"యేసుని గూర్చి తెలుసుకోవలసిన నిజాలు" (facts about Jesus)


నా తోటి పరిశుద్ధులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈనాడు ప్రపంచములో అనేకమంది మేము క్రైస్తవులమని తమకు తామే చెప్పుకుంటున్నారు కాని వారు నిజముగా క్రైస్తవులుగా జీవిస్తున్నారా, యేసును సంపూర్ణ విశ్వాసముతో అంగీకరిస్తున్నారా లేదా అనే విషయము గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే నిజముగా యేసు శిష్యుడుగా ఆయన యెదుట యధార్ధముగాను విశ్వాసముతోను జీవించాలంటే యేసుని గూర్చి కొన్ని నిజాలు తెలుసుకోవాలి.

ప్రతి ఒక్క క్రైస్తవుడు తన జీవితములో యేసుని గూర్చి తెలుసుకోవలసిన ఐదు నిజాలు :


యేసు మనలను సృజించెను – ఆయన మన సృష్టికర్త

» ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రి వలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. (యోహాను. 1:14).

» “ఆ వాక్యము” అనగా యేసు, ఈయన తండ్రికి అద్వితీయ కుమారుడు.

» ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.  ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. (యోహాను. 1:1-3).

» ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.  ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. (కొలస్సి. 1:16-17).


యేసు మన కొరకు మరణించాడు – ఆయన మన రక్షకుడు

ఒక ప్రయోజనకరమైన పని చేయుటకు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆ సంకల్పము గూర్చి గ్రంథము  ఏం చెప్తుందంటే :

» పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. (1 తిమోతి. 1:15).

» తండ్రి తన  కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. (1 యోహాను. 4:14).

» క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను. (1 కొరింధి. 15:3).

» దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. (ఎఫెసీ. 1:7).

గమనిక : ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశముగా మెరుగు పరుచుటకు యేసు ఈ లోకమునకు రాలేదు.
మానవ జాతియొక్క నైతిక భావనలు మరియు వారి ప్రామాణికతను పెంపొందించడానికి యేసు ఈ లోకమునకు రాలేదు కాని పాపముల నుండి మనలను రక్షించుటకు నరకం అనే భయంకరమైన శిక్ష నుండి మనలను తప్పించుటకు యేసు ఈ లోకమునకు వచ్చెను. 


యేసు మృతులలోనుండి లేచెను - ఆయన మన ప్రభువు

» క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. (1 కొరింధి. 15:4).

» ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. (రోమా. 4:25).

గమనిక : యేసు ఒక్కసారి మాత్రమే చనిపోయెను, మరల చనిపోవుటకు ఆయన లేపబడలేదు కాని నిత్యము జీవించుటకు ఆయన లేపబడెను.

» మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము. (రోమా. 6:9).

ఎవరైతే ఈ విషయములను గ్రహిస్తారో వారు పునరుత్థానుడును,  జీవించుచున్న ప్రభువని యేసుని నమ్మి హృదయపూర్వకముగా యేసును సేవించగలరు.


యేసు అధికారము గలవాడు – ఆయన మన రాజు

» ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల నేలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును. (లూకా. 1:33).

» పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోకి వారికి బాప్తిస్మమిచ్చును నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి పర్యంతము సదాకాలము మీతోకూడా ఉన్నానని వారితో చెప్పెను. (మత్తయి. 28:18-20).

» మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని సంఘమునకు ఆయనను శిరస్సుగా నియమించెను. ( సంఘము) ఆయన శరీరము; అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపుచున్న వానితో నింపబడినదై యున్నది. (ఎఫెసీ. 1:22-23).

» సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా. (ఎఫెసీ. 5:24).

» ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులనుగా చేసెను. (కొలస్సి. 1:13).


గమనిక : పై వచనముల బట్టి యేసు మన రాజని ఆయనకు మన మీద అధికారము కలదని మరియు మనము ఆయన ఏలుబడిలో ఉన్నామని ప్రతి క్రైస్తవుడు గమనించుకోవాలి.


యేసు తీర్పు తీర్చువాడు – ఆయన న్యాయాధిపతి

» తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరుచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు. (యోహాను. 5:22-23).

» ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించినవాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. (2 కొరింధి. 5:10).

» ఇదియు గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. (అపో.కార్య. 10:42).

గమనిక : దేవుని ఆలోచనా పూర్వకముగా యేసు మనలను సృజించెను,  ఆ ఒక్కడే మన కొరకు చనిపోయెను, మృతులలోనుండి మన కొరకు లేపబడెను, అతడే మనకు ప్రభువుగా లేక రాజుగా నియమింపబడెను మరియు అతడే మనకు తీర్పు తీర్చును.


కాబట్టి ప్రియులారా, అంత గొప్పవాడైన యేసుని మన జీవితములోనికి ఆహ్వానించుకున్న మనము ఆయన యొక్క గొప్ప త్యాగాన్ని మరచిపోయి ఏదో నమ్ముతున్నాము కదా అని నామకార్థ క్రైస్తవులుగా ఉంటె మాత్రము నరకము నుండి తప్పించుకోలేము. కావున యధార్ధముగా, నిష్కలంకముగా మన హృదయములను ఆయనకీ సమర్పించి ఆయన యొక్క త్యాగాన్ని నిత్యము జ్ఞాపకము చేసికొనుచూ గ్రంథము చెప్పిన రీతిగా యేసుని విశ్వసించాలని ప్రేమతో మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.

Share this

Related Posts

Previous
Next Post »

5 comments

comments
Anonymous
July 26, 2017 at 7:32 PM delete

Look, there is a mistake.you wrote Rom 6:9 n Mark 16:19 with a same verse.please correct it brother.

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16