పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన
వారికందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
మానవ జీవితములో అతి క్లిష్టమైన దశ (లేదా)
కాలము ఏది ? శిశు దశ ? బాల్య దశ ? యౌవ్వన దశ? వృద్ద్యాపము ? ఈ ప్రశ్నకి
సమాధానము మానవులు వారున్న ప్రస్తుత
కాలమును బట్టి వారి వారి అభిప్రాయములను తెలియజేస్తూ ఉంటారు కాని మనము సరియైన
విధముగా ఆలోచన చేస్తే యౌవ్వన కాలము చాల ప్రమాదకరమైనది మరియు చాల కష్టతరము అని
చెప్పవచ్చును.
యౌవ్వన కాలములో మనకు స్వాతంత్ర్యము
కావాలని ఆశపడతాము, సొంత నిర్ణయాలు తీసుకొనుటకు ప్రాధాన్యతనిస్తాము, ప్రతి
విషయములోను తొందరపాటు కలిగి ఉంటాము, మన పనులు విఫలమైనప్పుడు తొందరగా నిరాశ
చెందుతాము. అయితే మానవునికి యౌవ్వన దశ చాల
ప్రాముఖ్యమైనదని మొదట గమనించుకోవాలి.
పరిశుద్ధ గ్రంధమైన
బైబిలు యౌవ్వన దశ చాలా ప్రమాదకరమైనదే కాకుండా ఒక సవాలు వంటిదని కూడా తెలియజేస్తున్నది
ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది (ఆది. 8:21) మరియు
యౌవ్వన దశ అనేక చెడు కార్యములు చేయటకు దేవునికి విరోధముగా ఆలోచన చేయుటకు మూలముగా
ఉన్నది కనుక వాటిని విసర్జించి అనగా చెడుని విసర్జించి పవిత్ర హృదయులై
ఉండాలని ప్రార్ధన చేయువారితో సహవాసము
కలిగి (2 తిమోతి. 2:22) ఉన్నట్లయితే అటువంటి కార్యములకు దూరముగా ఉండగలమని
హెచ్చరిస్తున్నది.
అయితే దేవుని యొక్క
పరిచర్యలో, క్రీస్తు సువార్తను లోకమునకు చాటి చెప్పుటలో యౌవ్వనుడు చాలా కీలకమైన
వాడు ఎందుకనగా యువత అన్ని విషయములలోనూ ఆసక్తిని, ధైర్యమును, భవిష్యత్ కాలము యెడల
మంచి జ్ఞానమును కలిగి బలవంతులుగా ఉంటారు కనుక వారు దేవుని పనిలో కీలక పాత్ర
పోషించాలని ఆయనను మహిమ పరిచే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.
★ యౌవ్వన కాలములో ఉండి
దేవుని చిత్తములో నడిచిన కొంతమందిని గ్రంధములో చూద్దాము :
"యోసేపు"
పాత నిబంధన గ్రంథము మొత్తములో యోసేపుని
నిజముగా ఒక మంచి వ్యక్తిగా చూడగలము. యోసేపు తన తండ్రికి యిస్టానుసారమైనవాడు కనుక
తన సోదరులకి విరోధి అయ్యాడు. అతని సోదరులు అతనిమీద అసూయ చెంది ఇష్మాయేలీయులకు
అమ్మివేయగా (ఆది. 37:28) వారు ఫరోయొక్క సేనాధిపతియైన ఫోతీఫరునకు అమ్మివేసిరి (ఆది.
37:36).
అటు తరువాత జరిగిన విషయము మనకందరికీ
బాగుగా తెలియును ఏమనగా, ఫోతీఫరో భార్య యోసేపు మీద కన్నువేసి అతనిని బలవంతపెట్టగా
అతడు దృఢమైన నమ్మకముతో ఆమెకు ఎదురు తిరిగి ఆ ఘోరమైన పాపమునకు దూరముగా ఉండగలిగాడు.
నీవు అతని భార్యవైనందున
నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు.
» కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను. (ఆది. 39:9).
» కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను. (ఆది. 39:9).
