Showing posts with label సత్య ఆరాధన. Show all posts
Showing posts with label సత్య ఆరాధన. Show all posts

"క్రైస్తవుడు ఆరాధనలో వాయిద్యములు ఎందుకు వాడకూడదు?" (Why should a Christian not use instruments in worship?)

క్రైస్తవుడు ఆరాధనలో వాయిద్యములు ఎందుకు వాడకూడదు?


ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

క్రైస్తవులు ఆరాధనలో వాయిద్యములు ఉపయోగించకూడదని లేఖనములను ఆధారము చేసుకొని, దేవుడు ఎటువంటి ఆరాధనను కోరుకుంటున్నాడో, నేటి క్రైస్తవులమైన మనము సత్య ఆరాధనలో వాయిద్యములు వాడవలసిన అవసరము లేదని వివిధ అంశముల ద్వారా తెలియజేసినప్పటికీ, కొంతమంది క్రైస్తవులు సత్య వాక్యమును సరియైన విధములో పరిశీలించకుండా, సరిగా విభజన చేయుకుండా, పరిశుద్ధ గ్రంథమును అపార్థము చేసుకుంటూ గ్రంథమును వ్రాయించిన పరిశుద్ధాత్మునే ప్రశ్నించే వారిగా ఉన్నారు.

ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంధమందున్న ఏ ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి. (2 పేతురు. 1:21). కాబట్టి క్రైస్తవుడవైన నీవు ఈ విషయమును చాలా ఖండితంగా నమ్మితీరాలి కానీ మన సొంత మాటలను చేరుస్తూ, గ్రంథములో  లేని విషయమును గూర్చి ఆలోచిస్తూ పరిశుద్ధాత్ముని ప్రశ్నించే వారిగా మనము ఉండకూడదు.

మొదటి ఆధారము :


● చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. – (ఆది. 6:14).

నోవాహుతో మన దేవుడు “చితిసారకపు మ్రానుతో” మాత్రమే ఓడను చేయమని ఆజ్ఞాపించారు. దీనికి అర్థము వేరొక మ్రానును ఉపయోగించకూడదని తెలుస్తుంది.

నోవాహు కూడా దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను బట్టి చితిసారకపు మ్రానుతోనే ఓడను నిర్మించెను కాని ఇంకొక మ్రాను ఎందుకు ఉపయోగించకూడదని అజ్ఞానముగా దేవుని ప్రశ్నించలేదు.

● దేవుడు అతని (నోవాహు) కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. – (ఆది. 6:22).

రెండవ ఆధారము :


● నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. – (నిర్గమా. 28:1).

ఈ వచనములో దేవుడు తనకు యాజకత్వము చేయుటకు ఆహారోను సంతతి వారు మాత్రమే అర్హులని మోషేకు సెలవిచ్చినప్పుడు  మోషే కాని మిగతా ఇశ్రాయేలీయులు కాని ఆహారోను సంతతి వారు మాత్రమే ఎందుకు యాజకత్వము చేయాలని అజ్ఞానముగా దేవుని ప్రశ్నించలేదు.

మూడవ ఆధారము :


● నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఒక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచి, ఇది మీకొరకైన నా శరీరము - నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. – (1 కొరింధి. 11:23-25).

ఈ వచనములో క్రీస్తు వారు తన శరీరమునకు చిహ్నముగా రొట్టెను, తన రక్తానికి చిహ్నముగా ద్రాక్షారసమును తీసుకుని ఆయనను జ్ఞాపకము చేసుకోమని మనకు తెలియజేసారు అయితే రొట్టెగా బదులుగా మాంసమును, రక్తమునకు బదులుగా మరొక పానీయమును ఎందుకు తీసుకోకూడదని నీవు అజ్ఞానముగా ప్రశ్నించకూడదు.

నాల్గవ ఆధారము :


★ యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనెను. – (యోహాను. 4:23-24).

క్రొత్త నిబంధనలో పాడుట గూర్చి మాత్రమే చూడగలము కాని వాయిద్యములు లేవనుటకు క్రింది వచనములే మనకు సాక్ష్యమిస్తున్నాయి.

