![]() |
"పరిశుద్ధాత్ముడు" |
నా తోటి పరిశుద్ధులరా, మీకు మన ప్రభువువైన
యేసుక్రీస్తు నామములో నా వందనములు.
పరిశుద్ధాత్ముడు యొక్క
పేర్లు :
» ఆత్మ. (మత్తయి. 4:1; 12:31; ఎపేసి. 1:14).
» దేవుని ఆత్మ. (ఆది. 1:2; యోబు. 33:4; రోమా. 8:9).
» యెహోవా ఆత్మ. (యెషయా. 11:2; 40:3; 61:1).
» పరిశుద్ధాత్మ. (కీర్తన. 51:11; యెషయా. 63:10).
» నా ఆత్మ. (యోవేలు 2:28-29).
» ఆదరణ కర్త/ఉత్తరవాది. (యోహాను. 15:26).
» సత్యస్వరూపియైన ఆత్మ. (యోహాను. 16:13).
» మహిమాస్వరూపియైన ఆత్మ. (1 పేతురు. 4:14).
» నిత్యుడగు ఆత్మ. (హెబ్రీ. 9:14).
» దేవుని ఆత్మ. (ఆది. 1:2; యోబు. 33:4; రోమా. 8:9).
» యెహోవా ఆత్మ. (యెషయా. 11:2; 40:3; 61:1).
» పరిశుద్ధాత్మ. (కీర్తన. 51:11; యెషయా. 63:10).
» నా ఆత్మ. (యోవేలు 2:28-29).
» ఆదరణ కర్త/ఉత్తరవాది. (యోహాను. 15:26).
» సత్యస్వరూపియైన ఆత్మ. (యోహాను. 16:13).
» మహిమాస్వరూపియైన ఆత్మ. (1 పేతురు. 4:14).
» నిత్యుడగు ఆత్మ. (హెబ్రీ. 9:14).
దేవత్వములో ఒకడైయున్న పరిశుద్ధాత్మ
1) పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక వ్యక్తియై ఉన్నాడు.
2) పరిశుద్ధాత్ముడు దేవుడై యున్నాడని ప్రకటన పూర్వకంగా పరిశుద్ధ గ్రంధమందు
లేదు కాని ఆయన దేవత్వము కలిగినవాడని అపో. కార్య. 5:3,4
వచనములబట్టి చెప్పవచ్చును.
"అప్పుడు పేతురు - అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని
పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీయొద్దనున్నప్పుడు నీదేగదా? అమ్మిన పిమ్మట
అది నీ వశమైయుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో
ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే
అబద్ధమాడితివని వానితో చెప్పెను." (అపో.కార్య. 5:3,4).
3) పరిశుద్ధాత్ముని గూర్చి “ఆయన” అనే పురుష లింగాన్ని తెలియచేసే పదములు
గ్రంధములో అనేక చోట్ల వాడబడినవి.
"నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను
వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల
ఆయనను మీయొద్దక ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని
గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును." (యోహాను. 16:7,15).
"ఆత్మయు ఒక్కడే". (ఎఫెసీ. 4:4).
సృష్టికి ముందు పరిశుద్ధాత్మ
"నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి
నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కవగా శుద్ధిచేయును." (హెబ్రీ. 9:14).
నిత్యుడు అనగా నిరంతరము ఉన్నవాడు. కావున జగత్తు పునాది వేయబడకమునుపే
ఉన్నవాడని మరియు అదృశ్యమైనవి నిత్యములు అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. – (2 కొరింధి. 4:18).
సృష్టి ప్రారంభములో పరిశుద్ధాత్మ
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. – (ఆది. 1:1-2).
దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క
శ్వాసము నాకు జీవమిచ్చెను. – (యోబు.
33:4).
అందరి ప్రయోజనముకొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత
అనుగ్రహింపబడుచున్నది. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొకడే తన
చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి
కలుగజేయుచున్నాడు. – (1
కొరింధి. 12:7;11).
సృష్టి నిర్మాణములో పరిశుద్ధాత్మ
నిత్యత్వములో దేవుని యొక్క ఆలోచనలకు ఆకారమిచ్చిన
యేసుక్రీస్తు వారియొక్క పనికి కొలమానమిచ్చినది మన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు. – (ఆది. 1:1; 1 కొరింధి. 8:6; కొలస్సి.
1:15-17).
"తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను
కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను
తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?" – (యెషయా. 40:12).
వాక్యము వ్రాయుంచుటలో పరిశుద్దాత్ముని పని
"ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును
పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏల యనగా ప్రవచనము
ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన
ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి." – (2
పేతురు. 1:20:21).
"దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా
సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది." – (2 తిమోతి. 3:16-17).
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి
యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. – (1 కోరింధి. 2:10).
B) విజ్ఞాపన
చేస్తాడు:
అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము
చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన
చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని
మూలుగులతొ మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనము చేయు
చున్నాడు. – (రోమా.
8:26-27).
C) దుఃఖపడతాడు:
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు. – (ఎఫెసీ. 4:30).
D) ఆనందిస్తాడు:
D) ఆనందిస్తాడు:
దేవుని రాజ్యము
భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును
పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. – (రోమా.
14:17).
E) పరిశుద్ధాత్మునికి ఇష్టాలు(చిత్తం) ఉన్నవి:
అయినను
వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి
యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. – (1 కొరింధి. 12:11).
●ఆత్మను ఆర్పకుడి. – (1 థెస్సలొనీ. 5:19).
●పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ కలుగదు. – (మత్తయి. 12:32).
●పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండుని
నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. – (మార్కు.
3:29).
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్_నవీన.
4 comments
commentsVandanamulu brother garu
Replyవందనములు సిస్టర్
Replyబ్రదర్ పరిశుద్ధత్ముడు దేవుడు అని ఎక్కడ ఉంది.డైరెక్ట్ గా లేదు ఇండైరెక్టు గా కూడ లేదు.ఈ విషయంలో సరిచేసుకోగలరు
Replyపైన అంశములో ఏమి వ్రాసానో కాస్త జాగర్తగా చూసి మాటలడగలరు వందనములు బ్రదర్
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com