★ గమనిక : అయితే ఇక్కడ యోసేపు జీవితము గూర్చి మనమందరము ఆలోచించాల్సిన గొప్ప సంగతి
ఏమిటంటే ఆ సంఘటన జరిగినప్పుడు అతని వయస్సు పదిహేడు (17) సంవత్సరములు అదియే కాకుండా
మంచి యౌవ్వనప్రాయము కలిగినవాడు, తనకు అంతగా తెలియని దేశములో ఉన్నాడు మరియు తన
కుటుంబమునకు తన ప్రజలకు దూరముగా ఉన్నాడు అంటే పాపము చేయుటకు అన్ని పరిస్థితులు
అనుకూలముగా ఉన్నప్పటికీ దేవుని యెడల విశ్వాసము కలిగి ఆ ఘోరమైన పాపమునకు దూరముగా
ఉన్నాడు.
అంతే కాకుండా తన జీవితములో తగ్గింపు కలిగి తనను అమ్మివేసిన తన అన్నలను సైతము క్షమించాడు దేవుని చిత్తమును అంగీకరించాడు.
» అయినను నేనిక్కడికి వచ్చు
నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి ప్రాణరక్షణ
కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. (ఆది. 45:5).
» మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి
గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. (ఆది.
50:20).
దేవుని వాగ్ధానమును
బట్టి ఇవన్నియు జరిగెను కాని యోసేపు మంచి యౌవ్వనప్రాయములో ఉండి కూడా దేవుని యెడల
విశ్వాసము కలిగి (హెబ్రీ. 11:22) పాపమునకు దూరముగా ఉన్నాడు.
● కనుక మనము కూడా మన జీవితములో దేవుని యెడల విశ్వాసము కలిగియుంటే ఎటువంటి శోధనను అయినా జయించగలము.
● కనుక మనము కూడా మన జీవితములో దేవుని యెడల విశ్వాసము కలిగియుంటే ఎటువంటి శోధనను అయినా జయించగలము.
"దావీదు"
ఇశ్రాయేలీయుల రాజులలో ఒకడైన
దావీదు సంగతి మనకందరికీ’ బాగుగా తెలియును. అతడు తన బాల్యము నుండి దేవుని యెడల
విశ్వాసము కలిగి యెహోవా చిత్తమును నెరవేర్చిన వాడుగా ఉన్నాడు (1 సమూయేలు.
13:14).
» తనకు అనుభవము లేని వయస్సులో ఫిలిష్తీయుడైన గోల్యాతును యెహోవా పేరిట హతమార్చెను (1 సమూయేలు. 17:45-47).
» తనకు అనుభవము లేని వయస్సులో ఫిలిష్తీయుడైన గోల్యాతును యెహోవా పేరిట హతమార్చెను (1 సమూయేలు. 17:45-47).
» సౌలు ఈ ఫిలిష్తీయుని
ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము
చేసినవాడని దావీదుతో అనెను. (1 సమూయేలు. 17:33).
» ఫిలిష్తీయుడుకఱ్ఱ తీసి కొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. (1 సమూయేలు. 17:42).
అప్పుడు యెహోవా కత్తి
చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు యుద్ధము యెహోవాదే
ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. (1 సమూయేలు. 17:47).
★ గమనిక : అతడు చేసిన ఆ యుద్ధము ఎంత గొప్పదో మనము ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది
ఎందుకనగా యుద్ధమంటే ఏమిటో తెలియని వాడు, సున్నతిగల వాడు, యౌవ్వన దశలో ఉన్నవాడు
దైర్యము కలిగి దేవునిమీద ఉన్న నమ్మకముతో ముందుకు సాగి యుద్దమును జయించి
ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల నుంచి
కాపాడాడు.
● అంటే నీవు నేను
దేవుని యెడల విశ్వాసము కలిగి ఉంటే ఎటువంటి స్థితిలోనైన దేవుని జ్ఞాపకము చేసుకొన్నయెడల
తప్పక విజయము పొందుకోగలము.
"యోషీయా"
» బాల్యము నుండి కూడా
యెహోవా దృష్టికి యధార్ధముగా నడిచిన వారిలో యూదా దేశమునకు రాజైన యోషీయా ఒకడు. అతడు యెహోవా
దృష్టికి యథార్థముగా నడుచుచు, కుడి యెడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను
(2 రాజులు. 22:2;).
