నీవెందుకు క్రీస్తుసంఘ సభ్యుడివవ్వాలి..? (why you become a member of the Church of Christ?)

నీవెందుకు క్రీస్తుసంఘ సభ్యుడివవ్వాలి..?


అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు.

ప్రియమైన సహోదరీ, సహోదరులారా మనలో చాలామంది యేసుక్రీస్తుని తమ సొంత రక్షడుగా అంగీకరించి వివధ సంఘాలలో చేర్చబడుతున్నారు. కాని వారు వెళ్తున్న సంఘాలు వాక్యానుసారముగా ఉన్నవో లేవో గ్రహించలేకపోతున్నారు.  ప్రియులారా ఈ లోకములో మనుష్యులు ఏర్పాటు చేసుకున్న సంఘాలు ఎన్నో ఉన్నప్పటికీ దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా ఏర్పాటు చేసిన సంఘము ఒక్కటే అదియే క్రీస్తుసంఘము (CHURCH OF CHRIST). చాలామంది “మనము ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలేదు ఆరాధన ఒక్కటే కదా రక్షణ ఒక్కటే కదా అనే భావనలో ఉన్నారు” కాని నీవు నిజముగా రక్షణ పొందుకోవాలి, నిత్యజీవములోనికి ప్రవేశించాలంటే ఖచ్చితముగా నీవు క్రీస్తుసంఘ (CHURCH OF CHRIST) సభ్యుడివవ్వాలి. ఎందుకంటే...........

A). “క్రీస్తు సంఘము” లేఖనములలో చెప్పబడినట్టుగా దేవుని కుమారునిచే కట్టబడినందున.

» ఈ బండమీద నా (క్రీస్తు) సంఘమును కట్టుదును. – (మత్తయి. 16:18).

B). “క్రీస్తు సంఘము” లేఖనానుసారమైన పునాదిగా కట్టబడినందున.

» వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. (1 కొరింధి. 3:11) 

» క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. (ఎఫేసీ. 2:20).

C). “క్రీస్తు సంఘము” లేఖనములలో తెలుపబడిన స్థలములోనే (యెరూషలేము) ప్రారంభించబడినందున.

» అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. (యెషయా. 2:2-3)

» క్రీస్తు శ్రమపడి మూడవ దిన మున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. (లూకా. 24:46-49)

D). “క్రీస్తు సంఘము” లేఖనములలో తెలుపబడిన సమయానికే (పెంతుకొస్తను పండుగ దినమున) ప్రారంభింపబడినందున...

» కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. (అపొ.కార్య. 2:41:42).

E). “క్రీస్తు సంఘము” లేఖనానుసారముగా దేవుని కుమారునియొక్క స్వరక్తముతో కొనబడినందున.

» ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును...” (అపొ.కార్య. 20:28).

» పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా (1 పేతురు. 1:18-19).

F). “క్రీస్తు సంఘము” అను నామము మాత్రమే లేఖనములలో వ్రాయబడినందున.

» ఈ బండమీద నా (క్రీస్తు) సంఘమును కట్టుదును. (మత్తయి. 16:18)

» క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి. (రోమా. 16:16).

G). “క్రీస్తు సంఘము” పరిశుద్ధుల సమూహము కొరకు ఏర్పాటు చేయబడినందున.

» ఫిలిప్పీలో ఉన్నక్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధుల కును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.  (ఫిలిప్పి. 1:1).

H). “క్రీస్తు సంఘము” నకు మాత్రమే పరిశుద్ధ గ్రంధములో లేఖనములు, పత్రికలు వ్రాయబడినందున.

» దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.  (2 తిమోతి. 3:16-17)

» తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. (2 పేతురు. 1:3).

I). “క్రీస్తు సంఘము” మాత్రమే తండ్రియైన దేవునితోను, ప్రభువైన క్రీస్తుతోనూ మరియు అపోస్తులుల బోధలోను ఏకమై ఉన్నందున.

» నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. (యోహాను. 17:20-21).

J). “క్రీస్తు సంఘము” లేఖనానుసారమైన బోధను, బాప్తీస్మమును నిర్వహించునందున.

» యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. (మత్తయి. 28:18-19) 

» సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహానుకూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి. (యోహాను. 3:23)

» కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు. (రోమా. 6:4).

» వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు. (అపొ.కార్య. 8:36-39).

K). “క్రీస్తు సంఘము” మాత్రమే రక్షణ పొందుట మరియు దానిని కొనసాగించు విషయములో కలుగు ప్రతి సందేహమునకు  లేఖనానుసారముగా సమాధానము ఇవ్వగలుగునందున.

» పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.  (అపొ.కార్య. 2:38) 

» నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.  (అపొ.కార్య. 22:16).

» నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. (మార్కు. 16:16).

L). “క్రీస్తు సంఘము” లేఖనానుసారముగా ప్రతి ఆదివారము ప్రభువు బల్లలో పాలుపొందుటనందున.

» ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు (అపొ.కార్య. 20:7; 2:42; 1 కొరింధి. 11:23-31).

M). “క్రీస్తు సంఘము” మాత్రమే లేఖనానుసారమైన సంగీతమును కలిగియున్నందున.

» ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు, (ఎఫేసీ. 5:19)

» సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు (కొలస్సి. 3:16).

N). “క్రీస్తు సంఘము” తండ్రిని మాత్రమే ఆరాధించుటలో లేఖనానుసారమైన క్రీస్తు వారి ఆజ్ఞను పాటించునందున.

» యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. (యోహాను. 4:23-24).

O). “క్రీస్తు సంఘ” సభ్యులు మాత్రమే పరలోకములో దాచబడిన స్వాస్థ్యమునకు హక్కుదారులుగా ఉన్నందున.

» దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన3 ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. (ఎఫేసీ. 1:14)

» కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధ ముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది. (1 పేతురు. 1:5).

P). “క్రీస్తు సంఘము” లో అనగా క్రీస్తు శరీరములో (CHURCH OF CHRIST) ఉన్నవారికి మాత్రమే రక్షణ ఉన్నందున.

» క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.  (ఎఫేసీ. 5:23)

» సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. (కొలస్సి. 1:18).


కాబట్టి ప్రియులారా, పైన తెలుపబడిన లేఖనములన్నిటినిబట్టి నీవు చేర్చబడిన సంఘము దేవుడు ఏర్పాటు చేసిన సంఘమా లేక  మనుష్యులు ఏర్పాటు చేసిన సంఘమా చాలా ఖచ్చితముగా తెలుసుకోగలవు.

మరి నీవు ఆ నిజమైన ఏకైక క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) సభ్యుడిగా ఉన్నావా?

లేకపోతే  ఆలోచన చేయు. వాక్యాన్ని పరిశీలన చేసి లేఖనములను ఉన్నవి ఉన్నట్టుగా అంగీకరించు. నిజ క్రైస్తవుడిగా జీవించు. ఎందుకనగా...
క్రీస్తు సంఘ సభ్యుడే నిజమైన క్రైస్తవుడు.

మీ ఆత్మీయులు,
మనోహర్ నవీన.


Share this

Related Posts

Previous
Next Post »

2 comments

comments
November 21, 2020 at 9:40 PM delete

వందనాలు అండి
మీరు రిఫారెన్స్ పెట్టటం కంటే వాక్యాని వివరిస్తే బాగుంటుంది.

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16