★ అంతట వారు కీర్తన "పాడి" ఒలీవల కొండకు వెళ్లిరి. – (మత్తయి. 26:30).

★ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు "పాడుచు"నుండిరి. -  (అపొ.కార్య. 16:25).

★ అన్యజనులలో నేను నిన్ను "స్తుతింతును"; నీ "నామసంకీర్తనము" చేయుదును. – (రోమా. 15:9).

★ ఆత్మతో "పాడుదును", మనస్సుతోను "పాడుదును". – (1 కొరి౦ధి. 14:15).

మీ హృదయములలో ప్రభువునుగూర్చి "పాడుచు" కీర్తించుచు. – (ఎఫెసీ. 5:19).

★ మీ హృదయములలో దేవునిగూర్చి "గానము" చేయుచు. - (కొలస్సి. 3:16).

★ సమాజముమధ్య నీ కీర్తిని "గానము" చేతును అనెను. – (హెబ్రీ. 2:12).

★ ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు "పాడవలెను". – (యాకోబు. 5:13).

క్రొత్త నిబంధనలో సంగీతము గూర్చి మాట్లాడుతూ “పాడుట” లేదా “పాడిరి” అని మాత్రమే  ఈ వచనములన్నియు తెలియజేస్తున్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన ఆజ్ఞగా మనము చూడగలము. అపోస్తులులు కూడా ఏ సంధర్భములోను వాయిద్యముల ప్రస్తావన తీసుకురాలేదు వాటిని ఉపయోగించమని గ్రంథములో ఎక్కడా కూడా బోధించలేదు. కాబట్టి, ఈ వచనములలో పాడుట గూర్చి మాత్రమే ఉన్నది వాయిద్యములు వాడకూడదని చెప్పలేదు కదా అని క్రైస్తవుడవైన నీవు అటువంటి ఆలోచనా విధముతో మాట్లాడుతూ లేని విషయమును కలిపితే పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడినట్టే.

ఇలా చూసుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథమందు చాలా ఆధారములు ఉన్నవి అయితే ఇన్ని ఆధారములున్నప్పటికి, సొంత ఆలోచనలతో దేవుని ప్రత్యేకమైన ఆజ్ఞను మీరితే వాటి యొక్క ఫలితము కూడా గ్రంథమందు వ్రాయబడింది.

A) ఆహారోను కుమారులకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞను మీరినందుకు వారికి కలిగిన ఫలితము :

● అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. – (లేవీ. 10:1-2).

B) దేవుడు బండతో మాట్లాడమంటే మోషే బండను కఱ్ఱతో కొట్టగా అతనికి కలిగిన ఫలితము :

● నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. – (సంఖ్యా. 20:8).

● అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను. – (సంఖ్యా. 20:11).

● ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. – (సంఖ్యా. 20:24).

C) దేవుడు ఆజ్ఞాపించని యాజకత్వపు పనిని రాజైన ఉజ్జియా చేయగా అతనికి కలిగిన ఫలితము :

● వారు రాజైన ఉజ్జియాను ఎదిరించిఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా" "ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. – (2 దినవృత్తా. 26:18-19).

D) పరిశుద్ధ గ్రంథములో వేటిని కలిపినా తీసివేసినా అతనికి కలుగు ఫలితము :

● ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా-ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు - అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. – (ప్రకటన. 22:18-20).

కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుడు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చి, దానిని ప్రత్యేకపరిచినప్పుడు ఆ ఆజ్ఞకు వ్యతిరేకముగా ఏమియు మాట్లాడకూడదు, వేరొక ఆలోచన చేయకూడదు.  దీనిని బట్టి “క్రైస్తవులు సత్య ఆరాధనలో సంగీత వాయిద్యములు ఎందుకు వాడకూడదో, ఏ విధముగా తండ్రియైన దేవుని ఆరాధించాలో  చెప్పబడిన ఆజ్ఞ”కు వ్యతిరేకముగా ఆలోచన చేసి పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడకూడదని (మత్తయి. 12:32)నన్ను నేను హెచ్చరిక చేసికొనుచూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

క్రీస్తు సత్య ఆరాధనకు పాత్రుడా..? Is Christ deserving of true worship..?

