![]() |
ఎవరు శాపగ్రస్తులు.? |
★ "దేవుని ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు". (కీర్తనలు. 119:21).
★ "దేవుడు శపించిన దానిని హత్తుకొనేవారు". (యెహోషువ. 7:12).
★ "ప్రతీభార్య- తన భర్త బ్రతికి యుండగా వేరొక పురుషుని ఆశ్రయించువారు". (సంఖ్యా. 5:27).
★ "భక్తిహీనులై యుండిన గృహస్తులు". (సామెతలు. 3:33).
★ "దేవుని ప్రజలను శపించాలనుకునేవారు". (సంఖ్యా. 23:8).
★ "దేవుని పోలికగా ఉన్న తన సహోదరుని
శపించేవారు". (యాకోబు. 3:10).
★ "దేవుని వాక్యమును కలిపి చెరిపెడివారు". (2 కొరింథీ. 2:17; ప్రకటన. 22:18,19).
★ "వ్యభిచారము మానలేని కన్నులు కలిగినవారు". (2 పేతురు. 2:14).
★ "భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధించేవారు". (2 పేతురు. 1-3).
★ "అక్రమము చేయువారు". (మత్తయి. 7:22).
★ "క్రీస్తు మాటల ప్రకారం చేయక ప్రభువునామ స్మరణం చేయువారు". (లూకా. 6:46).
★ "దేవుడు తెలియజేసిన వాటిని చేయనివారు". (ఆది. కాం. 3:6).
★ "దేవుడు తెలియజేయనివాటిని చేసేవారు". (లేవీ.కాం.10:1).
★ "క్రీస్తునందు ఇబ్బందులు పడుచున్నవారికి సహాయపడనివారు". (మత్తయి. 25:41).
★ "ఈ లోకాన్ని ప్రేమించేవారు". (1యోహాను. 2:15).
★ "దేవున్ని హృదయపూర్వకముగా ఘనపరచనివారు". (మలాకీ. 2:2).
★ "కానుకల విషయములో వెనుకడుగు వేసేవారు". (మలాకీ. 3:9).
★ "హృదయంలో నిశ్చయించుకొన్న ప్రకారం దేవునికి ఇవ్వనివారు". (అపొ.కా. 5:5).
★ "జీవము గల దేవున్ని
విడిచి ఇతర దేవతలను ఆశ్రయించువారు". (నిర్గమ. 22:20).
★ "అన్యాయముగా తన తండ్రినైనను తన తల్లినైనను
నిర్లక్ష్యము చేయువారు". (ద్వితీయో. 27: 16).
★ "పరదేశికేగాని, తండ్రిలేనివారికేగాని, విధవరాండ్రకేగాని అన్యాయపు తీర్పు తీర్చువారు". (ద్వితీయో.27:19).
★ "అక్రమసంబంధం కలిగినవారు". (ద్వితీయో. 27:22).
★ "ఇతరులకు ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనువారు". (ద్వితీయో. 27:25).
★ "దేవుని చట్టమును అనుసరించనివారు". (యిర్మీయా. 11:3).
★ "దేవుడైన యెహోవాను విడచి నరులను ఆశ్రయించువారు". (యిర్మీయా.
17:5).
★ "దేవుడైన యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువారు". (యిర్మీయా. 48:10).
★ "భిన్నమైన బోధలు బోధించేవారు వినేవారు కూడా". (గలతీ. 1:8).
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com