» అతడు ఎనిమిదేండ్ల
వయసునందు యేలనారంభించి, బాలుడై ఉన్నప్పుడే దేవుని యెదుట విచారించి, తన పన్నెండవయేట అన్యుల దేవతాస్తంభములను పడగొట్టి యెరూషలేమును పవిత్రపరచుటకు పూనుకొనెను. (2
దినవృత్త. 34:2-4). మరియు మోషే ద్వారా యెహోవా దయచేసిన
ధర్మశాస్త్ర గ్రంధమును ప్రజలకు తెలియపరిచి ఆ గ్రంధమందు వ్రాయబడిన నిబంధన మాటల
ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను. (2
దినవృత్త. 34:14-31).
★ గమనిక : అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను
యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు
ఒకడును లేడు (2 రాజులు. 23:25) యోషీయా జీవితము గూర్చి గ్రంథము చెప్తున్న ఈ గొప్ప సాక్ష్యము చాలు అతను దేవుని
దృష్టికి ఎంత యధార్ధముగా నడుచుకున్నాడో.
● కాబట్టి మనము ఎంతమంది అన్యుల మధ్య నివసించిన కూడా వారి వైపు మనము వెళ్ళకుండా వారినే దేవుని వైపుకు నడిపించేవారముగా ఉండాలని గ్రహించాలి.
● కాబట్టి మనము ఎంతమంది అన్యుల మధ్య నివసించిన కూడా వారి వైపు మనము వెళ్ళకుండా వారినే దేవుని వైపుకు నడిపించేవారముగా ఉండాలని గ్రహించాలి.
"యిర్మీయా"
పాత నిబంధన
గ్రంధములో గల గొప్ప ప్రవక్తలలో యిర్మియా ఒకడు. ఇతడు యోషీయా కాలమునుండి
ప్రవచింపసాగెను. బాల్య దశ నుండే దేవుడు ఇతనిని వాడుకున్నాడని గ్రంథము
తేటపరుస్తున్నది.
» యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై
యీలాగు సెలవిచ్చెను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక
మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు
యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకీలాగు
సెలవిచ్చెనునేను బాలుడననవద్దు నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు
చెప్ప వలెను (యిర్మియా. 1:4-7).
★ గమనిక : యిర్మియా బాల్యము నుండి దేవుని యెడల భయభక్తులు కలవాడై అనేకమైన విశేష
సంగతులను ప్రజలకు తెలియపరుచాడు. ఆయన ద్వారా ప్రవచింపబడిన విశేష సంగతులను బట్టి
అతడు దేవుని యెదుట ఎంత నీతిగా నడుచుకున్నాడో గ్రంథము తెలియజేస్తుంది.
● కావున మనము కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి యుండాలని గ్రహించాలి.
● కావున మనము కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి యుండాలని గ్రహించాలి.
"మరియ"
ఇశ్రాయేలీయులలో అనేక
మంది స్త్రీలు ఉండగా దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును ఈ లోకములో
జన్మింపచేయుటకు మరియని మాత్రమే ఎన్నుకున్నాడంటే ఆమె దేవుని దృష్టికి ఎంత
ప్రీతికరమైనదో ఎంత యోగ్యురాలో మనము ఆలోచన చేయాలి.
» ఆరవ నెలలో గబ్రియేలను
దేవదూత గలిలైయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము
చేయబడిన కన్యకయొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యకపేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి
ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి -ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా
దూత - మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. (లూకా. 1:26-30).
» స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు
నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా
చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన
మాటలు సిద్ధంచును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. (లూకా. 1:42-44).
★ గమనిక : అప్పటికే ప్రజలు నాశనమయి దేవుని విసర్జించియున్నారు కనుకనే తండ్రి తనయొద్ద ఉన్న వాక్యమును ఈ లోకమునకు పంపుటకు ఆలోచన చేసెను, అటువంటి జనముల మధ్య కూడా పవిత్రురాలుగా ఉండి యౌవ్వన దశలో తన పవిత్రతను కాపాడుకున్నది దేవుని వలన కృపనొంది తన ప్రవర్తనను దేవుని దృష్టికి యధార్ధముగా కనపరుచుకొన్నది కనుక దేవుడు అంతమంది స్త్రీలలో ఆమెను మాత్రమే ఎన్నుకున్నాడని మనము ఆలోచన చేయాలి.