"క్రీస్తు సత్య ఆరాధనకు పాత్రుడా".. ?

నా తోటి పరిశుద్దులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు.

పాత నిబంధనలో ప్రధానయాజకుడి పని

1)      యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు, రాజుల సంగతుల విషయములలో  పై వాడుగా ఉన్నాడు. – (2 దిన. 19:11).

2)      పాపములకొరకు అర్పణములను, బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమి౦పబడెను. – (హెబ్రీ. 5:1; హెబ్రీ. 8:3).

3)      అతడు ఏమియు తెలియనివారి యెడలను, త్రోవతప్పిన వారి యెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. – (హెబ్రీ. 5:2).

4)      ఈ ప్రధానయాజకుడు తనది కాని రక్తము తీసుకొని సంవత్సరమునకు ఒక్కసారే పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించి ప్రజల కొరకు , తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయువాడు. – (హెబ్రీ. 5:3; 9:25).

5)      అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడై ఈ ఘనత పొందువాడు. – (నిర్గమ. 28:1; హెబ్రీ. 5:4).

6)      ఇట్టి ప్రధానయాజకుడు దేవుని ఆరాధన చేయువాడు. – (హెబ్రీ. 9:7-9).

NOTE: ఇట్టి ప్రధానయాజకుడి యొక్క పని మన మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు మరియు శరీరాచారములు గనుక దిద్దుబాటు చేయుటకొరకు అట్టి ఆరాధన కొట్టివేయబడినది. (హెబ్రీ. 9:10; 10:1; 8:7,13)

క్రొత్త నిబంధనలో ప్రధానయాజకుడి పని


ఆకాశమండలముగుండ వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. (హెబ్రీ. 4:14)

1)      యేసు ఆ జనములకొరకును , ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును , చావనైయున్నాడు. – (మత్తయి. 1:21; యోహాను. 11:52; 1 పేతురు. 2:24)

2)      పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలముకంటే మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. – (హెబ్రీ. 7:26)

3)      మన ప్రధానయజకుడైన క్రీస్తు , తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక , తన్నుతాను అర్పించుకొన్నప్పుడు  తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించి యీ పని చేసి ముగించెను. – (హెబ్రీ. 7:28; 9:11,12,26-28)

4)       క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిoచుచు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొని మన మనస్సాక్షి విషయములో నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు క్రీస్తు యొక్క రక్తము మనలను శుద్ధిచేసి, మన అపరాధములనుండి విమోచన కలుగుటకై మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్ధానము పొందుటకు, క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు   – (హెబ్రీ. 7:2; 9:14,15)

5)      క్రీస్తు సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసేదేకు యొక్క క్రమములో చేరిన ప్రధాయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. – (హెబ్రీ. 5:9,10; 6:20 7:16,17,20).

6)      పరిశుద్ధ గ్రంధములో ఉన్న ప్రధానయాజకులందరు దేవుని ఆరాధించిన వారుగానే ఉన్నారు కానీ ఆరాధనకు పాత్రులుగా లేరు అలాగే మనకు దేవుని చేత యేర్పరచబడిన  ప్రధానయాజకుడైన క్రీస్తు తన జీవితములో మన తండ్రిని ఆరాధించారు మరియు సత్య ఆరాధన లేదా యదార్ధమైన ఆరాధనయందు వారికి ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించాలని , అట్టి ఆరాధికులను తండ్రి వెదుకుచున్నాడని మన ప్రభువైన యేసు తెలియజేసెను. – (యోహాను. 4:21-24; లూకా. 2:41-42)

NOTE:  ఇట్టి ప్రధానయాజకుడి యొక్క పని మన మనస్సాక్షి విషయములో నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని (తండ్రిని) సత్య ఆరాధన చేయుటకు సంపూర్ణసిద్ధి కలుగజేసినది.


