దైవజనుడైన ఎలీషా ప్రవక్త (Elisha, man of God)

 "దైవజనుడైన ఎలీషా ప్రవక్త"

                             
నా తోటి పరిశుద్ధులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

●     దైవజనుడు అనగా దేవుని చేత నడిపింపబడేవాడు లేదా ఎన్నుకోబడినవాడు.
●ప్రవక్త అనగా దేవుని సంకల్పమును బయలుపరిచేవాడు.

*         ఏలియా తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడును వ్యవసాయకుడైన ఎలీషా దేవునిచేత ఎన్నుకోబడిన ప్రవక్త. – (1 రాజులు. 19:16).
*         తన గురువు మరియు ప్రవక్తయైన ఏలియా మాటలకి కి లోబడి ఆయన వెంట ఉండి ఉపచారము చేసిన మంచి శిష్యుడు. - (1 రాజులు. 19-19-21).
*         తన గురువు మరియు ప్రవక్తయైన ఏలియా యెద్ద నుండి రెండుపాళ్ళు ఆత్మని పొందుకుని ఏలియా తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు దైవజనుడు గాను ప్రవక్త గాను దేవుని చేత నియమింపబడ్డాడు. – (2 రాజులు. 2:9-16).


దైవజనుడైన ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చేసిన అధ్బుతములు :
1)    యోర్దాను నదిని రెండు పాయలుగా విడగొట్టెను. - (2 రాజులు. 2:14).
2) యెహోవా మాట చేత యెరికో పట్టణమందు త్రాగుటకు పనికిరాని ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చివేసెను. – (2 రాజులు. 2:21).
3)   తనని అపహాస్యము చేసిన వారిని యెహోవా నామమును బట్టి శపించెను. – (2 రాజులు. 2:23).
4)   ఇశ్రాయేలు ప్రజలను మోయాబీయుల చేతిలో నుండి రక్షించి ప్రజలకు పశువులకు త్రాగుటకు నీళ్ళు లేని దేశములో యెహోవా మాట చేత నీళ్ళు రప్పించెను. – (2 రాజులు. 3:9-20).
5)   కొంచెము నూనెను ఎక్కువగా చేసి తన దాసుని భార్యను, ఆమె కుమారుని అప్పుల బాధ నుండి రక్షించి వారు బ్రదుకుటకు మార్గము చూపెను. – (2 రాజులు. 4:1-7).
6)   దైవజనుడైన తనయందు శ్రద్ధా భక్తులు కనపరిచిన షూనేమీయురాలికి కుమారులు లేరని తెలిసి ఆమెకు కుమారుని కలుగజేసెను. – (2 రాజులు. 4:16).
7)   యెహోవాకు ప్రార్థన చేసి చనిపోయిన షూనేమీయురాలి కుమారుని బ్రతికించెను. – (2 రాజులు. 4:33-35).
8)   యెహోవా సెలవిచ్చిన రీతిగా ఇరవై  రొట్టెలను వందమంది తినేలా చేయగలిగాడు. – (2 రాజులు. 4:43-44).
9)   సిరియాదేశపు సైన్యాధిపతియైన నయమానుకు కలిగిన కుష్టురోగమును స్వస్థపరచెను. – (2 రాజులు. 5:14).
10) ధనమును సంపాదించుకొనుటకు ఆశపడిన తన శిష్యుడైన గేహాజీని, అతని సంతతిని నయమానుకు కలిగినటువంటి కుష్టురోగము కలుగునుగాక అని శపించెను. – (2 రాజులు. 5:26-27).
11)  యోర్దాను నదిలో పడిన తన దాసుని గొడ్డలిని పైకి తేలినట్లు చేసెను. – (2 రాజులు. 6:6).
12)  ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని తలంచిన సిరియాదేశపు దండువారిని, యెహోవాకు ప్రార్థన చేసి  అంధత్వముతో మొత్తెను. – (2 రాజులు. 6:18).


ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై మృతిపొందగా అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు  కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.- (2 రాజులు. 13:14,20-21).

చనిపోయిన తర్వాత కూడా క్రుళ్లుపట్టిన ఎముకలు తగిలి చనిపోయినవాడు సైతము బ్రతికాడంటే ఎలీషా తన జీవితములో దేవుని దృష్టికి ఎంత భయభక్తులు కలిగియున్నాడో, ఎంత నీతిగా జీవించాడో  మనము ఆలోచన చేయవలసిన అవసరత ఉంది.


కాబట్టి నా ప్రియులారా, మనము కూడా దైవజనుడైన ఎలీషా వలె దేవుని దృష్టికి యధార్ధముగా నడుచుకోవాలని నన్ను నేను హెచ్చరించుకొనుచూ మిమ్మల్ని మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయ సహోదరుడు.
మనోహర్ బాబు.

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16