ని గ్రహించినప్పుడు ఆయా విషయాలలో మనము ఏ విధముగా నడుచుకోవాలని దేవుడు    ఆశపడుతున్నాడో ఆ విధముగానే నడుచుకొనుటకు ప్రయత్నము చేయగలము. (లూకా. 6:16; మత్తయి. 7:21;  యిర్మియా. 37:17).

నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవునికి ప్రధమ స్థానము యిస్తే ఖచ్చితంగా ఆయన వాక్యము అనగా ఆయన సత్యమును గ్రహించగలము.

యేసు – సత్యము మనలను స్వతంత్రులుగా చేయును. (యోహాను. 8:32; 17:17; 2 తిమోతి. 2:15).

కావున ప్రతీ దినము మన నిర్ణయాలలో దేవునికి ప్రధమ స్థానము యివ్వగలిగితే దేవుని చిత్తమేమిటో తెలుసుకోగలము అయితే ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే నిత్యమూ ఆయన వాక్యమును అధ్యయనం చేయాలి అప్పుడే మనము దైవికమైన నిర్ణయాలు తీసుకోగలము.

● మనము దేవునికి ప్రధమ స్థానము ఇచ్చి ఆయనను మనముందు ఉంచుకోగలిగితే మన ఆలోచనలు ఆయన చిత్తానుసారముగా ఉంటాయి.

మనయొక్క ప్రతీ ఆలోచన క్రీస్తుకు లోబడునట్లుగా మరియు సంపూర్ణముగా విధేయత కనపరచునట్లుగా ఉండాలి. (2 కొరింధి. 10:3-5).

క్రైస్తవులమైన మనము దైవిక విషయముల గూర్చి మరియు యధార్థమైన విషయముల గూర్చి ఆలోచన చేయవలసిన వారమై వున్నాము. (ఫిలిప్పి. 4:6-8).

మన ఆలోచనలోనికి దేవుని ఆహ్వానించాలంటే మనకున్న ఏకైక మార్గము ఆయన నీతిని వెదకడమే. (కీర్తన. 119:10-12).

» “తండ్రి నేను ఏ విధముగా ఆలోచించాలి...? ” అని  మన యొక్క ప్రతీ పరిస్థితిలోను దేవుని అడగాలి.

● మన నిర్ణయాలు మరియు మన ఆలోచనలలో దేవునికి ప్రధమ స్థానము యిచ్చి ఆయనను మన ముందు ఉంచుకోగలిగితే మన పనిలో భద్రత ఉంటుంది.

ఆయన మన కుడిపార్శ్వమందు ఉన్నపుడు మనము కదల్చబడలేము. (కీర్తన. 16:8).

మనము నిజముగా క్రైస్తవులమైతే ఈ క్షణమే దేవునికి ప్రధమ స్థానము యిచ్చి మన నిర్ణయాలు, ఆలోచనలు మరియు పనులలో ఆయనను మనముందు ఉంచుకుని ఆయన అడుగుజాడలలో నడిచెదము.

★ దేవుణ్ణి నీ ముందు ఉంచుకోవాలనుకుంటే “ఆయన మాటను వినాలి”. (యోహాను. 5:24; అపో.కార్య. 8:5-6; రోమా. 10:17; ప్రకటన.1:3).

దేవుణ్ణి నీ ముందు ఉంచుకోవాలనుకుంటే “యేసుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడని విశ్వసించాలి”. (మత్తయి. 16:16-17; యోహాను. 8:24; అపో.కార్య. 16:31; హెబ్రీ. 11:6).

★ దేవుణ్ణి నీ ముందు ఉంచుకోవాలనుకుంటే “నీ పాపముల విషయములో మారుమనస్సు పొందాలి”. (లూకా. 13:3; అపో.కార్య. 17:30).

★ దేవుణ్ణి నీ ముందు ఉంచుకోవాలనుకుంటే “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి”. (మత్తయి. 10:32-33; యోహాను. 20:31; రోమా. 10:9-10).

★ దేవుణ్ణి నీ ముందు ఉంచుకోవాలనుకుంటే “బాప్తీస్మము పొందుకోవాలి”. (మార్కు. 16:16; అపో.కార్య. 2:38; 1 పేతురు. 3:21).

★ దేవుణ్ణి నీ ముందు ఉంచుకోవాలనుకుంటే “ప్రభువుచేత క్రీస్తు సంఘము (church of Christ)గా చేర్చబడాలి”. (అపో.కార్య. 2:47).

కాబట్టి ప్రియులారా, మన జీవితాలలో దేవునికి ప్రధమ స్థానము ఇచ్చి ఆయనను మన ముందు ఉంచుకోగలిగితే మనయొక్క ప్రతీ పరిస్థితిలోనో ప్రతీ అవసరత లోను ఆయన మనకు సహాయము చేస్తాడు ఆయన సహాయము మనకుంటే ప్రతీ విషయములోను మన పనులన్నిటిలోను విజయము పొందుకుంటాము.



మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.

Share this

Related Posts

Previous
Next Post »

3 comments

comments

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16