(హెబ్రీయులకు 8:1-2)

మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా,మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయనపరిశుద్ధాలయమునకు  అనగా మనుష్యుడుకాక ప్రభువేస్థాపించిన నిజమైన గుడారమునకుపరిచారకుడైయుండి, పరలోకమందుమహామహునిసింహాసనమునకు కుడిపార్శ్వమునఆసీనుడాయెను.

(మనోహర్ బాబు గుడివాడ)©

"ఆరాధన అనగా నేమి"..? CLICK HERE

"ఆత్మతోను", "సత్యముతోను" ఆరాధన చేయుట అనగా నేమి..?


"ఆత్మతోను", "సత్యముతోను"

ఆరాధన చేయుట అనగా నేమి..?


నా తోటి పరిశుద్ధులరా, మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

యోహాను 4: 23-24
యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను "తండ్రిని" ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని "తండ్రి కోరుచున్నాడు" (మూలభాషలో-వెదుకుచున్నాడు).

దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను(in Spirit) సత్యముతోను(in Truth) ఆరాధింపవలెననెను.

నా ప్రియులారా, "యధార్ధమైన ఆరాధన" లేదా "సత్య ఆరాధన" ఎలా ఉండాలో, ఎవరు ఆరాధనకు ప్రాతుడు, ఎవరు యదార్ధ ఆరాధికులు వెదుకుచున్నారో అనే విశేష సంగతిని మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి పరిచయము చేశారు - (యోహాను 4:21-23).


❣ ఆరాధన చేయువారు ఎలా ఉండాలి..? (యథార్థముగా).
❣ ఆరాధన ఎలా చేయాలి..? (ఆత్మతోను, సత్యముతోను).
❣ ఆరాధన ఎవరుకి చేయాలి లేదా చెందాలి..? (తండ్రినైనా దేవుడు).

గమనిక: మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు ఆరాధనను కోరుకోలేదు.

పైన వచనములు ఆధారముగా ఈ మూడు ముఖ్యమైన సంగతులను మనము తెలుసుకోవలసిన అవసరము ఎంతో ఉంది.

● నేడు అనేక రకరకాలు ఆరాధనలు లోకములో జరుగుతున్నాయి అవి ఏమియు కూడా దేవునికి అంగీకరయోగ్యమైనవి కావు. మునుపు అంశములో మనము ఎన్ని రకాలు ఆరాధనలు ఉన్నాయో గ్రంధము నుండే  తెలుసుకున్నాము.

● మన ఆరాధన తండ్రినైనా దేవుడికి అంగీకరయోగ్యముగా ఉండాలి అని అనుకుంటే ఈ క్రింది విషయాలను ఆలోచన చేసి, అనుసరిచవలసిన అవసరము ఎంతో ఉంది.


"ఆత్మతోను" ఆరాధన


ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక "దేవుని యొక్క ఆత్మవలన (worship God in the Spirit) ఆరాధించుచు". - ఫిలిప్పీయులకు 3: 3 

◆ శరీరమును ఆధారము చేసుకొనక దేవుని ఆత్మ వలన అనగా పరిశుద్ధాత్మ ద్వారానే మనము తండ్రినైనా దేవుడును ఆరాధన చేయాలి. శరీరమును ఆస్పదము చేసుకునే వాడు దేవుని యొక్క ఆత్మ చేత ఆరాధన చేయలేడు.

మన తండ్రినైనా దేవుడు శరీరమును ఆస్పదము చేసుకునే వారితో సబంధము పెట్టుకోరు.

◆ "దేవుడు దీన మనస్సు గలవారితోను, వినయ మనస్సు గలవారు తోను మాత్రమే సబంధము పెట్టుకొనే మహోన్నతుడు" (యేషయా 57:15).

