![]() |
"దేవుడు మనల్ని గమనిస్తున్నారు" |
నా తోటి
పరిశుద్ధులరా, మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో
నా వందనములు.
దేవుడు ఎక్కడ వున్నాడు? ఇది ఒక మంచి ప్రశ్న కావచ్చు, ఆయన ఎక్కడ లేడు?
» “నీ
ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి
నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను
ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో
నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును”
- (కీర్తనలు. 139:7).
» వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. - (కీర్తన. 14:2;
53:2).
» యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. - (కీర్తన. 11:4).
● దేవుని నుoచి ఏ మనుష్యుడు తప్పిoచుకోలేడు. మనము ఆకాశమునకెక్కినను ఆయన
అక్కడ ఉన్నాడు. మనము పాతాళమందు ప్రయాణం చేసినను ఆయన అక్కడ ఉన్నాడు.
» నేను సమీపముననుండు దేవుడనుమాత్ర మేనా?
దూరముననుండు దేవుడనుకానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన
కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను
కానా? యిదే యెహోవా వాక్కు”. - (యిర్మియా 23:23-24).
» “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు
కాడు. మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము”. - (అపొస్తలుల కార్యములు 7:27-28)
» “ఆకాశము నా
సింహాసనము భూమి నా పాద పీఠము”. - (యెషయా 66:1).
» “ఆకాశ మహాకాశములు
సహితము నిన్ను పట్టజాలవు”. - (I రాజులు 8:27).
“కెరూబుల మధ్యను
నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా” అని బైబిల్ చెపుతున్నది (II రాజులు 19:15). “నీవు నివాసము చేయుటకు నేను మందిరము
(సీయోను) కట్టించి యున్నాను” (I రాజులు 8:11,13; కీర్తనలు 26:8; యెషయా 8:18). క్రీస్తు నoదు (యోహాను 1:14; II కొరింథీ 5:19). “దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను
వారిలో (క్రీస్తు సంఘముతో) నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు”.( II కొరింథీ 6:16; ఎఫెసీ 2:19-22). మరియు “ఆయన ప్రతీ క్రైస్తవుని జీవితములో
నిలిచియున్నాడు”. (I యోహాను 4:12-16).
దీనిని బట్టి అయన మన జీవితములో అంతరంగికగా నివాసం చేయుచున్నాడు అని అర్దం అవుతున్నది. మనం ప్రతీ ఒక్కరికి ఆయన గూర్చిన సత్యముని తేలియజేయలి. ఆయన ప్రతీ చోట్లా వున్నాడు, దీన్ని అర్ధం “మనం ఎక్కడ ఉన్నను ఆయన కూడా మనతో అక్కడే వున్నవాడు”. అందువలనే, దేవుడు మనలని నిరతరం గమనిస్తున్నారు ఈ విషయం మనకి బాగుగా అర్ధం కావాలి, అపుడు మనము ఈ శరీరములోని నివసిస్తూ దేవుని నిరాశపరచే వారుగా ఉండము.
మనము క్రీస్తు సువార్తకు
కట్టుబడి వుoడి (1 థెస్సలొనీక. 2:14),
సత్యవాక్యామును సరిగా విభజిoచుటకును (2 తిమోతి. 2:15) మరియు క్రీస్తు యొక్క సిద్ధాoతములను చేపట్టాలి (2 థెస్సలొనీక. 2:15) అoదుకోసమే మనము క్రీస్తు నoదు పిలవబడితిమి. (మార్కు 16:16; యోహాను 8:31; II యోహాను 9).
అవును, దేవుడు అన్ని చోట్లా ఉన్నవాడు మరియు ఆయన ప్రతి ఒక్కరిని
గమనిస్తున్నారు. అయన ప్రతీ ఒక్కరి ఆలోచన మరియు ఉద్దేశ్యంను పరిశిలన చేయుచున్నాడు.
కాబట్టి ప్రియ
సహోదరులారా దేవుడు అన్ని చోట్లా ఉండి అందరి హృదయములను పరిశీలన చేయుచున్నాడు కనుక మన
ప్రవర్తన విషయములో మనుష్యుల దృష్టికి
దేవుని దృష్టికి యదార్థముగా మనల్ని మనము
కనపరుచుకొని, ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్దులమై యుండవలెనని ప్రేమతో
మిమ్మల్ని మనవి చేయుచున్నాను.
యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. (సామెతలు. 15:3).
మీ ఆత్మీయ
సహోదరుడు,
మనోహర్ బాబు.
2 comments
commentsWonderful Topic anna
Replyతమ్ముడు మనోహర్ మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
Replyచాల చక్కగా రాసారు. ఇంకా అనేక అంశములు వ్రాస్తూ మాకు మరి కొన్ని సత్యములును తెలియజేయాలి అని కోరుతున్నా... మీరు నా ప్రాద్దన లో ఉన్నారు.
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com