శిష్యుడివా? లేక అభిమానివా? (Afan or Discipleship)

శిష్యుడివా? లేక అభిమానివా?

 మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿

 

నేటి  వివిధ సంఘాలలో ప్రభువైన  క్రీస్తునకు శిష్యులుకంటే అభిమానులే ఎక్కువగా ఉన్నట్టు తేటగా అగుపడుచున్నది. అది మనమెలా చెప్పగలమంటే నేడు క్రైస్తవులు నడచుకుంటున్న జీవన విధానము మరియు వారి ప్రవర్తనా శైలియే అందుకు ఆధారం. అయితే క్రీస్తు తనకు శిష్యులు కావాలని కోరుకుంటున్నాడా? లేక తనకు అభిమానులను కోరుకుంటున్నాడా?  అనేది ఈ అంశము ద్వారా పరిశీలన చేద్దాము. అసలు అభిమానికి శిష్యునికి తేడా తెలుయునా నీకు? 


👤 అభిమాని  :

అభిమాని అనగా  తనకు నచ్చిన ఒకరిని వెంబడించేవాడే అభిమాని. 

ఒక అభిమాని(Fan) తనకు అభిమానమైన(నచ్చిన) వ్యక్తిని చూసి ఆనందిస్తాడు, గట్టిగా నమ్ముతాడు, ఇతరులకు గొప్పగా చెపుతాడు, కేరింతలు కొడతాడు, తనవాడిని అని చెప్పుకుంటాడు, అతని పేరుతో రక్తం డొనేట్ చేస్తాడు, రోడ్లు మీద పరుగులు పెడతాడు(Run for ***), వ్యక్తి పేరు చెప్పుకుని అనేక కార్యాలు, దానధర్మాలు చేస్తాడు, తన అభిమాన్ని ఎవరైనా ఏమైన అనిన లేక ఏదైనా  జరిగిన సహించలేడు,  రోడ్లు ఎక్కుతాడు, కేకలు వేస్తాడు, బట్టలు చింపుకొంటాడు.., Etc.  ఇవన్నియు ఈ లోకం వరకే చేయగలడు.



👤 శిష్యుడు  :

శిష్యుడు అనగా ఒకరిని వెంబడిస్తూ, వారి జీవితాన్ని, వారి మాటలను అనుసరించేవాడు(అంగీకరించేవాడు), ప్రకటించేవాడు, మాదిరిగా ఉండువాడే శిష్యుడు. 


యేసు - మన దేవుని యొక్క శిష్యుడు :

👤మన ప్రభువైన యేసు తన జీవితకాలములో తన దేవునికి(పరమతండ్రికి) శిష్యునిగానే బ్రతికాడు. 

(యెషయా. 50:4-7): "అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్ప గించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని."

(లూకా.  6:40): "శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును."

(యోహాను. 4:34): "యేసు వారిని చూచి-నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.౹"

(యోహాను. 7:16): "అందుకు యేసు-నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.౹"

(యోహాను. 8:26): "మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.౹"

(యోహాను. 8:38): "నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. 

(యోహాను. 13:16): "దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹"

(యోహాను. 15:15): ".. నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.౹"


ప్రభువైన యేసు తాను ఈ భూమిమీద పరిచర్య చేసే దినాలలో అనేక జన సమూహాలు ఆయనను వెంబడించేవారు. ఆయన అద్భుతాలు చేస్తుంటే చూడడానికి వచ్చిన జన సమూహం, ఆయనచేత తమ రోగాలను  స్వస్థపరచుకునేందుకు వచ్చిన జన సమూహం, రోగులతో పాటు వచ్చిన జన సమూహం, ఆయనను తప్పు పట్టాలని చూసే జన సమూహం, ఆయన్ను శోధించుటకు వచ్చిన బహు జన సమూహం, ఇహలోక సంబంధమైన ఆహారం పొందుటకు వచ్చిన బహు జన సమూహం, ఆయన మాటలు వినుటకు వచ్చిన బహు జన సమూహం.... ఇలా అనేక రకాలైన జన సమూహాలు ఆయనను వెంబడించేవారు. (మత్తయి. 4:25; 15:30; యోహాను. 6:2; లూకా. 5:15; లూకా. 6:17; 15:1;  20:20-26; యోహాను. 8:1-11; 6:22-27


🍂 ఇలా ఆయన యొద్దకు వచ్చిన ఆ జన సమూహాలను చూసి ఆయన ఏమాత్రము సంతోషించేవాడు కాదు, ఒక యూనియన్/సంస్థను గాని నడపలేదు, వారి నుండి అభిమానం కోరలేదు, వారిని తనకు అనుగుణముగా మలచుకోలేదు, వారి యెదుట నటించలేదు. ఎందుకంటే ప్రభువైన యేసు రాజకీయం చేయడానికి ఈ భూమిమీదకు రాలేదు. ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన నటుడు కూడా కాదు.  రాజకీయ నాయకునికి మరియు నటుడుకి  అయితే జనాలు(అభిమానులు) కావాలి కానీ క్రీస్తునకు మాత్రం శిష్యులే కావాలి.