గమనిక: ఎందరు అయితే పాపక్షమపణ కొరకు మారుమనస్సు పొంది, బాప్తిస్మము పిమ్మట దేవుని ఆత్మను పొందుకొని (అపో.కార్య 2:38) ప్రభువు సంఘము చేర్చబడి (అపో.కార్య 2:47) దేవుని యొక్క ఆత్మ చేత ఎందురు అయితే తండ్రిని ఆరాధన చేస్తున్నారో వారు "*యధార్ధముగా తండ్రిని ఆత్మతోను ఆరాధన చేయువారు"*.


"సత్యముతోను" ఆరాధన 


"సత్యము" అనగా "యథార్థమైన, నిౙమైన".

యోహాను 17: 17,19, 21
సత్యమందు( మూలభాషలో-సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; "నీ వాక్యమే సత్యము".

వారును "సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు" వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.

వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; "వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ" వలెనని వారికొరకును "ప్రార్థించుచున్నాను".

● పైన వచనములో మూడు ముఖ్యమైన విశేష సంగతులను మనము తెలుసుకోవాలి.

1)  శిష్యులు(అపోస్తలులు) ను యేసు వారు సత్యమందు ప్రతిష్ట చేసారు అని.
2)  దేవుని వాక్యమే సత్యము అని
3)  అపోస్తలులు ఆ సత్యమును ఎందరుకి ప్రకటన చేసారో వారు అందరూ ఆ బోధయందు ఏకమైయుండాలి అని.

● యదార్ధమైన ఆరాధికులు ఎల్లపుడు చెప్పబడిన లేదా వినిన సంగతులు పరిశుద్ధ లేఖనములును ఆలాగున్నవో, లేవో పరిశోధన చేయువారుగానే ఆసక్తి కలిగి ఉంటారు (అపో.కార్య. 17:11).


• యేసు సాక్ష్యము •

❣ నేను దేవుని యొద్ద వినిన సత్యమును మీకు బోధిస్తున్నా. - (యోహాను 8:26)
❣ దేవుని వలన వినిన సత్యము - (యోహాను 8:40)
❣ నా తండ్రి వలన వినిన సత్యము - (యోహాను 15:15).

◆ ఆ సత్యమును యేసు వారు అపోస్తలులుకి ఇచ్చి వారుని సత్యమందు ప్రతిష్ట చేసారు. (యోహాను 17:19).


అపోస్తలులు సాక్ష్యము •

❣ జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, "మేమేది వింటిమో".... అది మీకు తెలియజేయుచున్నాము. - (1 యోహాను. 1:1).
❣ "....మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను(పారంపర్యములను) చేపట్టుడి". - ( 2థెస్స. 2: 15).
❣ "....సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము". - ( 2కోరింథీ. 13: 8).


గమనిక: యేసు ద్వారా ప్రతిష్ట చేయబడిన ఆ సత్యము అనగా అపోస్తలులు బోధ యందు ఉంటూ వారు తెలియపరిచిన ప్రకారముగా ఎందరు అయితే  లోబడి దేవుని ఆరాధన చేయు కార్యక్రముము వారు మాటలు ద్వారా ఎందరూ అయితే అనుసరిస్తూ ఆరాధన చేస్తున్నారో వారె "యధార్ధముగా తండ్రిని సత్యముతోను ఆరాధన చేయువారు".


ఈ క్రింది అంశములు ప్రతి వారు యొక్క ఆరాధనలో భాగములో ఖచితముగా ఉండాలి 

◆ అపొస్తలుల బోధయందును, -- (యోహాను 17:14, 17-21; అపో.కార్య 2:42; 2 దెస్స 2:15).
◆ సహవాసమందును, -- (హెబ్రీ 10:23-24; 1 కోరింది 7:24; 1 యోహాను 1:3).
 రొట్టె విరుచుటయందును, -- (అపో.కార్య. 20:7; 1 కోరింది 11:23-29).
◆ ప్రార్థన చేయుటయందును, -- (యోహాను 16:23; 1తిమోతి 2:1,8).
◆ పాటలు (ఎపేసి 5:19; కొలసి 3:16; హెబ్రీ 13:15).
◆ కానుకులు -- (1 కోరింది 16:1-2; 2 కోరింది 9:7).