"తిమోతి"
అపోస్తులుడైన పౌలునకు దేవుని పరిచర్యలో
అన్ని విధముల సహకరించిన వారిలో యౌవనస్తుడైన తిమోతి ఒకడు. అపోస్తులుడైన పౌలు ఇతని
గూర్చి ఫిలిప్పిలో ఉన్న సంఘమునకు గొప్ప సాక్ష్యము తెలియజేసారు.
» నేనును మీ క్షేమము తెలిసికొని
ధైర్యము తెచ్చుచుకొను నిమిత్తము తిమోతీయును శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు
నిరీక్షించుచున్నాను. మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతనివంటివాడెవడును నాయొద్ద లేడు. అందరును తమ స్వకార్యములనే
చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు
సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవచేసెను. కాబట్టి నాకేమి సంభవింపనైయున్నదో
చూచినవెంటనే అతని పంపవలెనని అనుకొనుచున్నాను. (ఫిలిప్పీ. 2:19-23).
★ గమనిక : యౌవ్వన దశలో ఉన్న తిమోతి తన స్వకార్యములను విడిచిపెట్టి దేవుని పరిచర్యలో
విస్తారముగా వాడబడ్డాడు.
● అయితే యౌవన దశలో ఉన్న నీవు దేవుని పనిలో ఉన్నావా లేక నే స్వకార్యములను మాత్రమే చుచుకోనుచున్నావా ? అని ఆలోచన చేసి దేవుని పరిచర్యలో వాడబడాలని గ్రహింపు కలిగి ఉండాలి.
● అయితే యౌవన దశలో ఉన్న నీవు దేవుని పనిలో ఉన్నావా లేక నే స్వకార్యములను మాత్రమే చుచుకోనుచున్నావా ? అని ఆలోచన చేసి దేవుని పరిచర్యలో వాడబడాలని గ్రహింపు కలిగి ఉండాలి.
పైన వ్రాయబడిన
సంగతులను చూడగా ప్రతి ఒక్కరు వారి యౌవ్వన దశలో దేవుని ఘనపరిచే వారిగానే ఉన్నారు
కాని వారి సొంత ఆలోచనల మేరకు ప్రవర్తించలేదు అలా నడుచుకోలేదు ఎందుకంటే మన దేవుడు గొప్ప వాడని,
నమ్మదగిన వాడని, ఆయన సమస్తమును దయజేయగలవాడని
వారు విశ్వసించగలిగారు దేవుని దృష్టికి యధార్ధముగా నడుచుకుని దేవుని నామమును
మహిమపరిచారు.
★ మరి యౌవ్వన దశలో
ఉన్న నీవు నేను ఏ విధముగా ఆలోచన చేయుచున్నాము? దేవుని పనిలో వాడబడుతున్నామా?
క్రీస్తు సువార్తను లోకమునకు తెలియజేయుచున్నామా? లేదా మన స్వకార్యముల కొరకు
మాత్రమే జీవించుచున్నామా? ఈ క్షణమే ఆలోచన చేసి నీ యౌవన ప్రాయమును దేవునికిష్టముగా మలచుకో.
● ఇశ్రాయేలు చిన్నది
సైతము నయమానుకు దేవుని సంగతిని మరియు దైవజనుడైన ఎలీషా సంగతిని తెలియజేసి తన
యజమానుడు నిజ దేవుడిని తెలిసుకునేల తన వంతు పని తను చేసింది (2 రాజులు. 5:2).
★ కాబట్టి నా ప్రియ
సహోదరుడా, సహోదరీ, యౌవ్వన కాలములో నీకున్న బలమును, ధైర్యమును, జ్ఞానమును దేవుని
పనికి ఉపయోగించి ఆయన నామాన్ని మహిమపరిచే విధముగా మన జీవితము ముందుకెళ్ళాలని నన్ను
నేను హెచ్చరిక చేసికొనుచు ప్రేమతో మనవి చేయుచున్నాను.
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్_నవీన ©.
1 comments:
commentsWow!! Awesome explanation annaya.....
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com