 "బహుజనసమూహములు ఆయనతోకూడ వెళ్లు చున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి– ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు." "ఆప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు." (లూకా. 14:25-27, 33) :

🍃 ప్రభువైన యేసు జనులను పోగు చేసుకొనుటకు ఈ భూమిమీదకు వచ్చినవాడు కాదు. మనుష్యులను తనకు శిష్యులుగా చేసుకోవడానికే ఆయన వచ్చాడు. 


👀 మరి శిష్యుడు ఏమి చేస్తాడు ? 👤


𒐕. శిష్యుడు ప్రతీ ఉదయమున తన గురువుయొద్ద జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, తన గురువు యొక్క ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుని తన రోజుని ప్రారంభిస్తాడు.  

ప్రభువైన యేసు తాను శరీరథారిగా ఉన్నపుడు తన  దేవునికి శిష్యుడిగా బ్రతికాడు. ప్రతీ ఉదయమున లేచి తాను ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో తండ్రియొద్ద నేర్చుకునేవాడు. (యెషయా 50: 4-10, మార్కు 1:35). 


𒐖. శిష్యుడు వినుబుద్ధి కలవాడై ఉంటాడు, తన  యజమాని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడతాడు. 

ప్రభువైన యేసు తన దేవునికి శిష్యత్వం చేస్తూనే దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు. తండ్రి తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఆయన జరిగించాడు. (మత్తయి 10:24, మత్తయి 7:24, యాకోబు 1:19, 22, 23)


𒐗. శిష్యుడు విధేయత చూపిస్తాడు కానీ తిరుగుబాటు చేయడు. 

ప్రభువైన యేసు దేవునికి విధేయత చూపించి మనకు ఒక మాదిరిగా నిలిచాడు. ఎన్నో శ్రమలు, హింసలు పొందినప్పటికీ, చివరికి సిలువలో మరణం పొందినప్పుడు కూడా ఆయన తన దేవునిపై తిరుగుబాటు చేయలేదు. (హెబ్రీ 5:7, ఫిలిప్పి 2:5-8, యోహాను 13:16). 


𒐘. శిష్యుడు గురువు చెప్పింది చెప్పినట్టు గానే మాట్లాడుతాడు కానీ తన సొంతంగా ఏదియు మాట్లాడడు. 

ప్రభువైన యేసు తండ్రి తనకేది ఆజ్ఞాపిస్తే అదే మాట్లాడేవాడు (బోధించేవాడు) కానీ తన సొంత బోధ చేయలేదు. (యోహాను 12:49, యోహాను 8:38). 


పైవన్నియు శిష్యుడు చేసే కార్యక్రమాలు. 👆👆


💥 ప్రభువైన యేసు తాను ఎలాగైతే తన దేవునికి శిష్యరికం చేశాడో అలాగే తనకు శిష్యులు కావాలని కోరుకున్నాడు. అందుకే అన్ని విషయాలలో మనకు మాదిరి ఉంచిపోయాడు.(1 పేతురు. 2:21).  

💥 నీవు క్రీస్తుకు శిష్యుడువైతే క్రీస్తు ప్రభుతో కూడా వారసుడివి. అదే నీవు అభిమానివి అయితే క్రీస్తు ప్రభుతో కూడా వారసుడివి కాలేవు. (రోమా. 8:17)

💥 నీవు అభిమానివి అయితే క్రీస్తు ప్రభు యొక్క వాగ్దానాలు నీకు వర్తించవు. (యోహాను. 14:1-4; 17:24; యాకోబు. 2:5; 2 పేతురు. 3:13) 

💥 క్రీస్తు ప్రభువుకు ఎవరైతే శిష్యులుగా ఉంటారో వారికి మాత్రమే దేవుడు(యెహోవా) తండ్రిగా ఉంటాడు. (లూకా. 11:1-2; యోహాను. 20:17 ). 


🔎 క్రీస్తు ప్రభువు పేరు చెప్పుకుని ఆడంబరాలు చేసేవారు లేకపోలేదు, క్రీస్తు ప్రభువు పేరు చెప్పుకుని బైబిల్ చెప్పని పండగలు మరియు ఆచారాలు చేసేవారు లేకపోలేదు, క్రీస్తు ప్రభువు పేరు చెప్పుకుని రకరకాల కార్యక్రమాలు చేసేవారు లేకపోలేదు. వీరందరూ క్రీస్తు అభిమానులే కానీ శిష్యులు కారు, కానేరరు. మరి నీ సంగతి చదువరి? 🤔

మీ ఆత్మీయులు👥

WhatsApp Join Us   Telegram Join Us

Questions and Comments here!

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16