(మీ ఆరాధన క్రమములో పైన తెలిపిన ఏ ఒక్క అంశము లేకపోయినా అది యదార్ధమైన ఆరాధన కాదు).

👊 హెచ్చరిక - పైన తెలిపిన ప్రతి అంశము యందు కూడా యదార్ధమైన ఆరాధికుడు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధన చేయవలసిన అవసరం ఎంతో ఉంది.

ఆరాధన (worship)

ఆరాధన


నా సహోదరులారా, మీ అందరుకి మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు నామములో నా వందనములు.

ఆరాధన అనగా నేమి..? 

◆ "ఆరాధన యొక్క నిర్వచనము": "యెహోవా మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో మహోన్నతుని ఆదేశాల ప్రకారము క్రమబద్ధమైన విధానములో జరిగించేది ఆరాధన అనబడుతుంది". (c.f. 2 దినవృత్తా. 29:20-30)

◆ "యధార్ధమైన ఆరాధికుడు యొక్క నిర్వచనము": "యధార్ధవంతులైన ఆరాధికులు అంటే దిద్దుబాటును ప్రేమించేవారు. యధార్ధవంతులంటే ఆయన తన మార్గముల విషయమై బోధించునప్పుడు, లోపాలను, దోషాలను, గుర్తించి దిద్దుకొనేవారు! తమ లోపాలను సమర్ధించుకునేవారు యధార్ధవంతులుకారు". (c.f. కీర్తనలు. 50:17-22; యెషయా. 2:2-6; రోమా. 2:15; 1 తిమోతి. 4:3; తీతుకు. 1:15)

❣ "గ్రీక్" లో ఆరాధన అనే పదమును "proskuneó" (ప్రోస్కునేమో) అని,
❣ "హీబ్రూ" లో ఆరాధన అనే పదమును "לַעֲבוֹד" (లాహ్-ఆహ్- వొహెడ్) అని,
❣ "ఇంగ్లీష్" లో ఆరాధన అనే పదమునకు "worship" (వర్షిప్) అని అంటాము.

◆ "ఆరాధన" అనే "తెలుగు పదము" గ్రీక్ పదముమైన "ప్రోస్కునేమో"  అనే పదము నుండి తర్జుమా చేయబడింది. గ్రీక్ పరిశుద్ధ గ్రంధములో  "ప్రోస్కునేమో" అనే పదము ఉన్న అన్ని చోట్ల ఆరాధన అనే పదము కనిపించదు.

● మ్రొక్కి - worship - (అది.కాండము 22:5; 1 సమూయేలు 15:25; మతాయి 4:10).
● సాగిలపడుట - worship - (నిర్గమ 24:1; కీర్తన 132:7;  1 కోరింది 14:25).
● నమస్కారము - worship - (నిర్గమ 34:14; కీర్తన 5:7; దానియేలు 3:28; మతాయి 4:9).
● సేవించుట - worship - (మత్తయి 4:10; అపో.కార్య 24:14-15).
● పూజించుట - worship - (ద్వితియో 4:19; మత్తయి 2:2).
● ఆరాధన - worship - (యోహాను 4:21-24; అపో.కార్య 8:27; పిలిప్పీ 3:3).

** గమనిక: (ఇంకా అనేక వచనములు కలవు) **

• కొందఱు పైన తెలిపిన ఆ పదాలు పట్టుకొని నిజమైన ఆరాధన యొక్క నిర్వచనము అని అంటున్నారు కారణమూ ఆయా పదాలు తెలుగు పరిశుద్ధ గ్రంధములో రాయబడిన అన్ని చోట్ల ప్రోస్కునేమో అనే గ్రీక్ పదము ఉండుటయే.

:NOTE: నిజానికి మనకి తెలియవలసింది పరిశుద్ధ గ్రంధములో "ప్రోస్కునేమో" అనే పదము ఉన్న చోట్ల యధార్ధమైన ఆరాధన కాదు.


"బైబిల్ అంతటిలో ఐదు రకాల ఆరాధనలు" వేమనగా;

 విగ్రహాలుకి ఆరాధన - (అపో.కార్య 17:23);
❣ వ్యర్ధమైన ఆరాధన - (మతాయి 15:9);
❣ దేవదూత ఆరాధన - (కొలసి 2:18);
❣ స్వేచ్ఛ ఆరాధన - (కొలసి 2:23);
❣ సత్య ఆరాధన లేదా యధార్ధ ఆరాధన (యోహాను 4:24).


● మన తండ్రినైన దేవుడు వెదుకుచున్నది "యదార్ధమైన ఆరాధికులును" అని యేసు వారు తెలియపరిచారు - (యోహాను 4:23).

● క్రొత్త నిబంధన ప్రకారముగా "యదార్ధముగా ఆరాధించే" కార్యక్రమము పెంతుకోస్తూ దినము యెరూషలేములో బాప్తిస్మము పొందిన ఆ మూడు వేల మంది చేతనే ప్రారంభము అయింది (అపో.కార్య 2:36-42).


"క్రొత్త నిబంధన ఆరాధన" యొక్క నిజ రూపము


◆ అపొస్తలుల బోధయందును, -- (యోహాను 17:14, 17-21; అపో.కార్య 2:42; 2 దెస్స 2:15).
◆ సహవాసమందును, -- (హెబ్రీ 10:23-24; 1 కోరింది 7:24; 1 యోహాను 1:3).
 రొట్టె విరుచుటయందును, -- (అపో.కార్య. 20:7; 1 కోరింది 11:23-29).
◆ ప్రార్థన చేయుటయందును, -- (యోహాను 16:23; 1తిమోతి 2:1,8).
◆ పాటలు (ఎపేసి 5:19; కొలసి 3:16; హెబ్రీ 13:15).
◆ కానుకులు -- (1 కోరింది 16:1-2; 2 కోరింది 9:7).


గమనిక: నా ప్రియులారా... వీటిలో ఏ ఒక్క అంశమునైనా మన సత్య ఆరాధనలో లేనియెడల మరియు నీవు  పరిశుద్ధతను, నీ రక్షణను కొనసాగించక  ఎదో మొక్కుబడిగా జరిపిస్తే అది యదార్ధమైన ఆరాధన కాదు అనే విశేషమైన సంగతి మనకి బాగుగ తెలియాలి.

                                             
                         ఆరాధనకు పాత్రుడు ఎవరు..?

• సమాధానము: యోహాను 4:21-24 వచనములు

Note:- (యేసు వారు మాత్రమే యధార్ధ ఆరాధానను గూర్చి మనకి పరిచయము చేసారు).

❣ ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను, యెరూషలేములోనైనను ఎవరిని ఆరాధన చేసేవారు..?  "తండ్రిని"
❣ యధార్ధముగా ఎవరును ఆరాధించాలి..? "తండ్రిని"
❣ యధార్ధముగా ఆరాధన చేయువారు కావాలి అని ఎవరు వెదుకుచున్నారు..? "తండ్రి"
❣ ఆత్మతోను, సత్యముతోను ఎవరిని ఆరాధన చేయాలి..? "తండ్రి"

∆ యేసు వారు కూడా తన  12  ఏటా నుంచి తండ్రిని ఆరాధన చేశారని, తండ్రిని ఆరాధన చేయువారిలో అయన ఒక ఆరాధికుడు అని గ్రంధము తెలియపరుస్తుంది. - (లుకా 2:41-42; యోహాను 4:22).


సంఘముతో పాటు యేసుక్రీస్తు వారు తండ్రిని ఆరాధన చేయుచున్నారా..? 

అవును


పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన(యేసుక్రీస్తు) సిగ్గుపడక నీ(తండ్రి) నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య (సంఘము మధ్య) నీ కీర్తిని గానము చేతును అనెను.

:: Manohar Naveena ::
The churches of Christ greet you - Roma 16:16